ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ మే 10 వ తేదీన I / O 2023 డెవలపర్ కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ఈ ఈవెంట్ సందర్భంగా ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ని గూగుల్ పరిచయం చేయనుంది. దాంతో పాటు, గూగుల్ సంస్థ Pixel 7a, Pixel Fold ఫోన్లను లాంచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటివరకు కంపెనీ నుంచి దీనికి సంబంధించి ఎటువంటి ప్రకటన లేదు. కానీ, FrontPageTech వెబ్ సైట్ కి చెందిన John Prosser, Pixel 7a మరియు Pixel Fold డివైజెస్ ఎప్పుడు ప్రీ-ఆర్డర్ మరియు కొనుగోలుకి అందుబాటులోకి వస్తాయో తెలిపారు. దీంతోపాటు, Pixel 7a ధర ఒక రిపోర్ట్ ద్వారా రివీల్ అయ్యింది.
Google Pixel 7a
Charcoal, Snow, Sea (light blue), and Coral (Google Store only)Announcement: May 10, available for purchase immediately
6a will not be discontinued.
— jon prosser (@jon_prosser) April 17, 2023
Google Pixel 7a, Pixel Fold లాంచ్ తేదీ (లీక్)
- మే 10 వ తేదీన Google Pixel Fold లాంచ్ అవుతుందని అంచనా. మే 10 నుంచి గూగుల్ స్టోర్ ద్వారా ప్రీ-ఆర్డర్స్ మొదలవుతాయని సమాచారం.
- మే 30 నుంచి పార్ట్నర్స్ మరియు క్యారియర్ ఔట్‌లెట్స్ ద్వారా ప్రీ-ఆర్డర్స్ మొదలవుతాయి. జూన్ 27 నుంచి ఫోల్డబుల్ ఫోన్ సేల్ కి వస్తుంది.
- పిక్సెల్ 7ఏ మే 10 ప్రకటన తర్వాత అందుబాటులోకి వస్తుందని జాన్ చెప్పారు. ఇకపోతే ఈ డివైజ్ చార్‌కోల్, స్నో, సీ అండ్ కోరల్ కలర్ ఆప్షన్స్ లో గూగుల్ స్టోర్ ద్వారా మాత్రమే లభించనుంది.
- పిక్సెల్ 7ఏ తర్వాత గూగుల్ సంస్థ పిక్సెల్ 6ఏ ని నిలిపివేయదని రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది.
Google Pixel 7a ధర (అంచనా)
- పిక్సెల్ 7ఏ ధరను 9to5Google వెబ్ సైట్ తన కథనంలో పేర్కొంది. దాని ప్రకారం, ఈ ఫోన్ ధర 499 డాలర్లు (సుమారు రూ.41,000) గా ఉండనుంది. పిక్సెల్ 6ఏ కంటే ఇది 50 డాలర్లు ఎక్కువ.
Pixel 7a స్పెసిఫికేషన్స్ (అంచనా)
- Pixel 7a స్మార్ట్ ఫోన్ 6.1-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సిమ్మెట్రికల్ బెజెల్స్, సెంటర్ పొజిషన్డ్ పంచ్-హోల్ కటౌట్ తో రానుంది.
- ఈ డివైజ్ లో టెన్సర్ జీ2 చిప్సెట్ వాడనున్నారు. 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో ఈ ఫోన్ రానుంది.
- పిక్సెల్ 7ఏ లో 64ఎంపి సోని ఐఎంఎక్స్787 సెన్సర్, 13ఎంపి సెకండరీ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 10.8 ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
Pixel Fold స్పెసిఫికేషన్స్ (రూమర్స్)
- Pixel Fold డివైజ్ లో 7.57-ఇంచ్ ఫోల్డబుల్ మెయిన్ స్క్రీన్ మరియు 5.78-ఇంచ్ ఔటర్ స్క్రీన్ ఉంటాయి.
- ఈ ఫోల్డబుల్ ఫోన్ టెన్సర్ జీ2 చిప్సెట్ తో వస్తోంది. ఇందులో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి.
- ఈ డివైజ్ లో 4700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని సమాచారం. అయితే ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ గురించి సమాచారం ఇంకా రాలేదు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











