HMD Pulse Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 17 Apr 2024 16:08:04 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 HMD: లాంచ్‌కి ముందు లీకైన HMD Pulse Pro రెండర్స్, స్పెసిఫికేషన్స్, ధర వివరాలు https://www.91mobiles.com/telugu/hmd-pulse-pro-renders-specs-price-details-leaked-before-launch/ Wed, 17 Apr 2024 16:08:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=11149 స్మార్ట్‌ఫోన్ల తయారీదారు HMD నుంచి త్వరలో పల్స్ సిరీస్ లో ఫోన్లు లాంచ్ కానున్నాయి. భారత్ తో సహా గ్లోబల్ మార్కెట్స్ లో ఈ డివైజెస్ ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. తాజాగా OnLeaks సౌజన్యంతో 91mobiles HMD Pulse Pro యొక్క రెండర్స్‌ని రివీల్ చేసింది. అలాగే ఈ ఫోన్ అంచనా ధర, స్పెసిఫికేషన్స్ కూడా బయటకు వచ్చాయి. ఓసారి HMD Pulse Pro డివైజ్ రెండర్స్, ధర మరియు స్పెసిఫికేషన్స్ వివరాలను తెలుసుకుందాం పదండి. HMD Pulse […]

The post HMD: లాంచ్‌కి ముందు లీకైన HMD Pulse Pro రెండర్స్, స్పెసిఫికేషన్స్, ధర వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో HMD Pulse Pro లాంచ్
  • సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్
  • 90 హెర్ట్జ్ ఫ్లాట్ డిస్ప్లే

స్మార్ట్‌ఫోన్ల తయారీదారు HMD నుంచి త్వరలో పల్స్ సిరీస్ లో ఫోన్లు లాంచ్ కానున్నాయి. భారత్ తో సహా గ్లోబల్ మార్కెట్స్ లో ఈ డివైజెస్ ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. తాజాగా OnLeaks సౌజన్యంతో 91mobiles HMD Pulse Pro యొక్క రెండర్స్‌ని రివీల్ చేసింది. అలాగే ఈ ఫోన్ అంచనా ధర, స్పెసిఫికేషన్స్ కూడా బయటకు వచ్చాయి. ఓసారి HMD Pulse Pro డివైజ్ రెండర్స్, ధర మరియు స్పెసిఫికేషన్స్ వివరాలను తెలుసుకుందాం పదండి.

HMD Pulse Pro ధర (అంచనా)

లీకైన సమాచారం ప్రకారం, HMD Pulse Pro డివైజ్ ధర 179 యూరోలు ఉంటుందని తెలుస్తోంది. అంటే భారతీయ కరెన్సీలో ఇది రూ.15,950 అని చెప్పవచ్చు. భారత్ లో లాంచ్ అయ్యాక ఈ ధరలో మార్పు ఉంటుంది.

HMD Pulse Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: HMD Pulse Pro లో 6.56-ఇంచ్ ఐపీఎస్ స్క్రీన్, 1480*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సన్నని బెజెల్స్, ఫ్లాట్ డిస్ప్లే, సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్ ఉంటాయి.

కెమెరా: HMD Pulse Pro లో 50ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటుంది. బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి.

చిప్సెట్: HMD Pulse Pro లో యూనిఎస్ఓసీ టీ606 ప్రాసెసర్ ఉంటుంది. ఎంట్రీ లెవెల్ ఫోన్లలో ఎక్కువగా ఈ చిప్సెట్ కనిపిస్తుంది.

ర్యామ్, స్టోరేజీ: HMD Pulse Pro డివైజ్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో వస్తోందని టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది. ఇతర మెమొరీ వేరియంట్స్ కూడా ఉండే అవకాశం ఉంది.

బ్యాటరీ: HMD Pulse Pro డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ చార్జింగ్ వివరాలు ఇంకా తెలియదు.

బరువు: HMD Pulse Pro డివైజ్ 196 గ్రాముల బరువు ఉంటుంది.

ఇతర ఫీచర్లు: HMD Pulse Pro డివైజ్ లో 3.5ఎంఎం ఆడియో జాక్, ఐపీ52 స్ప్లాష్ రెసిస్టన్స్ రేటింగ్ ఉంటాయి.

The post HMD: లాంచ్‌కి ముందు లీకైన HMD Pulse Pro రెండర్స్, స్పెసిఫికేషన్స్, ధర వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
HMD: త్వరలో లాంచ్ కానున్న Nokia 3210 4G, HMD Pulse+, HMD T21 Tablet https://www.91mobiles.com/telugu/nokia-3210-4g-hmd-pulse-plus-hmd-t21-tablet-to-launch-soon/ Wed, 27 Mar 2024 09:22:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=10848 HMD సంస్థ ఇప్పటికే తన బ్రాండ్ ఫోన్లను లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటన చేసింది. ఈ ఉత్పత్తులు భారత్ తో సహా ఇతర మార్కెట్స్ లో లాంచ్ కానున్నాయి. ఈ డివైజెస్ లో ఒక ఫ్లిప్ ఫోన్ కూడా ఉంది. వీటితో పాటు Nokia బ్రాండ్ ఫోన్లు కూడా లాంచ్ కానున్నాయి. ఇక కొన్ని రోజుల క్రితం ఐఎంఈఐ డేటాబేస్ పై HMD కి సంబంధించిన 9 ఫోన్లు లిస్ట్ అయ్యాయి. ఇప్పుడు వీటిలో నుంచి కొన్ని డివైజెస్ […]

The post HMD: త్వరలో లాంచ్ కానున్న Nokia 3210 4G, HMD Pulse+, HMD T21 Tablet first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో HMD డివైజెస్ లాంచ్
  • లైనప్ లో వస్తోన్న HMD T21 ట్యాబ్
  • Nokia ఫోన్లు లాంచ్ అయ్యే అవకాశం

HMD సంస్థ ఇప్పటికే తన బ్రాండ్ ఫోన్లను లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటన చేసింది. ఈ ఉత్పత్తులు భారత్ తో సహా ఇతర మార్కెట్స్ లో లాంచ్ కానున్నాయి. ఈ డివైజెస్ లో ఒక ఫ్లిప్ ఫోన్ కూడా ఉంది. వీటితో పాటు Nokia బ్రాండ్ ఫోన్లు కూడా లాంచ్ కానున్నాయి. ఇక కొన్ని రోజుల క్రితం ఐఎంఈఐ డేటాబేస్ పై HMD కి సంబంధించిన 9 ఫోన్లు లిస్ట్ అయ్యాయి. ఇప్పుడు వీటిలో నుంచి కొన్ని డివైజెస్ యొక్క పేర్లు మరియు హార్డ్‌వేర్ వివరాలు, కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

త్వరలో లాంచ్ కాబోయే HMD ఫోన్ల జాబితా

Nokia 3210 4G: లిస్ట్ లో ఉన్న మొదటి ఫోన్ ఇదే. దీన్ని టిప్‌స్టర్ ముకుల్ శర్మ షేర్ చేశారు. ఐకానిక్ నోకియా 3210 ని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నంలో కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ స్కూబా బ్లూ, గ్రంజ్ బ్లాక్ మరియు వై2కే గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Nokia 225 4G: లిస్ట్ లో ఉన్న రెండో ఫోన్ Nokia 225 4G. ఈ డివైజ్ పింక్ మరియు డార్క్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అలాగే Nokia 235 4G ఫోన్ కూడా లాంచ్ కానుంది.

HMD T21 Tablet: హెచ్ఎండీ నుంచి ఒక ట్యాబ్లెట్ లాంచ్ కానుందని గతంలో వార్తలు వినిపించాయి. కంపెనీ విడుదల చేసిన అధికార టీజర్ లో కూడా ట్యాబ్లెట్ గ్లిమ్స్ ని చూపించారు.

HMD Pulse+: HMD Pulse+ స్మార్ట్‌ఫోన్ 6జిబి ర్యామ్/128జిబి స్టోరేజీ ఆప్షన్ లో లాంచ్ అవుతుందని సమాచారం. ఈ ఫోన్ 6.56-ఇంచ్ డిస్ప్లే, మిడ్నైట్ బ్లూ కలర్ ఆప్షన్ లో లభిస్తుంది.

HMD Pulse Pro: HMD Pulse Pro డివైజ్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్ లో లభిస్తుంది. ఈ హ్యాండ్సెట్ ట్విలైట్ పర్పుల్, బ్లాక్ ఓషన్ మరియు గ్లేవియర్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

HMD Legend, Legend+ మరియు Legend Pro ఫోన్లు కూడా అభివృద్ధి దశలో ఉన్నాయి. ఇకపోతే, HMD Pulse Pro టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై TA-1595 మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఈ సర్టిఫికేషన్ ద్వారా మరే ఇతర వివరాలు రివీల్ కాలేదు.

The post HMD: త్వరలో లాంచ్ కానున్న Nokia 3210 4G, HMD Pulse+, HMD T21 Tablet first appeared on 91Mobiles Telugu.

]]>