Honor - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 23 Jan 2024 05:58:52 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Honor X9b: లాంచ్‌కి ముందు లీకైన ఇండియా మార్కెట్ ధర, లాంచ్ తేదీ https://www.91mobiles.com/telugu/honor-x9b-5g-india-launch-date-price-leaked-before-launch/ Tue, 23 Jan 2024 05:58:52 +0000 https://www.91mobiles.com/telugu/?p=9869 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Honor త్వరలో భారతీయ మార్కెట్ లో Honor X9b అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయనుంది. తమ ఫోన్ ఎంత పటిష్టమైనదో తెలిపేందుకు పలు పరీక్షలు చేస్తున్న హానర్, ఆ వీడియోలను గత కొన్ని రోజులుగా టీజ్ చేస్తూ వస్తోంది. ఇకపోతే, Honor X9b డివైజ్ మిడ్-రేంజ్ బడ్జెట్ లో మార్కెట్ లోకి ప్రవేశించనుంది. తాజాగా Honor X9b యొక్క భారత మార్కెట్ ధర, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఆ […]

The post Honor X9b: లాంచ్‌కి ముందు లీకైన ఇండియా మార్కెట్ ధర, లాంచ్ తేదీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఫిబ్రవరి 8 లేదా 9 తేదీల్లో Honor X9b లాంచ్ అయ్యే ఛాన్స్
  • స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌తో రానున్న Honor X9b
  • డివైజ్ ధర రూ.30 వేల లోపు ఉండే అవకాశం

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Honor త్వరలో భారతీయ మార్కెట్ లో Honor X9b అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయనుంది. తమ ఫోన్ ఎంత పటిష్టమైనదో తెలిపేందుకు పలు పరీక్షలు చేస్తున్న హానర్, ఆ వీడియోలను గత కొన్ని రోజులుగా టీజ్ చేస్తూ వస్తోంది. ఇకపోతే, Honor X9b డివైజ్ మిడ్-రేంజ్ బడ్జెట్ లో మార్కెట్ లోకి ప్రవేశించనుంది. తాజాగా Honor X9b యొక్క భారత మార్కెట్ ధర, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఆ విశేషాలను తెలుసుకుందాం పదండి.

Honor X9b ఇండియా లాంచ్ తేదీ, ధర (లీక్)

  • ప్రముఖ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని Honor X9b భారత మార్కెట్ ధర, లాంచ్ తేదీని లీక్ చేశారు.
  • Honor X9b డివైజ్ భారత్ లో ఫిబ్రవరి 8 లేదా 9 తేదీల్లో లాంచ్ అవుతుందని టిప్‌స్టర్ అంచనా వేశారు.
  • అయితే రానున్న రోజుల్లో Honor X9b డివైజ్ యొక్క అసలైన లాంచ్ తేదీ రివీల్ కానుంది.
  • Honor X9b స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 7.2 కస్టమ్ స్కిన్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తుందని టిప్‌స్టర్ పారస్ తెలిపారు.

Honor X9b 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Honor X9b 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 1200*2652 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1920 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 429 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, ఎస్‌జీఎస్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Honor X9b 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, అడ్రెనో 710 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Honor X9b 5G డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ని ఆఫర్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Honor X9b 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.2 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Honor X9b 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Honor X9b 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 35 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Honor X9b 5G లో 5జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై 5, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్బీ 2.0 వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
  • కలర్ ఆప్షన్స్: Honor X9b 5G డివైజ్ సన్‌రైజ్ ఆరెంజ్, మిడ్నైట్ బ్లాక్, ఎమరాల్డ్ గ్రీన్ మరియు టైటానియమ్ సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post Honor X9b: లాంచ్‌కి ముందు లీకైన ఇండియా మార్కెట్ ధర, లాంచ్ తేదీ first appeared on 91Mobiles Telugu.

]]>
భారతీయ మార్కెట్ లోకి రీ-ఎంట్రీ ఇస్తోన్న Honor; ఆగస్టులో లాంచ్ కానున్న మొదటి ఫోన్! https://www.91mobiles.com/telugu/honor-re-entry-indan-market-first-phone-in-august-under-madhav-sheth-leadership/ Mon, 17 Jul 2023 06:07:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=7201 2013 లో Honor సంస్థ హువావే కి సబ్-బ్రాండ్ గా చైనాలో ప్రవేశించింది. 2014 లో భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన హానర్ తక్కువ సమయంలోనే యూజర్లలో బాగా పాపులర్ అయ్యింది. ఆ సంస్థ పరిచయం చేసిన వాల్యూ-ఫర్-మనీ డివైజెస్ ఇందుకు కారణం. అయితే హానర్ కంపెనీ 2020 లో భారతీయ మార్కెట్ లో తన స్మార్ట్‌ఫోన్ బిజినెస్ కి గుడ్ బై చెప్పింది. అదే సమయంలో హానర్ Honor 9X Pro, Honor 9S, […]

The post భారతీయ మార్కెట్ లోకి రీ-ఎంట్రీ ఇస్తోన్న Honor; ఆగస్టులో లాంచ్ కానున్న మొదటి ఫోన్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మళ్ళీ ఎంట్రీ ఇవ్వబోతున్న హానర్ కంపెనీ
  • ఆగస్టులో మొదటి ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం
  • హానర్ ఇండియాని లీడ్ చేయనున్న రియల్మీ మాజీ సీఈవో మాధవ్ సేత్

2013 లో Honor సంస్థ హువావే కి సబ్-బ్రాండ్ గా చైనాలో ప్రవేశించింది. 2014 లో భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన హానర్ తక్కువ సమయంలోనే యూజర్లలో బాగా పాపులర్ అయ్యింది. ఆ సంస్థ పరిచయం చేసిన వాల్యూ-ఫర్-మనీ డివైజెస్ ఇందుకు కారణం. అయితే హానర్ కంపెనీ 2020 లో భారతీయ మార్కెట్ లో తన స్మార్ట్‌ఫోన్ బిజినెస్ కి గుడ్ బై చెప్పింది. అదే సమయంలో హానర్ Honor 9X Pro, Honor 9S, Honor 9A వంటి ఫోన్లను లాంచ్ చేసింది.

అయితే భారత మార్కెట్ నుంచి హానర్ పూర్తిగా వైదొలగలేదు. ఫిట్నెస్ ట్రాకర్స్, ట్యాబ్లెట్స్ వంటి డివైజెస్ ని లాంచ్ చేస్తూ వస్తోంది. తాజా నివేదిక ద్వారా హానర్ తిరిగి భారతీయ మార్కెట్ లోకి ప్రవేశించనున్నట్లు తెలిసింది. అలాగే తన తొలి ఫోన్ ని భారత్ లో ఆగస్టు నెలలో లాంచ్ చేయనుందని సమాచారం.

గత నెలలో వచ్చిన నివేదిక ప్రకారం, రియల్మీ మాజీ సీఈవో, మాధవ్ సేత్ భారత్ లో హానర్ బ్రాండ్ ని నడిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ ఒక ఇమేజ్ ని షేర్ చేశారు. దాన్ని క్రింద చూడవచ్చు. ఇమేజ్ లో Honor for Knights అనే ట్రేడ్‌మార్క్ కనిపిస్తోంది.

లిస్టింగ్ లోని డిస్క్రిప్షన్ ని బట్టి, ఇది మొబైల్ ఫోన్స్, యాక్ససరీలతో అసోసియేట్ అయినట్లు తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మాధవ్ సేత్ ని ప్రొప్రైటర్ గా పేర్కొనబడింది. మరోవైపు, మాధవ్ సేత్ తన ట్వీట్ లో ఒక ప్రశ్నను సంధించారు. “వెన్ ఈజ్ ద నైట్ కమింగ్?” అని ఆ ప్రశ్న ఉంది. దీంతో ఇది హానర్ నుంచి రానున్న కొత్త ఫోన్ గురించేనని ఫాలోవర్లు అభిప్రాయపడుతున్నారు.

టిప్‌స్టర్ శర్మ ప్రకారం, హానర్ భారతీయ మార్కెట్ లోకి ఆగస్టులో ఒక కొత్త ఫోన్ తో రీఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. అయితే స్పెసిఫిక్ మోడల్ గురించి బ్రాండ్ నుంచి ఏ సమాచారం బయటకు రాలేదు.

The post భారతీయ మార్కెట్ లోకి రీ-ఎంట్రీ ఇస్తోన్న Honor; ఆగస్టులో లాంచ్ కానున్న మొదటి ఫోన్! first appeared on 91Mobiles Telugu.

]]>
భారత మార్కెట్ నుంచి తప్పుకోవడంపై స్పందించిన HONOR https://www.91mobiles.com/telugu/honor-denies-reports-of-india-market-exit/ Tue, 26 Jul 2022 09:42:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=1254 హైలైట్స్: భారత్ నుంచి వైదొలగడం లేదని స్పష్టం చేసిన హానర్ ప్రతినిధి జియోపొలిటికల్ కారణాలతో హానర్ భారత్ ని వీడనుందని తెలిపిన గత నివేదికలు భారత ఎలక్ట్రానిక్స్ మార్కెట్ లో స్థిరమైన డిమాండ్ లేమితో మొదలైన హానర్ వివాదం హువావే యొక్క ఒకప్పటి సబ్ బ్రాండ్ అయిన చైనీస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ హానర్, తాజాగా భారతీయ మార్కెట్ నుంచి తప్పుకోవడం పై స్పందించింది. తాము భారత మార్కెట్ నుంచి వైదొలగడం లేదని స్పష్టం చేసింది. చైనీస్ మీడియా […]

The post భారత మార్కెట్ నుంచి తప్పుకోవడంపై స్పందించిన HONOR first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత్ నుంచి వైదొలగడం లేదని స్పష్టం చేసిన హానర్ ప్రతినిధి
  • జియోపొలిటికల్ కారణాలతో హానర్ భారత్ ని వీడనుందని తెలిపిన గత నివేదికలు
  • భారత ఎలక్ట్రానిక్స్ మార్కెట్ లో స్థిరమైన డిమాండ్ లేమితో మొదలైన హానర్ వివాదం

హువావే యొక్క ఒకప్పటి సబ్ బ్రాండ్ అయిన చైనీస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ హానర్, తాజాగా భారతీయ మార్కెట్ నుంచి తప్పుకోవడం పై స్పందించింది. తాము భారత మార్కెట్ నుంచి వైదొలగడం లేదని స్పష్టం చేసింది. చైనీస్ మీడియా ఔట్ లెట్ ఐటీ హోమ్ తన కథనంలో, హానర్ సీఈవో జావో మింగ్ తాము భారత మార్కెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించినట్లు పేర్కొనడంతో ఈ వివాదం మొదలైంది. అయితే భారత్ లో హానర్ వ్యాపారం బాగానే సాగుతోంది. సదరు కంపెనీకి నష్టాలు కూడా ఏమీ లేవు. అయితే గత కొంత కాలంగా హానర్ నుంచి భారత మార్కెట్ కి స్మార్ట్ ఫోన్ ఏదీ రాలేదు. కానీ, చివరగా ఓ స్మార్ట్ వాచ్ ని లాంచ్ చేసింది.

Honor వివరణ, భారత మార్కెట్ స్తబ్ధత

తాజా నివేదికలపై స్పందించిన హానర్ ప్రతినిధి, “హానర్ భారత్ లో వ్యాపార లావాదేవీలను కొనసాగిస్తూ, అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తుంది. హానర్ ఇండియన్ మార్కెట్ నుంచి తప్పుకుంటోందన్న వార్తలు నిజం కాదు,” అని అన్నారు.

మరింత పకడ్బందీ వ్యూహంతో భారత్ లో వ్యాపారం చేసేందుకు మార్గాలను అన్వేషిస్తామని, హానర్ తెలిపినట్లు ఐటీ హోమ్ తన కథనంలో పేర్కొంది. అయితే హానర్ స్టేట్మెంట్ ని చూస్తే, భారత్, చైనా మధ్య నెలకొన్న జియోపొలిటికల్ పరిస్థితులను ప్రతిబింబిస్తున్నట్లు కనిపిస్తోంది. భారత ప్రభుత్వం గత కొన్నాళ్ళుగా ఎన్నో మొబైల్ యాప్స్ పై బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. అందులో హువావే కు చెందినవి కూడా ఉన్నాయి. గతంలో హువావే, హానర్ యొక్క పేరెంట్ కంపెనీ గా ఉన్న సంగతి తెలిసిందే. తర్వాత హానర్ వేరే కంపెనీగా అవతరించింది.

గతంలో హువావే, హానర్ బ్రాండ్స్ నుంచి ఎన్నో స్మార్ట్ ఫోన్స్, వేరబుల్స్, లాప్ టాప్స్, ఇతర డివైజెస్ పెద్ద ఎత్తున లాంచ్ అవుతుండేవి. కానీ, గత కొంత కాలంగా ఆశించిన స్థాయిలో లాంచెస్ ఏమీ లేవు. దీంతో హానర్ భారత మార్కెట్ నుంచి వైదొలుగుతోందనే వార్తలకు బలం చేకూరినట్లైంది. ఏలా అయితేనేమీ, తాము తప్పుకోవడం లేదని హానర్ ప్రతినిధి క్లారిటీ ఇచ్చేశారు. మరి భారత్ లో త్వరలోనే ఏదైనా స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసి మేం రేసులోనే ఉన్నామని గట్టిగా ప్రకటిస్తారేమో చూడాలి.

2022 ప్రథమార్థం లో భారత కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ స్తబ్దత నెలకొంది. ఇది కొన్ని రోజులుగా అలాగే కొనసాగుతోంది. భారత కన్స్యూమర్ మార్కెట్ లో స్మార్ట్ ఫోన్స్, యాక్సెసరీలు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు రెండు రెట్లు అధికంగా అమ్ముడవ్వక పేరుకుపోయి ఉన్నాయని మింట్ తన కథనంలో పేర్కొంది. వినియోగదారుల నుంచి డిమాండ్ తగ్గడమే దీనికి కారణమని మింట్ విశ్లేషించింది. ఆర్థిక మాంద్యం, హై డాలర్ ప్రైసెస్ తో పంపిణీ ఖర్చు పెరగడంచే, కొనుగోలుదారులకు డిస్కౌంట్స్ లేకుండా పోయాయి. మరి భారత మార్కెట్ లో నెలకొన్న స్తబ్దతను మిగతా బ్రాండ్స్ ఎలా ఎదుర్కుంటాయో చూడాలి.

The post భారత మార్కెట్ నుంచి తప్పుకోవడంపై స్పందించిన HONOR first appeared on 91Mobiles Telugu.

]]>
భారత మార్కెట్ నుంచి తప్పుకున్న Honor https://www.91mobiles.com/telugu/honor-officially-exited-from-the-india-markets-ceo-zhao-ming-report/ Fri, 22 Jul 2022 16:10:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=1196 హైలైట్స్: ఇటీవలె భారత్ లో హానర్ వాచ్ జీఎస్ 3 ని లాంచ్ చేసిన హానర్ తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో హానర్ సీఈవో సంచలన ప్రకటన భారత మార్కెట్ నుంచి వైదొలిగినప్పటికీ, భాగస్వామ్యాలను కొనసాగిస్తామని సీఈవో జావో మింగ్ ప్రకటన హానర్ సీఈవో జావో మింగ్ తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, భారత మార్కెట్ నుంచి వైదొలిగామని ప్రకటించినట్లు సమాచారం. గత కొన్నేళ్ళుగా భారత మార్కెట్ లో కొనసాగామని, ఇప్పుడు హానర్ టీమ్ ఇండియన్ మార్కెట్స్ […]

The post భారత మార్కెట్ నుంచి తప్పుకున్న Honor first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఇటీవలె భారత్ లో హానర్ వాచ్ జీఎస్ 3 ని లాంచ్ చేసిన హానర్
  • తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో హానర్ సీఈవో సంచలన ప్రకటన
  • భారత మార్కెట్ నుంచి వైదొలిగినప్పటికీ, భాగస్వామ్యాలను కొనసాగిస్తామని సీఈవో జావో మింగ్ ప్రకటన

హానర్ సీఈవో జావో మింగ్ తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, భారత మార్కెట్ నుంచి వైదొలిగామని ప్రకటించినట్లు సమాచారం. గత కొన్నేళ్ళుగా భారత మార్కెట్ లో కొనసాగామని, ఇప్పుడు హానర్ టీమ్ ఇండియన్ మార్కెట్స్ నుంచి తప్పుకుంటోందని మింగ్ చెప్పారు. అయితే, కంపెనీ తమ భాగస్వాములతో కలిసి వ్యాపారం చేస్తామని మింగ్ తెలిపారు. భారత మార్కెట్ లో కూడా హానర్ కు బాగానే లాభాలు వచ్చాయి. కంపెనీ భవిష్యత్తులో భారత మార్కెట్ లోకి మళ్ళీ ప్రవేశించే అవకాశమున్నట్లు సమాచారం.

ఐటీ హోమ్ వెబ్ సైట్ హానర్ కంపెనీ భారత్ నుంచి వైదొలిగినట్లు తన కథనం లో పేర్కొంది. ఇక చివరగా మార్చి, 2021 లో హోలీ పండుగ సందర్భంగా తన అఫీషియల్ హ్యాండిల్ నుంచి ట్వీట్ చేసింది. మార్కెట్ నుంచి తప్పుకుంటున్నప్పటికీ, హానర్ ఇప్పటి వరకు ఇచ్చిన ప్రామిస్ లను నిలబెట్టుకుంటుందని మింగ్ చెప్పారు. గత కొన్ని నెలల కాలంలో, హానర్ నుంచి పలు స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్, నోట్ బుక్స్ వంటి ఎన్నో ఉపకరణాలు భారత్ లో లాంచ్ అయ్యాయి.

ఇటీవలె హానర్ భారత్ లో హానర్ వాచ్ జీఎస్3 ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ వాచ్ 1.43 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే ను కలిగి ఉంది. 1000 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ కూడా ఇందులో ఉంది. సింగిల్ ఛార్జ్ తో ఈ వాచ్ 14 రోజులు వరకు నిరవధికంగా పని చేస్తుంది. ఈ వాచ్ మిడ్ నైట్ వేరియంట్ ధర రూ.12,990. ఓషియన్ బ్లూ, క్లాసిక్ గోల్డ్ వాచెస్ ధర రూ.14,990.

హువావే సబ్-బ్రాండ్ అయిన హానర్ గ్లోబల్ గా హానర్ ఎక్స్8 5జీ ఫోన్ ని శుక్రవారం నాడు లాంచ్ చేసింది. దీని ఫీచర్లు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. స్నాప్ డ్రాగన్ 480+ చిప్సెట్, అడ్రెనో 619 జీపీయూ, 6జిబి ర్యామ్, 6.5 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే, 20:9 యాస్పెక్ట్ రేషియో, 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. ఇక ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవకాశాలు దాదాపుగా లేనట్లే.

అలాగే హానర్ సీఈవో మింగ్ తమ కంపెనీ యొక్క భవిష్యత్ ప్లాన్స్ గురించి తెలిపారు. వచ్చే కొన్నేళ్ళ వరకు తమ కంపెనీకి కార్లు తయారు చేసే ఉద్దేశ్యం ఏదీ లేదని మింగ్ స్పష్టం చేశారు. ఇటీవల స్మార్ట్ ఫోన్ మేకర్ షావోమీ, ఎలక్ట్రిక్ కార్ల రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. షావోమీ నుంచి తొలి ఎలక్ట్రిక్ కారు 2024 లో తయారు కానుంది. ఈలోపు 2022 లో తమ కారు యొక్క ప్రోటోటైప్ ను జనాల ముందుకు తీసుకురావాలని షావోమీ లక్ష్యంగా పెట్టుకుంది.

The post భారత మార్కెట్ నుంచి తప్పుకున్న Honor first appeared on 91Mobiles Telugu.

]]>