Infinix Smart 7 HD - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 28 Apr 2023 10:26:48 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 కేవలం రూ.5,999 ధరతో భారత్‌లో లాంచైన Infinix Smart 7 HD https://www.91mobiles.com/telugu/infinix-smart-7-hd-launched-india-price-specs-availability/ Fri, 28 Apr 2023 10:26:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=6077 ఇన్ఫినిక్స్ సంస్థ నేడు భారత్ లో Infinix Smart 7 HD అనే చవకైన స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.5,999 మాత్రమే. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, భారీ డిస్ప్లే, ఎక్స్ఓఎస్ 12 కస్టమ్ స్కిన్, 4జీ ఏఐ ప్రాసెసర్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. తక్కువ బడ్జెట్ లో ఎంట్రీ లెవెల్ ఫోన్ కొనాలనుకునే వారికి ఈ ఫోన్ మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. సరే […]

The post కేవలం రూ.5,999 ధరతో భారత్‌లో లాంచైన Infinix Smart 7 HD first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Infinix Smart 7 HD ఒక చవకైన స్మార్ట్ ఫోన్
  • ఆండ్రాయిడ్ గో ఎడిషన్ పై పని చేయనున్న డివైజ్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన హ్యాండ్సెట్

ఇన్ఫినిక్స్ సంస్థ నేడు భారత్ లో Infinix Smart 7 HD అనే చవకైన స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.5,999 మాత్రమే. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, భారీ డిస్ప్లే, ఎక్స్ఓఎస్ 12 కస్టమ్ స్కిన్, 4జీ ఏఐ ప్రాసెసర్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. తక్కువ బడ్జెట్ లో ఎంట్రీ లెవెల్ ఫోన్ కొనాలనుకునే వారికి ఈ ఫోన్ మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. సరే ఓసారి, Infinix Smart 7 HD ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Infinix Smart 7 HD ధర

Infinix Smart 7 HD డివైజ్ భారతీయ మార్కెట్ లో 2జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీతో ఒకే వేరియంట్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ధరను రూ.5,999 గా నిర్ణయించారు. అయితే లాంచ్ ఆఫర్ లో భాగంగా ఈ డివైజ్ ని రూ.5,399 కే కొనుగోలు చేయవచ్చు. Infinix Smart 7 HD ఫోన్ మే 4 నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది. ఈ డివైజ్ సిల్క్ బ్లూ, గ్రీన్ ఆపిల్, ఇంక్ బ్లాక్ మరియు జేడ్ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Infinix Smart 7 HD స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

Infinix Smart 7 HD స్మార్ట్ ఫోన్ వేవ్ ప్యాటర్న్ డిజైన్ తో వచ్చింది. ఈ ఫోన్ లో 6.6-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్, 500 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఇకపోతే డిస్ప్లే కి మూడు వైపులా సన్నని బెజెల్స్, బాటమ్ లో మందపాటి చిన్ ఉన్నాయి.

ఓఎస్, ర్యామ్

Infinix Smart 7 HD డివైజ్ ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ తో లాంచ్ అయ్యింది. ఎక్ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది. ఆండ్రాయిడ్ గో ఎడిషన్ కావున గూగుల్ గో యాప్స్ ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీంతో తక్కువ ర్యామ్ ని వాడుకుని యాప్స్ నడుస్తాయి. Infinix Smart 7 HD డివైజ్ 2జిబి ఇంటర్నల్ ర్యామ్ మరియు 2జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చింది. దీంతో యూజర్ కి మొత్తం 4జిబి ర్యామ్ లభిస్తుంది.

కెమెరా విభాగం

Infinix Smart 7 HD స్మార్ట్ ఫోన్ లో 8ఎంపి రియర్ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ, కనెక్టివిటీ

Infinix Smart 7 HD లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఈ ఫోన్ లో బ్లూటూత్, వై-ఫై, డ్యూయల్ సిమ్, 4జీ వంటి బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post కేవలం రూ.5,999 ధరతో భారత్‌లో లాంచైన Infinix Smart 7 HD first appeared on 91Mobiles Telugu.

]]>
5000mAh బ్యాటరీ, 6.6-ఇంచ్ డిస్ప్లేతో ఏప్రిల్ 28 న లాంచ్ కానున్న Infinix Smart 7 HD https://www.91mobiles.com/telugu/infinix-smart-7-hd-india-launch-date-specifications/ Tue, 18 Apr 2023 05:54:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=5921 ఇన్ఫినిక్స్ సంస్థ ఒక కొత్త స్మార్ట్ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Infinix Smart 7 HD డివైజ్ ఏప్రిల్ 28 న భారత్ లో లాంచ్ కానుంది. గతేడాది లాంచైన మోడల్ స్మార్ట్ 6 హెచ్డీ ఫోన్ కి ఇది సక్సెసర్ గా వస్తోంది. త్వరలో లాంచ్ కాబోవు Infinix Smart 7 HD డివైజ్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ని కంపెనీ రివీల్ చేసింది. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం. […]

The post 5000mAh బ్యాటరీ, 6.6-ఇంచ్ డిస్ప్లేతో ఏప్రిల్ 28 న లాంచ్ కానున్న Infinix Smart 7 HD first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో Infinix Smart 7 HD ని లాంచ్ చేయనున్న ఇన్ఫినిక్స్
  • ఏప్రిల్ 28 న మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న డివైజ్
  • 6.6-ఇంచ్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోన్న ఫోన్

ఇన్ఫినిక్స్ సంస్థ ఒక కొత్త స్మార్ట్ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Infinix Smart 7 HD డివైజ్ ఏప్రిల్ 28 న భారత్ లో లాంచ్ కానుంది. గతేడాది లాంచైన మోడల్ స్మార్ట్ 6 హెచ్డీ ఫోన్ కి ఇది సక్సెసర్ గా వస్తోంది. త్వరలో లాంచ్ కాబోవు Infinix Smart 7 HD డివైజ్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ని కంపెనీ రివీల్ చేసింది. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.

Infinix Smart 7 HD స్పెసిఫికేషన్స్ (ఖరారు)

డిస్ప్లే

Infinix Smart 7 HD డివైజ్ లో 6.6-ఇంచ్ భారీ డిస్ప్లే ఉంటుంది. ఇది హెచ్డీ రెజుల్యూషన్ మరియు వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ తో రానుంది.

ర్యామ్ మరియు స్టోరేజీ వివరాలు

Infinix Smart 7 HD డివైజ్ 4జిబి ర్యామ్ మరియు 64జిబి స్టోరేజీ తో వస్తోంది. ఇప్పటివరకు ఈ ఫోన్ లో వాడబడిన ప్రాసెసర్ గురించి సమాచారం తెలియలేదు.

బ్యాటరీ

Infinix Smart 7 HD స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. చార్జింగ్ కెపాసిటీ లాంచ్ తేదీ రోజున రివీల్ అవుతుంది.

సెక్యూరిటీ

Infinix Smart 7 HD లో భద్రత కోసం బ్యాక్ ప్యానెల్ పై కెమెరా మాడ్యూల్ పక్కన ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది.

కెమెరా సెటప్

Infinix Smart 7 HD స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. అయితే కెమెరా సెన్సర్స్ ఏమి ఉండనున్నాయో ఇంకా తెలియలేదు. అలాగే ఫ్రంట్ కెమెరా వివరాలు కూడా ప్రస్తుతం అందుబాటులో లేవు.

Infinix Smart 7 HD ధర (అంచనా)

Infinix Smart 7 HD స్మార్ట్ ఫోన్ గ్రీన్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది. లో-బడ్జెట్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. ఇప్పటి వరకు ధరకు సంబంధించిన సమాచారం తెలియలేదు. త్వరలోనే కంపెనీ నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

మరొక వార్త ఏంటంటే, Infinix సంస్థ ఏప్రిల్ 19 న భారత్ లో InBook Y1 Plus Neo అనే ల్యాప్ టాప్ ని లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ల్యాప్ టాప్ 15.6-ఇంచ్ డిస్ప్లే, డ్యూయల్ 2వాట్ స్పీకర్, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, టైప్-సీ పోర్ట్, 512జిబి స్టోరేజీ, ఇంటెల్ కోర్ ప్రాసెసర్ తో రానున్నట్లు తెలుస్తోంది. ఈ ల్యాప్ టాప్ ధర రూ.25,000 లోపు ఉండే అవకాశం ఉంది. లాంచ్ రోజున కచ్చితమైన ధర తెలియనుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 5000mAh బ్యాటరీ, 6.6-ఇంచ్ డిస్ప్లేతో ఏప్రిల్ 28 న లాంచ్ కానున్న Infinix Smart 7 HD first appeared on 91Mobiles Telugu.

]]>