
ఇన్ఫినిక్స్ సంస్థ నేడు భారత్ లో Infinix Smart 7 HD అనే చవకైన స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.5,999 మాత్రమే. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, భారీ డిస్ప్లే, ఎక్స్ఓఎస్ 12 కస్టమ్ స్కిన్, 4జీ ఏఐ ప్రాసెసర్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. తక్కువ బడ్జెట్ లో ఎంట్రీ లెవెల్ ఫోన్ కొనాలనుకునే వారికి ఈ ఫోన్ మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. సరే ఓసారి, Infinix Smart 7 HD ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Infinix Smart 7 HD ధర
Infinix Smart 7 HD డివైజ్ భారతీయ మార్కెట్ లో 2జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీతో ఒకే వేరియంట్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ధరను రూ.5,999 గా నిర్ణయించారు. అయితే లాంచ్ ఆఫర్ లో భాగంగా ఈ డివైజ్ ని రూ.5,399 కే కొనుగోలు చేయవచ్చు. Infinix Smart 7 HD ఫోన్ మే 4 నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది. ఈ డివైజ్ సిల్క్ బ్లూ, గ్రీన్ ఆపిల్, ఇంక్ బ్లాక్ మరియు జేడ్ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Infinix Smart 7 HD స్పెసిఫికేషన్స్
డిస్ప్లే
Infinix Smart 7 HD స్మార్ట్ ఫోన్ వేవ్ ప్యాటర్న్ డిజైన్ తో వచ్చింది. ఈ ఫోన్ లో 6.6-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్, 500 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఇకపోతే డిస్ప్లే కి మూడు వైపులా సన్నని బెజెల్స్, బాటమ్ లో మందపాటి చిన్ ఉన్నాయి.
ఓఎస్, ర్యామ్
Infinix Smart 7 HD డివైజ్ ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ తో లాంచ్ అయ్యింది. ఎక్ఓఎస్ 12 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది. ఆండ్రాయిడ్ గో ఎడిషన్ కావున గూగుల్ గో యాప్స్ ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీంతో తక్కువ ర్యామ్ ని వాడుకుని యాప్స్ నడుస్తాయి. Infinix Smart 7 HD డివైజ్ 2జిబి ఇంటర్నల్ ర్యామ్ మరియు 2జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చింది. దీంతో యూజర్ కి మొత్తం 4జిబి ర్యామ్ లభిస్తుంది.
కెమెరా విభాగం
Infinix Smart 7 HD స్మార్ట్ ఫోన్ లో 8ఎంపి రియర్ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
బ్యాటరీ, కనెక్టివిటీ
Infinix Smart 7 HD లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఈ ఫోన్ లో బ్లూటూత్, వై-ఫై, డ్యూయల్ సిమ్, 4జీ వంటి బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











