iPhone 14 Series - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 13 Sep 2022 05:50:43 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 iPhone 14 సిరీస్ బ్యాటరీ కెపాసిటీ వివరాలు https://www.91mobiles.com/telugu/apple-iphone-14-series-battery-capacity-revealed/ Tue, 13 Sep 2022 05:32:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=2286 హైలైట్స్: చైనా రెగ్యులేటరీ డేటాబేస్ ద్వారా నెట్టింట్లోకి వచ్చిన ఆపిల్ iPhone 14 బ్యాటరీ వివరాలు iPhone 14 లైనప్ లో కెల్లా ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ కలిగి ఉన్న iPhone 14 Plus iPhone 13 Pro Max బ్యాటరీ సైజుతో పోల్చితే కాస్త చిన్నగా ఉన్న iPhone 14 Pro Max బ్యాటరీ గత వారం జరిగిన ఫార్ ఔట్ ఈవెంట్ లో ఆపిల్ సంస్థ iPhone 14 సిరీస్ ని లాంచ్ చేసింది. […]

The post iPhone 14 సిరీస్ బ్యాటరీ కెపాసిటీ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • చైనా రెగ్యులేటరీ డేటాబేస్ ద్వారా నెట్టింట్లోకి వచ్చిన ఆపిల్ iPhone 14 బ్యాటరీ వివరాలు
  • iPhone 14 లైనప్ లో కెల్లా ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ కలిగి ఉన్న iPhone 14 Plus
  • iPhone 13 Pro Max బ్యాటరీ సైజుతో పోల్చితే కాస్త చిన్నగా ఉన్న iPhone 14 Pro Max బ్యాటరీ

గత వారం జరిగిన ఫార్ ఔట్ ఈవెంట్ లో ఆపిల్ సంస్థ iPhone 14 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro, iPhone 14 Pro Max అనే మోడల్స్ ఉన్నాయి. ఐఫోన్ హిస్టరీలోనే iPhone 14 Plus అత్యధిక బ్యాటరీ కెపాసిటీ కలిగిన ఫోన్ అని ఆపిల్ చెబుతోంది. అయితే ఈ కొత్త లైనప్ కి సంబంధించిన బ్యాటరీ కెపాసిటీ వివరాలపై మాత్రం ఆపిల్ మౌనంగా ఉంది.

ఒక చైనా రెగ్యులేటరీ డేటాబేస్ ద్వారా iPhone 14 సిరీస్ ఫోన్లకు సంబంధించిన బ్యాటరీ కెపాసిటీ వివరాలు ఆన్‌లైన్లో ప్రత్యక్షమయ్యాయి. మ్యాక్‌రూమర్స్ ఈ లిస్టింగ్ ని వెలికితీసింది. ఈ నంబర్స్ జూన్ లో లీకైన కెపాసిటీలను పోలి ఉన్నాయి. మరి iPhone 14 సిరీస్ బ్యాటరీ వివరాలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.

iPhone 14 సిరీస్ బ్యాటరీ కెపాసిటీ

iPhone 14 సిరీస్ లోని అన్ని మోడల్స్ యొక్క బ్యాటరీ సైజులు లీక్ అయిన ఫైలింగ్ లో ఉన్నాయి. iPhone 14 Plus అన్నింటికంటే అత్యధిక బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. iPhone 14, iPhone 14 Pro మోడల్స్ బ్యాటరీ సామర్థ్యం iPhone 13 లైనప్ మోడల్స్ తో పోల్చితే తక్కువగా ఉంది. iPhone 14 Pro Max బ్యాటరీ సామర్థ్యం iPhone 13 Pro Max కెపాసిటీ కంటే కాస్త తక్కువగా ఉంది. iPhone 14 సిరీస్ బ్యాటరీ కెపాసిటీస్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

iPhone 14 మోడల్ లో 3,279mAh బ్యాటరీ ఉంది. iPhone 14 Plus లో 4,325mAh బ్యాటరీని అమర్చారు. iPhone 14 Pro లో 3,200mAh బ్యాటరీ నిక్షిప్తమైంది. iPhone 14 Pro Max లో 4,323mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ ఉంది.

ఇప్పుడు iPhone 13 సిరీస్ బ్యాటరీ కెపాసిటీ మోడల్స్ వారిగా ఎలా ఉందో తెలుసుకుందాం. iPhone 13 స్టాండర్డ్ వేరియంట్ బ్యాటరీ కెపాసిటీ 3,227mAh గా ఉంది. iPhone 13 mini బ్యాటరీ సామర్థ్యం 2,406mAh గా ఉంది. iPhone 13 Pro మోడల్ లో 3,095mAh బ్యాటరీ ఉంది. హై-వేరియంట్ అయిన iPhone 13 Pro Max లో 4,352mAh బ్యాటరీని అమర్చారు.

లీకైన లిస్టింగ్ iPhone 14 సిరీస్, iPhone 13 సిరీస్ ల యొక్క వాట్-అవర్స్ కెపాసిటీని కూడా రివీల్ చేసింది. iPhone 14 లో 12.68 watt-hours, iPhone 14 Plus లో 16.68 watt-hours, iPhone 14 Pro లో 12.38 watt-hours, iPhone 14 Pro Max లో 16.68 watt-hours కెపాసిటీ ఉన్నాయి.

ఇక iPhone 13 సిరీస్ లో వాట్ అవర్స్ కెపాసిటీ ఎలా ఉందో తెలుసుకుందాం. iPhone 13 స్టాండర్డ్ వేరియంట్ లో 12.41 watt-hours, iPhone 13 mini లో 9.34 watt-hours, iPhone 13 Pro లో 11.97 watt-hours, iPhone 13 Pro Max లో 16.75 watt-hours కెపాసిటీస్ ఉన్నాయి.

The post iPhone 14 సిరీస్ బ్యాటరీ కెపాసిటీ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
iPhone 14 లాంచ్ తర్వాత భారత్ లో తగ్గిన iPhone 13, iPhone 13 mini, iPhone 12 ధరలు https://www.91mobiles.com/telugu/iphone-13-mini-iphone-12-price-drop-india-iphone-14-launch/ Thu, 08 Sep 2022 13:18:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=2200 హైలైట్స్: భారత్ లో తగ్గిన ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 12 ధరలు లాంచ్ ప్రైస్ తో పోల్చితే రూ.10,000 తగ్గిన ఐఫోన్ 13 ధర, రూ.20,000 తగ్గిన ఐఫోన్ 12 ధర ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తర్వాత ఐఫోన్ 12 మినీ ఫోన్ ని నిలిపివేసిన ఆపిల్ బుధవారం నాడు ఆపిల్ కంపెనీ ఐఫోన్ 14 సిరీస్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు ప్రీ-ఆర్డర్ చేసేందుకు అవకాశముంది. ఇకపోతే ఐఫోన్ 14 […]

The post iPhone 14 లాంచ్ తర్వాత భారత్ లో తగ్గిన iPhone 13, iPhone 13 mini, iPhone 12 ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత్ లో తగ్గిన ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 12 ధరలు
  • లాంచ్ ప్రైస్ తో పోల్చితే రూ.10,000 తగ్గిన ఐఫోన్ 13 ధర, రూ.20,000 తగ్గిన ఐఫోన్ 12 ధర
  • ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తర్వాత ఐఫోన్ 12 మినీ ఫోన్ ని నిలిపివేసిన ఆపిల్

బుధవారం నాడు ఆపిల్ కంపెనీ ఐఫోన్ 14 సిరీస్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు ప్రీ-ఆర్డర్ చేసేందుకు అవకాశముంది. ఇకపోతే ఐఫోన్ 14 లాంచ్ తర్వాత ఆపిల్ సంస్థ, ఐఫోన్ 13 సిరీస్, ఐఫోన్ 12 ల ధరలు తగ్గించింది. ఐఫోన్ 14 ఎంట్రీ ఇచ్చాక, ఐఫోన్ 12 మినీ వర్షన్ ని కూడా ఆపిల్ నిలిపివేసింది.

లాంచ్ ప్రైస్ తో పోల్చితే, ఐఫోన్ 13 ధర భారీగా రూ.10,000 తగ్గింది. అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ సేల్స్ లో మరింత బెస్ట్ ప్రైస్ ని పొందవచ్చు. ఐఫోన్ 14 ప్రారంభ ధర రూ.79,900 కాగా, ఇదే ధరతో రెండేళ్ళ క్రితం ఐఫోన్ 12 కూడా లాంచ్ అయ్యింది. ప్రైస్ డ్రాప్ తర్వాత ఐఫోన్ 12 రూ.59,900 కి లభిస్తోంది. రూ.20,000 భారీ మొత్తం తగ్గడం వల్లన ఈ ఫోన్ కొనాలనుకునే వారికి శుభవార్తేనని చెప్పాలి.

అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్, ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ఈ ఫోన్ మరింత తక్కువ ధరకు లభించే అవకాశముంది. అందుకే మేం చెప్పేదేంటంటే, ఫోన్స్ కొనేముందు కాస్త వేచి చూడటం మంచిది. లీక్ ప్రకారం, అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది.

ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 12 ఫోన్ల ధరలు ప్రస్తుతం భారత మార్కెట్లో ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

iPhone 13, iPhone 13 mini ప్రైస్ డ్రాప్

ప్రస్తుతం ఐఫోన్ 13 128జిబి ధర రూ.69,900 గా ఉంది. 256జిబి వేరియంట్ ధర రూ.79,900, 512జిబి వేరియంట్ ధర రూ.99,900 గా ఉంది. మరోవైపు ఐఫోన్ 13 మినీ 128జిబి ధర రూ.64,900, 256జిబి యూనిట్ ధర రూ.74,900, 512జిబి వేరియంట్ ధర రూ.94,900 గా ఉంది.

డిస్కౌంట్ తర్వాత భారత్ లో ఐఫోన్ 12 64జిబి వేరియంట్ ధర భారత్ లో రూ.59,900 గా ఉంది. 128జిబి వేరియంట్ ధర రూ.64,900, 256జిబి మోడల్ ధర రూ.64,900 గా ఉంది. ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తర్వాత, ఆపిల్ కంపెనీ ఐఫోన్ 12 మినీ వర్షన్ ని నిలిపివేసింది. ప్రస్తుతం మినీ ఐఫోన్ కొనాలంటే మిగిలిన ఏకైక ఫోన్ ఐఫోన్ 13 మినీ మాత్రమే.

ఐఫోన్ 13 మినీ లో 5.4 ఇంచెస్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 2340*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఐపీ68 మెటల్ బాడీ, 12ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్, 12ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఏ15 బయోనిక్ చిప్ ఇందులో వాడారు. ఐఫోన్ మినీ ఐఓఎస్ 15 పై రన్ అవుతుంది. ఈ ఫోన్ వైర్లెస్, ఫాస్ట్ చార్జింగ్ సౌకర్యం కలిగి ఉంది. ఐఫోన్ 13 మినీ 128జిబి, 256జిబి, 512జిబి వేరియంట్లలో లభిస్తుంది. ఐఫోన్ 13 మినీ లో 5జీ కనెక్టివిటీ ఉంది.

The post iPhone 14 లాంచ్ తర్వాత భారత్ లో తగ్గిన iPhone 13, iPhone 13 mini, iPhone 12 ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్ లో iPhone 14 series, Watch Series 8, AirPods Pro ధరలు https://www.91mobiles.com/telugu/iphone-14-series-watch-series-8-airpods-pro-prices-india/ Thu, 08 Sep 2022 08:42:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=2192 హైలైట్స్: ఐఫోన్ 14 సిరీస్ తో పాటు, ఆపిల్ వాచ్ సిరీస్ 8, వాచ్ ఎస్ఈ, వాచ్ అల్ట్రా, ఎయిర్ పాడ్స్ ప్రో సెకండ్ జనరేషన్ ని లాంచ్ చేసిన ఆపిల్ భారత్ లో ఐఫోన్ 14 ధర రూ.79,900 నుంచి ప్రారంభం, ఐఫోన్ 14 ప్లస్ ధర రూ.89,900 నుంచి ప్రారంభం ఐఫోన్ 14 ప్రో ధర రూ.1,29,900 నుంచి ప్రారంభం, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ధర రూ.1,39,900 నుంచి ప్రారంభం బుధవారం నాడు […]

The post భారత్ లో iPhone 14 series, Watch Series 8, AirPods Pro ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఐఫోన్ 14 సిరీస్ తో పాటు, ఆపిల్ వాచ్ సిరీస్ 8, వాచ్ ఎస్ఈ, వాచ్ అల్ట్రా, ఎయిర్ పాడ్స్ ప్రో సెకండ్ జనరేషన్ ని లాంచ్ చేసిన ఆపిల్
  • భారత్ లో ఐఫోన్ 14 ధర రూ.79,900 నుంచి ప్రారంభం, ఐఫోన్ 14 ప్లస్ ధర రూ.89,900 నుంచి ప్రారంభం
  • ఐఫోన్ 14 ప్రో ధర రూ.1,29,900 నుంచి ప్రారంభం, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ధర రూ.1,39,900 నుంచి ప్రారంభం

బుధవారం నాడు జరిగిన ఆపిల్ ఫార్ ఔట్ ఈవెంట్ లో ఐఫోన్ 14 సిరీస్ తో పాటు ఆపిల్ వాచ్ సిరీస్ 8, ఆపిల్ వాచ్ ఎస్ఈ, ఆపిల్ వాచ్ అల్ట్రా, ఎయిర్‌పాడ్స్ ప్రో లను ఆపిల్ సంస్థ లాంచ్ చేసింది. ప్రస్తుతం వీటిని ప్రీ-ఆర్డర్ చేసుకునే అవకాశముంది. ఐఫోన్ 14 సిరీస్ ను సెప్టెంబర్ 9 సాయంత్రం 5.30 గంటల నుంచి ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ సెప్టెంబర్ 16 నుంచి సేల్ కి వస్తున్నాయి. ఇక ఐఫోన్ 14 ప్లస్ అక్టోబర్ 7 నుంచి సేల్ కి వస్తోంది.

ఆపిల్ వాచ్ సిరీస్ 8, వాచ్ ఎస్ఈ, వాచ్ అల్ట్రా ఇప్పటికే ప్రీ-ఆర్డర్ కి అందుబాటులో ఉన్నాయి. సెప్టెంబర్ 16 నుంచి వాచ్ సిరీస్ 8, వాచ్ ఎస్ఈ లను కొనుగోలు చేయవచ్చు. అయితే ఆపిల్ వాచ్ అల్ట్రా సెప్టెంబర్ 23 నుంచి సేల్ కి వస్తోంది. ఎయిర్‌పాడ్స్ ప్రో సెకండ్ జనరేషన్ ప్రీ-ఆర్డర్స్ భారత్ లో సెప్టెంబర్ 9 సాయంత్రం 5.30 గంటల నుంచి మొదలవుతాయి. ఈ డివైజెస్ ని ఆపిల్ స్టోర్ ఆన్‌లైన్, ఫ్లిప్ కార్ట్, అమెజాన్, ఆపిల్ రిటైల్ స్టోర్స్ నుంచి కొనుగోలు చేయవచ్చు.

ఐఫోన్ 14 సిరీస్, ఆపిల్ వాచ్ సిరీస్ 8, ఆపిల్ వాచ్ ఎస్ఈ, ఆపిల్ వాచ్ అల్ట్రా, ఎయిర్‌పాడ్స్ ప్రో సెకండ్ జనరేషన్ ధరలు భారత్ లో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

భారత్ లో iPhone 14 series, Watch Series 8, Watch SE, Watch Ultra, AirPods Pro 2nd Gen ధరలు

భారత్ లో ఐఫోన్ 14 ధర

  • ఐఫోన్ 14 128జిబి: రూ.79,900
  • ఐఫోన్ 14 256జిబి: రూ.89,900
  • ఐఫోన్ 14 512జిబి: రూ.1,09,900

భారత్ లో ఐఫోన్ 14 ప్లస్ ధర

  • ఐఫోన్ 14 ప్లస్ 128జిబి: రూ.89,900
  • ఐఫోన్ 14 ప్లస్ 256జిబి: రూ.99,900
  • ఐఫోన్ 14 ప్లస్ 512జిబి: రూ.1,19,900

భారత్ లో ఐఫోన్ 14 ప్రో ధర

  • ఐఫోన్ 14 ప్రో 128జిబి: రూ.1,29,900
  • ఐఫోన్ 14 ప్రో 256జిబి: రూ.1,39,900
  • ఐఫోన్ 14 ప్రో 512జిబి: రూ.1,59,900
  • ఐఫోన్ 14 ప్రో 1టిబి: రూ.1,79,900

భారత్ లో ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ధర

  • ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ 128జిబి: రూ.1,39,900
  • ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ 256జిబి: రూ.1,49,900
  • ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ 512జిబి: రూ.1,69,900
  • ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ 1టిబి: రూ.1,89,900

భారత్ లో ఆపిల్ వాచ్ సిరీస్ 8 ధర

  • ఆపిల్ వాచ్ సిరీస్ 8 అల్యూమినియమ్ కేస్ 41ఎంఎం జీపీఎస్: రూ.45,900
  • ఆపిల్ వాచ్ సిరీస్ 8 అల్యూమినియమ్ కేస్ 41ఎంఎం జీపీఎస్ + సెల్యూలర్: రూ.55,900
  • ఆపిల్ వాచ్ సిరీస్ 8 అల్యూమినియమ్ కేస్ 45ఎంఎం జీపీఎస్: రూ.48,900
  • ఆపిల్ వాచ్ సిరీస్ 8 అల్యూమినియమ్ కేస్ 45ఎంఎం జీపీఎస్ + సెల్యూలర్: రూ.58,900
  • ఆపిల్ వాచ్ సిరీస్ 8 స్టెయిన్లెస్ స్టీల్ కేస్ 41ఎంఎం జీపీఎస్ + సెల్యూలర్: రూ.79,900
  • ఆపిల్ వాచ్ సిరీస్ 8 స్టెయిన్లెస్ స్టీల్ కేస్ 45ఎంఎం జీపీఎస్ + సెల్యూలర్: రూ.84,900

భారత్ లో ఆపిల్ వాచ్ ఎస్ఈ ధర

  • ఆపిల్ వాచ్ ఎస్ఈ 40ఎంఎం జీపీఎస్: రూ.29,900
  • ఆపిల్ వాచ్ ఎస్ఈ 40ఎంఎం జీపీఎస్ + సెల్యూలర్: రూ.34,900
  • ఆపిల్ వాచ్ ఎస్ఈ 44ఎంఎం జీపీఎస్: రూ.32,900
  • ఆపిల్ వాచ్ ఎస్ఈ 44ఎంఎం జీపీఎస్ + సెల్యూలర్: రూ.37,900

భారత్ లో ఆపిల్ వాచ్ అల్ట్రా ధర

  • ఆపిల్ వాచ్ అల్ట్రా జీపీఎస్ + సెల్యూలర్: రూ.89,900

భారత్ లో ఎయిర్‌పాడ్స్ ప్రో సెకండ్ జనరేషన్ ధర

  • ఎయిర్‌పాడ్స్ ప్రో సెకండ్ జనరేషన్: రూ.26,900

The post భారత్ లో iPhone 14 series, Watch Series 8, AirPods Pro ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
iPhone 14 సిరీస్ ని లాంచ్ చేసిన ఆపిల్: ధర, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/iphone-14-series-launched-price-specs-availability/ Wed, 07 Sep 2022 18:50:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=2178 హైలైట్స్: ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఫోన్లను లాంచ్ చేసిన ఆపిల్ ఏ15 బయోనిక్ చిప్సెట్, ఏ16 బయోనిక్ చిప్సెట్, 48ఎంపి, 12ఎంపి కెమెరా, 512జిబి స్టోరేజీ 14-సిరీస్ ప్రధాన ఫీచర్లు ఐఫోన్ 14 ప్రారంభ ధర 799 డాలర్లు (దాదాపు రూ.63,700) బుధవారం జరిగిన ఫార్ ఔట్ ఈవెంట్ లో, ఆపిల్ సంస్థ ఐఫోన్ 14 సిరీస్ ను లాంచ్ చేసింది. అంచనా వేసినట్లుగానే, […]

The post iPhone 14 సిరీస్ ని లాంచ్ చేసిన ఆపిల్: ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఫోన్లను లాంచ్ చేసిన ఆపిల్
  • ఏ15 బయోనిక్ చిప్సెట్, ఏ16 బయోనిక్ చిప్సెట్, 48ఎంపి, 12ఎంపి కెమెరా, 512జిబి స్టోరేజీ 14-సిరీస్ ప్రధాన ఫీచర్లు
  • ఐఫోన్ 14 ప్రారంభ ధర 799 డాలర్లు (దాదాపు రూ.63,700)

బుధవారం జరిగిన ఫార్ ఔట్ ఈవెంట్ లో, ఆపిల్ సంస్థ ఐఫోన్ 14 సిరీస్ ను లాంచ్ చేసింది. అంచనా వేసినట్లుగానే, ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఫోన్లను లాంచ్ చేసింది. గతేడాది విడుదలైన ఐఫోన్ 13 కి ఈ ఫోన్స్ సక్సెసర్స్ గా వచ్చాయి. అయితే, ఈసారి మినీ ఐఫోన్ కి బదులు అతిపెద్ద ఐఫోన్ ప్లస్ ని తీసుకురావడం పెద్ద మార్పని చెప్పాలి. 6.7 అంగుళాల ఐఫోన్ కావాలనుకునే వారికి ఇదొక మంచి ఆప్షన్. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ పై ఎక్కువ మొత్తం చెల్లించకుండానే పెద్ద సైజు ఐఫోన్ 14 ప్లస్ ని ఎంచుకోవచ్చు. ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 మైనర్ అప్‌గ్రేడ్ లతోనే వచ్చాయి. బ్యాటరీ, కెమెరా ఇంప్రూవ్మెంట్స్ ని గమనించవచ్చు. ఐఫోన్ 13 లో వాడిన ఏ15 బయోనిక్ చిప్ నే వీటిలోనూ వాడారు.

iPhone 14, iPhone 14 Plus ధర, విక్రయ తేదీ

ఐఫోన్ 14 128జిబి వర్షన్ ధర 799 డాలర్లు (దాదాపు రూ.63,700), ఐఫోన్ 14 ప్లస్ 128జిబి మోడల్ ధర 899 డాలర్లు (దాదాపు రూ.71,700). ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ఫోన్లను సెప్టెంబర్ 9 నుంచి ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. అక్టోబర్ 7 నుంచి ప్లస్ వేరియంట్ స్టోర్స్ కి వస్తుంది. స్టాండర్డ్ వేరియంట్ అయిన ఐఫోన్ 14 సెప్టెంబర్ 16 నుంచి విక్రయానికి వస్తోంది. త్వరలోనే భారత్ లో ధరల వివరాలను వెల్లడిస్తాం.

iPhone 14, iPhone 14 Plus స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

ఐఫోన్ 14 లో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లే అమర్చారు. ఐఫోన్ 14 ప్లస్ లో 6.7 అంగుళాల సూపర్ రెటీనా ఎక్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లే అందించారు. ఇక రెండు ఫోన్లు కూడా స్లిమ్ బెజెల్స్, వైడ్ కలర్ గేముత్, హెచ్డీఆర్, 1200 నిట్స్ బ్రైట్నెస్, ట్రూ టోన్ రెగ్యులర్ నాచ్, ఫ్రంట్ కెమెరా, ఫేస్ ఐడీ సెన్సర్స్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ని కలిగి ఉన్నాయి.

రెండు ఫోన్లలో 5ఎన్ఎం ప్రాసెస్ పై నిర్మితమైన ఏ15 బయోనిక్ చిప్సెట్ ఉంది. 4జిబి ర్యామ్, 128జిబి/256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ తో ఈ ఫోన్లు వస్తున్నాయి. ఐఓఎస్ 16 స్టేబుల్ వర్షన్ పై ఈ ఫోన్లు పని చేస్తాయి. 5జీ, వై-ఫై, డ్యూయల్-సిమ్, బ్లూటూత్, జీపీఎస్, లైట్నింగ్ పోర్ట్, వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్లలో ఉన్నాయి.

ఐఫోన్ 14, 14 ప్లస్ లలో డ్యూయల్ రియర్ కెమెరాలు ఉన్నాయి. వీటిలో ఒకటి 12ఎంపి వైడ్ యాంగిల్ మెయిన్ సెన్సర్ (ఐఓఎస్), రెండోది 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ఆటోఫోకస్ తో కూడిన 12ఎంపి ఫ్రంట్ కెమెరాను ఇందులో అమర్చారు. తొలిసారిగా ఫ్రంట్ కెమెరాలో ఆటోఫోకస్ ని అందించారు. రియర్ కెమెరా 38 శాతం మెరుగైన లో-లైట్ పెర్ఫామెన్స్ ని అందిస్తుందని, అలాగే డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉందని ఆపిల్ చెబుతోంది.

ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ఫోన్స్ హై-డైనమిక్ రేంజ్ జైరోస్కోప్, డ్యూయల్-కోర్ యాక్సెలరోమీటర్, క్రాష్ డిటెక్షన్ ఫీచర్ తో వస్తున్నాయి. ఈ సిరీస్ లో శాటిలైట్ ద్వారా ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ ఫీచర్ ని అందించారు. ఏ మొబైల్ నెట్వర్క్ లేకపోయినా నేరుగా శాటిలైట్ తో కనెక్ట్ అయి అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు.

The post iPhone 14 సిరీస్ ని లాంచ్ చేసిన ఆపిల్: ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
సెప్టెంబర్ 7 న జరగనున్న ఆపిల్ ఈవెంట్: లాంచ్ కానున్న iPhone 14, Apple Watch Series 8 https://www.91mobiles.com/telugu/apple-event-iphone-14-watch-series-8-new-ipad-details/ Tue, 30 Aug 2022 10:27:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=2005 హైలైట్స్: సెప్టెంబర్ 7 న జరగనున్న ఆపిల్ ఈవెంట్ ఈవెంట్ లో లాంచ్ కానున్న ఐఫోన్ 14 సిరీస్, వాచ్ సిరీస్ 8, ఐప్యాడ్ మోడల్స్ ఎయిర్‌పాడ్స్ ప్రో, మ్యాక్ ప్రో కూడా లాంచ్ అయ్యే అవకాశం సెప్టెంబర్ 7 న ఆపిల్ ఈవెంట్ 2022 జరగనుంది. ఈ సందర్భంగా పలు ఉత్పత్తులను ఆపిల్ లాంచ్ చేయనుంది. ఐఫోన్ 14 సిరీస్, వాచ్ సిరీస్ 8 తదితర ప్రోడక్ట్స్ ఈవెంట్ లో లాంచ్ అయ్యే అవకాశముంది. ఇటీవలె […]

The post సెప్టెంబర్ 7 న జరగనున్న ఆపిల్ ఈవెంట్: లాంచ్ కానున్న iPhone 14, Apple Watch Series 8 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • సెప్టెంబర్ 7 న జరగనున్న ఆపిల్ ఈవెంట్
  • ఈవెంట్ లో లాంచ్ కానున్న ఐఫోన్ 14 సిరీస్, వాచ్ సిరీస్ 8, ఐప్యాడ్ మోడల్స్
  • ఎయిర్‌పాడ్స్ ప్రో, మ్యాక్ ప్రో కూడా లాంచ్ అయ్యే అవకాశం

సెప్టెంబర్ 7 న ఆపిల్ ఈవెంట్ 2022 జరగనుంది. ఈ సందర్భంగా పలు ఉత్పత్తులను ఆపిల్ లాంచ్ చేయనుంది. ఐఫోన్ 14 సిరీస్, వాచ్ సిరీస్ 8 తదితర ప్రోడక్ట్స్ ఈవెంట్ లో లాంచ్ అయ్యే అవకాశముంది. ఇటీవలె ఆపిల్ నుంచి వచ్చిన ఇమేజ్ టీజర్ ని బట్టి కంపెనీ ఆస్ట్రోఫోటోగ్రఫీ, శాటిలైట్ నెట్వర్క్ కనెక్టివిటీ, ఆల్వేస్-ఆన్-డిస్ప్లే తదితర వాటిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈసారి ఐఫోన్ 14 సిరీస్ లో నాచ్ కి సంబంధించిన మార్పులను గమనించవచ్చు. ఏళ్ళుగా కొనసాగుతోన్న డిజైన్ కి యాపిల్ ఎండ్ కార్డ్ వేయనుందని అర్థమవుతోంది.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆపిల్ ఫ్యాన్స్, టెక్నాలజీ ప్రియులు, ప్రతి ఏడాది జరిగే ఆపిల్ ఈవెంట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. సెప్టెంబర్ 7 న జరగబోవు ఆపిల్ ఈవెంట్ లో ఏయే ప్రోడక్ట్స్ లాంచ్ కానున్నాయో ఈ ఆర్టికల్ లో మేం వివరిస్తాం.

సెప్టెంబర్ 7 న జరగనున్న Apple ఈవెంట్: ఏం ఆశించవచ్చు?

iPhone 14 series: గతేడాది విడుదలైన ఐఫోన్ 13 లైనప్ కి సక్సెసర్ గా ఐఫోన్ 14 సిరీస్ రానుంది. సెప్టెంబర్ 7 న జరగబోవు ఈవెంట్ లో ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్ ని లాంచ్ చేసేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈసారి కేవలం మూడు మోడల్స్ మాత్రమే రానున్నట్లు తెలుస్తోంది. మినీ వర్షన్ ని ఈసారి తీసుకు రావడం లేదని సమాచారం. అలాగే 6.7 అంగుళాల స్క్రీన్ కలిగిన ఐఫోన్ 14 మ్యాక్స్ మోడల్ ని ఆపిల్ తీసుకొచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది వంద శాతం నిజమని చెప్పలేం. ఇక ఈ లైనప్ లో స్టాండర్డ్ వేరియంట్ అయిన ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ లేదా మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మోడల్స్ ఉండనున్నాయి.

సంప్రదాయ నాచ్ డిజైన్ కి బదులుగా ఐఫోన్ 14 ప్రో మోడల్స్ లో పిల్-షేప్డ్ హోల్-పంచ్ కటౌట్ ఉండనున్నట్లు సమాచారం. అయితే స్టాండర్డ్ మోడల్ మాత్రం పాత నాచ్ డిజైన్ తోనే వస్తున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 14 సిరీస్ మోడల్స్ స్క్వేర్ ఎడ్జెస్ తో కూడిన బాక్సీ డిజైన్ ని కలిగి ఉంటాయని అంచనా. ఐఫోన్ 14 మరియు ఐఫోన్ 14 ప్రో మోడల్స్ వరుసగా 6.1 మరియు 6.7 అంగుళాల డిస్ప్లే సైజులను కలిగి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తాయని అంచనా. ఇక ప్రో వర్షన్స్ విషయానికి వస్తే, ఇవి ఆల్వేస్-ఆన్-డిస్ప్లే ఫంక్షనాలిటీని కలిగి ఉంటాయని సమాచారం.

ఐఫోన్ 14 ప్రో మోడల్స్ లో ఆపిల్ ఏ16 బయోనిక్ చిప్సెట్ ఉండనుంద. స్టాండర్డ్ వర్షన్స్ లో ఏ15 బయోనిక్ చిప్ ఉంటుందని అంచనా. ఐఫోన్ 14 లో 3279 ఎంఏహెచ్ బ్యాటరీ, ఐఫోన్ 14 మ్యాక్స్ లో 4325ఎంఏహెచ్ బ్యాటరీ, ఐఫోన్ ప్రో లో 3200ఎంఏహెచ్ బ్యాటరీ, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ లో 4323 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయని తెలుస్తోంది. ఇక కెమెరాల గురించి తెలుసుకుందాం. ఐఫోన్ 14 సిరీస్ మెరుగైన కెమెరా సెన్సర్స్ తో వస్తున్నట్లు సమాచారం. ప్రైమరీ సెన్సర్ 48 ఎంపి ఉంటుందని అంచనా.

Apple Watch Series 8: సెప్టెంబర్ 7 న జరగబోవు ఈవెంట్ లో వాచ్ సిరీస్ 8 కూడా లాంచ్ కానున్నట్లు సమాచారం. వాచ్ ఎస్ఈ సక్సెసర్ ని బడ్జెట్ సెగ్మెంట్ లో పెట్టే అవకాశముంది. వాచ్ సిరీస్ 3 కూడా రెగ్యులర్ మోడల్స్ మాదిరి పెర్ఫామెన్స్ ను అందించనున్నాయి.

ఇక ఇవే కాకుండా, ఆపిల్ ఒక రగ్డ్ స్మార్ట్ వాచ్ (యాపిల్ వాచ్ ప్రో) ని తీసుకు రానున్నట్లు సమాచారం. ఇది కచ్చితంగా స్పోర్ట్స్, ఫిట్నెస్ ఔత్సాహికుల కోసమని తెలుస్తోంది. ఈ వాచ్ అత్యంత దృఢమైన టైటానియం కేసింగ్, భారీ డ్యామేజ్-రెసిస్టంట్ స్క్రీన్ కలిగి ఉండనుంది. అలాగే ఈ వాచ్ ధర కూడా చాలా ఎక్కువగా ఉంటుందని అంచనా.

కొత్త ఐప్యాడ్: కొత్త ఐప్యాడ్ మోడల్స్ ని కూడా ఈవెంట్ లో పరిచయం చేయనున్నట్లు సమాచారం. అలాగే ఇందులో బడ్జెట్ ఐప్యాడ్ కూడా ఉండనుందట. ఐప్యాడ్ మినీ, ఐప్యాడ్ ప్రో, బడ్జెట్ ఐప్యాడ్ అని మూడు వేరియంట్స్ ఈ లైనప్ లో ఉంటాయని సమాచారం. ఎంట్రీ లెవెల్ వర్షన్ లో ఏ14 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది. మిగతా వేరియంట్స్ లో ఎమ్2 చిప్సెట్ ఉండనున్నట్లు తెలుస్తోంది.

The post సెప్టెంబర్ 7 న జరగనున్న ఆపిల్ ఈవెంట్: లాంచ్ కానున్న iPhone 14, Apple Watch Series 8 first appeared on 91Mobiles Telugu.

]]>