iPhone 15 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 25 Sep 2024 08:05:10 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 iPhone 15 Pro: ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో చవకగా ఐఫోన్ 15 ప్రో https://www.91mobiles.com/telugu/iphone-15-pro-is-available-for-low-price-on-flipkart/ https://www.91mobiles.com/telugu/iphone-15-pro-is-available-for-low-price-on-flipkart/#respond Wed, 25 Sep 2024 08:05:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=13731 సెప్టెంబర్ 27వ తేదీన ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్ 2024 ప్రారంభం కానుంది. ఈ సేల్ కోసం ఎంతోమంది వినియోగదారులు వేచి చూస్తున్నారు. ప్రత్యేకించి స్మార్ట్‌ఫోన్ లవర్స్ ఆఫర్లు, డీల్స్, డిస్కౌంట్స్ పై తమకు నచ్చిన ఫోన్లను కొనుగోలు చేయాలని ఆసక్తిగా ఉన్నారు. తాజాగా iPhone 15 Pro డీల్ వివరాలను ఫ్లిప్‌కార్ట్ రివీల్ చేసింది. ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం. iPhone 15 Pro ఫ్లిప్‌కార్ట్ డీల్ వివరాలు iPhone 15 Pro స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ […]

The post iPhone 15 Pro: ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో చవకగా ఐఫోన్ 15 ప్రో first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రివీలైన iPhone 15 Pro సేల్ ధర
  • 27వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో సేల్
  • ఆఫర్ ధర రూ.89,999

సెప్టెంబర్ 27వ తేదీన ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్ 2024 ప్రారంభం కానుంది. ఈ సేల్ కోసం ఎంతోమంది వినియోగదారులు వేచి చూస్తున్నారు. ప్రత్యేకించి స్మార్ట్‌ఫోన్ లవర్స్ ఆఫర్లు, డీల్స్, డిస్కౌంట్స్ పై తమకు నచ్చిన ఫోన్లను కొనుగోలు చేయాలని ఆసక్తిగా ఉన్నారు. తాజాగా iPhone 15 Pro డీల్ వివరాలను ఫ్లిప్‌కార్ట్ రివీల్ చేసింది. ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం.

iPhone 15 Pro ఫ్లిప్‌కార్ట్ డీల్ వివరాలు

iPhone 15 Pro స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ సేల్ లో అన్ని ఆఫర్లను కలుపుకుంటే రూ.89,999 కి లభిస్తోంది.

సేల్ లో iPhone 15 Pro ధరను రూ.99,999 గా పెట్టారు. అయితే కస్టమర్లకు బ్యాంక్ డిస్కౌంట్ రూ.5,000 మరియు ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్ రూ.5,000 లభించనుంది. దీంతో రూ.10,000 వరకు అదనపు డిస్కౌంట్ ప్రయోజనం పొందవచ్చు.

ప్రస్తుతం iPhone 15 Pro 128జిబి వేరియంట్ ధర ఫ్లిప్‌కార్ట్ లో రూ.1,09,900 గా ఉంది. సేల్ లో ఈ ఫోన్ ని రూ.19,901 తక్కువకే కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ వీఐపీ కస్టమర్లకు అదనంగా రూ.2,000 ఎక్స్‌చేంజ్ ఆఫర్ లభిస్తుంది.

స్మార్ట్‌ఫోన్‌పై రెగ్యులర్ డిస్కౌంట్స్ కాకుండా, బ్యాంక్ కార్డ్స్ మరియు ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ పై డిస్కౌంట్స్ లభించనున్నాయి.

మీరు ఎక్స్‌చేంజ్ ఆఫర్ మరియు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకున్నప్పటికీ, మీరు డిస్కౌంట్ పొందవచ్చు. కానీ, మీరు పొందే డిస్కౌంట్ విలువ ఇంకా రివీల్ కాలేదు.

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 15 Pro 256జిబి ధర రూ.1,19,900, 512జిబి మోడల్ ధర రూ.1,39,900, 1టిబి మోడల్ ధర రూ.1,59,900 గా ఉంది. ఇంకా రూ.35,050 ఎక్స్‌చేంజ్ బోనస్, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది.

గమనిక: ఆపిల్ సంస్థ అధికారికంగా iPhone 15 Pro డివైజ్‌ను నిలిపివేసింది. గతేడాది ఈ ఫోన్ రూ.1,34,900 ధరతో లాంచ్ అయ్యింది.

iPhone 15 Pro ఫోన్‌ని మీరు కొనవచ్చా?

iPhone 15 Pro ఒక ప్రీమియమ్ ఫోన్. కెమెరా, బిల్డ్ క్వాలిటీ, చిప్సెట్ పెర్ఫామెన్స్, సాఫ్ట్‌వేర్ సపోర్ట్ వంటి విషయాల్లో ఈ ఫోన్ మేటిగా నిలుస్తుంది.

అయితే, iPhone 15 Pro డివైజ్ చాలా ఖరీదైనది. అయితే ఫ్లిప్‌కార్ట్ సేల్ లో దీన్ని తక్కువకే సొంతం చేసుకోవచ్చు. అదీనూ మీరు గనుక, లేటెస్ట్ iPhone 16, iPhone 16 Plus కొనాలనుకుంటే.. ఆగండి.. iPhone 15 Pro కొనండి. ఇందులో 120 హెర్ట్జ్ ప్రోమోషన్ డిస్ప్లే ఉంటుంది. (ఐఫోన్ 16 లో ఇది లేదు). ఇంకా యాపిల్ ఇంటెలిజెన్స్, యాక్షన్ బటన్ కూడా ఉంటాయి. అయితే యాక్షన్ బటన్ ద్వారా కేవలం ఒక పనిని మాత్రమే చేసుకోవచ్చు.

iPhone 15 Pro స్పెసిఫికేషన్స్

స్క్రీన్: iPhone 15 Pro లో 6.1-ఇంచ్ ఓఎల్ఈడీ సూపర్ రెటీనా డిస్ప్లే ఉంది.

చిప్సెట్: iPhone 15 Pro లో ఏ17 బయోనిక్ చిప్సెట్ వాడారు. ఇది 3 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన చిప్. 6-కోర్ జీపీయూని ఈ చిప్ తో అనుసంధానించారు.

స్టోరేజీ: iPhone 15 Pro డివైజ్ 128జిబి, 256జిబి, 512జిబి, 1టిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

ఓఎస్: iPhone 15 Pro డివైజ్ ఐఓఎస్ 17 ఆపరేటింగ్ సిస్టమ్ పై పని చేస్తుంది.

కెమెరా: iPhone 15 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 12ఎంపి ఓఐఎస్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 12ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 12ఎంపి ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: iPhone 15 Pro లో 15 వాట్ మ్యాగ్‌సేఫ్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ అందించారు.

The post iPhone 15 Pro: ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో చవకగా ఐఫోన్ 15 ప్రో first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/iphone-15-pro-is-available-for-low-price-on-flipkart/feed/ 0
iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max భారత మార్కెట్ ధరలు, సేల్ వివరాలు! https://www.91mobiles.com/telugu/iphone-15-series-india-price-sale/ Wed, 13 Sep 2023 05:30:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=7995 ప్రముఖ టెక్ కంపెనీ Apple భారత్ తో పాటు గ్లోబల్ మార్కెట్స్ లో తన కొత్త ఫోన్ సిరీస్ iPhone 15 ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max అనే మోడల్స్ ఎంట్రీ ఇచ్చాయి. iPhone 14 సిరీస్ లో స్టాండర్డ్, ప్లస్ వేరియంట్స్ లో డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ ఇవ్వలేదు. కానీ, ఈసారి iPhone 15 సిరీస్ […]

The post iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max భారత మార్కెట్ ధరలు, సేల్ వివరాలు! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో లాంచైన iPhone 15 సిరీస్
  • లైనప్ లో వచ్చిన 4 స్మార్ట్‌ఫోన్లు
  • భారత్‌లో iPhone 15 ప్రారంభ ధర రూ.79,900

ప్రముఖ టెక్ కంపెనీ Apple భారత్ తో పాటు గ్లోబల్ మార్కెట్స్ లో తన కొత్త ఫోన్ సిరీస్ iPhone 15 ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max అనే మోడల్స్ ఎంట్రీ ఇచ్చాయి. iPhone 14 సిరీస్ లో స్టాండర్డ్, ప్లస్ వేరియంట్స్ లో డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ ఇవ్వలేదు. కానీ, ఈసారి iPhone 15 సిరీస్ లోని అన్ని ఫోన్లలో డైనమిక్ ఐల్యాండ్ స్క్రీన్ ని తీసుకొచ్చారు. ఇది ప్రధానమైన మార్పుగా చెప్పవచ్చు. సరే, ఓసారి iPhone 15 సిరీస్ యొక్క ధర, సేల్ వివరాలను తెలుసుకుందాం పదండి.

భారత్ లో iPhone 15 సిరీస్ ధర

  • iPhone 15 ధర: స్టాండర్డ్ వేరియంట్ అయిన iPhone 15 యొక్క 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.79,900 గా నిర్ణయించారు. ఇకపోతే 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.89,900 గా ఉంది. 512జిబి స్టోరేజీ యూనిట్ ధర రూ.1,09,900 గా ఉంది.
  • iPhone 15 Plus ధర: iPhone 15 Plus డివైజ్ 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.89,900 గా ఉంది. 256జిబి యూనిట్ ధరను రూ. గా ఉంది. 512జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.1,19,900 గా నిర్ణయించారు.
  • iPhone 15 Pro ధర: iPhone 15 Pro డివైజ్ యొక్క 128జిబి మోడల్ ధరను 1,34,900 గా నిర్ణయించారు. 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,44,900 గా ఉంది. 512జిబి స్టోరేజీ యూనిట్ ధర రూ.1,64,900 గా ఉంది. 1టిబి మోడల్ ధర రూ.1,84,900 గా ఉంది.
  • iPhone 15 Pro Max ధర: iPhone 15 Pro Max 256జిబి వేరియంట్ ధర రూ.1,59,900 గా ఉంది. 512జిబి యూనిట్ ధర 1,79,900 గా నిర్ణయించారు. 1టిబి వేరియంట్ ధరను రూ.1,99,900 గా ఉంది.

iPhone 15 సిరీస్ ప్రీ-ఆర్డర్స్ సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభమవుతాయి. ఆపిల్ ఫ్యాన్స్, ఐఫోన్స్ ని సెప్టెంబర్ 22 నుంచి కొనుగోలు చేయవచ్చు. iPhone 15, iPhone 15 Plus డివైజెస్ పింక్, యెల్లో, గ్రీన్, బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తాయి. iPhone 15 Pro Max బ్లాక్ టైటానియమ్, వైట్ టైటానియమ్, బ్లూ టైటానియమ్, నేచురల్ టైటానియమ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max భారత మార్కెట్ ధరలు, సేల్ వివరాలు! first appeared on 91Mobiles Telugu.

]]>
A17 బయోనిక్ చిప్, USB టైప్-సీ పోర్ట్‌తో లాంచైన iPhone 15 Pro, iPhone Pro Max https://www.91mobiles.com/telugu/iphone-15-pro-15-pro-max-launched-price-specs/ Tue, 12 Sep 2023 18:28:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=7990 ప్రముఖ టెక్ కంపెనీ ఆపిల్ నుంచి తాజాగా మార్కెట్ లోకి iPhone 15 సిరీస్ లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో మొత్తం 4 మోడల్స్ లాంచ్ అయ్యాయి. అవి: iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max. ఈ ఆర్టికల్ లో మనం iPhone 15 Pro, iPhone 15 Pro Max డివైజెస్ గురించి తెలుసుకుందాం. ఈ రెండు ఫోన్లు కూడా ఏ17 బయోనిక్ చిప్సెట్ […]

The post A17 బయోనిక్ చిప్, USB టైప్-సీ పోర్ట్‌తో లాంచైన iPhone 15 Pro, iPhone Pro Max first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ తో సహా గ్లోబల్ గా లాంచైన iPhone 15 సిరీస్
  • లైనప్ లో వచ్చిన 4 మోడల్స్
  • యూఎస్బీ టైప్-సీ పోర్ట్ తో వచ్చిన డివైజెస్

ప్రముఖ టెక్ కంపెనీ ఆపిల్ నుంచి తాజాగా మార్కెట్ లోకి iPhone 15 సిరీస్ లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో మొత్తం 4 మోడల్స్ లాంచ్ అయ్యాయి. అవి: iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max. ఈ ఆర్టికల్ లో మనం iPhone 15 Pro, iPhone 15 Pro Max డివైజెస్ గురించి తెలుసుకుందాం. ఈ రెండు ఫోన్లు కూడా ఏ17 బయోనిక్ చిప్సెట్ తో వచ్చాయి. సరే, ఓసారి ఈ ఫోన్ల పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

iPhone 15 Pro, iPhone 15 Pro Max ధరలు

  • iPhone 15 Pro డివైజ్ 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర 999 డాలర్లుగా ఉంది. ఇతర స్టోరేజీ వేరియంట్స్ ధరలు వేరుగా ఉంటాయి.
  • iPhone 15 Pro Max డివైజ్ 256జిబి స్టోరేజీ మోడల్ ధరను 1199 డాలర్లుగా నిర్ణయించారు.
  • సెప్టెంబర్ 15 నుంచి కొత్త ఐఫోన్ మోడల్స్ యొక్క ప్రీ-ఆర్డర్స్ ప్రారంభమవుతాయి.

iPhone 15 Pro స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: iPhone 15 Pro లో 6.1-ఇంచ్ ఓఎల్ఈడీ సూపర్ రెటీనా డిస్ప్లే ఉంది.
  • చిప్సెట్: iPhone 15 Pro లో ఏ17 బయోనిక్ చిప్సెట్ వాడారు. ఇది 3 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన చిప్. 6-కోర్ జీపీయూని ఈ చిప్ తో అనుసంధానించారు.
  • స్టోరేజీ: iPhone 15 Pro డివైజ్ 128జిబి, 256జిబి, 512జిబి, 1టిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • ఓఎస్: iPhone 15 Pro డివైజ్ ఐఓఎస్ 17 ఆపరేటింగ్ సిస్టమ్ పై పని చేస్తుంది.
  • కెమెరా: iPhone 15 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 12ఎంపి ఓఐఎస్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 12ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 12ఎంపి ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: iPhone 15 Pro లో 15 వాట్ మ్యాగ్‌సేఫ్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ అందించారు.

iPhone 15 Pro Max స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: iPhone 15 Pro Max లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్ప్లే, 2796*1290 పిక్సెల్స్ రెజుల్యూషన్, హెచ్డీఆర్, ట్రూ టోన్, డైనమిక్ ఐల్యాండ్, ఆల్వేస్-ఆన్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ ప్రోమోషన్ టెక్నాలజీ, సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: iPhone 15 Pro Max లో ఏ17 బయోనిక్ 3ఎన్ఎమ్ చిప్ వాడారు. గ్రాఫిక్స్ కోసం 6-కోర్ జీపీయూ అందించారు.
  • స్టోరేజీ: iPhone 15 Pro Max డివైజ్ 128జిబి, 256జిబి, 512జిబి, 1టిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • ఓఎస్: iPhone 15 Pro Max డివైజ్ ఐఓఎస్ 17 ఆపరేటింగ్ సిస్టమ్ పై పని చేస్తుంది.
  • కెమెరా: iPhone 15 Pro Max లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ ఓఐఎస్ లెన్స్, 12ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. 5ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఆప్షన్ ఈ ఫోన్ లో ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 12ఎంపి ట్రూడెప్త్ కెమెరా అందించారు.
  • కనెక్టివిటీ: iPhone 15 Pro Max లో 5జీ, గిగాబిట్-క్లాస్ ఎల్టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లొనాస్ ఉన్నాయి.

The post A17 బయోనిక్ చిప్, USB టైప్-సీ పోర్ట్‌తో లాంచైన iPhone 15 Pro, iPhone Pro Max first appeared on 91Mobiles Telugu.

]]>
కర్వ్డ్ డిజైన్, స్లిమ్ బెజెల్స్ తో వస్తోన్న iPhone 15 Pro; లీకైన రెండర్స్ https://www.91mobiles.com/telugu/iphone-15-pro-design-renders-case-manufacturer-cad-model/ Fri, 17 Feb 2023 06:09:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=4973 Apple సంస్థ ఈ ఏడాది తన ఫ్లాగ్షిప్ ఫోన్ iPhone 15 Pro ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. కానీ అందుకు ఇంకా చాలా నెలల సమయం ఉంది. అయితే ఈలోపే iPhone 15 Pro కి సంబంధించిన ఎన్నో లీక్స్ నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. iPhone 15 Pro ఎలా ఉండనుందో తెలుసుకోవాలనే కుతూహలం అందరు ఆపిల్ లవర్స్ లో ఉంటుంది. వారి కోరికను తీర్చేందుకు లాంచ్ కి ముందుగానే iPhone 15 Pro డిజైన్ […]

The post కర్వ్డ్ డిజైన్, స్లిమ్ బెజెల్స్ తో వస్తోన్న iPhone 15 Pro; లీకైన రెండర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 2023 లో లాంచ్ కానున్న iPhone 15 Pro స్మార్ట్ ఫోన్
  • తాజాగా నెట్టింట్లో లీకైన iPhone 15 Pro ఎక్స్‌క్లూజివ్ రెండర్స్
  • నమ్మదగిన కేస్ మానుఫ్యాక్చరర్ మరియు 3డీ ఆర్టిస్ట్ ద్వారా లీకైన CAD ఫైల్స్

Apple సంస్థ ఈ ఏడాది తన ఫ్లాగ్షిప్ ఫోన్ iPhone 15 Pro ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. కానీ అందుకు ఇంకా చాలా నెలల సమయం ఉంది. అయితే ఈలోపే iPhone 15 Pro కి సంబంధించిన ఎన్నో లీక్స్ నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. iPhone 15 Pro ఎలా ఉండనుందో తెలుసుకోవాలనే కుతూహలం అందరు ఆపిల్ లవర్స్ లో ఉంటుంది. వారి కోరికను తీర్చేందుకు లాంచ్ కి ముందుగానే iPhone 15 Pro డిజైన్ లీకైంది.

iPhone 15 Pro CAD ఫైల్స్ ని నమ్మదగిన కేస్ మానుఫాక్చరర్ మరియు 3డీ ఆర్టిస్ట్ బయటపెట్టారు. ఈ రెండర్స్ త్వరలో లాంచ్ కాబోయే iPhone 15 Pro ఫ్లాగ్షిప్ డివైజ్ గ్లిమ్స్ ని మనకు అందిస్తున్నాయి. ఈ CAD ఫైల్స్ ని ఆపిల్ సంస్థ ఏషియా లోని కర్మాగారాలకు కేస్ ల తయారీ కోసం పంపిస్తుంది. దీంతో ఫోన్ లాంచ్ అయ్యే సమయానికి ఫోన్ కేసెస్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి.

సరే, iPhone 15 Pro నుంచి ఈ లీకైన రెండర్స్ ద్వారా మనకు ఏం తెలిసాయి? తెలుసుకుందాం పదండి. ఇప్పటి వరకు చక్కర్లు కొడుతోన్న రూమర్లకు బలం చేకూర్చేలా iPhone 15 Pro డిజైన్ ఉంది. లైట్నింగ్ పోర్ట్ స్థానంలో iPhone 15 Pro లో ఆపిల్ సంస్థ యూఎస్బీ-సీ పోర్ట్ ని తీసుకొచ్చింది. ఈ మార్పు వల్లన iPhone డిజైన్, ఫీచర్స్ లో భారీ మార్పు ఉండనుంది. కామన్ చార్జింగ్ పోర్ట్ తీసుకురావాలన్న ధ్యేయంతో యురోపియన్ యూనియన్ చేసిన ఒత్తిడికి ఫలితం దక్కింది. వారికి థాంక్స్ చెప్పుకోవాల్సిందే.

 

ఆగండి, అక్కడితోనే అయిపోలేదు. iPhone 15 Pro కొన్ని డిజైన్ మార్పులకు కూడా లోనైంది. రెండర్స్ ని బట్టి గ్లాస్ మరియు మెటల్ ఫ్రేమ్ ఎడ్జెస్ కర్వ్డ్ గా ఉండటం గమనించవచ్చు. ఈ మార్పు వల్లన చేతిలో ఫోన్ సులభంగా ఇమిడిపోయి, యాక్సిడెంటల్ టచెస్ ని నివారిస్తుంది.

గతంలో కంటే ఈసారి iPhone 15 Pro పై కెమెరా బంప్ మందంగా ఉంది. దీన్ని బట్టి ఆపిల్ కెమెరా సిస్టమ్ ని కొత్త సెన్సర్స్ లేదా లెన్సెస్ తో అప్‌గ్రేడ్ చేసినట్లు అర్థమవుతోంది. ఇకపోతే కెమెరా లేఔట్ iPhone 14 Pro లో మాదిరే ఉంది. మూడు లెన్సెస్, లైడార్ స్కానర్ స్క్వేర్ మాడ్యూల్ లో ఇమడ్చబడి ఉన్నాయి. కెమెరా లెన్సెస్ మందంగా కనిపిస్తున్నాయి. దీంతో భారీ సెన్సర్స్ iPhone 15 Pro లో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

వాల్యూమ్ రాకర్స్ మరియు మ్యూట్ స్విచ్ లో కూడా మార్పు గమనించవచ్చు. వాల్యూమ్ రాకర్స్ ఫిజికల్ బటన్స్ కాకుండా కెపాసిటివ్ బటన్స్ మాదిరి కనిపిస్తున్నాయి. దీనిపై గతంలో ప్రచారం జరిగింది. మ్యూట్ స్విచ్ కూడా రీడిజైన్ చేయబడినట్లు తెలుస్తోంది. ఈసారి మరింత చిన్నగా, గుండ్రని ఆకారంలో కెపాసిటివ్ బటన్స్ మాదిరి రూపొందించబడింది.

iPhone 15 Pro డివైజ్ సన్నని బెజెల్స్ కారణంగా కాస్త చిన్నగా కనిపిస్తోంది. 6.1-ఇంచ్ లేదా కాస్త పెద్ద డిస్ప్లే ఉండే అవకాశం ఉంది. డైనమిక్ ఐల్యాండ్ అలానే ఉంది. iPhone 14 Pro లో ఉన్నట్లే కనిపిస్తోంది.

తాజాగా లీకైన రెండర్స్ CAD మోడల్ ఆధారంగా రూపొందినవి కావున, ఆపిల్ యొక్క ఫైనల్ డిజైన్ యాస్పెక్ట్స్ కి సరిపోలే అవకాశాలు తక్కువ.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post కర్వ్డ్ డిజైన్, స్లిమ్ బెజెల్స్ తో వస్తోన్న iPhone 15 Pro; లీకైన రెండర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>