
Apple సంస్థ ఈ ఏడాది తన ఫ్లాగ్షిప్ ఫోన్ iPhone 15 Pro ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. కానీ అందుకు ఇంకా చాలా నెలల సమయం ఉంది. అయితే ఈలోపే iPhone 15 Pro కి సంబంధించిన ఎన్నో లీక్స్ నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. iPhone 15 Pro ఎలా ఉండనుందో తెలుసుకోవాలనే కుతూహలం అందరు ఆపిల్ లవర్స్ లో ఉంటుంది. వారి కోరికను తీర్చేందుకు లాంచ్ కి ముందుగానే iPhone 15 Pro డిజైన్ లీకైంది.
iPhone 15 Pro CAD ఫైల్స్ ని నమ్మదగిన కేస్ మానుఫాక్చరర్ మరియు 3డీ ఆర్టిస్ట్ బయటపెట్టారు. ఈ రెండర్స్ త్వరలో లాంచ్ కాబోయే iPhone 15 Pro ఫ్లాగ్షిప్ డివైజ్ గ్లిమ్స్ ని మనకు అందిస్తున్నాయి. ఈ CAD ఫైల్స్ ని ఆపిల్ సంస్థ ఏషియా లోని కర్మాగారాలకు కేస్ ల తయారీ కోసం పంపిస్తుంది. దీంతో ఫోన్ లాంచ్ అయ్యే సమయానికి ఫోన్ కేసెస్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి.
సరే, iPhone 15 Pro నుంచి ఈ లీకైన రెండర్స్ ద్వారా మనకు ఏం తెలిసాయి? తెలుసుకుందాం పదండి. ఇప్పటి వరకు చక్కర్లు కొడుతోన్న రూమర్లకు బలం చేకూర్చేలా iPhone 15 Pro డిజైన్ ఉంది. లైట్నింగ్ పోర్ట్ స్థానంలో iPhone 15 Pro లో ఆపిల్ సంస్థ యూఎస్బీ-సీ పోర్ట్ ని తీసుకొచ్చింది. ఈ మార్పు వల్లన iPhone డిజైన్, ఫీచర్స్ లో భారీ మార్పు ఉండనుంది. కామన్ చార్జింగ్ పోర్ట్ తీసుకురావాలన్న ధ్యేయంతో యురోపియన్ యూనియన్ చేసిన ఒత్తిడికి ఫలితం దక్కింది. వారికి థాంక్స్ చెప్పుకోవాల్సిందే.
ఆగండి, అక్కడితోనే అయిపోలేదు. iPhone 15 Pro కొన్ని డిజైన్ మార్పులకు కూడా లోనైంది. రెండర్స్ ని బట్టి గ్లాస్ మరియు మెటల్ ఫ్రేమ్ ఎడ్జెస్ కర్వ్డ్ గా ఉండటం గమనించవచ్చు. ఈ మార్పు వల్లన చేతిలో ఫోన్ సులభంగా ఇమిడిపోయి, యాక్సిడెంటల్ టచెస్ ని నివారిస్తుంది.
గతంలో కంటే ఈసారి iPhone 15 Pro పై కెమెరా బంప్ మందంగా ఉంది. దీన్ని బట్టి ఆపిల్ కెమెరా సిస్టమ్ ని కొత్త సెన్సర్స్ లేదా లెన్సెస్ తో అప్‌గ్రేడ్ చేసినట్లు అర్థమవుతోంది. ఇకపోతే కెమెరా లేఔట్ iPhone 14 Pro లో మాదిరే ఉంది. మూడు లెన్సెస్, లైడార్ స్కానర్ స్క్వేర్ మాడ్యూల్ లో ఇమడ్చబడి ఉన్నాయి. కెమెరా లెన్సెస్ మందంగా కనిపిస్తున్నాయి. దీంతో భారీ సెన్సర్స్ iPhone 15 Pro లో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
వాల్యూమ్ రాకర్స్ మరియు మ్యూట్ స్విచ్ లో కూడా మార్పు గమనించవచ్చు. వాల్యూమ్ రాకర్స్ ఫిజికల్ బటన్స్ కాకుండా కెపాసిటివ్ బటన్స్ మాదిరి కనిపిస్తున్నాయి. దీనిపై గతంలో ప్రచారం జరిగింది. మ్యూట్ స్విచ్ కూడా రీడిజైన్ చేయబడినట్లు తెలుస్తోంది. ఈసారి మరింత చిన్నగా, గుండ్రని ఆకారంలో కెపాసిటివ్ బటన్స్ మాదిరి రూపొందించబడింది.
iPhone 15 Pro డివైజ్ సన్నని బెజెల్స్ కారణంగా కాస్త చిన్నగా కనిపిస్తోంది. 6.1-ఇంచ్ లేదా కాస్త పెద్ద డిస్ప్లే ఉండే అవకాశం ఉంది. డైనమిక్ ఐల్యాండ్ అలానే ఉంది. iPhone 14 Pro లో ఉన్నట్లే కనిపిస్తోంది.
తాజాగా లీకైన రెండర్స్ CAD మోడల్ ఆధారంగా రూపొందినవి కావున, ఆపిల్ యొక్క ఫైనల్ డిజైన్ యాస్పెక్ట్స్ కి సరిపోలే అవకాశాలు తక్కువ.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











