iQOO 11 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 09 Dec 2022 05:21:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 200W చార్జింగ్, 144Hz డిస్ప్లేతో చైనాలో లాంచైన iQOO 11 సిరీస్; జనవరి 10 న భారత్ లోకి ఎంట్రీ https://www.91mobiles.com/telugu/iqoo-11-series-launched-china-specs-price/ Fri, 09 Dec 2022 05:21:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=3897 హైలైట్స్ చైనాలో లాంచైన iQOO 11, iQOO 11 Pro, iQOO 7 Neo SE ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఫాస్ట్ చార్జింగ్, అమోలెడ్ డిస్ప్లే తో లాంచైన iQOO 11 సిరీస్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో లాంచైన iQOO 11, iQOO 11 Pro ఎన్నో లీక్స్ అనంతరం ఎట్టకేలకు iQOO 11 సిరీస్ చైనాలో ఎంట్రీ ఇచ్చింది. ఈలైనప్ లో iQOO 11, iQOO 11 […]

The post 200W చార్జింగ్, 144Hz డిస్ప్లేతో చైనాలో లాంచైన iQOO 11 సిరీస్; జనవరి 10 న భారత్ లోకి ఎంట్రీ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • చైనాలో లాంచైన iQOO 11, iQOO 11 Pro, iQOO 7 Neo SE
  • ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఫాస్ట్ చార్జింగ్, అమోలెడ్ డిస్ప్లే తో లాంచైన iQOO 11 సిరీస్
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో లాంచైన iQOO 11, iQOO 11 Pro

ఎన్నో లీక్స్ అనంతరం ఎట్టకేలకు iQOO 11 సిరీస్ చైనాలో ఎంట్రీ ఇచ్చింది. ఈలైనప్ లో iQOO 11, iQOO 11 Pro లాంచ్ అయ్యాయి. అలాగే వీటితో పాటు iQOO 7 Neo SE కూడా లాంచైంది. ఈ ఫోన్లన్నీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఫాస్ట్ చార్జింగ్, హై-రిఫ్రెష్ రేట్, అమోలెడ్ డిస్ప్లే తో లాంచ్ అయ్యాయి.

iQOO 11 లైనప్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ తో లాంచ్ అయ్యాయి. ప్రస్తుతానికి ఈ డివైజెస్ చైనాలో మాత్రమే లాంచ్ అయ్యాయి. త్వరలోనే భారత్ తో పాటు అంతర్జాతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

iQOO 11 స్పెసిఫికేషన్స్

iQOO 11 లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

iQOO 11 కెమెరా విభాగం విషయానికి వస్తే, ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ, 13ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 8ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

iQOO 11 Pro స్పెసిఫికేషన్స్

iQOO 11 Pro లో 6.78-ఇంచ్ క్యూహెచ్డీ+ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ఈ డివైజ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వచ్చింది. పవర్ బ్యాకప్ కోసం 4700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 50వాట్/200వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేయనుంది. ఈ ఫోన్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది.

ఇప్పుడు iQOO 11 Pro కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 13ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

iQOO 11 ధర

  • 8GB RAM/128GB స్టోరేజీ CNY 3,799 (సుమారు రూ.44,900)
  • 8GB RAM/256GB స్టోరేజీ CNY 4,099 (సుమారు రూ.48,500)
  • 12GB RAM/256GB స్టోరేజీ CNY 4,399 (సుమారు రూ.52,100)
  • 16GB RAM/256GB స్టోరేజీ CNY 4,699 (సుమారు రూ.55,600)
  • 16GB RAM/512GB స్టోరేజీ CNY 4,999 (సుమారు రూ.59,200)

iQOO 11 Pro ధర

  • 8GB RAM/256GB స్టోరేజీ CNY 4,999 (సుమారు రూ.59,200)
  • 12GB RAM/256GB స్టోరేజీ CNY 5,499 (సుమారు రూ.65,100)
  • 16GB RAM/512GB స్టోరేజీ CNY 5,999 (సుమారు రూ.71,900)

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 200W చార్జింగ్, 144Hz డిస్ప్లేతో చైనాలో లాంచైన iQOO 11 సిరీస్; జనవరి 10 న భారత్ లోకి ఎంట్రీ first appeared on 91Mobiles Telugu.

]]>
King Of Gaming Smartphones: డిసెంబర్ 2 న లాంచ్ అవుతోన్న iQOO 11 5G https://www.91mobiles.com/telugu/iqoo-11-5g-launch-timeline-malaysia/ Wed, 23 Nov 2022 15:33:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=3624 హైలైట్స్ డిసెంబర్ 2 న లాంచ్ కానున్న iQOO 11 5G స్మార్ట్ ఫోన్ iQOO 11 5G ని ‘కింగ్ ఆఫ్ గేమింగ్ స్మార్ట్ ఫోన్స్’ గా అభివర్ణిస్తోన్న ఐకూ కంపెనీ మలేషియన్ మార్కెట్ లో లాంచ్ అవుతోన్న iQOO 11 5G గత కొన్ని రోజులుగా iQOO 11 సిరీస్ కి సంబంధించిన లీక్స్ ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ ఇవేనంటూ నానా హడావుడి క్రియేట్ అవుతోంది. ఈ క్రమంలో iQOO […]

The post King Of Gaming Smartphones: డిసెంబర్ 2 న లాంచ్ అవుతోన్న iQOO 11 5G first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • డిసెంబర్ 2 న లాంచ్ కానున్న iQOO 11 5G స్మార్ట్ ఫోన్
  • iQOO 11 5G ని ‘కింగ్ ఆఫ్ గేమింగ్ స్మార్ట్ ఫోన్స్’ గా అభివర్ణిస్తోన్న ఐకూ కంపెనీ
  • మలేషియన్ మార్కెట్ లో లాంచ్ అవుతోన్న iQOO 11 5G

గత కొన్ని రోజులుగా iQOO 11 సిరీస్ కి సంబంధించిన లీక్స్ ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ ఇవేనంటూ నానా హడావుడి క్రియేట్ అవుతోంది. ఈ క్రమంలో iQOO 11 5G డిసెంబర్ 2 న లాంచ్ కానుందంటూ ఓ వార్త బయటకు వచ్చింది. అయితే ఈసారి రూమర్ కాదండి, స్వయంగా ఐకూ కంపెనీయే ఈ ప్రకటన చేసింది. iQOO 11 5G డిసెంబర్ 2 న మలేషియా లో లాంచ్ అవుతోంది. తర్వాత కొన్ని రోజులకు మిగతా మార్కెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

iQOO 11 5G లాంచ్

iQOO 11 5G స్మార్ట్ ఫోన్ డిసెంబర్ 2 న లాంచ్ అవ్వనుంది. మలేషియన్ మార్కెట్ లో తొలుత ఈ డివైజ్ ని లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. మలేషియా తర్వాత ఇతర మార్కెట్స్ లోకి ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుంది. భారత కాలమానం ప్రకారం iQOO 11 5G లాంచ్ ఈవెంట్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ లాంచ్ తర్వాత కొన్ని రోజులకే భారత్ లో కూడా ఈ సిరీస్ లాంచ్ అవుతుందని సమాచారం.

iQOO 11 5G స్పెసిఫికేషన్స్

iQOO 11 5G స్మార్ట్ ఫోన్ 6.67-ఇంచ్ ఈ6 అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ అమర్చారు. క్వాల్కమ్ తయారు చేసిన అత్యంత శక్తివంతమైన ఈ ప్రాసెసర్ ఇటీవలె లాంచ్ అయ్యింది. iQOO 11 5G ఫోన్ ని King Of Gaming Smartphones గా కంపెనీ చెబుతోంది.

iQOO 11 5G యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. iQOO 11 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 13 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 13 మెగాపిక్సెల్ పొట్రెయిట్ టెలీఫోటో లెన్స్, 50 ఎంపి శాంసంగ్ జీఎన్5 ప్రైమరీ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 32 ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. పవర్ బ్యాకప్ కోసం ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

అయితే మలేషియా మార్కెట్ లో కేవలం iQOO 11 5G మాత్రమే లాంచ్ అవుతుందా లేదా దాంతో పాటు iQOO 11 Pro 5G కూడా ఎంట్రీ ఇస్తుందా అనేది ఇంకా తెలియదు.

iQOO 11 Pro స్పెసిఫికేషన్స్

iQOO 11 Pro స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో లాంచ్ కానుంది. 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో ఈ ఫోన్ రానుంది. iQOO 11 Pro లో 6.78-ఇంచ్ ఈ6 అమోలెడ్ డిస్ప్లే, క్యూహెచ్డీ+ పిక్సెల్ రెజుల్యూషన్ ఉంటాయి.

iQOO 11 Pro కెమెరా విభాగానికి వస్తే, ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. బ్యాక్ ప్యానెల్ పై 50ఎంపి ప్రైమరీ లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 14.6 ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post King Of Gaming Smartphones: డిసెంబర్ 2 న లాంచ్ అవుతోన్న iQOO 11 5G first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన iQOO 11 Pro ఇండియా లాంచ్ టైమ్‌లైన్, ప్రధాన స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/iqoo-11-pro-india-launch-timeline-key-specs-leaked/ Tue, 15 Nov 2022 13:41:03 +0000 https://www.91mobiles.com/telugu/?p=3450 హైలైట్స్ నెట్టింట్లో ప్రత్యక్షమైన iQOO 11 Pro ఇండియా లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్స్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 200 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న iQOO 11 Pro 2023 ఆరంభంలో భారత్ లో లాంచ్ కానున్న iQOO 11 Pro ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ iQOO త్వరలో iQOO 11 సిరీస్ ని చైనాలో లాంచ్ చేయబోతోంది. iQOO 11 సిరీస్ లైనప్ లో స్టాండర్డ్ iQOO 11 […]

The post లీకైన iQOO 11 Pro ఇండియా లాంచ్ టైమ్‌లైన్, ప్రధాన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • నెట్టింట్లో ప్రత్యక్షమైన iQOO 11 Pro ఇండియా లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్స్
  • స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 200 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న iQOO 11 Pro
  • 2023 ఆరంభంలో భారత్ లో లాంచ్ కానున్న iQOO 11 Pro

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ iQOO త్వరలో iQOO 11 సిరీస్ ని చైనాలో లాంచ్ చేయబోతోంది. iQOO 11 సిరీస్ లైనప్ లో స్టాండర్డ్ iQOO 11 మరియు iQOO 11 Pro వేరియంట్స్ ఉంటాయి. ఇప్పటి వరకు కంపెనీ నుంచి iQOO 11 సిరీస్ ఇండియా లాంచ్ కి సంబంధించిన ఎటువంటి ప్రకటన బయటకు రాలేదు. తాజాగా బయటకు వచ్చిన ఓ లీక్ ద్వారా iQOO 11 Pro యొక్క లాంచ్ టైమ్ లైన్ మరియు ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ గురించి తెలిసింది. పదండి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.

iQOO 11 Pro ఇండియా లాంచ్ టైమ్‌లైన్

GSMArena కథనం ప్రకారం, iQOO 11 Pro 2023 జనవరి లో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన కచ్చితమైన తేదీ ఇంకా తెలియలేదు. ఐకూ బ్రాండ్ ఇప్పటికే లాంచ్ తేదీని నిర్ణయించి ఉంటుందని భావిస్తున్నారు. ఎందుకంటే లాంచ్ కి ఇంకా కొన్ని వారాల గడువే ఉంది.

iQOO 11 Pro స్పెసిఫికేషన్స్ (లీక్డ్)

లీకైన సమాచారాన్ని బట్టి iQOO 11 Pro స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో రానున్నట్లు తెలుస్తోంది. ఈ డివైజ్ వివో సొంతంగా అభివృద్ధి పరిచిన V2 ఇమేజ్ ప్రాసెసింగ్ చిప్ తో వస్తోంది. ఈ విషయం ఇటీవలె స్పష్టమైంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే, iQOO 11 Pro 6.78-ఇంచ్ ఈ6 అమోలెడ్ డిస్ప్లేతో వస్తోంది. అలాగే 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్ లో ఉండనుంది.

ఇప్పుడు iQOO 11 Pro కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. iQOO 11 Pro లో 50ఎంపి + 50ఎంపి + 48ఎంపి + 64ఎంపి క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇందులో ఉండనుంది. iQOO 11 Pro లో 4700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 200 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. iQOO 11 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ ఓషన్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. అదే భారత్ లో అయితే ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది. బీఎండబ్ల్యూ ఎమ్ మోటార్‌స్పోర్ట్ ఇన్‌స్పైర్డ్ డిజైన్ తో ఈ ఫోన్ వస్తోంది.

iQOO 11 Pro డివైజ్ లో 2కే రెజుల్యూషన్ డిస్ప్లే ఉంటుందని అంచనా వేస్తున్నారు. 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్ తో ఈ ఫోన్ రానుందని సమాచారం. 512జిబి స్టోరేజీ యూనిట్ ని ఐకూ చైనాలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ వేరియంట్ భారత్ కి వచ్చే చాన్సెస్ తక్కువే.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన iQOO 11 Pro ఇండియా లాంచ్ టైమ్‌లైన్, ప్రధాన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన iQOO 11 సిరీస్ ఇండియా లాంచ్ టైమ్‌లైన్ https://www.91mobiles.com/telugu/iqoo-11-series-india-launch-timeline-tipped/ Thu, 03 Nov 2022 09:40:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=3217 హైలైట్స్ తొలుత చైనాలో లాంచ్ కానున్న ఐకూ ఫ్లాగ్షిప్ సిరీస్ iQOO 11 భారత్ లో డిసెంబర్ లో లాంచ్ అవ్వనున్న iQOO 11 సిరీస్ తాజాగా లీకైన iQOO 11 సిరీస్ మోడల్ నంబర్స్, భారత్ లో ఐకూ 10 పేరుతో రీబ్రాండ్ అయి లాంచ్ కానున్న iQOO 11 Vivo సబ్-బ్రాండ్ అయిన iQOO ఈ ఏడాది ఆరంభంలో చైనాలో iQOO 10, iQOO 10 Pro ఫోన్లను లాంచ్ చేసింది. ఇప్పుడు, తన […]

The post లీకైన iQOO 11 సిరీస్ ఇండియా లాంచ్ టైమ్‌లైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • తొలుత చైనాలో లాంచ్ కానున్న ఐకూ ఫ్లాగ్షిప్ సిరీస్ iQOO 11
  • భారత్ లో డిసెంబర్ లో లాంచ్ అవ్వనున్న iQOO 11 సిరీస్
  • తాజాగా లీకైన iQOO 11 సిరీస్ మోడల్ నంబర్స్, భారత్ లో ఐకూ 10 పేరుతో రీబ్రాండ్ అయి లాంచ్ కానున్న iQOO 11

Vivo సబ్-బ్రాండ్ అయిన iQOO ఈ ఏడాది ఆరంభంలో చైనాలో iQOO 10, iQOO 10 Pro ఫోన్లను లాంచ్ చేసింది. ఇప్పుడు, తన తదుపరి ఫ్లాగ్షిప్ ఫోన్ ని లాంచ్ చేయబోతోంది ఐకూ. iQOO 11 సిరీస్ గా వస్తోన్న ఈ లైనప్ లో iQOO 11 మరియు iQOO 11 Pro మోడల్స్ ఉండనున్నాయి. భారత్ లో iQOO 11 సిరీస్ డిసెంబర్ లో లాంచ్ అవుతుందని ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ రివీల్ చేశాడు. iQOO 11 తొలుత చైనాలో లాంచ్ అయి తర్వాత భారత గడ్డపై అడుగుపెట్టనుంది.

గతంలో Pricebaba వెలువరించిన కథనంలో iQOO 11 యొక్క అఫీషియల్ మానికర్స్ మరియు మోడల్ నంబర్స్ రివీల్ అయ్యాయి. iQOO 11 మరియు iQOO 11 Pro ఇండియన్ వేరియంట్స్ యొక్క మోడల్ నంబర్లు వరుసగా I2209, I2212 గా ఉన్నాయి. మరోవైపు IMEI డేటాబేస్ పై I2209 మోడల్ నంబర్ తో iQOO 10 కనిపించింది. దీంతో iQOO 11 ని భారత్ లో iQOO 10 గా రీబ్రాండ్ చేసి విడుదల చేయనున్నారనే రూమర్లు వస్తున్నాయి. మరో విషయం ఏంటంటే, iQOO 10 భారత్ లో iQOO 9T గా రీబ్రాండ్ అయి లాంచ్ అయ్యింది.

iQOO 11 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

iQOO 11 స్మార్ట్ ఫోన్ 6.78-ఇంచ్ ఫ్లాట్ ఈ6 అమోలెడ్ డిస్ప్లే, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ లేదా 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోంది. మరోవైపు iQOO 11 Pro మోడల్ 6.78-ఇంచ్ శాంసంగ్ ఈ6 ఎల్టీపీవో ప్యానెల్, 2కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4700 ఎంఏహెచ్ బ్యాటరీ, 200 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోంది.

iQOO 11 సిరీస్ లోని రెండు మోడల్స్ కూడా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ ఓషన్ యూఐ తో వస్తున్నాయి. ఈ సిరీస్ 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ తో వస్తోంది.

ఇప్పుడు iQOO 11 సిరీస్ కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. స్టాండర్డ్ వేరియంట్ అయిన iQOO 11 లో 50ఎంపి శాంసంగ్ జీఎన్5 మెయిన్ కెమెరా, 13 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్, 12 మెగా పిక్సెల్ టెలీఫోటో లెన్స్, 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటాయి. iQOO 11 Pro వేరియంట్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 14.6 ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. త్వరలోనే ఐకూ 11 సిరీస్ ఇండియా లాంచ్ కి సంబంధించిన అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరో విషయం ఏంటంటే, నవంబర్ లో జరగబోవు క్వాల్కమ్ ఈవెంట్ లో స్నాప్ డ్రానగ్ 8 జెన్ 2 చిప్ లాంచ్ అవుతోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన iQOO 11 సిరీస్ ఇండియా లాంచ్ టైమ్‌లైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Snapdragon 8 Gen 2 చిప్సెట్, 200W ఫాస్ట్ చార్జింగ్ తో రానున్న iQOO 11 Pro https://www.91mobiles.com/telugu/iqoo-11-pro-specifications-surfaced-online/ Fri, 21 Oct 2022 14:58:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=3024 హైలైట్స్ నవంబర్ లేదా డిసెంబర్ మాసాల్లో లాంచ్ కానున్న ఐకూ ఫ్లాగ్షిప్ డివైజ్ iQOO 11 Pro చైనాతో పాటు భారత్ లో కూడా లాంచ్ కానున్న డివైజెస్ గతంలో చైనాకు మాత్రమే పరిమితమైన ఐకూ 10 సిరీస్ తన నెక్ట్స్ ఫ్లాగ్షిప్ సిరీస్ iQOO 11 సిరీస్ ని లాంచ్ చేసేందుకు ఐకూ కంపెనీ రంగం సిద్ధం చేస్తోంది. ఈ సిరీస్ నవంబర్ లేదా డిసెంబర్ మాసాల్లో లాంచ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. చైనాతో పాటు […]

The post Snapdragon 8 Gen 2 చిప్సెట్, 200W ఫాస్ట్ చార్జింగ్ తో రానున్న iQOO 11 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • నవంబర్ లేదా డిసెంబర్ మాసాల్లో లాంచ్ కానున్న ఐకూ ఫ్లాగ్షిప్ డివైజ్ iQOO 11 Pro
  • చైనాతో పాటు భారత్ లో కూడా లాంచ్ కానున్న డివైజెస్
  • గతంలో చైనాకు మాత్రమే పరిమితమైన ఐకూ 10 సిరీస్

తన నెక్ట్స్ ఫ్లాగ్షిప్ సిరీస్ iQOO 11 సిరీస్ ని లాంచ్ చేసేందుకు ఐకూ కంపెనీ రంగం సిద్ధం చేస్తోంది. ఈ సిరీస్ నవంబర్ లేదా డిసెంబర్ మాసాల్లో లాంచ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. చైనాతో పాటు భారత్ లో కూడా ఈ ఫ్లాగ్షిప్ సిరీస్ లాంచ్ అవ్వనుందని సమాచారం. గతంలో ఐకూ 10 సిరీస్ ని చైనాకు మాత్రమే పరిమితం చేసిన ఐకూ, భారత్ లో ఐకూ 9టీ ని లాంచ్ చేసింది. ఇది వన్‌ప్లస్ 10టీ 5జీ డివైజ్ కి పోటీగా వచ్చింది. అయితే ఈసారి iQOO 11 సిరీస్ ని భారత్ కి కూడా తీసుకురావాలని ఐకూ ప్లాన్ చేస్తోంది.

ఇదివరకు వచ్చిన రిపోర్ట్ ద్వారా iQOO 11 Pro మోడల్ యొక్క డిస్ప్లే స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఇప్పుడు ప్రముక టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ iQOO 11 Pro స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేశాడు. అయితే లేటెస్ట్ లీక్ కి గతంలో వచ్చిన రిపోర్ట్స్ కి తేడా ఉంది. సరే, తాజాగా బయటకు వచ్చిన సమాచారం ఏంటో తెలుసుకుందాం పదండి.

iQOO 11 Pro పూర్తి స్పెసిఫికేషన్స్

iQOO 11 Pro 6.78-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ డిస్ప్లే, 2కే రెజుల్యూషన్ తో వస్తోంది. ఈ ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. ఇదివరకు చైనీస్ టిప్‌స్టర్ 144హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అని రిపోర్ట్ చేశాడు. అయితే వీటిలో ఏది సరైనదో అప్పుడే కచ్చితంగా చెప్పలేం. కంపెనీ కన్ఫర్మ్ చేసే వరకు వేచి చూడాల్సిందే.

iQOO 11 Pro స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తోంది. ఈ చిప్సెట్ నవంబర్ 15 న జరిగే క్వాల్కమ్ ఈవెంట్ లో లాంచ్ అవ్వనుంది. స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 తర్వాత ఇదే నెక్ట్స్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. iQOO 11 Pro లో 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు ఇంటర్నల్ స్టోరేజీ ఉంటాయి. ఈ డివైజ్ లో 4700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 200 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఈ ఫోన్ లో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉండనుంది. iQOO 11 Pro ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది. అయితే భారత్ లో ఫన్‌టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ తో లాంచ్ అవుతుంది.

iQOO 11 Pro కెమెరా విభాగం విషయానికి వస్తే, ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 14.6ఎంపి టెలీఫోటో సెన్సర్ ఉండనున్నాయి. 50ఎంపి మెయిన్ కెమెరా సోని ఐఎంఎక్స్866 సెన్సర్ తో వస్తోంది. ప్రో వేరియంట్ లో వీ2 ఐఎస్‌పీ చిప్ ని వాడినట్లు సమాచారం. ఇదొక ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్. ప్రత్యేకించి ఇమేజింగ్ మరియు వీడియో అప్లికేషన్స్ కోసం రూపొందించారు. ఇకపోతే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం iQOO 11 Pro లో 32ఎంపి కెమెరా ఉండనుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Snapdragon 8 Gen 2 చిప్సెట్, 200W ఫాస్ట్ చార్జింగ్ తో రానున్న iQOO 11 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Snapdragon 8 Gen 2 చిప్ తో వస్తున్న iQOO 11 సిరీస్ https://www.91mobiles.com/telugu/iqoo-11-series-india-launch-timeline-specs/ Fri, 07 Oct 2022 07:11:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=2790 హైలైట్స్: త్వరలో ఐకూ నుంచి రానున్న iQOO 11, iQOO 11 pro నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో లాంచ్ కానున్న ఐకూ 11 సిరీస్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ తో రానున్న iQOO 11 సిరీస్ ఇటీవలె చైనాలో ఐకూ 10, ఐకూ 10 ప్రో ఫోన్లను లాంచ్ చేసిన వివో సబ్-బ్రాండ్ ఐకూ తన తదుపరి ఫ్లాగ్షిప్ సిరీస్ iQOO 11 ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. […]

The post Snapdragon 8 Gen 2 చిప్ తో వస్తున్న iQOO 11 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • త్వరలో ఐకూ నుంచి రానున్న iQOO 11, iQOO 11 pro
  • నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో లాంచ్ కానున్న ఐకూ 11 సిరీస్
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ తో రానున్న iQOO 11 సిరీస్

ఇటీవలె చైనాలో ఐకూ 10, ఐకూ 10 ప్రో ఫోన్లను లాంచ్ చేసిన వివో సబ్-బ్రాండ్ ఐకూ తన తదుపరి ఫ్లాగ్షిప్ సిరీస్ iQOO 11 ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ సిరీస్ నవంబర్ లేదా డిసెంబర్ నెల్లలో లాంచ్ అవ్వనుంది. క్వాల్కమ్ తయారు చేసిన నెక్ట్స్ జనరేషన్ ఫ్లాగ్షిప్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో ఐకూ 11 సిరీస్ రాబోతోంది. ఈ సిరీస్ చైనాతో పాటు భారత్ లో కూడా లాంచ్ అవ్వనున్నట్లు టిప్‌స్టర్ పారస్ గుగ్లాని వెల్లడించాడు. అలాగే Pricebaba వెలువరించిన కొత్త కథనం iQOO 11 సిరీస్ యొక్క మానికర్స్, మోడల్ నంబర్స్ ని తెలియజేస్తోంది.

హ్యాండ్సెట్స్ యొక్క ఫర్మ్‌వేర్ డేటా ద్వారా రెండు ఫోన్ల అఫీషియల్ మోడల్ నంబర్లు కన్ఫర్మ్ అయ్యాయి. iQOO I2209 మోడల్ నంబర్ ని గమనిస్తే ఇది ఇండియన్ వర్షన్ స్టాండర్డ్ వేరియంట్ అని, iQOO I2212 ఇండియన్ వర్షన్ ప్రో వేరియంట్ అని తెలుస్తోంది. మరోవైపు చైనా వేరియంట్స్ యొక్క మోడల్ నంబర్లు IQOO V2243A, V2254A అని ఉన్నాయి.

iQOO 11 సిరీస్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

లీక్స్ ని బట్టి, త్వరలో లాంచ్ కాబోవు ఈ iQOO 11 సిరీస్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ తో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. నవంబర్ మూడో వారంలో ఈ సిరీస్ లాంచ్ అవ్వనుంది. iQOO 11 సిరీస్ లో శాంసంగ్ ఈ6 అమోలెడ్ డిస్ప్లే, పంచ్ హోల్ డిజైన్ ఉండనుంది. స్టాండర్డ్ వేరియంట్ ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ తో రానుండగా, ప్రో వేరియంట్ 2కే రెజుల్యూషన్ తో వస్తుందని సమాచారం. అలాగే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 144 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్ ఈ ఫోన్లలో ఉండనున్నాయి.

iQOO 11 ఫోన్ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుండగా, iQOO 11 Pro 200 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రానుంది. ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ రెండు హ్యాండ్సెట్స్ 50 మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్8-సిరీస్ సెన్సర్స్ తో వస్తాయని రూమర్లు వినిపిస్తున్నాయి. ప్రో వేరియంట్ లో వీ2 ఐఎస్పీ చిప్ ని వాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

లాంచ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ, iQOO 11 సిరీస్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ గురించి మరింత స్పష్టత వస్తుంది. iQOO సంస్థ భారత్ లో ఐకూ 10 సిరీస్ లాంచ్ ని స్కిప్ చేసింది. అయితే ఐకూ 10 స్టాండర్డ్ వేరియంట్ ని iQOO 9T 5G పేరుతో భారత్ లో లాంచ్ చేసింది. కానీ, ఈసారి పూర్తిస్థాయిలో iQOO 11 సిరీస్ ఇండియా లో లాంచ్ అవ్వడం ఖాయమని తెలుస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post Snapdragon 8 Gen 2 చిప్ తో వస్తున్న iQOO 11 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>