iQOO Neo 7 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 18 Jan 2023 07:54:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Geekbench లిస్టింగ్ ద్వారా కన్ఫర్మ్ అయిన iQOO Neo 7 ప్రధాన స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/iqoo-neo-7-india-geekbench-specs-confirmations/ Wed, 18 Jan 2023 07:54:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=4520 భారత్ లో ఐకూ కంపెనీ iQOO Neo 7 స్మార్ట్ ఫోన్ ని ఫిబ్రవరి 16 న లాంచ్ చేయనుంది. అయితే లాంచ్ కి ముందు iQOO Neo 7 స్మార్ట్ ఫోన్ I2214 అనే మోడల్ నంబర్ తో గీక్ బెంచ్ డేటాబేస్ పై కనిపించింది. ఈ బెంచ్ మార్క్ లిస్టింగ్ ద్వారా iQOO Neo 7 మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ తో వస్తున్నట్లు స్పష్టమైంది. చైనా మార్కెట్ లో లాంచైన iQOO Neo […]

The post Geekbench లిస్టింగ్ ద్వారా కన్ఫర్మ్ అయిన iQOO Neo 7 ప్రధాన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఫిబ్రవరి 16 న భారత్ లో లాంచ్ అవుతోన్న iQOO Neo 7 స్మార్ట్ ఫోన్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ తో వస్తోన్న iQOO Neo 7
  • iQOO Neo 7 SE కి రీబ్రాండ్ వర్షన్ గా రానున్న iQOO Neo 7 ఇండియ్ వేరియంట్

భారత్ లో ఐకూ కంపెనీ iQOO Neo 7 స్మార్ట్ ఫోన్ ని ఫిబ్రవరి 16 న లాంచ్ చేయనుంది. అయితే లాంచ్ కి ముందు iQOO Neo 7 స్మార్ట్ ఫోన్ I2214 అనే మోడల్ నంబర్ తో గీక్ బెంచ్ డేటాబేస్ పై కనిపించింది. ఈ బెంచ్ మార్క్ లిస్టింగ్ ద్వారా iQOO Neo 7 మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ తో వస్తున్నట్లు స్పష్టమైంది.

చైనా మార్కెట్ లో లాంచైన iQOO Neo 7 SE కి రీబ్రాండ్ వర్షన్ గా iQOO Neo 7 ఫోన్ భారత్ కి వస్తోందని గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా మరోసారి తెలిసింది. గత నెలలో iQOO Neo 7 SE చైనాలో లాంచైంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ తో వచ్చింది. సరే, ఓసారి వివరాలను పూర్తిగా తెలుసుకుందాం పదండి.

iQOO Neo 7 Geekbench స్కోర్

iQOO Neo 7 స్మార్ట్ ఫోన్ గీక్ బెంచ్ పై కనిపించింది. Geekbench 5 బెంచ్ మార్క్ టెస్ట్ లో సింగిల్ కోర్ పై 998 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్టులో 3938 పాయింట్లు సాధించింది. లిస్టింగ్ ద్వారా ఈ ఫోన్ 1+3+4 కోర్ కన్ఫిగరేషన్, 3.10Ghz పీక్ ఫ్రీక్వెన్సీ తో కూడిన ఆక్టా-కోర్ ప్రాసెసర్ ని కలిగి ఉన్నట్లు అర్థమవుతోంది. దీన్ని బట్టి, iQOO Neo 7 ఇండియన్ వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

ఇంకా ఈ లిస్టింగ్ ద్వారా iQOO Neo 7 ఫోన్ లో 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, ఫన్‌టచ్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ ఉంటాయని తెలిసింది. సరే, ఈ ఫోన్ iQOO Neo 7 SE కి రీబ్రాండ్ వర్షన్ అని స్పష్టమైంది కనుక, ఓసారి iQOO Neo 7 SE స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

iQOO Neo 7 SE స్మార్ట్ ఫోన్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి.

iQOO Neo 7 SE లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి హై రెజుల్యూషన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 2ఎంపి డెప్త్ కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ హ్యాండ్సెట్ లో స్టీరియో స్పీకర్ సెటప్, టైప్-సీ చార్జింగ్ పోర్ట్ ఉంటాయి. వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 5జీ, 4జీ వొల్టీ, డ్యూయల్ సిమ్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉంటాయి. https://www.indiangadgetawards.com/

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Geekbench లిస్టింగ్ ద్వారా కన్ఫర్మ్ అయిన iQOO Neo 7 ప్రధాన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
MediaTek Dimensity 9000+ చిప్సెట్, 120W ఫాస్ట్ చార్జింగ్ తో లాంచ్ అయిన iQOO Neo 7 5G https://www.91mobiles.com/telugu/iqoo-neo-7-launched-in-china-specs-price/ Thu, 20 Oct 2022 14:41:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=3002 హైలైట్స్ Neo సిరీస్ లో కొత్త ఫోన్ ని లాంచ్ చేసిన ఐకూ చైనాలో ఎంట్రీ ఇచ్చిన iQOO Neo 7 5G స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ ప్రాసెసర్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50ఎంపి సోని ఐఎంఎక్స్766వీ లెన్స్ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ Neo సిరీస్ లో iQOO సంస్థ కొత్త ఫోన్ iQOO Neo 7 5G ని లాంచ్ చేసింది. నియో 6 5జీ ఫోన్ కి ఇది […]

The post MediaTek Dimensity 9000+ చిప్సెట్, 120W ఫాస్ట్ చార్జింగ్ తో లాంచ్ అయిన iQOO Neo 7 5G first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • Neo సిరీస్ లో కొత్త ఫోన్ ని లాంచ్ చేసిన ఐకూ
  • చైనాలో ఎంట్రీ ఇచ్చిన iQOO Neo 7 5G స్మార్ట్ ఫోన్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ ప్రాసెసర్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50ఎంపి సోని ఐఎంఎక్స్766వీ లెన్స్ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

Neo సిరీస్ లో iQOO సంస్థ కొత్త ఫోన్ iQOO Neo 7 5G ని లాంచ్ చేసింది. నియో 6 5జీ ఫోన్ కి ఇది సక్సెసర్ గా వచ్చింది. త్వరలోనే iQOO Neo 7 5G భారత్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. ప్రస్తుతానికి ఈ ఫోన్ చైనాలో కొనుగోలుకి అందుబాటులో ఉంది. iQOO Neo 7 5G మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ చిప్సెట్ తో వస్తోంది.

iQOO Neo 7 5G స్మార్ట్ ఫోన్ లో భారీ అమోలెడ్ డిస్ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నాయి. iQOO Neo 7 5G తో పాటు ఐకూ సంస్థ iQOO TWS Air ని కూడా లాంచ్ చేసింది. iQOO Neo 7 5G మరియు iQOO TWS Air ధర, స్పెసిఫికేషన్స్ ఇతర వివరాలను గురించి తెలుసుకుందాం పదండి.

iQOO Neo 7 5G ధర, స్పెసిఫికేషన్స్

iQOO Neo 7 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఈ5 అమోలెడ్ డిస్ప్లే, హోల్-పంచ్ కౌటౌట్, 1500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డిస్ప్లే చిప్ ఉన్నాయి. iQOO Neo 7 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ చిప్ అమర్చారు. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. iQOO Neo 7 5G ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఒరిజిన్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. గ్లోబల్ వేరియంట్ ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ ని కలిగి ఉండనుంది.

ఇప్పుడు iQOO Neo 7 5G యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. iQOO Neo 7 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్766వీ ప్రైమరీ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. ప్రైమరీ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 16ఎంపి కెమెరా అందించారు.

iQOO Neo 7 5G స్మార్ట్ ఫోన్ 4013MM స్క్వేర్ భారీ లిక్విడ్ వేపర్ చాంబర్ ని కలిగి ఉంది. ఈ ఫోన్ నాలుగు వేరియంట్లలో లభ్యం కానుంది. వీటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 8GB + 128GB వేరియంట్ ధర CNY 2699 (సుమారు రూ.30,900), 8GB + 256GB వేరియంట్ ధర CNY 2999 (సుమారు రూ.34,300), 12GB + 256GB వేరియంట్ ధర CNY 3299 (సుమారు రూ.37,700), 12GB + 512GB యూనిట్ ధర CNY 3599 (సుమారు రూ.41,200). iQOO Neo 7 5G స్మార్ట్ ఫోన్ ఆరెంజ్, బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

iQOO Neo 7 5G తో పాటు TWS Air కూడా లాంచ్ అయ్యింది. iQOO TWS Air సెమీ-ఇన్-ఇయర్ డిజైన్ ని కలిగి ఉంది. ఈ టీడబ్ల్యూఎస్ ఎయిర్ ధర CNY 199 (దాదాపు రూ.2,300).

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post MediaTek Dimensity 9000+ చిప్సెట్, 120W ఫాస్ట్ చార్జింగ్ తో లాంచ్ అయిన iQOO Neo 7 5G first appeared on 91Mobiles Telugu.

]]>
అక్టోబర్ 20 న లాంచ్ అవుతోన్న iQOO Neo 7 https://www.91mobiles.com/telugu/iqoo-neo-7-china-launch-date-announced-by-iqoo/ Wed, 12 Oct 2022 14:27:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=2888 హైలైట్స్ అక్టోబర్ 20 న రాత్రి 7 గంటలకు చైనాలో లాంచ్ అవుతోన్న iQOO Neo 7 ఐకూ నియో 6 మాదిరి డిజైన్ ని కలిగి ఉన్న iQOO Neo 7 ఆరెంజ్, బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న iQOO Neo 7 స్మార్ట్ ఫోన్ ఇటీవలె iQOO Neo 7 యొక్క స్పెసిఫికేషన్స్, లైవ్ ఇమేజ్, ఫోటో శాంపిల్ నెట్టింట్లో ప్రత్యక్షమైంది. ఇప్పుడు ఐకూ లేటెస్ట్ టీజర్ లో iQOO Neo 7 […]

The post అక్టోబర్ 20 న లాంచ్ అవుతోన్న iQOO Neo 7 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • అక్టోబర్ 20 న రాత్రి 7 గంటలకు చైనాలో లాంచ్ అవుతోన్న iQOO Neo 7
  • ఐకూ నియో 6 మాదిరి డిజైన్ ని కలిగి ఉన్న iQOO Neo 7
  • ఆరెంజ్, బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న iQOO Neo 7 స్మార్ట్ ఫోన్

ఇటీవలె iQOO Neo 7 యొక్క స్పెసిఫికేషన్స్, లైవ్ ఇమేజ్, ఫోటో శాంపిల్ నెట్టింట్లో ప్రత్యక్షమైంది. ఇప్పుడు ఐకూ లేటెస్ట్ టీజర్ లో iQOO Neo 7 హ్యాండ్సెట్ లాంచ్ తేదీని ప్రకటించింది. టీజర్ ద్వారా ఫోన్ యొక్క డిజైన్, కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. గతంలో బయటకు వచ్చిన పిక్స్ ద్వారా ఫోన్ బ్యాక్ ప్యానెల్ యొక్క డిజైన్ ఎలా ఉందో స్పష్టం తెలియలేదు. అయితే లాంచ్ డేట్ తో వచ్చిన పోస్టర్ లో డివైజ్ బ్యాక్ ప్యానెల్ కాస్త బెటర్ గా కనిపిస్తోంది. iQOO Neo 7 లాంచ్ తేదీ, డిజైన్, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

iQOO Neo 7 లాంచ్ తేదీ, డిజైన్

వివో చైనా వెబ్ సైట్ ద్వారా iQOO Neo 7 అక్టోబర్ 20 న రాత్రి 7 గంటలకు లాంచ్ అవుతుందని స్పష్టమైంది. టీజర్ లో iQOO Neo 7 యొక్క ఆరెంజ్ కలర్ వేరియంట్ కనిపిస్తోంది. డిజైన్ విషయంలో నియో 6 తో పోల్చితే iQOO Neo 7 లో పెద్దగా మార్పులు ఉన్నట్లు కనిపించడం లేదు. iQOO Neo 7 నీలం రంగులో కూడా వస్తుందని గతంలో విడుదలైన లీక్డ్ పిక్స్ ద్వారా స్పష్టమైంది. అయితే, బ్లూ, ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ మాత్రమే ఉంటాయా లేదా ఇంకా వేరే కలర్స్ లో iQOO Neo 7 లభ్యమవుతుందా అనే విషయం ఇంకా మిస్టరీ గానే ఉంది.

iQOO Neo 7 స్పెసిఫికేషన్స్

రీసెంట్ గా ఓ లీక్ ద్వారా iQOO Neo 7 యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. అవేంటో ఓసారి చూద్దాం. iQOO Neo 7 ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ని కలిగి ఉండనుంది. అలాగే iQOO Neo 7 మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ చిప్సెట్ తో రానుందని సమాచారం. ఇంకా ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని తెలుస్తోంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేయనుంది.

ఇప్పుడు iQOO Neo 7 కెమెరా విభాగం ఎలా ఉందో తెలుసుకుందాం. iQOO Neo 7 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. ఇందులో 50 మెగా పిక్సెల్ సోని ఐఎంఎక్స్766వీ ప్రైమరీ కెమెరా ఉండనుంది. మిగతా సెన్సర్ వివరాలు త్వరలోనే తెలుస్తాయి. ప్రస్తుతానికి iQOO Neo 7 యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ జాబితా రహస్యంగా ఉంది. మరొక 8 రోజుల్లో iQOO Neo 7 కి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా బయటకు రానున్నాయి. చైనాలో లాంచ్ అయ్యాక iQOO Neo 7 భారత్ తో పాటు, ఇతర గ్లోబల్ మార్కెట్స్ లోకి ప్రవేశించనుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post అక్టోబర్ 20 న లాంచ్ అవుతోన్న iQOO Neo 7 first appeared on 91Mobiles Telugu.

]]>
Dimensity 9000+ చిప్, 120W ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్న iQOO Neo 7 https://www.91mobiles.com/telugu/iqoo-neo-7-specs-leaked-before-launch/ Mon, 10 Oct 2022 15:26:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=2837 హైలైట్స్: లీకైన iQOO Neo 7 స్పెసిఫికేషన్స్ డైమెన్సిటీ 9000+ చిప్సెట్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రానున్న iQOO Neo 7 ఈ నెలలో చైనాలో iQOO Neo 7 లాంచ్ అవుతుందని అంచనా iQOO కంపెనీ త్వరలో iQOO Neo 7 ని లాంచ్ చేసేందుకు సన్నద్ధం అవుతోంది. తొలుత ఈ ఫోన్ చైనాలో లాంచ్ కానుంది. తర్వాత భారత్ తో పాటు గ్లోబల్ మార్కెట్స్ లోకి ప్రవేశించనుంది. iQOO Neo 7 […]

The post Dimensity 9000+ చిప్, 120W ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్న iQOO Neo 7 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • లీకైన iQOO Neo 7 స్పెసిఫికేషన్స్
  • డైమెన్సిటీ 9000+ చిప్సెట్, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రానున్న iQOO Neo 7
  • ఈ నెలలో చైనాలో iQOO Neo 7 లాంచ్ అవుతుందని అంచనా

iQOO కంపెనీ త్వరలో iQOO Neo 7 ని లాంచ్ చేసేందుకు సన్నద్ధం అవుతోంది. తొలుత ఈ ఫోన్ చైనాలో లాంచ్ కానుంది. తర్వాత భారత్ తో పాటు గ్లోబల్ మార్కెట్స్ లోకి ప్రవేశించనుంది. iQOO Neo 7 లాంచ్ కి సంబంధించిన వివరాలను ఐకూ సంస్థ ఇంకా వెల్లడించాల్సి ఉంది. ఈ నెలాఖరు వరకు చైనాలో iQOO Neo 7 ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ఫోన్ కి సంబంధించిన ఎన్నో విషయాలు లీక్ అయ్యాయి. తాజాగా iQOO Neo 7 యొక్క స్పెసిఫికేషన్స్ ని చైనాకు చెందిన ప్రముఖ టిప్‌స్టర్ బాల్డ్ పండా వెల్లడించింది. టిప్‌స్టర్ ప్రకారం, iQOO Neo 7 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రానుందని సమాచారం.

టిప్‌స్టర్ చెబుతున్నది నిజమైతే గనుక, నియో సిరీస్ లో 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రాబోవు తొలి ఫోన్ గా iQOO Neo 7 నిలవనుంది. ఐకూ నియో 6 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ని కలిగి ఉన్న సంగతి తెలిసిందే. మరి తాజాగా లీకైన iQOO Neo 7 యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం పదండి.

iQOO Neo 7 స్పెసిఫికేషన్స్

iQOO Neo 7 మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ చిప్సెట్ తో వస్తుందని ఇదివరకు ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వెల్లడించింది. 4ఎన్ఎం ప్రాసెస్ పై తయారైన ఈ చిప్సెట్ ని మీడియాటెక్ సంస్థ ఈ సంవత్సరం జూన్ లో లాంచ్ చేసింది. ఇక iQOO Neo 7 లో మాలి-జీ710 జీపీయూ ని గ్రాఫిక్స్ కోసం వాడినట్లు సమాచారం.

iQOO Neo 7 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ రెజుల్యూషన్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 6.62-ఇంచ్ డిస్ప్లే, సెంటర్ పంచ్-హోల్ కెమెరా ని కలిగి ఉండనున్నట్లు డిజిటల్ చాట్ స్టేషన్ రివీల్ చేసింది.

ఇప్పుడు కెమెరా విభాగం ఎలా ఉండనుందో చూద్దాం. iQOO Neo 7 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని అంచనా. ఇందులో 50 మెగా పిక్సెల్ సోని ఐఎంఎక్స్766వీ సెన్సర్ వాడినట్లు సమాచారం. ఐకూ 8ప్రో చైనా వేరియంట్ లో ఇదే సెన్సర్ ని వాడారు. ఇక 13 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 12 మెగా పిక్సెల్ పొట్రెయిట్-టెలీఫోటో కెమెరా iQOO Neo 7 లో ఉండనున్నాయి.

ఇటీవలె iQOO Neo 7 స్మార్ట్ ఫోన్ యొక్క బ్యాక్ ప్యానెల్ డిజైన్ పిక్స్ ఇంటర్నెట్ లో ప్రత్యక్షమయ్యాయి. అలాగే ఐకూ సంస్థ నియో 7 యొక్క లో-లైట్ కెమెరా పనితీరుని టీజ్ చేస్తూ ఒక పిక్ ని బయటకు వదిలింది. లాంచ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ మరిన్ని ఫోన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post Dimensity 9000+ చిప్, 120W ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్న iQOO Neo 7 first appeared on 91Mobiles Telugu.

]]>
నెట్టింట్లో ప్రత్యక్షమైన iQOO Neo 7 లైవ్ ఇమెజెస్ https://www.91mobiles.com/telugu/iqoo-neo-7-design-leaked-before-launch/ Sun, 09 Oct 2022 04:03:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=2810 హైలైట్స్: iQOO Neo 6 కి సక్సెసర్ గా వస్తోన్న iQOO Neo 7 స్మార్ట్ ఫోన్ నియో 7 యొక్క లో-లైట్ కెమెరా పనితీరుని టీజ్ చేసిన ఐకూ సంస్థ నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్న iQOO Neo 7 లైవ్ ఇమేజెస్ త్వరలోనే iQOO సంస్థ iQOO Neo 7 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. ఈ నెలలోనే ఐకూ నియో 7 మార్కెట్ లో అడుగుపెట్టే అవకాశం ఉందని సమాచారం. తొలుత చైనాలో […]

The post నెట్టింట్లో ప్రత్యక్షమైన iQOO Neo 7 లైవ్ ఇమెజెస్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • iQOO Neo 6 కి సక్సెసర్ గా వస్తోన్న iQOO Neo 7 స్మార్ట్ ఫోన్
  • నియో 7 యొక్క లో-లైట్ కెమెరా పనితీరుని టీజ్ చేసిన ఐకూ సంస్థ
  • నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్న iQOO Neo 7 లైవ్ ఇమేజెస్

త్వరలోనే iQOO సంస్థ iQOO Neo 7 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. ఈ నెలలోనే ఐకూ నియో 7 మార్కెట్ లో అడుగుపెట్టే అవకాశం ఉందని సమాచారం. తొలుత చైనాలో లాంచ్ అవ్వనున్న ఈ డివైజ్ ఇదే ఏడాది ఇండియాకు కూడా రానుంది. రానున్న రోజుల్లో ఐకూ నుంచి iQOO Neo 7 కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి. ఈలోపు ఐకూ ప్రొడక్ట్ మేనేజర్ చైనా సామాజిక మాధ్యమం వీబో పై iQOO Neo 7 కి సంబంధించిన పిక్స్ ని షేర్ చేశారు.

ఇక మరొక లీక్ లో iQOO Neo 7 యొక్క లైవ్ ఇమేజ్ బయటకు వచ్చింది. ఈ ఇమేజ్ లో రియర్ ప్యానెల్ కలర్, కెమెరా మాడ్యూల్ డిజైన్ కనిపిస్తున్నాయి. ఓసారి iQOO Neo 7 5జీ డివైజ్ యొక్క స్పెసిఫికేషన్స్, లైవ్ ఇమేజ్, ఇతర వివరాలను గురించి తెలుసుకుందాం పదండి.

లీకైన iQOO Neo 7 డిజైన్

 

Vivo సబ్-బ్రాండ్ అయిన ఐకూ త్వరలోనే iQOO Neo 7 అనే ప్రీమియమ్ ఫోన్ ని మార్కెట్ లోకి తీసుకురానుంది. చైనా మార్కెట్ లో ముందుగా లాంచ్ అయ్యాక, తర్వాత గ్లోబల్ మార్కెట్స్ లోకి ఈ ఫోన్ వెళ్ళనుంది. లాంచ్ తేదీ కోసం వేచి చూస్తున్న తరుణంలో, కంపెనీ ప్రోడక్ట్ మేనేజర్ iQOO Neo 7 ఇమేజ్ షాట్ ని షేర్ చేశారు. శాంపిల్ పిక్ iQOO Neo 7 కెమెరా లో-లైట్ పనితనాన్ని చూపిస్తోంది.

ఇక iQOO Neo 7 డివైజ్ యొక్క లైవ్ ఇమేజ్ ని ప్రముఖ చైనీస్ సింగర్ జౌ షెన్ ఒక లైవ్ బ్రాడ్ కాస్ట్ లో లీక్ చేశారు. పిక్ ఫోన్ యొక్క బ్లూ కలర్ ఆప్షన్ ని రివీల్ చేసింది. వెనుక ప్యానెల్ ఫ్రేమ్ లోకి కర్వ్ అయి ఉంది. కుడివైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్స్ కనిపిస్తున్నాయి.

iQOO Neo 7 కెమెరా మాడ్యూల్ స్క్వేర్ షేప్ లో కనిపిస్తోంది. అయితే సెన్సర్ కటౌట్స్ ఇమేజ్ లో కనిపించడం లేదు. రూమర్లను బట్టి, iQOO Neo 7 లో ట్రిపుల్ రియర్ కెమెరా ఉన్నట్లు తెలుస్తోంది. iQOO Neo 7 లో 50ఎంపి సోనీ ఐఎంఎక్స్ మెయిన్ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 12ఎంపి పొట్రెయిన్ టెలీఫోటో లెన్స్ ఉండనున్నాయి.

గతంలో వచ్చిన నివేదికలను బట్టి, iQOO Neo 7 లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ చిప్సెట్ ఉండనుందని తెలిసింది. ఇక ఈ ఫోన్ లో 6.6-ఇంచ్ లేదా 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండనున్నాయి. iQOO Neo 7 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తుందని అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో iQOO Neo 7 కి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వస్తాయి. త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ ఉన్నందున స్పెసిఫికేషన్స్ ని కంపెనీ టీజ్ చేసే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post నెట్టింట్లో ప్రత్యక్షమైన iQOO Neo 7 లైవ్ ఇమెజెస్ first appeared on 91Mobiles Telugu.

]]>
డైమెన్సిటీ 9000+ ప్రాసెసర్ తో వస్తున్న iQOO Neo 7 https://www.91mobiles.com/telugu/iqoo-neo-7-specs-leaked-by-digital-chat-station/ Thu, 18 Aug 2022 13:23:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=1763 హైలైట్స్: లీకైన ఐకూ నియో 7 ప్రధాన ఫీచర్లు మీడియాటెక్ డైమెన్సిటీ 9000+, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 120 హెర్ట్జ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు ఐకూ నియో 6 కి సక్సెసర్ గా వస్తున్న ఐకూ నియో 7 స్మార్ట్ ఫోన్ ఈ ఏడాది రెండు ఫ్లాగ్ షిప్ ఫోన్స్ లాంచ్ చేసిన ఐకూ కంపెనీ, తన మిడ్-రేంజ్ సెగ్మెంట్ ను కూడా విస్తృతం చేసింది. […]

The post డైమెన్సిటీ 9000+ ప్రాసెసర్ తో వస్తున్న iQOO Neo 7 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • లీకైన ఐకూ నియో 7 ప్రధాన ఫీచర్లు
  • మీడియాటెక్ డైమెన్సిటీ 9000+, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 120 హెర్ట్జ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
  • ఐకూ నియో 6 కి సక్సెసర్ గా వస్తున్న ఐకూ నియో 7 స్మార్ట్ ఫోన్

ఈ ఏడాది రెండు ఫ్లాగ్ షిప్ ఫోన్స్ లాంచ్ చేసిన ఐకూ కంపెనీ, తన మిడ్-రేంజ్ సెగ్మెంట్ ను కూడా విస్తృతం చేసింది. ఇప్పుడు, కంపెనీ త్వరలోనే కొత్త నియో సిరీస్ ఫోన్ ని చైనాలో లాంచ్ చేయాలని భావిస్తోంది. అది ఐకూ నియో 7. ఐకూ నియో 6 ఫోన్ కి సక్సెసర్ గా వస్తోంది. ఐకూ నియో 6 రూ.30,000 లోపు ధరలో వచ్చి ఒక సరైన మిడ్-రేంజ్ ఫోన్ గా ఇండియాలో పేరు సంపాదించింది. అయితే చైనా వర్షన్ లో స్పెసిఫికేషన్స్ లో తేడాలున్నాయి. ఈసారి భారత్ లో కూడా అదే విధంగా జరిగే అవకాశముంది. ప్రముఖ లీక్ స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ తాజాగా ఐకూ నియో 7 యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ ని లీక్ చేసింది.

టిప్ స్టర్ చెబుతున్న దాన్ని బట్టి, ఐకూ నియో 7 మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ చిప్సెట్ తో వస్తోంది. ఇది మీడియాటెక్ తయారు చేసిన ప్రీమియమ్ ప్రాసెసర్. ఇది నియో సిరీస్ లో క్వాల్కమ్ చిప్సెట్ ను రీప్లేస్ చేయనుంది. చైనా, భారత వర్షన్స్ లో ఇదే చిప్ ఉండనుంది.

iQOO Neo 7 స్పెసిఫికేషన్స్ (అంచనా)

ఐకూ నియో 7 ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్ హోల్ కటౌట్ తో వస్తోంది. ఇక ఈ ఫోన్లో అమోలెడ్ ప్యానెల్ ను వాడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అలాగే ఐ-ప్రొటెక్షన్ ఫీచర్ ను ఇందులో అందిస్తున్నారు. కెమెరాల విషయానికి వస్తే ఐకూ నియో 7 లో, 50ఎంపి సోనీ ఐఎంఎక్స్766వీ మెయిన్ కెమెరాతో సహా రెండు ఇతర లెన్స్ లు ఉండనున్నాయి.

ఈ హ్యాండ్సెట్ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ని కలిగి ఉండనుందని అంచనా. 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ నుంచి ఇది అప్ గ్రేడ్ అనుకోవచ్చు. ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ను ఇందులో అందించే అవకాశముంది. అలాగే ఇందులో ఐఆర్ బ్లాస్టర్, ఎన్ఎఫ్‌సీ, లీనియర్ మోటర్ వంటి ఫీచర్లున్నాయి.

ఐకూ నియో 7 లో డైమెన్సిటీ 9000+ చిప్సెట్ ను అమర్చనున్నారు. ఇది 4ఎన్ఎం ప్రాసెస్ పై తయారైంది. మాలి-జీ710 గ్రాఫిక్స్ ని నియో 7 లో అందిస్తున్నారు. అయితే, ఐకూ నియో 7 స్మార్ట్ ఫోన్ యొక్క లాంచ్ తేదీని టిప్ స్టర్ వెల్లడించలేదు. అయితే ఈ ఏడాది ముగిసే లోపు ఐకూ నియో 7 లాంచ్ అయ్యే అవకాశమున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

iQOO Neo 7 Specifications

  • ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ ప్రాసెసర్
  • 50ఎంపి సోనీ ఐఎంఎక్స్766వీ మెయిన్ కెమెరా
  • 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
  • మాలి-జీ710 గ్రాఫిక్స్
  • ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్

The post డైమెన్సిటీ 9000+ ప్రాసెసర్ తో వస్తున్న iQOO Neo 7 first appeared on 91Mobiles Telugu.

]]>