iQOO Z7 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 17 Mar 2023 13:06:38 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 అఫీషియల్ గా రివీలైన iQOO Z7 5G భారత మార్కెట్ ధర https://www.91mobiles.com/telugu/iqoo-z7-5g-india-price-officially-revealed/ Fri, 17 Mar 2023 13:06:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=5558 iQOO Z7 5G స్మార్ట్ ఫోన్ భారత్ లో మార్చి 21 న లాంచ్ అవుతోంది. లాంచ్ కి ముందు శుక్రవారం నాడు ఈ ఫోన్ ధర అఫీషియల్ గా రివీల్ అయ్యింది. ఈ ఫోన్ ధర రూ.18,999 తో ప్రారంభమవుతుంది. iQOO Z6 5G కి సక్సెసర్ గా iQOO Z7 5G మార్కెట్ లోకి వస్తోంది. గతేడాది మోడల్ తో పోల్చితే iQOO Z7 5G డివైజ్ పలు హార్డ్‌వేర్ మార్పులతో వస్తోంది. iQOO […]

The post అఫీషియల్ గా రివీలైన iQOO Z7 5G భారత మార్కెట్ ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రూ.18,999 ధరతో భారత్ లో లభ్యం కానున్న iQOO Z7 5G
  • మీడియాటెక్ డైమెన్సిటీ 930 చిప్సెట్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 90 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే తో వస్తోన్న డివైజ్
  • మార్చి 21 నుంచి మొదలుకానున్న iQOO Z7 5G సేల్

iQOO Z7 5G స్మార్ట్ ఫోన్ భారత్ లో మార్చి 21 న లాంచ్ అవుతోంది. లాంచ్ కి ముందు శుక్రవారం నాడు ఈ ఫోన్ ధర అఫీషియల్ గా రివీల్ అయ్యింది. ఈ ఫోన్ ధర రూ.18,999 తో ప్రారంభమవుతుంది. iQOO Z6 5G కి సక్సెసర్ గా iQOO Z7 5G మార్కెట్ లోకి వస్తోంది. గతేడాది మోడల్ తో పోల్చితే iQOO Z7 5G డివైజ్ పలు హార్డ్‌వేర్ మార్పులతో వస్తోంది. iQOO Z7 5G డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 930 చిప్సెట్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ తో ఈ ఫోన్ వస్తోంది.

సరే, ఓసారి iQOO Z7 5G యొక్క సేల్ తేదీ, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

భారత్ లో iQOO Z7 5G సేల్ తేదీ, ధర

iQOO Z7 5G డివైజ్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను భారత్ లో రూ.18,999 గా నిర్ణయించారు. ఇక 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.19,999 గా ఉంది. ఈ ఫోన్ బ్లూ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. మార్చి 21 వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ ద్వారా ఈ ఫోన్ సేల్ మొదలవుతుంది. లాంచ్ ఆఫర్ లో భాగంగా, ఐకూ సంస్థ రూ.1500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఈ డిస్కౌంట్ ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్‌సీ డెబిట్/క్రెడిట్ కార్డ్స్, నో-కాస్ట్ ఈఎంఐ లావాదేవీలపై వర్తిస్తుంది.

iQOO Z7 5G స్పెసిఫికేషన్స్

  • 6.38-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే
  • 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 930 చిప్సెట్
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్
  • 64ఎంపి + 2ఎంపి డ్యూయల్ కెమెరాలు
  • 16ఎంపి సెల్ఫీ కెమెరా
  • 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్

iQOO Z7 5G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 930 చిప్సెట్ వాడారు. దీనికి ఐఎంజీ బీఎక్స్ఎం-8-256 జీపీయూ ని జత చేశారు. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై ఫోన్ పని చేస్తుంది. రెండు మేజర్ ఓఎస్ అప్‌గ్రేడ్స్, 3 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ని కంపెనీ హామీనిస్తోంది. ఈ డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

iQOO Z7 5G లో 6.38-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి. iQOO Z7 5G లో డ్యూయల్ సిమ్ 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ వంటి కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి.

iQOO Z7 5G లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ఐసోసెల్ జీడబ్ల్యూ3 ప్రైమరీ ఓఐఎస్ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి సెకండరీ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post అఫీషియల్ గా రివీలైన iQOO Z7 5G భారత మార్కెట్ ధర first appeared on 91Mobiles Telugu.

]]>
రూ.20 వేల లోపు ధరతో భారత్‌లో లాంచ్ కానున్న iQOO Z7 5G; ప్రకటించిన ఐకూ https://www.91mobiles.com/telugu/iqoo-z7-5g-india-launch-date-price-segment-official/ Mon, 13 Mar 2023 06:25:21 +0000 https://www.91mobiles.com/telugu/?p=5472 iQOO Z7 5G స్మార్ట్ ఫోన్ భారత్ లో మార్చి 21 న లాంచ్ అవ్వబోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్ ని 91మొబైల్స్ హిందీ వెబ్‌సైట్ ప్రచురించింది. అలాగే iQOO Z7 5G డివైజ్ యొక్క ధర కూడా రివీల్ అయ్యింది. ఇండస్ట్రీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, ఈ ఫోన్ రూ.17,999 ధరతో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఐకూ కూడా తన అఫీషియల్ ట్వీట్ లో రూ.20,000 లోపు ధరతో iQOO […]

The post రూ.20 వేల లోపు ధరతో భారత్‌లో లాంచ్ కానున్న iQOO Z7 5G; ప్రకటించిన ఐకూ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రూ.20,000 లోపు ధరతో వస్తోన్న iQOO Z7 5G స్మార్ట్ ఫోన్
  • రెండు మెమొరీ వేరియంట్స్ లో అందుబాటులో ఉండనున్న iQOO Z7 5G
  • భారత్ లో మార్చి 21 న లాంచ్ అవుతోన్న iQOO Z7 5G డివైజ్

iQOO Z7 5G స్మార్ట్ ఫోన్ భారత్ లో మార్చి 21 న లాంచ్ అవ్వబోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్ ని 91మొబైల్స్ హిందీ వెబ్‌సైట్ ప్రచురించింది. అలాగే iQOO Z7 5G డివైజ్ యొక్క ధర కూడా రివీల్ అయ్యింది. ఇండస్ట్రీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, ఈ ఫోన్ రూ.17,999 ధరతో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఐకూ కూడా తన అఫీషియల్ ట్వీట్ లో రూ.20,000 లోపు ధరతో iQOO Z7 5G రానుందని తెలిపింది.

iQOO Z7 5G ధర (లీక్డ్)

iQOO Z7 5G మెమొరీ వేరియంట్స్ కి సంబంధించిన సమాచారం 91మొబైల్స్ కి వచ్చింది. ఆ సమాచారం ప్రకారం, iQOO Z7 5G డివైజ్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లభించనుంది. అవి: 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ. ఇండస్ట్రీ నుంచి అందిన సమాచారం ప్రకారం, iQOO Z7 5G ధర రూ.17,999 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది iQOO Z7 5G యొక్క ప్రారంభ ధర అని గమనించాలి. ఈ ఫోన్ పసిఫిక్ నైట్, నార్వే బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభింనున్నట్లు సమాచారం.

iQOO Z7 5G స్పెసిఫికేషన్స్ (లీక్డ్)

  • మీడియాటెక్ డైమెన్సిటీ 920
  • అల్ట్రా గేమింగ్ మోడ్
  • 6.4-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే
  • 64ఎంపి మెయిన్ కెమెరా
  • 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ

అందిన సమాచారాన్ని బట్టి, iQOO Z7 5G స్మార్ట్ ఫోన్ 6.4 ఇంచ్ వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లేతో వస్తోంది. ఈ స్క్రీన్ అమోలెడ్ ప్యానెల్ పై తయారైంది. 1200 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ని ఈ డిస్ప్లే కలిగి ఉండటం విశేషం. ఫోన్ స్క్రీన్ కి మూడు వైపులా సన్నని బెజెల్స్ ఉన్నాయి. బాటమ్ లో మందపాటి చిన్ ఉంది. ఈ ఫోన్ డిస్ప్లే హెచ్డీఆర్10+ సపోర్ట్ తో వస్తోంది.

iQOO Z7 5G స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 920 చిప్సెట్ తో వస్తున్నట్లుస మాచారం. ఇక ఈ ఫోన్ 4,85,000 అంటుటు స్కోర్ ని నమోదు చేసింది. భారత్ లో iQOO Z7 5G డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ తో లాంచ్ కానుంది. అలాగే మరొక మెమొరీ వేరియంట్ కూడా రానుంది.

మొబైల్ గేమింగ్ కి iQOO Z7 5G డివైజ్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అల్ట్రా గేమింగ్ మోడ్, 4డీ గేమ్ వైబ్రేషన్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. iQOO Z7 5G లో 64ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరా ఉండనుంది. iQOO Z7 5G లో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. మార్చి 21 న కచ్చితమైన ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు రివీల్ అవుతాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post రూ.20 వేల లోపు ధరతో భారత్‌లో లాంచ్ కానున్న iQOO Z7 5G; ప్రకటించిన ఐకూ first appeared on 91Mobiles Telugu.

]]>
అఫీషియల్ పోస్టర్ ద్వారా రివీలైన iQOO Z7 5G ఫ్రంట్ డిజైన్; వాటర్ డ్రాప్ నాచ్ తో వస్తోన్న డివైజ్ https://www.91mobiles.com/telugu/iqoo-z7-5g-front-look-revealed-by-company/ Tue, 07 Mar 2023 07:20:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=5239 iQOO సంస్థ ఇప్పటికే Z-సిరీస్ స్మార్ట్ ఫోన్ iQOO Z7 5G ని టీజ్ చేయడం మొదలుపెట్టింది. డివైజ్ ని 2023 మార్చి 21 న లాంచ్ చేయనున్నట్లు సమాచారం. గూగుత్ సెర్చ్ లో కాసేపు యాడ్ రూపంలో కనిపించడంతో iQOO Z7 5G లాంచ్ తేదీ రివీల్ అయ్యింది. తాజాగా ఐకూ iQOO Z7 5G ఫ్రంట్ లుక్ ని అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా రివీల్ చేసింది. రివీలైన iQOO Z7 5G […]

The post అఫీషియల్ పోస్టర్ ద్వారా రివీలైన iQOO Z7 5G ఫ్రంట్ డిజైన్; వాటర్ డ్రాప్ నాచ్ తో వస్తోన్న డివైజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • iQOO Z7 5G డివైజ్ మార్చి 21 న భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం
  • లాంచ్ కి ముందు అఫీషియల్ గా ఫ్రంట్ లుక్ ని టీజ్ చేసిన కంపెనీ
  • వాటర్ డ్రాప్ నాచ్ తో వస్తోన్న iQOO Z7 5G స్మార్ట్ ఫోన్

iQOO సంస్థ ఇప్పటికే Z-సిరీస్ స్మార్ట్ ఫోన్ iQOO Z7 5G ని టీజ్ చేయడం మొదలుపెట్టింది. డివైజ్ ని 2023 మార్చి 21 న లాంచ్ చేయనున్నట్లు సమాచారం. గూగుత్ సెర్చ్ లో కాసేపు యాడ్ రూపంలో కనిపించడంతో iQOO Z7 5G లాంచ్ తేదీ రివీల్ అయ్యింది. తాజాగా ఐకూ iQOO Z7 5G ఫ్రంట్ లుక్ ని అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా రివీల్ చేసింది.

రివీలైన iQOO Z7 5G ఫ్రంట్ డిజైన్

పైన అఫీషియల్ పోస్టర్ లో కనిపిస్తోన్న విధంగా, iQOO Z7 5G ఫ్రంట్ లుక్ ఉంటుంది. డివైజ్ వాటర్ డ్రాప్ నాచ్ తో వస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ నాచ్ లో సెల్ఫీ కెమెరా ఉండనుంది. ఇక ఫోన్ కి కుడివైపున పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. అయితే ఫోన్ యొక్క ఇతర యాంగిల్స్ ని కంపెనీ ప్రదర్శించలేదు. మరికొన్ని రోజులు ఆగితే iQOO Z7 5G పూర్తి డిజైన్ కనిపించనుంది.

iQOO Z7 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

iQOO Z7 5G స్మార్ట్ ఫోన్ లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయని తెలుస్తోంది. అయితే ఈ డివైజ్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్ తో వస్తుందా? లేదా అమోలెడ్ ప్యానెల్ తో వస్తుందా? అనే విషయం ఇంకా తెలియదు. iQOO Z7 5G స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్ తో రానుందని అంచనా వేస్తున్నారు. స్నాప్ డ్రాగన్ చిప్సెట్ తో కూడా వచ్చే అవకాశం ఉంది.

iQOO Z7 5G డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనుంది. iQOO Z7 5G ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది. iQOO Z7 5G బ్యాటరీ విభాగం విషయానికి వస్తే, ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేయనుందని తెలుస్తోంది.

ఇప్పుడు iQOO Z7 5G కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. iQOO Z7 5G లో 50ఎంపి మెయిన్ కెమెరా ఉంటుందని సమాచారం. ఇది ఓఐఎస్ సపోర్ట్ తో రావొచ్చని అంచనా. ఫ్రంట్ కెమెరా మరియు మిగతా రియర్ లెన్సెస్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. త్వరలోనే iQOO Z7 5G కి సంబంధించిన ఇతర ప్రధాన వివరాలు తెలిసే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post అఫీషియల్ పోస్టర్ ద్వారా రివీలైన iQOO Z7 5G ఫ్రంట్ డిజైన్; వాటర్ డ్రాప్ నాచ్ తో వస్తోన్న డివైజ్ first appeared on 91Mobiles Telugu.

]]>