
iQOO Z7 5G స్మార్ట్ ఫోన్ భారత్ లో మార్చి 21 న లాంచ్ అవ్వబోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్ ని 91మొబైల్స్ హిందీ వెబ్‌సైట్ ప్రచురించింది. అలాగే iQOO Z7 5G డివైజ్ యొక్క ధర కూడా రివీల్ అయ్యింది. ఇండస్ట్రీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, ఈ ఫోన్ రూ.17,999 ధరతో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఐకూ కూడా తన అఫీషియల్ ట్వీట్ లో రూ.20,000 లోపు ధరతో iQOO Z7 5G రానుందని తెలిపింది.
#iQOOZ7 5G is here to take your photography skills to the next level! With India's First* 64MP OIS Camera, its Hybrid Image Stabilization ensures the stability & smoothness of frames, making videos more stable and clear. Loading @amazonIN on 21st Mar.
*Under ₹20K price segment pic.twitter.com/0UyiLGujuD
— iQOO India (@IqooInd) March 13, 2023
iQOO Z7 5G ధర (లీక్డ్)
iQOO Z7 5G మెమొరీ వేరియంట్స్ కి సంబంధించిన సమాచారం 91మొబైల్స్ కి వచ్చింది. ఆ సమాచారం ప్రకారం, iQOO Z7 5G డివైజ్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లభించనుంది. అవి: 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ. ఇండస్ట్రీ నుంచి అందిన సమాచారం ప్రకారం, iQOO Z7 5G ధర రూ.17,999 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది iQOO Z7 5G యొక్క ప్రారంభ ధర అని గమనించాలి. ఈ ఫోన్ పసిఫిక్ నైట్, నార్వే బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభింనున్నట్లు సమాచారం.
iQOO Z7 5G స్పెసిఫికేషన్స్ (లీక్డ్)
- మీడియాటెక్ డైమెన్సిటీ 920
- అల్ట్రా గేమింగ్ మోడ్
- 6.4-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే
- 64ఎంపి మెయిన్ కెమెరా
- 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ
అందిన సమాచారాన్ని బట్టి, iQOO Z7 5G స్మార్ట్ ఫోన్ 6.4 ఇంచ్ వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లేతో వస్తోంది. ఈ స్క్రీన్ అమోలెడ్ ప్యానెల్ పై తయారైంది. 1200 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ని ఈ డిస్ప్లే కలిగి ఉండటం విశేషం. ఫోన్ స్క్రీన్ కి మూడు వైపులా సన్నని బెజెల్స్ ఉన్నాయి. బాటమ్ లో మందపాటి చిన్ ఉంది. ఈ ఫోన్ డిస్ప్లే హెచ్డీఆర్10+ సపోర్ట్ తో వస్తోంది.
iQOO Z7 5G స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 920 చిప్సెట్ తో వస్తున్నట్లుస మాచారం. ఇక ఈ ఫోన్ 4,85,000 అంటుటు స్కోర్ ని నమోదు చేసింది. భారత్ లో iQOO Z7 5G డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ తో లాంచ్ కానుంది. అలాగే మరొక మెమొరీ వేరియంట్ కూడా రానుంది.
మొబైల్ గేమింగ్ కి iQOO Z7 5G డివైజ్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అల్ట్రా గేమింగ్ మోడ్, 4డీ గేమ్ వైబ్రేషన్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. iQOO Z7 5G లో 64ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరా ఉండనుంది. iQOO Z7 5G లో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. మార్చి 21 న కచ్చితమైన ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు రివీల్ అవుతాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











