iQOO Z8x - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 31 Aug 2023 18:16:18 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 120Hz డిస్ప్లేతో చైనాలో లాంచైన iQOO Z8 5G, iQOO Z8x 5G https://www.91mobiles.com/telugu/iqoo-z8-5g-z8x-5g-launched-china-price-specs-availability/ Thu, 31 Aug 2023 15:57:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=7828 వివో సబ్-బ్రాండ్ iQOO చైనాలో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. iQOO Z8, iQOO Z8x అనే పేరుతో వచ్చిన ఈ ఫోన్లు గతంలో వచ్చిన ఐకూ జెడ్ 7 సిరీస్ కి సక్సెసర్స్ గా మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ రెండు ఫోన్లు 120 హెర్ట్జ్ డిస్ప్లేని కలిగి ఉన్నాయి. iQOO Z8 డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్, iQOO Z8x డివైజ్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 […]

The post 120Hz డిస్ప్లేతో చైనాలో లాంచైన iQOO Z8 5G, iQOO Z8x 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో లాంచైన iQOO Z8, Z8x డివైజెస్
  • iQOO Z8 ప్రారంభ ధర RMB 1,699 (సుమారు రూ.19,300)
  • iQOO Z8x ప్రారంభ ధర RMB 1,299 (సుమారు రూ.15,000)

వివో సబ్-బ్రాండ్ iQOO చైనాలో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. iQOO Z8, iQOO Z8x అనే పేరుతో వచ్చిన ఈ ఫోన్లు గతంలో వచ్చిన ఐకూ జెడ్ 7 సిరీస్ కి సక్సెసర్స్ గా మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ రెండు ఫోన్లు 120 హెర్ట్జ్ డిస్ప్లేని కలిగి ఉన్నాయి. iQOO Z8 డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్, iQOO Z8x డివైజ్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 చిప్ తో వచ్చాయి. సరే, ఓసారి iQOO Z8 మరియు iQOO Z8x ఫోన్ల యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

iQOO Z8, iQOO Z8x ధరలు

  • iQOO Z8 డివైజ్ 8జిబి + 256జిబి మోడల్ ధర RMB 1,699 (సుమారు రూ.19,300) గా ఉంది. 12జిబి + 256జిబి యూనిట్ ధర RMB 1799 (సుమారు రూ.20,500) గా ఉంది. టాప్ మోడల్ అయిన 12జిబి + 512జిబి వేరియంట్ ధరను RMB 1,999 (సుమారు రూ.23,100) గా నిర్ణయించారు.
  • iQOO Z8x యొక్క 8జిబి + 128జిబి మోడల్ ధరను RMB 1,299 (సుమారు రూ.15,000) గా పెట్టారు. 8జిబి + 256జిబి మోడల్ ధరను RMB 1,399 (సుమారు రూ.16,200) గా నిర్ణయించారు. 12జిబి + 256జిబి వేరియంట్ ధర RMB 1,499 (సుమారు రూ.17,100) గా ఉంది.
  • iQOO Z8x, iQOO Z8 డివైజెస్ బ్లాక్, బ్లూ, వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తాయి. సెప్టెంబర్ 7 వ తేదీ నుంచి చైనాలో ఈ ఫోన్ల సేల్ మొదలవుతుంది. iQOO Z8 సిరీస్ ఇండియా లాంచ్ గురించి ఇంతవరకు కంపెనీ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. అయితే నేడు భారత్ లో ఐకూ సంస్థ iQOO Z7 Pro 5G డివైజ్ ని లాంచ్ చేసింది.

iQOO Z8 స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: iQOO Z8 లో 6.64-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2388*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 19.9:9 యాస్పెక్ట్ రేషియో, పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి.
  • చిప్సెట్: iQOO Z8 లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్ వాడారు. గ్రాఫిక్స్ కోసం ఒడిన్ ఎంసీ6 జీపీయూ వినియోగించారు.
  • ఓఎస్: iQOO Z8 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: iQOO Z8 లో 64ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. 16ఎంపి ఫ్రంట్ కెమెరాను ఈ ఫోన్ లో అందించారు.
  • బ్యాటరీ: iQOO Z8 లో 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు.
  • కనెక్టివిటీ: iQOO Z8 లో 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: iQOO Z8 లో 12జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ అందించారు.

iQOO Z8x స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: iQOO Z8x 5G లో 6.64-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2388 * 1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 19.9:9 యాస్పెక్ట్ రేషియో, పంచ్-హోల్ కటౌట్, ఫ్లాట్ ఎడ్జెస్ ఉంటాయి.
  • ప్రాసెసర్: iQOO Z8x 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 చిప్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 710 జీపీయూ వినియోగించారు.
  • ర్యామ్, స్టోరేజీ: iQOO Z8x 5G డివైజ్ 12జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.
  • ఓఎస్: iQOO Z8x 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: iQOO Z8x 5G డివైజ్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: iQOO Z8x 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: iQOO Z8x 5G లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.
  • కనెక్టివిటీ: iQOO Z8x 5G లో 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
  • డైమెన్షన్స్: iQOO Z8x 5G డివైజ్ 164.63 మి.మీ పొడవు, 75.80 మి.మీ వెడల్పు, 9.10 మి.మీ మందం, 199.6 గ్రాముల బరువు ఉంది.

The post 120Hz డిస్ప్లేతో చైనాలో లాంచైన iQOO Z8 5G, iQOO Z8x 5G first appeared on 91Mobiles Telugu.

]]>
ఆగస్టు 31న చైనాలో లాంచ్ అవుతోన్న iQOO Z8, Z8x https://www.91mobiles.com/telugu/iqoo-z8-z8x-china-launch-date-officially-revealed-by-company/ Thu, 24 Aug 2023 18:28:43 +0000 https://www.91mobiles.com/telugu/?p=7718 Vivo సబ్-బ్రాండ్ ఐకూ త్వరలోనే iQOO Z8 సిరీస్ ని లాంచ్ చేయబోతోంది. ఈ లైనప్ లో iQOO Z8 మరియు iQOO Z8x డివైజెస్ లాంచ్ కానున్నాయి. ఈ రెండు ఫోన్ల లాంచ్ తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఆగస్టు 31 వ తేదీన ఈ రెండు ఫోన్లు లాంచ్ కానున్నాయి. లాంచ్ సమాచారంతో పాటు, కంపెనీ నుంచి ప్రాసెసర్ కి సంబంధించిన వివరాలు కూడా బయటకు వచ్చాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. iQOO […]

The post ఆగస్టు 31న చైనాలో లాంచ్ అవుతోన్న iQOO Z8, Z8x first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న iQOO Z8 సిరీస్
  • లైనప్ లో రానున్న iQOO Z8, Z8x
  • 6000mAh బ్యాటరీతో వస్తోన్న iQOO Z8x

Vivo సబ్-బ్రాండ్ ఐకూ త్వరలోనే iQOO Z8 సిరీస్ ని లాంచ్ చేయబోతోంది. ఈ లైనప్ లో iQOO Z8 మరియు iQOO Z8x డివైజెస్ లాంచ్ కానున్నాయి. ఈ రెండు ఫోన్ల లాంచ్ తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఆగస్టు 31 వ తేదీన ఈ రెండు ఫోన్లు లాంచ్ కానున్నాయి. లాంచ్ సమాచారంతో పాటు, కంపెనీ నుంచి ప్రాసెసర్ కి సంబంధించిన వివరాలు కూడా బయటకు వచ్చాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

iQOO Z8, iQOO Z8x లాంచ్ తేదీ

iQOO కంపెనీ తన కొత్త ఫోన్లకు సంబంధించి ఒక టీజర్ ని రివీల్ చేసింది. ఈ టీజర్ లో లాంచ్ తేదీ ఆగస్టు 31 అని పేర్కొనబడి ఉంది. లాంచ్ సమయం గురించి మాట్లాడితే, చైనాలో ఆగస్టు 31 న రాత్రి 7 గంటలకు లాంచ్ ఉంటుంది. iQOO Z8 డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ తో రానున్నట్లు సమాచారం. ఇది 5 నానోమీటర్ ప్రాసెసర్ తయారైన చిప్.

iQOO Z8 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: iQOO Z8 లో 6.64-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: iQOO Z8 లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్ వాడారు. ఇక గ్రాఫిక్స్ కోసం మాలి-జీ610 ఎమ్‌సీ6 జీపీయూ వినియోగించారు.
  • స్టోరేజీ: iQOO Z8 లో 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీని అందిస్తున్నారు.
  • కెమెరా: iQOO Z8 లో 64ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి కెమెరా అందిస్తున్నారు.
  • బ్యాటరీ: iQOO Z8 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: iQOO Z8 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 3.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: iQOO Z8 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.

iQOO Z8x స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: iQOO Z8x లో 6.64-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, పుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: iQOO Z8x లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ610 ఎంసీ6 జీపీయూ ఇవ్వనున్నారు.
  • స్టోరేజీ: iQOO Z8x డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
  • కెమెరా: iQOO Z8x లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: iQOO Z8x లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: iQOO Z8x డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 3.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post ఆగస్టు 31న చైనాలో లాంచ్ అవుతోన్న iQOO Z8, Z8x first appeared on 91Mobiles Telugu.

]]>