iQOO Z9 Turbo - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 24 Sep 2024 14:36:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 iQOO Z9 Turbo+: 16GB ర్యామ్‌తో చైనాలో లాంచైన ఐకూ కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/iqoo-z9-turbo-plus-launched-china-16gb-ram/ https://www.91mobiles.com/telugu/iqoo-z9-turbo-plus-launched-china-16gb-ram/#respond Tue, 24 Sep 2024 14:36:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=13723 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నేడు తన హోమ్ మార్కెట్ చైనాలో జెడ్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. iQOO Z9 Turbo+ పేరుతో ఈ ఫోన్ విడుదలైంది. శక్తివంతమైన ఫీచర్లను ఈ ఫోన్ లో అందించారు. 16జిబి ర్యామ్, 6400 ఎంఏహెచ్ బ్యాటరీ, 16ఎంపి ఫ్రంట్ కెమెరా, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్సెట్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర […]

The post iQOO Z9 Turbo+: 16GB ర్యామ్‌తో చైనాలో లాంచైన ఐకూ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో iQOO Z9 Turbo+ విడుదల
  • 512జిబి స్టోరేజీ, 16జిబి ర్యామ్
  • ప్రారంభ ధర రూ.27,300

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నేడు తన హోమ్ మార్కెట్ చైనాలో జెడ్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. iQOO Z9 Turbo+ పేరుతో ఈ ఫోన్ విడుదలైంది. శక్తివంతమైన ఫీచర్లను ఈ ఫోన్ లో అందించారు. 16జిబి ర్యామ్, 6400 ఎంఏహెచ్ బ్యాటరీ, 16ఎంపి ఫ్రంట్ కెమెరా, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్సెట్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

iQOO Z9 Turbo+ ధర

iQOO Z9 Turbo+ స్మార్ట్‌ఫోన్ 4 వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలను తెలుసుకుందాం.

12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 2,299 యువాన్లు (సుమారు రూ.27,300) గా ఉంది.

16జిబి+256జిబి వేరియంట్ ధరను 2,499 యువాన్లు (సుమారు రూ.29,700) గా నిర్ణయించారు.

12జిబి+512జిబి వేరియంట్ ధర 2,699 యువాన్లు (సుమారు రూ.32,000) గా ఉంది.

16జిబి+512జిబి మోడల్ ధర 2,899 యువాన్లు (సుమారు రూ.34,400) గా ఉంది.

ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా తెలియదు. త్వరలోనే ఐకూ నుంచి ప్రకటన వస్తుందేమో చూడాలి.

iQOO Z9 Turbo+ స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: iQOO Z9 Turbo+ లో 6.78-ఇంచ్ 1.5కే స్క్రీన్, ఓఎల్ఈడీ హుఆక్సింగ్ సీ8 ప్యానెల్, 2800*1200 పిక్సెల్ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3840 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

చిప్సెట్: iQOO Z9 Turbo+ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్లస్ చిప్సెట్ వాడారు. దీనికి తోడు క్యూ1 సూపర్‌కంప్యూటింగ్ చిప్ కూడా అందించారు. ఇంకా 6043ఎంఎం స్క్వేర్ వీసీ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా ఈ ఫోన్ లో ఉంది.

ర్యామ్, స్టోరేజీ: iQOO Z9 Turbo+ డివైజ్ 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.

కెమెరా: iQOO Z9 Turbo+ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-600 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి గెలాక్సీ కోర్ సీసీ08ఏ3 సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి శాంసంగ్ ఎస్5కే3పీ9 ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: iQOO Z9 Turbo+ డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 6,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: iQOO Z9 Turbo+ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యింది.

ఇతర ఫీచర్లు: iQOO Z9 Turbo+ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 7, డ్యూయల్ ఫ్రీక్వెన్సీ జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఐఆర్ బ్లాస్టర్, ఎక్స్ యాక్సిస్ లీనియర్ మోటర్, డ్యూయల్ స్పీకర్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post iQOO Z9 Turbo+: 16GB ర్యామ్‌తో చైనాలో లాంచైన ఐకూ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/iqoo-z9-turbo-plus-launched-china-16gb-ram/feed/ 0
iQOO Z9 Turbo+: చైనాలో సెప్టెంబర్ 24న లాంచ్ అవుతోన్న ఐకూ కొత్త ఫోన్ https://www.91mobiles.com/telugu/iqoo-z9-turbo-plus-china-launch-date-september-24/ https://www.91mobiles.com/telugu/iqoo-z9-turbo-plus-china-launch-date-september-24/#respond Thu, 19 Sep 2024 07:29:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=13597 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నుంచి త్వరలో జెడ్9 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. iQOO Z9 Turbo+ పేరుతో ఈ డివైజ్ విడుదల కానుంది. తాజాగా చైనా లాంచ్ తేదీని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. కాగా, ఇప్పటికే జెడ్9 లైనప్ లో ఐకూ జెడ్9, జెడ్9ఎక్స్, జెడ్9ఎస్ ప్రో అనే ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇక, iQOO Z9 Turbo+ స్మార్ట్‌ఫోన్ 6400 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుండటం విశేషం. సరే, ఓసారి […]

The post iQOO Z9 Turbo+: చైనాలో సెప్టెంబర్ 24న లాంచ్ అవుతోన్న ఐకూ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • iQOO Z9 Turbo+ చైనా లాంచ్ తేదీ ఖరారు
  • సెప్టెంబర్ 24న విడుదల
  • డైమెన్సిటీ 9300+ చిప్సెట్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నుంచి త్వరలో జెడ్9 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. iQOO Z9 Turbo+ పేరుతో ఈ డివైజ్ విడుదల కానుంది. తాజాగా చైనా లాంచ్ తేదీని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. కాగా, ఇప్పటికే జెడ్9 లైనప్ లో ఐకూ జెడ్9, జెడ్9ఎక్స్, జెడ్9ఎస్ ప్రో అనే ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇక, iQOO Z9 Turbo+ స్మార్ట్‌ఫోన్ 6400 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుండటం విశేషం. సరే, ఓసారి ఈ ఫోన్ యొక్క చైనా లాంచ్ తేదీ మరియు ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

iQOO Z9 Turbo+ చైనా లాంచ్ తేదీ

iQOO Z9 Turbo+ స్మార్ట్‌ఫోన్ యొక్క చైనా లాంచ్ తేదీని కంపెనీ టీజర్ ద్వారా తెలియజేసింది.

సెప్టెంబర్ 24వ తేదీన iQOO Z9 Turbo+ చైనాలో లాంచ్ అవుతోంది. అదే రోజున డివైజ్ యొక్క ధర, సేల్ వివరాలు తెలుస్తాయి.

iQOO Z9 Turbo+ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్ తో లాంచ్ కానుందని ఐకూ సంస్థ వెల్లడించింది.

డైమెన్సిటీ 9300+ మీడియాటెక్ కంపెనీ యొక్క ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. ఈ చిప్ గేమింగ్ మరియు ఇతర టాస్కులను వేగంగా హ్యాండిల్ చేయగలదు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.4 గిగాహెర్ట్జ్.

అంతేకాదు, iQOO Z9 Turbo+ డివైజ్ 6,400 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.

iQOO Z9 Turbo+ స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: iQOO Z9 Turbo+ లో 6.78-ఇంచ్ 1.5కే అమోలెడ్ స్క్రీన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 480 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+, డాల్బీ విజన్, 3840హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, డీసీ డిమ్మింగ్ సపోర్ట్ ఉంటాయి.

స్టోరేజీ, ర్యామ్: iQOO Z9 Turbo+ డివైజ్ 12జిబి మరియు 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి మరియు 512జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీతో లాంచ్ కానుంది.

కెమెరా: iQOO Z9 Turbo+ లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా ఉంటుందని లీక్స్ ద్వారా తెలుస్తోంది. ఇందులో సోని ఎల్‌వైటీ-600 సెన్సర్ మరియు జీసీ08ఏ3 సెన్సర్ ను వాడే అవకాశం ఉంది. దీనికి తోడు ఒక 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ, చార్జింగ్: iQOO Z9 Turbo+ లో పవర్ బ్యాకప్ కోసం 6,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

సాఫ్ట్‌వేర్: iQOO Z9 Turbo+ డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: iQOO Z9 Turbo+ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ వొల్టీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.4 ఉంటాయి.

ఇతర ఫీచర్లు: iQOO Z9 Turbo+ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్, స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. భద్రత కోసం ఈ ఫోన్ ఐపీ64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ ప్రొటెక్షన్ రేటింగ్ తో వస్తోంది.

The post iQOO Z9 Turbo+: చైనాలో సెప్టెంబర్ 24న లాంచ్ అవుతోన్న ఐకూ కొత్త ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/iqoo-z9-turbo-plus-china-launch-date-september-24/feed/ 0
లీకైన iQOO Z9, iQOO Z9x, iQOO Z9 Turbo పూర్తి స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/iqoo-z9-z9x-z9-turbo-full-specs-leaked/ Tue, 16 Apr 2024 14:27:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=11124 Vivo సబ్-బ్రాండ్ iQOO నుంచి త్వరలో Z9 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Z9, Z9 Turbo, Z9x అనే ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. ఈ సిరీస్ తొలుత చైనాలో ఏప్రిల్ 24వ తేదీన లాంచ్ అవుతోంది. తాజాగా, 91mobiles ఐకూ జెడ్9 లైనప్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్‌ని టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ సౌజన్యంతో రివీల్ చేసింది. ఓసారి ఐకూ జీ9 సిరీస్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. iQOO Z9 […]

The post లీకైన iQOO Z9, iQOO Z9x, iQOO Z9 Turbo పూర్తి స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో చైనాలో ఐకూ జెడ్9 సిరీస్ లాంచ్
  • 6000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • స్నాప్‌డ్రాగన్ చిప్సెట్

Vivo సబ్-బ్రాండ్ iQOO నుంచి త్వరలో Z9 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Z9, Z9 Turbo, Z9x అనే ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. ఈ సిరీస్ తొలుత చైనాలో ఏప్రిల్ 24వ తేదీన లాంచ్ అవుతోంది. తాజాగా, 91mobiles ఐకూ జెడ్9 లైనప్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్‌ని టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ సౌజన్యంతో రివీల్ చేసింది. ఓసారి ఐకూ జీ9 సిరీస్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

iQOO Z9 సిరీస్ స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: iQOO Z9x లో 6.72-ఇంచ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎల్సీడీ ప్యానెల్ ఉంటాయి. iQOO Z9, Z9 Turbo ఫోన్లలో 6.78-ఇంచ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్ ఉంటాయి.

కెమెరా: iQOO Z9, Z9x ఫోన్లలో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉంటాయి. Z9 Turbo లో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. Z9 మరియు Z9 Turbo డివైజెస్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. iQOO Z9x లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

ప్రాసెసర్: iQOO Z9x లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, Z9 లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ ఉంటుంది. Z9 Turbo లో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.

ర్యామ్, స్టోరేజీ: iQOO Z9x, Z9 ఫోన్లలో ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉంటాయి. Z9 Turbo లో ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉంటాయి.

బ్యాటరీ: iQOO Z9 సిరీస్ లోని మూడు ఫోన్లలో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. iQOO Z9, Z9 Turbo 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నాయి. మరోవైపు, iQOO Z9x 40 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

సాఫ్ట్‌వేర్: ఐకూ జీ9 సిరీస్ లోని మూడు ఫోన్లు కూడా ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.

The post లీకైన iQOO Z9, iQOO Z9x, iQOO Z9 Turbo పూర్తి స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
iQOO: ఏప్రిల్ 24న చైనాలో లాంచ్ అవుతోన్న Z9 Turbo https://www.91mobiles.com/telugu/iqoo-z9-turbo-5g-china-launch-date-april-24/ Wed, 10 Apr 2024 05:52:02 +0000 https://www.91mobiles.com/telugu/?p=11013 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo సబ్-బ్రాండ్ iQOO నుంచి త్వరలో Z9 Turbo అనే స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ తో వస్తోంది. ఇప్పటికే మార్కెట్ లో iQOO Z9 5G కొనుగోలుకి అందుబాటులో ఉంది. ఇప్పుడు iQOO Z9 Turbo లాంచ్ కి సిద్ధమవుతోంది. ఏప్రిల్ 24న చైనాలో ఈ ఫోన్ లాంచ్ కానుంది. iQOO Z9 Turbo లాంచ్ వివరాలు iQOO Z9 Turbo స్మార్ట్‌ఫోన్ లాంచ్ […]

The post iQOO: ఏప్రిల్ 24న చైనాలో లాంచ్ అవుతోన్న Z9 Turbo first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • iQOO Z9 Turbo లాంచ్ తేదీ ఖరారు
  • మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్
  • భారత మార్కెట్ ధర రూ.19,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo సబ్-బ్రాండ్ iQOO నుంచి త్వరలో Z9 Turbo అనే స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ తో వస్తోంది. ఇప్పటికే మార్కెట్ లో iQOO Z9 5G కొనుగోలుకి అందుబాటులో ఉంది. ఇప్పుడు iQOO Z9 Turbo లాంచ్ కి సిద్ధమవుతోంది. ఏప్రిల్ 24న చైనాలో ఈ ఫోన్ లాంచ్ కానుంది.

iQOO Z9 Turbo లాంచ్ వివరాలు

iQOO Z9 Turbo స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీ ఖరారైంది. ఏప్రిల్ 24వ తేదీన చైనాలో ఈ ఫోన్ లాంచ్ అవుతోంది. ఇప్పటి వరకు ఇండియా లాంచ్ వివరాలు తెలియలేదు. చైనాలో త్వరలో లాంచ్ కాబోయే iQOO Z9 Turbo ఫోన్ శక్తివంతమైన చిప్సెట్ మరియు స్పెసిఫికేషన్స్ తో వస్తోంది. భారత్ లో అందుబాటులో ఉన్న iQOO Z9 5జీ కంటే మెరుగైన ఫీచర్లు టర్బో ఎడిషన్ లో ఉంటాయి.

iQOO Z9 Turbo స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: లీక్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం, iQOO Z9 Turbo లో 1.5కే స్క్రీన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఓఎల్ఈడీ ఫ్లాట్ ప్యానెల్ ఉంటాయి.

ప్రాసెసర్: iQOO Z9 Turbo లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. రెడ్మీ టర్బో 3 లో కూడా ఇదే చిప్సెట్ ఉంటుంది. అంటే రెండూ ఒకదానికొకటి పోటీ పడనున్నాయని తెలుస్తోంది.

ర్యామ్, స్టోరేజీ: iQOO Z9 Turbo డివైజ్ 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మరియు 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్స్ లో లాంచ్ కానుంది.

బ్యాటరీ: iQOO Z9 Turbo లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని ఐకూ కన్ఫర్మ్ చేసింది. 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో ఈ ఫోన్ వస్తుందని సమాచారం.

కెమెరా: iQOO Z9 Turbo లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని రివీలైన డిజైన్ ద్వారా తెలుస్తోంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

ఓఎస్: iQOO Z9 Turbo డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

సెక్యూరిటీ: iQOO Z9 Turbo లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది.

The post iQOO: ఏప్రిల్ 24న చైనాలో లాంచ్ అవుతోన్న Z9 Turbo first appeared on 91Mobiles Telugu.

]]>
iQOO: 6000mAh బ్యాటరీతో వస్తోన్న Z9 Turbo https://www.91mobiles.com/telugu/iqoo-z9-turbo-to-launch-with-6000mah-battery/ Tue, 09 Apr 2024 06:36:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=10992 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo యొక్క సబ్-బ్రాండ్ iQOO నుంచి త్వరలో ఒక కొత్త జెడ్-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. iQOO Z9 Turbo పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. ఈ ఫోన్ ఇదే నెలలో లాంచ్ అవుతుందని ఐకూ ప్రొడక్ట్ మేనేజర్ జెంగ్ చింగ్ చైనాకు చెందిన సామాజిక మాధ్యమం Weibo ద్వారా తెలిపారు. అయితే, లాంచ్ తేదీ గురించి ఏ వివరాలు పేర్కొనలేదు. కానీ, ఇప్పుడు కంపెనీ iQOO Z9 Turbo […]

The post iQOO: 6000mAh బ్యాటరీతో వస్తోన్న Z9 Turbo first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో iQOO Z9 Turbo లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్
  • డ్యూయల్ రియర్ కెమెరా సెటప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo యొక్క సబ్-బ్రాండ్ iQOO నుంచి త్వరలో ఒక కొత్త జెడ్-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. iQOO Z9 Turbo పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. ఈ ఫోన్ ఇదే నెలలో లాంచ్ అవుతుందని ఐకూ ప్రొడక్ట్ మేనేజర్ జెంగ్ చింగ్ చైనాకు చెందిన సామాజిక మాధ్యమం Weibo ద్వారా తెలిపారు. అయితే, లాంచ్ తేదీ గురించి ఏ వివరాలు పేర్కొనలేదు. కానీ, ఇప్పుడు కంపెనీ iQOO Z9 Turbo యొక్క అఫీషియల్ లుక్ మరియు కొన్ని ప్రత్యేక ఫీచర్లను టీజర్ చేసింది.

iQOO Z9 Turbo డిజైన్

iQOO Z9 Turbo ఫోన్ డిజైన్ ఐకూ 12 స్మార్ట్‌ఫోన్ మాదిరి ఉంటుందని షేర్ చేసిన ఇమేజ్ ద్వారా తెలుస్తోంది. బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కనిపిస్తోంది. కెమెరా మాడ్యూల్ డిజైన్ ఐకూ 12 లో ఉన్నట్లుగానే ఉంది.

iQOO Z9 Turbo ఫోన్ “ఇండిపెండెంట్ గ్రాఫిక్స్ చిప్” తో వస్తున్నట్లు వివో వైస్ ప్రెసిడెంట్ జియా జింగ్‌డాంగ్ తెలిపారు.

iQOO Z9 Turbo స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: లీక్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం, iQOO Z9 Turbo లో 1.5కే స్క్రీన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఓఎల్ఈడీ ఫ్లాట్ ప్యానెల్ ఉంటాయి.
  • ప్రాసెసర్: iQOO Z9 Turbo లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. రెడ్మీ టర్బో 3 లో కూడా ఇదే చిప్సెట్ ఉంటుంది. అంటే రెండూ ఒకదానికొకటి పోటీ పడనున్నాయని తెలుస్తోంది.
  • ర్యామ్, స్టోరేజీ: iQOO Z9 Turbo డివైజ్ 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మరియు 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్స్ లో లాంచ్ కానుంది.
  • బ్యాటరీ: iQOO Z9 Turbo లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని ఐకూ కన్ఫర్మ్ చేసింది. 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో ఈ ఫోన్ వస్తుందని సమాచారం.
  • కెమెరా: iQOO Z9 Turbo లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని రివీలైన డిజైన్ ద్వారా తెలుస్తోంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • ఓఎస్: iQOO Z9 Turbo డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • సెక్యూరిటీ: iQOO Z9 Turbo లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది.

The post iQOO: 6000mAh బ్యాటరీతో వస్తోన్న Z9 Turbo first appeared on 91Mobiles Telugu.

]]>
iQOO: 120W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో రానున్న Z9 Turbo https://www.91mobiles.com/telugu/iqoo-z9-turbo-to-feature-120w-fast-charging/ Wed, 13 Mar 2024 11:48:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=10669 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO ఇటీవలె Z9 5G ఫోన్‌ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. రూ.19,999 ప్రారంభ ధర కలిగిన ఈ ఫోన్ లో 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 50ఎంపి కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ ఉన్నాయి. ఇదిలా ఉండగా, iQOO నుంచి Z9 Turbo అనే మరొక ఫోన్ లాంచ్ కానుందని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఓసారి iQOO Z9 Turbo విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. iQOO […]

The post iQOO: 120W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో రానున్న Z9 Turbo first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో iQOO Z9 Turbo లాంచ్
  • లీకైన స్పెసిఫికేషన్స్
  • డైమెన్సిటీ 7200 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO ఇటీవలె Z9 5G ఫోన్‌ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. రూ.19,999 ప్రారంభ ధర కలిగిన ఈ ఫోన్ లో 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 50ఎంపి కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ ఉన్నాయి. ఇదిలా ఉండగా, iQOO నుంచి Z9 Turbo అనే మరొక ఫోన్ లాంచ్ కానుందని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఓసారి iQOO Z9 Turbo విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

iQOO Z9 Turbo వివరాలు (లీక్)

iQOO Z9 Turbo కి సంబంధించిన వివరాలను ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ చైనా మైక్రోబ్లాగింగ్ సైట్ వీబోపై రివీల్ చేసింది.

త్వరలో లాంచ్ కాబోయే iQOO Z9 Turbo క్వాల్కమ్ Snapdragon 8s Gen 3 చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం.

లీక్ ప్రకారం, iQOO Z9 Turbo లో 6.78-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 144Hz రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉంటాయి.

iQOO Z9 Turbo ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అవుతుంది.

iQOO Z9 Turbo లో 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉంటాయి.

iQOO Z9 Turbo లో ఉండే బ్యాటరీ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియదు. కానీ, ఇది 120W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు లీక్ ద్వారా తెలుస్తోంది.

iQOO Z9 Turbo లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ లెన్స్ ఉండే అవకాశం ఉంది.

iQOO Z9 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: iQOO Z9 5G లో 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 91.90% స్క్రీన్ టు బాడీ రేషియో, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: iQOO Z9 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్, ఏఆర్ఎమ్ మాలి 610 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: iQOO Z9 5G డివైజ్ 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. యూజర్ కి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ ద్వారా గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.
  • కెమెరా: iQOO Z9 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: iQOO Z9 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: iQOO Z9 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 2 మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్ కి లభిస్తాయి.
  • కనెక్టివిటీ: iQOO Z9 5G లో డ్యూయల్ సిమ్, 4జీ, 5జీ, బ్లూటూత్, వై-ఫై 6 ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: iQOO Z9 5G లో ఐపీ54 రేటింగ్, డ్యూయల్ స్టీరియో స్పీకర్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post iQOO: 120W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో రానున్న Z9 Turbo first appeared on 91Mobiles Telugu.

]]>