itel S23 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 26 Sep 2023 12:20:24 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 3డీ కర్వ్డ్ స్క్రీన్, 32MP ఫ్రంట్ కెమెరాతో భారత్‌లో లాంచైన itel S23+ https://www.91mobiles.com/telugu/itel-s23-plus-launched-india-price-specs-availability/ Tue, 26 Sep 2023 12:20:24 +0000 https://www.91mobiles.com/telugu/?p=8152 చవకైన ఫోన్లను తయారు చేయడంలో టెక్ బ్రాండ్ itel ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటుంది. అందుకు తాజాగా itel S23+ డివైజ్ ఉదాహరణగా నిలుస్తోంది. itel S23+ డివైజ్ అత్యంత చవకైన కర్వ్డ్ స్క్రీన్ గల ఫోన్ గా వార్తల్లోకెక్కింది. నేడు ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అయ్యింది. itel S23+ డివైజ్ 32ఎంపి సెల్ఫీ కెమెరా, 3డీ కర్వ్డ్ స్క్రీన్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి. itel S23+ ఫోన్ ధరను రూ.13,999 […]

The post 3డీ కర్వ్డ్ స్క్రీన్, 32MP ఫ్రంట్ కెమెరాతో భారత్‌లో లాంచైన itel S23+ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన itel S23+
  • 32ఎంపి ఫ్రంట్ కెమెరాతో వచ్చిన డివైజ్
  • ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఈ ఫోన్ ప్రత్యేకత

చవకైన ఫోన్లను తయారు చేయడంలో టెక్ బ్రాండ్ itel ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటుంది. అందుకు తాజాగా itel S23+ డివైజ్ ఉదాహరణగా నిలుస్తోంది. itel S23+ డివైజ్ అత్యంత చవకైన కర్వ్డ్ స్క్రీన్ గల ఫోన్ గా వార్తల్లోకెక్కింది. నేడు ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అయ్యింది. itel S23+ డివైజ్ 32ఎంపి సెల్ఫీ కెమెరా, 3డీ కర్వ్డ్ స్క్రీన్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి. itel S23+ ఫోన్ ధరను రూ.13,999 గా నిర్ణయించారు. సరే, ఓసారి ఈ డివైజ్ పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

itel S23+ స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: itel S23+ డివైజ్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్, 3డీ కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, గొరిల్లా గ్లాస్ 5 ఉన్నాయి.
  • ప్రాసెసర్: itel S23+ లో యూనిఎస్ఓసీ టైగర్ టీ616 ఆక్టా-కోర్ ప్రాసెసర్ వాడారు. ఇది 2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంది.
  • ఓఎస్: itel S23+ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • మెమొరీ: itel S23+ లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. దీంతో యూజర్ కి 16జిబి వరకు ర్యామ్ పవర్ లభించనుంది.
  • బ్యాటరీ: itel S23+ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: itel S23+ లో 50ఎంపి మెయిన్ కెమెరా, ఒక ఎల్ఈడీ ఫ్లాస్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

The post 3డీ కర్వ్డ్ స్క్రీన్, 32MP ఫ్రంట్ కెమెరాతో భారత్‌లో లాంచైన itel S23+ first appeared on 91Mobiles Telugu.

]]>
itel S23+ ఇండియా లాంచ్ ఖరారు; రివీలైన ధర శ్రేణి, ప్రధాన స్పెసిఫికేషన్స్! https://www.91mobiles.com/telugu/itel-s23-plus-curved-amoled-display-phone-india-launch-confirmed/ Wed, 20 Sep 2023 05:25:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=8067 itel బ్రాండ్ తాజాగా itel S23+ స్మార్ట్‌ఫోన్ ని అధికారికంగా టీజ్ చేసింది. ఈ ఫోన్ త్వరలోనే భారత్ లో లాంచ్ కానుంది. తన టీజర్ తో ఇండియా లాంచ్ ని కన్ఫర్మ్ చేసింది. ఇప్పటికే ఈ డివైజ్ ఇథియోపియా లో లాంచ్ అయ్యింది. తర్వాత యురోపియన్ మార్కెట్స్ లో కూడా itel S23+ ప్రవేశించింది. itel S23 సిరీస్ లో వస్తోన్న itel S23+ డివైజ్ రెండోది. ఇప్పుడు itel S23+ యొక్క ధర శ్రేణి, […]

The post itel S23+ ఇండియా లాంచ్ ఖరారు; రివీలైన ధర శ్రేణి, ప్రధాన స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • itel S23+ ఇండియా లాంచ్‌ని కన్ఫర్మ్ చేసిన itel
  • ఫోన్ ధర రూ.15,000 లోపు ఉండే అవకాశం
  • కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్ తో వస్తోన్న డివైజ్

itel బ్రాండ్ తాజాగా itel S23+ స్మార్ట్‌ఫోన్ ని అధికారికంగా టీజ్ చేసింది. ఈ ఫోన్ త్వరలోనే భారత్ లో లాంచ్ కానుంది. తన టీజర్ తో ఇండియా లాంచ్ ని కన్ఫర్మ్ చేసింది. ఇప్పటికే ఈ డివైజ్ ఇథియోపియా లో లాంచ్ అయ్యింది. తర్వాత యురోపియన్ మార్కెట్స్ లో కూడా itel S23+ ప్రవేశించింది. itel S23 సిరీస్ లో వస్తోన్న itel S23+ డివైజ్ రెండోది. ఇప్పుడు itel S23+ యొక్క ధర శ్రేణి, ప్రధాన స్పెసిఫికేషన్స్ ని కంపెనీ రివీల్ చేసింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

itel S23+ ధర శ్రేణి

itel S23+ డివైజ్ itel S23 సిరీస్ లో వస్తోన్న కొత్త ఫోన్. ఈ ఫోన్ ధర రూ.15,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. రూ.15,000 లోపు ధరలో వస్తోన్న మొట్టమొదటి కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే ఫోన్ ఇదే కావడం విశేషం. తక్కువ ధరలో కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్ కలిగిన ఫోన్ కొనాలని భావించే వారికి itel S23+ ఉత్తమమైన ఎంపిక అయ్యే అవకాశం ఉంది.

itel S23+ స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: itel S23+ లో 6.78-ఇంచ్ 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్, 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, డీసీఐ-పీ3 కలర్ గేముత్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఉంటాయి.
  • చిప్సెట్: itel S23+ లో యూనిఎస్ఓసీ టీ616 చిప్సెట్ వాడనున్నారు. గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 ఎంపీ1 జీపీయూ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: itel S23+ లో 8జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 25జిబి యూఎఫ్ఎస్ 2.0 ఇంటర్నల్ స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ఉంటాయి.
  • సాఫ్ట్‌వేర్: itel S23+ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఐటెల్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • రియర్ కెమెరా: itel S23+ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, సెకండరీ ఏఐ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్, ఐ ట్రాకింగ్ ఫీచర్ ఉంటాయి.
  • ఫ్రంట్ కెమెరా: itel S23+ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి సెల్ఫీ కెమెరా అందిస్తున్నారు.
  • బ్యాటరీ: itel S23+ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: itel S23+ లో డైనమిక్ ఐల్యాండ్ వంటి డైనమిక్ బార్ ఫీచర్ ఉంటుంది. ఇంకా భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందిస్తున్నారు.
  • కలర్స్: itel S23+ డివైజ్ రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: లేక్ సైయన్, ఎలిమెంటల్ బ్లూ. త్వరలోనే ఈ డివైజ్ లాంచ్ తేదీని కూడా ఐటెల్ సంస్థ ప్రకటించే అవకాశం ఉంది.

The post itel S23+ ఇండియా లాంచ్ ఖరారు; రివీలైన ధర శ్రేణి, ప్రధాన స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
6.6-ఇంచ్ డిస్ప్లే, Unisoc T606 చిప్‌తో భారత్‌లో లాంచైన Itel S23 https://www.91mobiles.com/telugu/itel-s23-launched-india-price-specs-availability/ Mon, 12 Jun 2023 12:54:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=6728 వరుస టీజర్ల తర్వాత, ఐటెల్ సంస్థ తన కొత్త ఫోన్ Itel S23 ని భారత మార్కెట్ లో లాంచ్ చేసింది. భారత్ లో ఈ ఫోన్ ధర రూ.10,000 లోపే ఉంది. Itel S23 డివైజ్ లో 6.6-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్, డ్యూయల్-కెమెరా సెటప్, 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. […]

The post 6.6-ఇంచ్ డిస్ప్లే, Unisoc T606 చిప్‌తో భారత్‌లో లాంచైన Itel S23 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన Itel S23 బడ్జెట్ స్మార్ట్ ఫోన్
  • 8జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ తో వచ్చిన డివైజ్
  • భారత మార్కెట్ లో Itel S23 ధర రూ.8799

వరుస టీజర్ల తర్వాత, ఐటెల్ సంస్థ తన కొత్త ఫోన్ Itel S23 ని భారత మార్కెట్ లో లాంచ్ చేసింది. భారత్ లో ఈ ఫోన్ ధర రూ.10,000 లోపే ఉంది. Itel S23 డివైజ్ లో 6.6-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్, డ్యూయల్-కెమెరా సెటప్, 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. Itel S23 డివైజ్ ఇతర స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

భారత్ లో Itel S23 ధర, లభ్యత

Itel S23 స్మార్ట్ ఫోన్ స్టారీ బ్లాక్ మరియు మిస్టరీ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ డివైజ్ ధర భారత్ లో రూ.8,799 గా నిర్ణయించారు. ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ ద్వారా జూన్ 14 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ 4జిబి ర్యామ్ వేరియంట్ (4జిబి వర్చువల్ ర్యామ్) రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా లభించనుంది.

Itel S23 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Itel S23 స్మార్ట్ ఫోన్ లో 6.6-ఇంచ్ డిస్ప్లే, హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్-డ్రాప్ నాచ్ డిజైన్ ఉన్నాయి.
  • కెమెరా: Itel S23 హ్యాండ్సెట్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, ఒక ఏఐ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి సెల్ఫీ కెమెరా ఉంది.
  • చిప్సెట్: Itel S23 స్మార్ట్ ఫోన్ లో యూనిఎస్ఓసీ టీ606 ప్రాసెసర్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 ఎంపీ1 జీపీయూ వినియోగించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Itel S23 డివైజ్ లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే వీలుంది.
  • సేఫ్టీ: భద్రత కోసం ఈ ఫోన్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది.
  • బ్యాటరీ, ఓఎస్: Itel S23 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వాడారు. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Itel S23 డివైజ్ లో డ్యూయల్ సిమ్, 4జీ వొల్టీ, 3.5 ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

The post 6.6-ఇంచ్ డిస్ప్లే, Unisoc T606 చిప్‌తో భారత్‌లో లాంచైన Itel S23 first appeared on 91Mobiles Telugu.

]]>
రూ.8,799 ధరతో భారత్‌లో లాంచ్ కానున్న itel S23 https://www.91mobiles.com/telugu/itel-s23-launch-date-june-14-price-specs/ Fri, 09 Jun 2023 14:30:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=6705 ఐటెల్ సంస్థ త్వరలో భారత మార్కెట్ లో ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఈ కొత్త ఫోన్ itel S23 పేరుతో రానుంది. అమెజాన్ ఇండియా వెబ్ సైట్ లో కొన్ని రోజుల క్రితం ఈ ఫోన్ లిస్ట్ అయ్యింది. ఈ లిస్టింగ్ ద్వారా స్పెసిఫికేషన్స్, ప్రైస్ రేంజ్ వివరాలు తెలిసాయి. ఇప్పుడు ఇదే లిస్టింగ్ లో ఫోన్ స్పెసిఫికేషన్స్ వివరాలు బయటకు వచ్చాయి. ఇంకా ధర, లాంచ్ తేదీ కూడా రివీల్ […]

The post రూ.8,799 ధరతో భారత్‌లో లాంచ్ కానున్న itel S23 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జూన్ 14 న లాంచ్ కానున్న itel S23
  • లాంచ్ కి ముందు రివీల్ అయిన ధర, స్పెసిఫికేషన్స్
  • వన్-టైమ్ స్క్రీన్ రిప్లేస్మెంట్ తో వస్తోన్న డివైజ్

ఐటెల్ సంస్థ త్వరలో భారత మార్కెట్ లో ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఈ కొత్త ఫోన్ itel S23 పేరుతో రానుంది. అమెజాన్ ఇండియా వెబ్ సైట్ లో కొన్ని రోజుల క్రితం ఈ ఫోన్ లిస్ట్ అయ్యింది. ఈ లిస్టింగ్ ద్వారా స్పెసిఫికేషన్స్, ప్రైస్ రేంజ్ వివరాలు తెలిసాయి. ఇప్పుడు ఇదే లిస్టింగ్ లో ఫోన్ స్పెసిఫికేషన్స్ వివరాలు బయటకు వచ్చాయి. ఇంకా ధర, లాంచ్ తేదీ కూడా రివీల్ అయ్యాయి.

itel S23 లాంచ్ తేదీ

itel S23 స్మార్ట్ ఫోన్ భారత్ లో జూన్ 14 న లాంచ్ అవుతుందని అమెజాన్ లిస్టింగ్ ద్వారా తెలిసింది. ఈ ఫోన్ రూ.8,799 కి లభిస్తుంది. కంపెనీ ఈ ఫోన్ కి వన్-టైమ్ స్క్రీన్ రిప్లేస్మెంట్ ని ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ ఫోన్ కొన్న రోజు నుంచి 100 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది.

itel S23 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: itel S23 స్మార్ట్ ఫోన్ లో 6.6-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ ఉన్నాయి. లీకైన రిపోర్ట్స్ ని బట్టి, ఈ ఫోన్ హెచ్డీ+ డిస్ప్లేతో వస్తున్నట్లు అర్థమవుతోంది.
  • ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజీ: itel S23 లో ఏ ప్రాసెసర్ వాడారో ఇంకా తెలియదు. అయితే లిస్టింగ్ ప్రకారం, ఈ డివైజ్ 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీతో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • బ్యాటరీ: itel S23 స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. చార్జింగ్ స్పీడ్ గురించి తెలియదు. యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ని చార్జింగ్ కొరకు అందిస్తున్నారు.
  • కెమెరా: itel S23 లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందిస్తున్నారు. హెచ్డీఆర్, సూపర్ నైట్ మోడ్, 10ఎక్స్ డిజిటల్ జూమ్ వంటి కెమెరా ఫీచర్లు ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: itel S23 స్మార్ట్ ఫోన్ లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఈ ఫోన్ బ్లాక్, మిస్టరీ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post రూ.8,799 ధరతో భారత్‌లో లాంచ్ కానున్న itel S23 first appeared on 91Mobiles Telugu.

]]>