
చవకైన ఫోన్లను తయారు చేయడంలో టెక్ బ్రాండ్ itel ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటుంది. అందుకు తాజాగా itel S23+ డివైజ్ ఉదాహరణగా నిలుస్తోంది. itel S23+ డివైజ్ అత్యంత చవకైన కర్వ్డ్ స్క్రీన్ గల ఫోన్ గా వార్తల్లోకెక్కింది. నేడు ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అయ్యింది. itel S23+ డివైజ్ 32ఎంపి సెల్ఫీ కెమెరా, 3డీ కర్వ్డ్ స్క్రీన్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి. itel S23+ ఫోన్ ధరను రూ.13,999 గా నిర్ణయించారు. సరే, ఓసారి ఈ డివైజ్ పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.
itel S23+ స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: itel S23+ డివైజ్ లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్, 3డీ కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, గొరిల్లా గ్లాస్ 5 ఉన్నాయి.
- ప్రాసెసర్: itel S23+ లో యూనిఎస్ఓసీ టైగర్ టీ616 ఆక్టా-కోర్ ప్రాసెసర్ వాడారు. ఇది 2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంది.
- ఓఎస్: itel S23+ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
- మెమొరీ: itel S23+ లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. దీంతో యూజర్ కి 16జిబి వరకు ర్యామ్ పవర్ లభించనుంది.
- బ్యాటరీ: itel S23+ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కెమెరా: itel S23+ లో 50ఎంపి మెయిన్ కెమెరా, ఒక ఎల్ఈడీ ఫ్లాస్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.











