రూ.8,799 ధరతో భారత్‌లో లాంచ్ కానున్న itel S23

Highlights

  • జూన్ 14 న లాంచ్ కానున్న itel S23
  • లాంచ్ కి ముందు రివీల్ అయిన ధర, స్పెసిఫికేషన్స్
  • వన్-టైమ్ స్క్రీన్ రిప్లేస్మెంట్ తో వస్తోన్న డివైజ్

ఐటెల్ సంస్థ త్వరలో భారత మార్కెట్ లో ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఈ కొత్త ఫోన్ itel S23 పేరుతో రానుంది. అమెజాన్ ఇండియా వెబ్ సైట్ లో కొన్ని రోజుల క్రితం ఈ ఫోన్ లిస్ట్ అయ్యింది. ఈ లిస్టింగ్ ద్వారా స్పెసిఫికేషన్స్, ప్రైస్ రేంజ్ వివరాలు తెలిసాయి. ఇప్పుడు ఇదే లిస్టింగ్ లో ఫోన్ స్పెసిఫికేషన్స్ వివరాలు బయటకు వచ్చాయి. ఇంకా ధర, లాంచ్ తేదీ కూడా రివీల్ అయ్యాయి.

itel S23 లాంచ్ తేదీ

itel S23 స్మార్ట్ ఫోన్ భారత్ లో జూన్ 14 న లాంచ్ అవుతుందని అమెజాన్ లిస్టింగ్ ద్వారా తెలిసింది. ఈ ఫోన్ రూ.8,799 కి లభిస్తుంది. కంపెనీ ఈ ఫోన్ కి వన్-టైమ్ స్క్రీన్ రిప్లేస్మెంట్ ని ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ ఫోన్ కొన్న రోజు నుంచి 100 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది.

itel S23 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: itel S23 స్మార్ట్ ఫోన్ లో 6.6-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ ఉన్నాయి. లీకైన రిపోర్ట్స్ ని బట్టి, ఈ ఫోన్ హెచ్డీ+ డిస్ప్లేతో వస్తున్నట్లు అర్థమవుతోంది.
  • ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజీ: itel S23 లో ఏ ప్రాసెసర్ వాడారో ఇంకా తెలియదు. అయితే లిస్టింగ్ ప్రకారం, ఈ డివైజ్ 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీతో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • బ్యాటరీ: itel S23 స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. చార్జింగ్ స్పీడ్ గురించి తెలియదు. యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ని చార్జింగ్ కొరకు అందిస్తున్నారు.
  • కెమెరా: itel S23 లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందిస్తున్నారు. హెచ్డీఆర్, సూపర్ నైట్ మోడ్, 10ఎక్స్ డిజిటల్ జూమ్ వంటి కెమెరా ఫీచర్లు ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: itel S23 స్మార్ట్ ఫోన్ లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఈ ఫోన్ బ్లాక్, మిస్టరీ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.