Jio Phone 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 07 Aug 2023 05:56:51 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Reliance AGM 2023: ఆగస్టు 28న జియో ఫోన్ 5జీ లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/reliance-agm-2023-august-28th-jio-phone-5g-might-launch/ Mon, 07 Aug 2023 05:56:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=7487 రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క ఆన్యువల్ జనరల్ మీటింగ్ (ఏజీఎమ్) తేదీ ప్రకటన వచ్చింది. 46 వ యాన్యువల్ జనరల్ మీటింగ్ 2023 ఆగస్టు 28 న ప్రారంభం కానుంది. ఆ రోజున మధ్యాహ్నం 2 గంటలకు కంపెనీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాన్ని ప్రారంభించనుంది. అయితే ఈ మీటింగ్ లో చేయబోయే ప్రకటనల గురించి కంపెనీ ఇంకా సమాచారం ఇవ్వలేదు. కానీ, ఆ రోజున ముకేశ్ అంబాని తమ జియో 5జీ ప్లాన్, జియో ఫోన్ 5 […]

The post Reliance AGM 2023: ఆగస్టు 28న జియో ఫోన్ 5జీ లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఆగస్టు 28 న మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న AGM
  • జియో 5జీ ప్లాన్ ని ముకేశ్ అంబాని ప్రకటించే అవకాశం
  • లాంచ్ కానున్న JioPhone 5G, Jio Air Fiber ప్లాన్స్

రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క ఆన్యువల్ జనరల్ మీటింగ్ (ఏజీఎమ్) తేదీ ప్రకటన వచ్చింది. 46 వ యాన్యువల్ జనరల్ మీటింగ్ 2023 ఆగస్టు 28 న ప్రారంభం కానుంది. ఆ రోజున మధ్యాహ్నం 2 గంటలకు కంపెనీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాన్ని ప్రారంభించనుంది. అయితే ఈ మీటింగ్ లో చేయబోయే ప్రకటనల గురించి కంపెనీ ఇంకా సమాచారం ఇవ్వలేదు. కానీ, ఆ రోజున ముకేశ్ అంబాని తమ జియో 5జీ ప్లాన్, జియో ఫోన్ 5 ని లాంచ్ చేయనున్నారు.

రిలయన్స్ ఏజీఎమ్ 2023 నుంచి ఏమి ఆశించవచ్చు?

జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిస్టింగ్ డేట్ ని ప్రకటించడం తప్పితే, కంపెనీ ఎటువంటి అధికార సమాచారం ఇవ్వలేదు. కానీ, అయితే ఏజీఎమ్ ఈవెంట్ లో ముకేశ్ అంబాని జియో 5జీ ప్లాన్, జియో 5జీ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ప్రకటన చేస్తారని అంతా అంచనా వేస్తున్నారు.

Jio 5G Plan

జియో 5జీ సేవలు ఇప్పటికే దేశంలోని వేల కొలదీ పట్టణాలు, నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. కాకపోతే, 2024 కల్లా పూర్తిస్థాయిలో 5జీ నెట్వర్క్ ని లాంచ్ చేయనున్నారని సమాచారం. మరోవైపు జియో సంస్థ ఇంకా తన 5జీ రీచార్జ్ ప్లాన్స్ ని లాంచ్ చేయాల్సి ఉంది. యూజర్లు 4జీ ప్లాన్స్ పైనే 5జీ సేవలను కూడా పొందుతున్నారు. ఏజీఎమ్ లో జియో తన 5జీ సేవలను పరిచయం చేస్తుందని భావిస్తున్నారు. 4జీ ప్లాన్స్ తరహాలోనే 5జీ రీచార్జ్ ప్లాన్స్ ధరలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.

Jio Phone 5G

జియో, గూగుల్ భాగస్వామ్యంతో ఒక చవకైన 5జీ స్మార్ట్ ఫోన్ ని తీసుకురానుందని 2020 లో ముకేశ్ అంబాని ప్రకటించారు. అయితే అప్పటి నుంచి జియో 5జీ ఫోన్ గురించి పెద్దగా ఏ వార్త వినిపించలేదు. కానీ, ఆగస్టు 28 న ఫోన్ లాంచ్ కానుందని చెబుతున్నారు.

2022 డిసెంబర్ లో JioPhone 5G బెంచ్ మార్కింగ్ సైట్ గీక్ బెంచ్ పై స్నాప్ డ్రాగన్ 480+ చిప్సెట్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో కనిపించింది. ఆమధ్య ఫోన్ లైవ్ పిక్స్ కూడా లీక్ అయ్యాయి.

The post Reliance AGM 2023: ఆగస్టు 28న జియో ఫోన్ 5జీ లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు లీకైన Jio Phone 5G పూర్తి స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/jio-phone-5g-full-specs-leaked-before-launch/ Tue, 27 Jun 2023 05:09:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=6938 రిలయన్స్ జియో సంస్థ ఈ ఏడాది ఆఖర్లో Jio Phone 5G డివైజ్ ని లాంచ్ చేయనుంది. అయితే, ఇప్పటి వరకు కంపెనీ నుంచి లాంచ్ కి సంబంధించి అధికార సమాచారం రాలేదు. కానీ, గత వారం ఒక ట్విట్టర్ యూజర్ ఫోన్ ఇమేజెస్ ని షేర్ చేశారు. అలాగే, ఇప్పుడు టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేశారు. Jio Phone 5G స్మార్ట్ ఫోన్ యొక్క డిస్ప్లే, ప్రాసెసర్, బ్యాటరీ, ఆపరేటింగ్ సిస్టమ్, […]

The post లాంచ్‌కి ముందు లీకైన Jio Phone 5G పూర్తి స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Jio Phone 5G
  • 6.5-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తోన్న ఫోన్
  • రూ.10,000 లోపు ధరతో వస్తోన్న డివైజ్

రిలయన్స్ జియో సంస్థ ఈ ఏడాది ఆఖర్లో Jio Phone 5G డివైజ్ ని లాంచ్ చేయనుంది. అయితే, ఇప్పటి వరకు కంపెనీ నుంచి లాంచ్ కి సంబంధించి అధికార సమాచారం రాలేదు. కానీ, గత వారం ఒక ట్విట్టర్ యూజర్ ఫోన్ ఇమేజెస్ ని షేర్ చేశారు. అలాగే, ఇప్పుడు టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేశారు.

Jio Phone 5G స్మార్ట్ ఫోన్ యొక్క డిస్ప్లే, ప్రాసెసర్, బ్యాటరీ, ఆపరేటింగ్ సిస్టమ్, కెమెరా, బ్యాటరీ కెపాసిటీ వంటి వివరాలను టిప్‌స్టర్ షేర్ చేశారు. Jio Phone 5G స్మార్ట్ ఫోన్ లో 6.5-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. Jio Phone 5G డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 480 ప్లస్ ఎస్ఎమ్4350 ప్రొ చిప్సెట్ ని అందించనున్నారు. Jio Phone 5G డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ సెన్సర్ ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. పూర్తి స్పెసిఫికేషన్స్ ఇక్కడ చూడండి.

Jio Phone 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: Jio Phone 5G స్మార్ట్ ఫోన్ లో 6.5-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది.
  • ప్రాసెసర్: Jio Phone 5G డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 480 ప్లస్ ఎస్ఎమ్4350 ప్రొ చిప్సెట్ ని అందించనున్నారు.
  • ఓఎస్: Jio Phone 5G స్మార్ట్ ఫోన్ లో ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ని అందించారు.
  • కెమెరా: Jio Phone 5G డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ సెన్సర్ ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Jio Phone 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Jio Phone 5G డివైజ్ లో యూఎస్బీ టైప్-సీ పోర్ట్, వై-ఫై 5, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

Jio Phone 5G ధర (లీక్)

Jio Phone 5G స్మార్ట్ ఫోన్ భారత్ లో రూ.10,000 లోపు ధరతో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. లీక్ ప్రకారం, Jio Phone 5G ఈ ఏడాది భారతీయ మార్కెట్ లో దీపావళి పండుగ సందర్భంగా లాంచ్ అవుతుందని తెలుస్తోంది. అంటే నవంబర్-డిసెంబర్ మధ్యలో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

Jio Phone 5G లాంచ్ టైమ్‌లైన్ (అంచనా)

ఈ ఏడాది జరగబోయే రిలయన్స్ సంస్థ యాన్యువల్ జనరల్ మీటింగ్ లో Jio Phone 5G ని లాంచ్ చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే రిలయన్స్ జియో నుంచి ఫోన్ లాంచ్ కి సంబంధించిన అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

The post లాంచ్‌కి ముందు లీకైన Jio Phone 5G పూర్తి స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Jio Phone 5G ధర, స్పెసిఫికేషన్స్, లాంచ్ వివరాలు; లీకైన అన్ని వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/jio-phone-5g-price-specifications-launch-details/ Wed, 29 Mar 2023 17:07:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=5653 సరిగ్గా ఏడాది క్రితం మొబైల్ యూజర్లు 5జీ నెట్వర్క్ గురించి ఇప్పటిలా ఆలోచించలేదు. ఇప్పటికి ఎన్నో నగరాల్లో 5జీ విస్తరణ పూర్తయ్యింది. ఇదంతా ఏవ్వరూ కూడా ఆనాడు ఊహించి ఉండరు. కానీ నేడు ఇదంతా సాధ్యమైంది. భారత్ లో 5జీ నెట్వర్క్ కి సపోర్ట్ చేసే 5జీ హ్యాండ్సెట్స్ 4జీ ఫోన్ల కంటే భారీ స్థాయిలో అమ్ముడవుతున్నాయి. ఇక ఇప్పుడు చవకైన 5జీ ఫోన్ లాంచ్ పై కంపెనీల ఫోకస్ పడింది. ఈ రేసులోకి టెలీకామ్ దిగ్గజం […]

The post Jio Phone 5G ధర, స్పెసిఫికేషన్స్, లాంచ్ వివరాలు; లీకైన అన్ని వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచ్ కానున్న అత్యంత చవకైన 5జీ ఫోన్ గా నిలవనున్న Jio Phone 5G
  • భారతీయుల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ప్రగతి ఓఎస్ పై నడవనున్న Jio Phone 5G
  • Jio Phone 5G స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ.8,000 గా ఉండే అవకాశం

సరిగ్గా ఏడాది క్రితం మొబైల్ యూజర్లు 5జీ నెట్వర్క్ గురించి ఇప్పటిలా ఆలోచించలేదు. ఇప్పటికి ఎన్నో నగరాల్లో 5జీ విస్తరణ పూర్తయ్యింది. ఇదంతా ఏవ్వరూ కూడా ఆనాడు ఊహించి ఉండరు. కానీ నేడు ఇదంతా సాధ్యమైంది. భారత్ లో 5జీ నెట్వర్క్ కి సపోర్ట్ చేసే 5జీ హ్యాండ్సెట్స్ 4జీ ఫోన్ల కంటే భారీ స్థాయిలో అమ్ముడవుతున్నాయి. ఇక ఇప్పుడు చవకైన 5జీ ఫోన్ లాంచ్ పై కంపెనీల ఫోకస్ పడింది. ఈ రేసులోకి టెలీకామ్ దిగ్గజం జియో అడుగుపెట్టింది. తన Jio Phone 5G ని త్వరలో ఈ సంస్థ లాంచ్ చేయబోతోంది.

భారత్ లో చవకైన ఫోన్ గా నిలవనున్న Jio Phone 5G

రిలయన్స్ జియో తీసుకొస్తోన్న Jio Phone 5G ఫోన్ చవకైన 5జీ ఫోన్ గా నిలవనుంది. కౌంటర్‌పాయింట్స్ కథనం ద్వారా Jio Phone 5G యొక్క ధర బయటకు వచ్చింది. దాని ప్రకారం, Jio Phone 5G ధర భారత్ లో రూ.8,000 ఉంటుందని తెలుస్తోంది.

Jio Phone 5G ధర

Jio Phone 5G భారతీయ మార్కెట్ లో ఒక మెమొరీ వేరియంట్ కంటే ఎక్కువ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.8,000 గా ఉంటుందని అంచనా. హైఎండ్ వేరియంట్ ధర గరిష్టంగా రూ.12,000 వద్ద ఉండనుందని సమాచారం. అయితే ఈ ఫోన్ కి సంబంధించి కచ్చితమైన సమాచారం బయటకు రాలేదు. అయితే 4జిబి ర్యామ్, 6జిబి ర్యామ్ వేరియంట్స్ లో ఫోన్ లభిస్తుందని మాత్రం అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం భారత్ లో ఉన్న చవకైన 5జీ ఫోన్ గా Lava Blaze 5G అగ్రస్థానంలో ఉంది. దీని మార్కెట్ ధర రూ.10,999 గా ఉంది.

Jio Phone 5G స్పెసిఫికేషన్స్

  • 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే
  • 13ఎంపి + 2ఎంపి రియర్ కెమెరా
  • 8ఎంపి సెల్ఫీ కెమెరా
  • 4జిబి ర్యామ్
  • 32జిబి స్టోరేజీ
  • ప్రగతి ఓఎస్
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 480 చిప్
  • 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ

ఇప్పటి వరకు బయటకు వచ్చిన లీక్స్ మరియు రిపోర్ట్స్ ప్రకారం, Jio Phone 5G డివైజ్ 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 1600*720 పిక్సెల్ రెజుల్యూషన్ తో వస్తోంది. ఈ ఫోన్ స్క్రీన్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్ తో తయారైనట్లు సమాచారం. ఈ స్క్రీన్ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. వాటర్ డ్రాప్ నాచ్ లో ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది.

Jio Phone 5G డివైజ్ ప్రగతి ఓఎస్ పై పని చేస్తుంది. ఈ ఓఎస్ ని గూగుల్ ప్రత్యేకంగా భారతీయ మొబైల్ యూజర్ల కోసం తయారు చేసింది. Jio Phone 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 480 చిప్సెట్ వాడారు. Jio Phone 5G డివైజ్ 4జిబి ర్యామ్ + 32జిబి స్టోరేజీతో రానుంది. మరొక హైఎండ్ వేరియంట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ లో మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే వీలుంది.

Jio Phone 5G కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అయితే ఫోన్ కి సంబంధించిన స్పెషిఫికేషన్స్ ని కంపెనీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Source – 91mobiles Hindi

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Jio Phone 5G ధర, స్పెసిఫికేషన్స్, లాంచ్ వివరాలు; లీకైన అన్ని వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
స్నాప్‌డ్రాగన్ 480+ చిప్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో రానున్న Jio Phone 5G https://www.91mobiles.com/telugu/jio-phone-5g-snapdragon-480-plus-chip-android-12-os-geekbench/ Thu, 08 Dec 2022 08:39:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=3880 హైలైట్స్ Geekbench పై LS1654QB5 మోడల్ నంబర్ తో కనిపించిన Jio Phone 5G సింగిల్ కోర్ టెస్ట్ లో 549 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 1661 పాయింట్లు సాధించిన Jio Phone 5G స్నాప్ డ్రాగన్ 480+ చిప్సెట్, 4జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ రానున్న Jio Phone 5G భారతదేశంలో ఉన్న అతిపెద్ద టెలీకామ్ ఆపరేటర్లలో జియో కూడా ఒకటి. ప్రస్తుతం ఈ సంస్థ నెం.1 టెలీకామ్ సంస్థగా కొనసాగుతోంది. యూజర్లకు […]

The post స్నాప్‌డ్రాగన్ 480+ చిప్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో రానున్న Jio Phone 5G first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • Geekbench పై LS1654QB5 మోడల్ నంబర్ తో కనిపించిన Jio Phone 5G
  • సింగిల్ కోర్ టెస్ట్ లో 549 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 1661 పాయింట్లు సాధించిన Jio Phone 5G
  • స్నాప్ డ్రాగన్ 480+ చిప్సెట్, 4జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ రానున్న Jio Phone 5G

భారతదేశంలో ఉన్న అతిపెద్ద టెలీకామ్ ఆపరేటర్లలో జియో కూడా ఒకటి. ప్రస్తుతం ఈ సంస్థ నెం.1 టెలీకామ్ సంస్థగా కొనసాగుతోంది. యూజర్లకు వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ ని అందించడమే గాక, వాల్యూ ఫర్ మనీ ఫోన్లను కూడా తీసుకొస్తుంటుంది జియో. ఇప్పటికే జియో ఫోన్, జియో ఫోన్ 4జీ డివైజెస్ ని లాంచ్ చేసిన ఈ కంపెనీ నెక్ట్స్ జియో ఫోన్ 5జీ ని లాంచ్ చేసేందుకు సన్నద్ధమవుతోంది.

Jio Phone 5G తక్కువ బడ్జెట్ లో వస్తోన్న 5జీ ఫోన్. ఈ ఫోన్ తో 5జీ సేవలను అందరికీ చేరువ చేయాలనేది జియో లక్ష్యం. తద్వారా అందరూ 5జీ సిమ్ ని ప్రత్యేకించి జియో 5జీ సిమ్ ని వాడే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఇటు డివైజ్ అమ్మడంతో పాటు, తన 5జీ టెలీకామ్ సేవలను కూడా వినియోగదారునికి అందిస్తూ జియో తన వ్యాపారాన్ని మరింత పెంచుకోనుంది.

 

భారత్ లో ఈ బడ్జెట్ 5జీ ఫోన్ ని అందించేందుకై జియో, గూగుల్ తో జట్టుకట్టింది. ఇప్పుడు Jio Phone 5G ఫోన్ బెంచ్‌మార్కింగ్ సైట్ Geekbench పై కనిపించింది. Jio LS1654QB5 అనే మోడల్ నంబర్ ని ఈ ఫోన్ కలిగి ఉంది. తొలుత ఈ విషయాన్ని MySmartPrice గుర్తించింది.

Jio Phone 5G యొక్క గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా కొన్ని ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. మొదటి విషయం ఏంటంటే, ఈ డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 549 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 1661 పాయింట్లు సాధించింది.

Jio Phone 5G గీక్ బెంచ్ జాబితా ద్వారా ఈ ఫోన్ 4జిబి ర్యామ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో రానున్నట్లు స్పష్టమైంది. మదర్ బోర్డ్ విభాగంలో Holi అనే కోడ్ నేమ్ మెన్షన్ చేసి ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 480+ చిప్సెట్ కి సంబంధించినది. రూ.12,000 ధరలో లభించే 5జీ ఫోన్లలో ఈ చిప్సెట్ వాడతారు. ఈ చిప్సెట్ కి తోడు గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 619 జీపీయూ వాడారు. ఇప్పటి వరకు గీక్ బెంచ్ ద్వారా రివీల్ అయిన విషయాలు ఇవే.

Jio Phone 5G స్పెసిఫికేషన్స్ ఫర్మ్‌వేర్ గా రివీల్ అయ్యాయి. దాని ప్రకారం, Jio Phone 5G లో 6.5-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ఇంకా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్ లో ఉంటాయి. Jio Phone 5G స్మార్ట్ ఫోన్ Syntiant NDP115 ఆల్వేస్-ఆన్ ఏఐ ప్రాసెసర్ తో వస్తోంది. 4జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీని ఈ ఫోన్ లో అందించనున్నారు.

ఇప్పుడు Jio Phone 5G యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ కెమెరాలు ఉంటాయి. ఇందులో 13 ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. వై-ఫై, బ్లూటూత్ 5.1 వంటి బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉంటాయి. Jio Phone 5G ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ప్రగతిఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఇందులో GMS సేవలు, Jio suite ఉంటాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post స్నాప్‌డ్రాగన్ 480+ చిప్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో రానున్న Jio Phone 5G first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Jio Phone 5G స్పెసిఫికేషన్స్: Snapdragon 480 చిప్, 90Hz రిఫ్రెష్ రేట్ https://www.91mobiles.com/telugu/jio-phone-5g-specs-leaked-before-launch/ Thu, 29 Sep 2022 05:35:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=2641 హైలైట్స్: త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Jio Phone 5G 6.5-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్, 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 480 ప్రాసెసర్ తో వస్తున్న Jio Phone 5G రూ.12,000 లోపు ఉండనున్న Jio Phone 5G ధర ఒక ఏడాది నుంచి Jio Phone 5G వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. తాజాగా Jio Phone 5G స్పెసిఫికేషన్స్ […]

The post లీకైన Jio Phone 5G స్పెసిఫికేషన్స్: Snapdragon 480 చిప్, 90Hz రిఫ్రెష్ రేట్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Jio Phone 5G
  • 6.5-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్, 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 480 ప్రాసెసర్ తో వస్తున్న Jio Phone 5G
  • రూ.12,000 లోపు ఉండనున్న Jio Phone 5G ధర

ఒక ఏడాది నుంచి Jio Phone 5G వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. తాజాగా Jio Phone 5G స్పెసిఫికేషన్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. Kuba Wojciechowski 91మొబైల్స్ కి ఫోన్ యొక్క ఇమేజెస్ పంపించాడు. Jio Phone 5G అతి త్వరలో భారత్ లో లాంచ్ కానుంది. మరోవైపు అక్టోబర్ లో దేశంలో 5జీ సేవలను ప్రారంభించేందుకు టెలీకామ్ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. మరో విషయం ఏంటంటే, ఇటీవలె ఓ రిపోర్ట్ ద్వారా Jio Phone 5G ధర రూ.8,000 నుంచి రూ.10,000 మధ్య ఉంటుందని తెలిసింది.

తాజాగా Jio Phone 5G స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. లీకైన సమాచారాన్ని బట్టి, ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 480 చిప్, 13ఎంపి మెయిన్ కెమెరాతో వస్తున్నట్లు తెలుస్తోంది. కోడ్ నేమ్ గంగా తో Jio Phone True 5G కనిపిస్తోంది. అలాగే LS1654QB5 అనే మోడల్ నంబర్ ని ఈ ఫోన్ కలిగి ఉంది. LYF భాగస్వామ్యంతో ఈ ఫోన్ ని JIO లాంచ్ చేయనుందని స్పష్టమవుతోంది.

 

Jio Phone 5G స్పెసిఫికేషన్స్

Jio Phone 5G లో 6.5-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 480 చిప్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉండనున్నాయి. అలాగే Synitant NDP115 ఆల్వేస్-ఆన్ ఏఐ ప్రాసెసర్ ఈ ఫోన్ లో ఉంటుంది. Jio Phone 5G 4జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 32జిబి స్టోరేజీ తో వస్తోంది.

Jio Phone 5G యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Jio Phone 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 8ఎంపి కెమెరాను అందించారు. వై-ఫై, బ్లూటూత్ 5.1 వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది. ఇందులో గూగుల్ మొబైల్ సర్వీసెస్, జియో యాప్స్ ప్రీలోడ్ అయి వస్తాయి.

Jio Phone 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు పర్వాలేదనిపించేలా ఉన్నాయి. ధర రూ.10,000 లోపు పెడితే ఫోన్ బాగా క్లిక్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే, పది వేల పైన అయితే వేరే కంపెనీలకు చెందిన ఫోన్లు బెటర్ ఆప్షన్స్ గా కనిపిస్తాయి. అందువల్లన జనాలు వాటిని కొనేందుకు మొగ్గు చూపుతారు. మరి జియో సంస్థ తన 5జీ ఫోన్ ధరను ఏ ధరలో అందిస్తుందో చూడాలి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post లీకైన Jio Phone 5G స్పెసిఫికేషన్స్: Snapdragon 480 చిప్, 90Hz రిఫ్రెష్ రేట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Jio Phone 5G: లాంచ్ తేదీ, ధర, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/jio-phone-5g-launch-timeline-price-specs/ Mon, 29 Aug 2022 15:14:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=1990 హైలైట్స్: ఎంపిక చేయబడిన మెట్రో నగరాల్లో ఈ దీపావళికి 5జీ సేవలను లాంచ్ చేయనున్న ప్రముఖ టెలీకామ్ సంస్థ జియో గూగుల్ తో కలిసి 5జీ ఫోన్ పై పని చేస్తున్నట్లు వెల్లడించిన జియో భారత్ లో జియో ఫోన్ 5జీ ధర రూ.10,000 లోపు ఉండే అవకాశం జియో ఫోన్ 5జీ లాంచ్: రిలయన్స్ జియో ఎట్టకేలకు జియో 5జీ సేవలను నేడు యాన్యువల్ జనరల్ మీటింగ్ 2022 ఈవెంట్ లో ప్రకటించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ […]

The post Jio Phone 5G: లాంచ్ తేదీ, ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఎంపిక చేయబడిన మెట్రో నగరాల్లో ఈ దీపావళికి 5జీ సేవలను లాంచ్ చేయనున్న ప్రముఖ టెలీకామ్ సంస్థ జియో
  • గూగుల్ తో కలిసి 5జీ ఫోన్ పై పని చేస్తున్నట్లు వెల్లడించిన జియో
  • భారత్ లో జియో ఫోన్ 5జీ ధర రూ.10,000 లోపు ఉండే అవకాశం

జియో ఫోన్ 5జీ లాంచ్: రిలయన్స్ జియో ఎట్టకేలకు జియో 5జీ సేవలను నేడు యాన్యువల్ జనరల్ మీటింగ్ 2022 ఈవెంట్ లో ప్రకటించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబాని సమావేశంలో మాట్లాడుతూ, జియో 5జీ సేవలు దీపావళి కల్లా ఎంపిక చేయబడిన నగరాల్లో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అలాగే, గూగుల్ తో కలిసి 5జీ ఫోన్ కోసం పని చేస్తున్నట్లు ముకేశ్ అంబాని తెలిపారు. ఈ ఫోన్ ని జియో ఫోన్ 5జీ అని పిలిచే అవకాశముంది. అయితే అధికారిక పేరు ఇంకా తెలియదు.

త్వరలోనే 5జీ ఫోన్ ని లాంచ్ చేస్తామని, అందు కొరకు గూగుల్ తో కలిసి పని చేస్తున్నట్లు యాన్యువల్ జనరల్ మీటింగ్ లో అంబాని తెలిపారు. వచ్చే ఏడాది ఏజీఎం ఈవెంట్ కల్లా జియో ఫోన్ 5జీ సిద్దం కానుందని అంబాని హింట్ ఇచ్చారు. జియో మరియు గూగుల్ కలిసి ఇదివరకు జియో ఫోన్ నెక్ట్స్ ని అభివృద్ది చేయగా, ఇప్పుడు రెండో ఫోన్ కోసం కలిసి పని చేస్తున్నాయి.

తాము గూగుల్ తో కలిసి తేనున్న 5జీ ఫోన్ కి సంబంధించిన ఇతర వివరాలను జియో వెల్లడించలేదు. కానీ, రూమర్లను బట్టి పలు వివరాలు బయటకు వచ్చాయి. ఏజీఎం ఈవెంట్ కి ముందు, పలు నివేదికల ద్వారా ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర ఇతర వివరాలు బయటకు వచ్చాయి. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.

Jio Phone 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

జియో ఫోన్ 5జీ లో 6.5-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్ ఉండనుంది. ఇది హెచ్డీ+ రెజుల్యూషన్ కలిగి ఉండనుంది. అలాగే ఈ ఫోన్ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాన్ 480 5జీ ప్రాసెసర్ ను ఇందులో ఉపయోగించనున్నారు. 4జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీని ఈ ఫోన్ కలిగి ఉండనుంది.

జియో ఫోన్ 5జీ ప్రగతి ఓఎస్ పై పని చేయనుంది. ఇందులో జియో యాప్స్, గూగుల్ ప్లే సర్వీసెస్ ఉండనున్నాయి. ఆల్వేస్ ఆన్ గూగుల్ అసిస్టెంట్, రీడ్-లౌడ్ టెక్స్ట్, గూగుల్ లెన్స్ ద్వారా ఇన్‌స్టంట్ ట్రాన్స్‌లేషన్, గూగుల్ ట్రాన్స్‌లేట్, తదితర ఫీచర్లు జియో ఫోన్ 5జీ లో ఉంటాయి.

జియో ఫోన్ 5జీ 5000ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉండనుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్లో యూఎస్బీ టైప్-సీ చార్జింగ్ పోర్ట్ ఉంటుంది. జియో ఫోన్ 5జీ లో డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉండనుంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. భద్రత కొరకు ఫోన్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ను అందిస్తున్నారు.

భారత్ లో Jio Phone 5G ధర (అంచనా)

ధర విషయానికి వస్తే, దేశంలోనే తక్కువ రేటు కలిగిన 5జీ ఫోన్ గా జియో ఫోన్ 5జీ నిలవనుంది. ఏజీఎం సందర్భంగా మాట్లాడిన అంబాని, జియో 5జీ ఫోన్ ని చాలా తక్కువ ధరకు తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఈ ఫోన్ ధర రూ.10,000 లోపు ఉంటుందని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఇక గతేడాది జియోఫోన్ నెక్ట్స్ రూ.6,499 ధరతో విడుదలైంది.

The post Jio Phone 5G: లాంచ్ తేదీ, ధర, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>