హైలైట్స్:
- త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Jio Phone 5G
- 6.5-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్, 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 480 ప్రాసెసర్ తో వస్తున్న Jio Phone 5G
- రూ.12,000 లోపు ఉండనున్న Jio Phone 5G ధర

ఒక ఏడాది నుంచి Jio Phone 5G వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. తాజాగా Jio Phone 5G స్పెసిఫికేషన్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. Kuba Wojciechowski 91మొబైల్స్ కి ఫోన్ యొక్క ఇమేజెస్ పంపించాడు. Jio Phone 5G అతి త్వరలో భారత్ లో లాంచ్ కానుంది. మరోవైపు అక్టోబర్ లో దేశంలో 5జీ సేవలను ప్రారంభించేందుకు టెలీకామ్ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. మరో విషయం ఏంటంటే, ఇటీవలె ఓ రిపోర్ట్ ద్వారా Jio Phone 5G ధర రూ.8,000 నుంచి రూ.10,000 మధ్య ఉంటుందని తెలిసింది.
తాజాగా Jio Phone 5G స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. లీకైన సమాచారాన్ని బట్టి, ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 480 చిప్, 13ఎంపి మెయిన్ కెమెరాతో వస్తున్నట్లు తెలుస్తోంది. కోడ్ నేమ్ గంగా తో Jio Phone True 5G కనిపిస్తోంది. అలాగే LS1654QB5 అనే మోడల్ నంబర్ ని ఈ ఫోన్ కలిగి ఉంది. LYF భాగస్వామ్యంతో ఈ ఫోన్ ని JIO లాంచ్ చేయనుందని స్పష్టమవుతోంది.
Jio Phone 5G స్పెసిఫికేషన్స్
Jio Phone 5G లో 6.5-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 480 చిప్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉండనున్నాయి. అలాగే Synitant NDP115 ఆల్వేస్-ఆన్ ఏఐ ప్రాసెసర్ ఈ ఫోన్ లో ఉంటుంది. Jio Phone 5G 4జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 32జిబి స్టోరేజీ తో వస్తోంది.
Jio Phone 5G యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Jio Phone 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 8ఎంపి కెమెరాను అందించారు. వై-ఫై, బ్లూటూత్ 5.1 వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది. ఇందులో గూగుల్ మొబైల్ సర్వీసెస్, జియో యాప్స్ ప్రీలోడ్ అయి వస్తాయి.
Jio Phone 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు పర్వాలేదనిపించేలా ఉన్నాయి. ధర రూ.10,000 లోపు పెడితే ఫోన్ బాగా క్లిక్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే, పది వేల పైన అయితే వేరే కంపెనీలకు చెందిన ఫోన్లు బెటర్ ఆప్షన్స్ గా కనిపిస్తాయి. అందువల్లన జనాలు వాటిని కొనేందుకు మొగ్గు చూపుతారు. మరి జియో సంస్థ తన 5జీ ఫోన్ ధరను ఏ ధరలో అందిస్తుందో చూడాలి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.











