స్నాప్‌డ్రాగన్ 480+ చిప్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో రానున్న Jio Phone 5G

హైలైట్స్

  • Geekbench పై LS1654QB5 మోడల్ నంబర్ తో కనిపించిన Jio Phone 5G
  • సింగిల్ కోర్ టెస్ట్ లో 549 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 1661 పాయింట్లు సాధించిన Jio Phone 5G
  • స్నాప్ డ్రాగన్ 480+ చిప్సెట్, 4జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ రానున్న Jio Phone 5G

భారతదేశంలో ఉన్న అతిపెద్ద టెలీకామ్ ఆపరేటర్లలో జియో కూడా ఒకటి. ప్రస్తుతం ఈ సంస్థ నెం.1 టెలీకామ్ సంస్థగా కొనసాగుతోంది. యూజర్లకు వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ ని అందించడమే గాక, వాల్యూ ఫర్ మనీ ఫోన్లను కూడా తీసుకొస్తుంటుంది జియో. ఇప్పటికే జియో ఫోన్, జియో ఫోన్ 4జీ డివైజెస్ ని లాంచ్ చేసిన ఈ కంపెనీ నెక్ట్స్ జియో ఫోన్ 5జీ ని లాంచ్ చేసేందుకు సన్నద్ధమవుతోంది.

Jio Phone 5G తక్కువ బడ్జెట్ లో వస్తోన్న 5జీ ఫోన్. ఈ ఫోన్ తో 5జీ సేవలను అందరికీ చేరువ చేయాలనేది జియో లక్ష్యం. తద్వారా అందరూ 5జీ సిమ్ ని ప్రత్యేకించి జియో 5జీ సిమ్ ని వాడే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఇటు డివైజ్ అమ్మడంతో పాటు, తన 5జీ టెలీకామ్ సేవలను కూడా వినియోగదారునికి అందిస్తూ జియో తన వ్యాపారాన్ని మరింత పెంచుకోనుంది.

 

భారత్ లో ఈ బడ్జెట్ 5జీ ఫోన్ ని అందించేందుకై జియో, గూగుల్ తో జట్టుకట్టింది. ఇప్పుడు Jio Phone 5G ఫోన్ బెంచ్‌మార్కింగ్ సైట్ Geekbench పై కనిపించింది. Jio LS1654QB5 అనే మోడల్ నంబర్ ని ఈ ఫోన్ కలిగి ఉంది. తొలుత ఈ విషయాన్ని MySmartPrice గుర్తించింది.

Jio Phone 5G యొక్క గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా కొన్ని ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. మొదటి విషయం ఏంటంటే, ఈ డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 549 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 1661 పాయింట్లు సాధించింది.

Jio Phone 5G గీక్ బెంచ్ జాబితా ద్వారా ఈ ఫోన్ 4జిబి ర్యామ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో రానున్నట్లు స్పష్టమైంది. మదర్ బోర్డ్ విభాగంలో Holi అనే కోడ్ నేమ్ మెన్షన్ చేసి ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 480+ చిప్సెట్ కి సంబంధించినది. రూ.12,000 ధరలో లభించే 5జీ ఫోన్లలో ఈ చిప్సెట్ వాడతారు. ఈ చిప్సెట్ కి తోడు గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 619 జీపీయూ వాడారు. ఇప్పటి వరకు గీక్ బెంచ్ ద్వారా రివీల్ అయిన విషయాలు ఇవే.

Jio Phone 5G స్పెసిఫికేషన్స్ ఫర్మ్‌వేర్ గా రివీల్ అయ్యాయి. దాని ప్రకారం, Jio Phone 5G లో 6.5-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ఇంకా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్ లో ఉంటాయి. Jio Phone 5G స్మార్ట్ ఫోన్ Syntiant NDP115 ఆల్వేస్-ఆన్ ఏఐ ప్రాసెసర్ తో వస్తోంది. 4జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీని ఈ ఫోన్ లో అందించనున్నారు.

ఇప్పుడు Jio Phone 5G యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ కెమెరాలు ఉంటాయి. ఇందులో 13 ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. వై-ఫై, బ్లూటూత్ 5.1 వంటి బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉంటాయి. Jio Phone 5G ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ప్రగతిఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఇందులో GMS సేవలు, Jio suite ఉంటాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous article20GB ర్యామ్, 108MP కెమెరా, 33W చార్జింగ్ తో లాంచైన Realme 10 Pro
Next articleDimensity 1080 చిప్, 108MP కెమెరా, 67W చార్జింగ్ తో లాంచైన Realme 10 Pro+
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.