Komaki - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 05 Sep 2022 14:27:30 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 కోలికోడ్ లోని ఎలక్ట్రిక్ స్కూటర్ డీలర్షిప్ లో 12 స్కూటర్లకు నిప్పు https://www.91mobiles.com/telugu/e-scooter-fire-kozhikode-showroom/ Mon, 05 Sep 2022 14:26:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=2109 హైలైట్స్: కోలికోడ్ లోని కొమాకి డీలర్షిప్ లో ఈ-స్కూటర్లకు నిప్పు, 9 స్కూటర్లు దగ్దం బ్యాటరీ సమస్య ఉన్న స్కూటర్ మూలంగా రాజుకున్న మంటలు అగ్ని ప్రమాదంలో రూ.17 లక్షల ఆస్తి నష్టం జరిగిందని అంచనా కేరళ రాష్ట్రంలోని కోలికోడ్ లో ఉన్న కొమాకి ఎలక్ట్రిక్ స్కూటర్స్ షోరూమ్ లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు నిప్పంటుకుంది. ఈ ఘటనలో 9 స్కూటర్లు దగ్ధమయ్యాయి. బ్యాటరీ సమస్యలతో షోరూమ్ కి వచ్చిన స్కూటర్ ని టెక్నీషియన్లు రిపేరు చేస్తుండగా ఒక్కసారిగా […]

The post కోలికోడ్ లోని ఎలక్ట్రిక్ స్కూటర్ డీలర్షిప్ లో 12 స్కూటర్లకు నిప్పు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • కోలికోడ్ లోని కొమాకి డీలర్షిప్ లో ఈ-స్కూటర్లకు నిప్పు, 9 స్కూటర్లు దగ్దం
  • బ్యాటరీ సమస్య ఉన్న స్కూటర్ మూలంగా రాజుకున్న మంటలు
  • అగ్ని ప్రమాదంలో రూ.17 లక్షల ఆస్తి నష్టం జరిగిందని అంచనా

కేరళ రాష్ట్రంలోని కోలికోడ్ లో ఉన్న కొమాకి ఎలక్ట్రిక్ స్కూటర్స్ షోరూమ్ లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు నిప్పంటుకుంది. ఈ ఘటనలో 9 స్కూటర్లు దగ్ధమయ్యాయి. బ్యాటరీ సమస్యలతో షోరూమ్ కి వచ్చిన స్కూటర్ ని టెక్నీషియన్లు రిపేరు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన బీచ్ ఫైర్ ఫోర్స్ రెండు రెస్క్యూ బృందాలను సంఘటన స్థలానికి పంపించింది. రెస్క్యూ బృందాలు అర్థగంటలో మంటలను అదుపు చేశారు. రూ.17 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా నిర్దారించారు. అయితే ఉద్యోగులు, కస్టమర్లు ఎవరైనా గాయపడ్డారా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలు ఇటీవలి కాలంలో అగ్ని రాజుకుంటోన్న సంగతి తెలిసిందే. మనం ఎన్నో సంఘటనలను చూస్తూ వస్తున్నాం. ఇప్పటికే డజనుల కొలది నిప్పుల్లో చిక్కుకున్నాయి. ఇందులో దాదాపు అన్నీ కూడా బ్యాటరీ సంబంధిత సమస్యలతోనే నిప్పంటుకున్నాయి. దురదృష్టవశాత్తు, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అగ్నిప్రమాదాల వల్లన పలువురు దుర్మరణం పాలయ్యారు.

కోలికోడ్ లోని Komaki డీలర్షిప్ లో అగ్ని ప్రమాదం

కోలికోడ్ లోని కొమాకి ఎలక్ట్రిక్ స్కూటర్ డీలర్షిప్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో స్కూటర్లకు నిప్పంటుకుంది. 9 స్కూటర్లు పూర్తిగా దగ్దమైనట్లు సమాచారం. బ్యాటరీ సమస్యతో షోరూమ్ కి వచ్చిన స్కూటర్ ని రిపేర్ చేస్తుండగా నిప్పు రాజేసుకుందని తెలుస్తోంది. దీంతో ఇతర స్కూటర్లకు నిప్పంటుకుంది. టెక్నీషియన్లు రిపేర్ చేస్తుండగానే నిప్పులు చెలరేగాయి. దీంతో పక్కనే పార్క్ చేసి ఉన్న బండ్లకు మంటలు అంటుకున్నాయి.

నిమిషాల వ్యవధిలో డీలర్షిప్ మొత్తం పొగ కమ్ముకుంది. యూనిట్ లోని ప్రధాన భాగాలన్నింటికీ మంటలు వ్యాపించాయి. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే బీచ్ ఫైర్ ఫోర్స్ కి సమాచారం అందించారు. దీంతో రెండు యూనిట్ల అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి అరగంటలో మంటలను ఆర్పేశాయి.

ఈ అగ్ని ప్రమాదంలో ఉద్యోగులు, వినియోగదారులు ఎవరైనా గాయపడ్డారా లేదా అనే విషయం ఇంకా తెలియదు. అయితే, రూ.17 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.

ఈ ఏడాది ఈ-స్కూటర్ ఫైర్ యాక్సిడెంట్స్ తరచూ చోటు చేసుకుంటున్నాయి. ప్రత్యేకించి భారత్ లో వేసవి కాలంలో ఉండే అత్యధిక ఉష్ణోగ్రతలు ఈ ఉదంతాలకు కారణంగా నిలుస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ ఉదంతాలపై పూర్తి విచారణ చేపట్టింది. అలాగే ఈ-స్కూటర్స్ బ్యాటరీ అగ్ని ప్రమాదాలను అరికట్టాలని, ఉత్పత్తిదారులైన ఒకినావ ఆటోటెక్, ఓలా ఎలక్ట్రిక్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన నిబంధనలను ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. దీంతో ఈ బ్యాటరీ పేలుళ్ళు తగ్గేందుకు అవకాశముందని అందరూ భావిస్తున్నారు.

లేటెస్ట్ ఆటోమొబైల్, స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ వార్తల కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post కోలికోడ్ లోని ఎలక్ట్రిక్ స్కూటర్ డీలర్షిప్ లో 12 స్కూటర్లకు నిప్పు first appeared on 91Mobiles Telugu.

]]>
మెరుగైన ఫైర్-రెసిస్టంట్ ఈవీ బ్యాటరీని అభివృద్ధి చేసిన Komaki https://www.91mobiles.com/telugu/komaki-developed-fire-resistant-ev-battery/ Thu, 04 Aug 2022 14:33:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=1498 హైలైట్స్: సంప్రదాయ బ్యాటరీల కంటే మెరుగైన ఫైర్-రెసిస్టంట్ బ్యాటరీని అభివృద్ది చేసిన కొమాకి LiFePO4 కెమికల్ కంపోజిషన్, తక్కువ సెల్స్, కంపానియన్ యాప్ కలిగిఉండనున్న కొత్త బ్యాటరీ రైడింగ్ రేంజ్ ని పెంచనున్న కొత్త బ్యాటరీ, త్వరలోనే అందుబాటోకి రానున్న బ్యాటరీ  ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న బ్యాటరీలతో పోలిస్తే, మరింత మెరుగైన ఫైర్ రెసిస్టంట్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన బ్యాటరీని తాము తయారు చేశామని కొమాకి అనే కంపెనీ ప్రకటించింది. బ్యాటరీకి కొత్త కెమికల్ కంపోజిషన్ […]

The post మెరుగైన ఫైర్-రెసిస్టంట్ ఈవీ బ్యాటరీని అభివృద్ధి చేసిన Komaki first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • సంప్రదాయ బ్యాటరీల కంటే మెరుగైన ఫైర్-రెసిస్టంట్ బ్యాటరీని అభివృద్ది చేసిన కొమాకి
  • LiFePO4 కెమికల్ కంపోజిషన్, తక్కువ సెల్స్, కంపానియన్ యాప్ కలిగిఉండనున్న కొత్త బ్యాటరీ
  • రైడింగ్ రేంజ్ ని పెంచనున్న కొత్త బ్యాటరీ, త్వరలోనే అందుబాటోకి రానున్న బ్యాటరీ

 ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న బ్యాటరీలతో పోలిస్తే, మరింత మెరుగైన ఫైర్ రెసిస్టంట్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన బ్యాటరీని తాము తయారు చేశామని కొమాకి అనే కంపెనీ ప్రకటించింది. బ్యాటరీకి కొత్త కెమికల్ కంపోజిషన్ వాడటంతో పాటు, ఓ స్మార్ట్ ఫోన్ అప్లికేషన్, సెన్సర్స్ ను వాడాలని కొమాకి ప్లాన్ చేస్తోంది. ఈ అప్లికేషన్ ద్వారా బ్యాటరీ హెల్త్ ని మానిటర్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ విధంగా రెండు విధాలుగా ప్రమాదాన్ని నివారించడం ద్వారా, భద్రతతో కూడిన ఈవీ ఎక్స్‌పీరియన్స్ ని అందించాలని కొమాకి సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్ళు పెరిగాయి. అయితే, క్వాలిటీ, రిలైబులిటీ విషయంలో ఎంతో పరిణితి రావాల్సి ఉంది. ఆర్ అండ్ డీ మరియు యూసేజ్ గ్రోత్ లో వ్యత్యాసం వెరసి ఎన్నో ఈ-స్కూటర్లు దగ్ధమవ్వాడానికి కారణమవుతున్నాయి. కొమాకి ఈవీస్ తో పాటు మల్టీ బ్రాండ్స్ ని అమ్మే పుణె లోని ఒక డీలర్షిప్ లో వెహికిల్స్ తగులబడ్డాయి. దీంతో ప్రభుత్వం కూడా మొత్తం మూడు ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులకు నోటీసులు పంపించింది. అలాగే ఇటువంటి ఘటనల నేపథ్యంలో ఈవీ మేకర్స్ కి కొత్త మార్గదర్శకాలను నిర్దేశించింది.

ఫైర్-సేఫ్ ఈవీ బ్యాటరీలు (Fire-safe EV batteries)

కొమాకి బ్యాటరీలు లిథియమ్-అయాన్ ఫెర్రో పాస్పేట్ (LiFePO4) అనే కొత్త సమ్మేళనంతో తయారవుతున్నాయి. మిగతా వాటికంటే ఇవి థిరియాటికల్ గా అధిక ఫైర్-రిసిస్టన్స్ ని కలిగి ఉండనున్నాయి. అయితే కొమాకి చెబుతున్న దాన్ని, అథారిటీస్ వెరిఫై చేయాల్సి ఉంది.

బ్యాటరీల్లో వాడే ఒక వంతు సెల్స్ యొక్క వినియోగాన్ని కొమాకి తగ్గించనుంది.
బ్యాటరీల్లో ఉద్భవించే వేడిమిని ఇది కంట్రోల్ చేయగలదు. అత్యధికంగా 2500-3000 లైఫ్ సైకిల్ వరకు బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచవచ్చని కంపెనీ చెబుతోంది. సాధారణ ఎన్ఎంసీ (నికెల్, మాంగనీస్, కోబాల్ట్) బ్యాటరీల యొక్క 800 లైఫ్ సైకిల్ తో పోల్చితే ఇది ఎంతో అధికం.

కంపోనెంట్స్ ని తగ్గించడం ద్వారా సర్వీస్ ప్రొవైడర్లకు వెహికిల్స్ తో భద్రంగా పని చేసేట్లు చేయాలనేది కొమాకి లక్ష్యమని తెలుస్తోంది. ఇక బైక్ వెళ్తున్నప్పుడు బ్యాటరీ డ్యామేజ్ కాకుండా చాలా వరకు నివారించబడుతుంది.

స్మార్ట్ ఫోన్ లో ఒక యాప్ ని డౌన్ లోడ్ చేసుకుని బ్యాటరీ హెల్త్ ని ఎప్పటికప్పుడు మానిటర్ చేయవచ్చు. సెన్సర్స్ ద్వారా ఈ సమాచారం యూజర్ కి వెళ్తుంది. దీని ద్వారా ఇటు యూజర్, అటు డీలర్షిప్ కి వెహికిల్ యొక్క అనుమానస్పద శైలి గురించి తెలుస్తుంది. ఒక్క ఉదుటున, 250 బ్యాటరీలను పరీక్షించగల సామర్థ్యం ఈ అప్లికేషన్ కి ఉంది. అలాగే సెకనుల వ్యవధిలో మళ్ళీ మళ్ళీ ఈ ప్రక్రియను చేయగలదు. ఇవన్నీ కలగలిసి బ్యాటరీ పేలుడు, మంటల్లో చిక్కుకోవడం వంటి దుర్ఘటనలు జరగకుండా దాదాపుగా తగ్గించవచ్చు.

300 కిలోమీటర్ల రేంజ్ వరకు కొమాకి బ్యాటరీ ప్యాక్ నిర్విరామంగా నడవగలదని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. ఈ దూరం కొమాకి వెనిస్ మోడల్ కి వర్తిస్తుంది. వేరే మోడల్ కి ఈ రేంజ్ మారే అవకాశముంది. ఇక కొమాకి ఎస్ఈ, టీఎన్95 మోడల్స్ సింగిల్ చార్జ్ పై 180 కిలోమీటర్ల దూరం వెళ్ళగలవని కంపెనీ క్లెయిమ్ చేసింది.

The post మెరుగైన ఫైర్-రెసిస్టంట్ ఈవీ బ్యాటరీని అభివృద్ధి చేసిన Komaki first appeared on 91Mobiles Telugu.

]]>