హైలైట్స్:
- కోలికోడ్ లోని కొమాకి డీలర్షిప్ లో ఈ-స్కూటర్లకు నిప్పు, 9 స్కూటర్లు దగ్దం
- బ్యాటరీ సమస్య ఉన్న స్కూటర్ మూలంగా రాజుకున్న మంటలు
- అగ్ని ప్రమాదంలో రూ.17 లక్షల ఆస్తి నష్టం జరిగిందని అంచనా
కేరళ రాష్ట్రంలోని కోలికోడ్ లో ఉన్న కొమాకి ఎలక్ట్రిక్ స్కూటర్స్ షోరూమ్ లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు నిప్పంటుకుంది. ఈ ఘటనలో 9 స్కూటర్లు దగ్ధమయ్యాయి. బ్యాటరీ సమస్యలతో షోరూమ్ కి వచ్చిన స్కూటర్ ని టెక్నీషియన్లు రిపేరు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన బీచ్ ఫైర్ ఫోర్స్ రెండు రెస్క్యూ బృందాలను సంఘటన స్థలానికి పంపించింది. రెస్క్యూ బృందాలు అర్థగంటలో మంటలను అదుపు చేశారు. రూ.17 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా నిర్దారించారు. అయితే ఉద్యోగులు, కస్టమర్లు ఎవరైనా గాయపడ్డారా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.
బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలు ఇటీవలి కాలంలో అగ్ని రాజుకుంటోన్న సంగతి తెలిసిందే. మనం ఎన్నో సంఘటనలను చూస్తూ వస్తున్నాం. ఇప్పటికే డజనుల కొలది నిప్పుల్లో చిక్కుకున్నాయి. ఇందులో దాదాపు అన్నీ కూడా బ్యాటరీ సంబంధిత సమస్యలతోనే నిప్పంటుకున్నాయి. దురదృష్టవశాత్తు, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అగ్నిప్రమాదాల వల్లన పలువురు దుర్మరణం పాలయ్యారు.
కోలికోడ్ లోని Komaki డీలర్షిప్ లో అగ్ని ప్రమాదం
కోలికోడ్ లోని కొమాకి ఎలక్ట్రిక్ స్కూటర్ డీలర్షిప్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో స్కూటర్లకు నిప్పంటుకుంది. 9 స్కూటర్లు పూర్తిగా దగ్దమైనట్లు సమాచారం. బ్యాటరీ సమస్యతో షోరూమ్ కి వచ్చిన స్కూటర్ ని రిపేర్ చేస్తుండగా నిప్పు రాజేసుకుందని తెలుస్తోంది. దీంతో ఇతర స్కూటర్లకు నిప్పంటుకుంది. టెక్నీషియన్లు రిపేర్ చేస్తుండగానే నిప్పులు చెలరేగాయి. దీంతో పక్కనే పార్క్ చేసి ఉన్న బండ్లకు మంటలు అంటుకున్నాయి.
నిమిషాల వ్యవధిలో డీలర్షిప్ మొత్తం పొగ కమ్ముకుంది. యూనిట్ లోని ప్రధాన భాగాలన్నింటికీ మంటలు వ్యాపించాయి. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే బీచ్ ఫైర్ ఫోర్స్ కి సమాచారం అందించారు. దీంతో రెండు యూనిట్ల అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి అరగంటలో మంటలను ఆర్పేశాయి.
ఈ అగ్ని ప్రమాదంలో ఉద్యోగులు, వినియోగదారులు ఎవరైనా గాయపడ్డారా లేదా అనే విషయం ఇంకా తెలియదు. అయితే, రూ.17 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.
ఈ ఏడాది ఈ-స్కూటర్ ఫైర్ యాక్సిడెంట్స్ తరచూ చోటు చేసుకుంటున్నాయి. ప్రత్యేకించి భారత్ లో వేసవి కాలంలో ఉండే అత్యధిక ఉష్ణోగ్రతలు ఈ ఉదంతాలకు కారణంగా నిలుస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ ఉదంతాలపై పూర్తి విచారణ చేపట్టింది. అలాగే ఈ-స్కూటర్స్ బ్యాటరీ అగ్ని ప్రమాదాలను అరికట్టాలని, ఉత్పత్తిదారులైన ఒకినావ ఆటోటెక్, ఓలా ఎలక్ట్రిక్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన నిబంధనలను ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. దీంతో ఈ బ్యాటరీ పేలుళ్ళు తగ్గేందుకు అవకాశముందని అందరూ భావిస్తున్నారు.
లేటెస్ట్ ఆటోమొబైల్, స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ వార్తల కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.












