Mahindra XUV400 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 01 Sep 2022 10:36:07 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 లాంచ్ కి ముందు Mahindra XUV400 ఫస్ట్ లుక్ ని షేర్ చేసిన ఆనంద్ మహింద్రా https://www.91mobiles.com/telugu/xuv-400-electric-suv-first-look-teased/ Thu, 01 Sep 2022 10:36:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=2037 హైలైట్స్: 2022, సెప్టెంబర్ 8 న లాంచ్ అవుతోన్న Mahindra XUV400 ఐసీఈ వర్షన్ XUV300 తో పోల్చితే పొడవుగా ఉండనున్న ఎలక్ట్రిక్ వర్షన్ XUV400 ఒకటి కంటే ఎక్కువ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో వస్తున్న XUV400 మహింద్రా అధినేత ఆనంద్ మహింద్రా తమ కంపెనీ నుంచి త్వరలో లాంచ్ కానున్న XUV400 కారు యొక్క ఫస్ట్ లుక్ ని వినాయక చవితి పండుగ రోజున టీజ్ చేశారు. XUV400 ఒక ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ. […]

The post లాంచ్ కి ముందు Mahindra XUV400 ఫస్ట్ లుక్ ని షేర్ చేసిన ఆనంద్ మహింద్రా first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • 2022, సెప్టెంబర్ 8 న లాంచ్ అవుతోన్న Mahindra XUV400
  • ఐసీఈ వర్షన్ XUV300 తో పోల్చితే పొడవుగా ఉండనున్న ఎలక్ట్రిక్ వర్షన్ XUV400
  • ఒకటి కంటే ఎక్కువ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో వస్తున్న XUV400

మహింద్రా అధినేత ఆనంద్ మహింద్రా తమ కంపెనీ నుంచి త్వరలో లాంచ్ కానున్న XUV400 కారు యొక్క ఫస్ట్ లుక్ ని వినాయక చవితి పండుగ రోజున టీజ్ చేశారు. XUV400 ఒక ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ. ప్యాసెంజర్ ఈవీ సెగ్మెంట్ లో మహింద్రా నుంచి వస్తున్న మొదటి ఎలక్ట్రిక్ వాహనం XUV400. టాటా నెక్సాన్ ఈవీ ప్రైమ్, టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ లతో ఈ కారు పోటీ పడనుంది. కొన్ని వారాల క్రితం XUV400 టెస్ట్ రైడ్ కై బయటకు వచ్చి, పబ్లిక్ రోడ్లపై కనిపించింది. దీంతో XUV400 హాట్ టాపిక్ గా మారింది. ఇక దేశంలో ఈవీ మార్కెట్ లో ఆధిపత్యం చెలాయించాలనే లక్ష్యంతో మహింద్రా కంపెనీ అడుగులు వేస్తోంది. XUV400 కాకుండా మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేసేందుకు మహింద్రా కంపెనీ ప్రణాళికలు వేస్తోంది. మరి XUV400 విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

మహింద్రా XUV400 ఎక్స్-షోరూమ్ ధర రూ.15 లక్షల నుంచి రూ.18 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ బండి 450 కిలోమీటర్ల రేంజ్ ని కలిగి ఉంది. సెప్టెంబర్ 8 న ఈ వాహనం లాంచ్ అవుతుంది.

సెప్టెంబర్ 8 న XUV400 ని లాంచ్ చేయనున్న మహింద్రా

మహింద్రా అండ్ మహింద్రా కంపెనీ చైర్మన్ అయిన ఆనంద్ మహింద్రా గణేశ్ చతుర్థి రోజున ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ XUV400 యొక్క ఫస్ట్ లుక్ ని టీజ్ చేశారు. ట్విట్టర్ ద్వారా ఆయన ఈ పోస్ట్ చేశారు. ఈ టీజర్ ద్వారా డిజైన్ హైలైట్స్, చార్జింగ్ పోర్ట్, ఎల్ఈడీ డీఆర్ఎల్, సరికొత్త బట్టర్ ఫ్లై స్టైల్ మహింద్రా లోగో, ఎక్స్-ప్యాటెర్న్ ఫ్రంట్ గ్రిల్ వంటివి కనిపిస్తున్నాయి.

XUV300 తో పోలిస్తే XUV400 విభిన్నంగా కనిపిస్తోంది. XUV400 4 మీటర్ల కంటే పొడవుగా ఉంది. XUV400 రీడిజైన్డ్ రియర్ ప్రొఫైల్ కలిగి, సీ-పిల్లర్ పై షీట్ మెటల్ తో ఉంది. XUV400 ఎక్స్-ప్యాటెర్న్ తో, కొత్త రకం గ్రిల్ ఎంబెలిష్మెంట్స్ తో కనిపిస్తోంది.

టీజర్ వీడియో ద్వారా XUV400 విడుదల తేదీ, 2022 సెప్టెంబర్ 8 అని తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీ ట్రెండ్స్ ని బట్టి, మహింద్రా ట్రాక్ రికార్డ్ ని కూడా గమనిస్తే, XUV400 యొక్క లాంచ్, ధరలు తర్వాత మరొక తేదీన తెలియనున్నాయి. మహింద్రా XUV400 ఎక్స్-షోరూమ్ ధర రూ.15 లక్షల నుంచి రూ.18 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ బండి 450 కిలోమీటర్ల రేంజ్ ని కలిగి ఉంది. సెప్టెంబర్ 8 న ఈ వాహనం లాంచ్ అవుతుంది.

లేటెస్ట్ ఆటోమొబైల్, స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post లాంచ్ కి ముందు Mahindra XUV400 ఫస్ట్ లుక్ ని షేర్ చేసిన ఆనంద్ మహింద్రా first appeared on 91Mobiles Telugu.

]]>
సెప్టెంబర్ 6 న లాంచ్ కానున్న Mahindra XUV400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ https://www.91mobiles.com/telugu/mahindra-xuv-400-ev-launch-september-features/ Thu, 18 Aug 2022 08:27:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=1752 హైలైట్స్: సెప్టెంబర్ 6 న భారత్ లో లాంచ్ కానున్న మహింద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 150హెచ్పీ మోటర్, 2 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్, అడ్రెనోఎక్స్ ఈ కారు ప్రధాన ఫీచర్లు టాటా నెక్సాన్ ఈవీ ట్విన్స్ తో పోటీ పడనున్న 4 మీటర్ల కంటే పొడవుగా ఉన్న ఎక్స్‌యూవీ400 మహింద్రా యొక్క ఎలక్ట్రిక్ మొబిలిటీ డివిజన్ కొన్నాళ్ళుగా మహింద్రా ఎక్స్‌యూవీ400 కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పై పని చేస్తోంది. ఇప్పుడు ఈ వాహనాన్ని వచ్చే నెలలో […]

The post సెప్టెంబర్ 6 న లాంచ్ కానున్న Mahindra XUV400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • సెప్టెంబర్ 6 న భారత్ లో లాంచ్ కానున్న మహింద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ
  • 150హెచ్పీ మోటర్, 2 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్, అడ్రెనోఎక్స్ ఈ కారు ప్రధాన ఫీచర్లు
  • టాటా నెక్సాన్ ఈవీ ట్విన్స్ తో పోటీ పడనున్న 4 మీటర్ల కంటే పొడవుగా ఉన్న ఎక్స్‌యూవీ400

మహింద్రా యొక్క ఎలక్ట్రిక్ మొబిలిటీ డివిజన్ కొన్నాళ్ళుగా మహింద్రా ఎక్స్‌యూవీ400 కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పై పని చేస్తోంది. ఇప్పుడు ఈ వాహనాన్ని వచ్చే నెలలో లాంచ్ చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 2022 సెప్టెంబర్ 6 న ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ని మహింద్రా లాంచ్ చేయనున్నట్లు సమాచారం.

మహింద్ర కంపెనీ భారత ఈవీ ఎస్‌యూవీ సెగ్మెంట్ లో బలంగా పాతుకుపోతోంది. ఈ క్రమంలో ఆగస్టు 15 న ఐదు కొత్త ఎలక్ట్రిక్ మోడల్స్ ని అన్‌వీల్ చేసింది. ఇవన్నీ మహింద్రా తన ఐఎన్‌జీఎల్‌వో ఎలక్ట్రిక్ స్కేట్‌బోర్డ్ ప్లాట్ఫామ్ పై తయారయ్యాయి. ఎక్స్‌యూవీ700 తరహా వాహనాలతో పాటు, మరిన్ని కొత్త వాహనాలు మహింద్రా యొక్క బార్న్ ఎలక్ట్రిక్ ద్వారా లాంచ్ తయారవ్వనున్నాయి.

Mahindra XUV400 అంచనా ధర, ఫీచర్లు

ఇటీవలె మహింద్రా ఎక్స్‌యూవీ400 టెస్టింగ్ లో భాగంగా పబ్లిక్ రోడ్లపై కనిపించింది. మొత్తానికి ఈ బండిని అధికారికంగా వచ్చే నెలలో మహింద్రా లాంచ్ చేయబోతోంది. మీడియా రిపోర్ట్స్ ని బట్టి, మహింద్రా ఎక్స్‌యూవీ సెప్టెంబర్ 6 న భారత్ లో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. లాంచ్ తర్వాత, ఈ కారు, టాటా నెక్సాన్ ఈవీ ప్రైమ్, టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ లతో పోటీపడనుంది. ఇక స్టాండర్డ్ ఐసీఈ వర్షన్ తో పోల్చినప్పుడు ఎక్స్‌యూవీ400 ఈవీ ధర కొన్ని లక్షలు ఎక్కువగా ఉండనుంది. మహింద్రా ఎక్స్‌యూవీ400 ఎక్స్-షోరూమ్ ధర రూ.15 లక్షల నుంచి రూ.18 లక్షల మధ్య ఉంటుందని అంచనా.

ఆటో ఎక్స్‌పో 2020 లో ప్రదర్శింపబడిన ఈఎక్స్‌యూవీ300 కాంపాక్ట్ ఈవీ ఎస్‌యూవీ వంటి పోలికలను ఎక్స్‌యూవీ400 ఈవీ కలిగి ఉంది. అయితే, లీక్స్, స్పై షాట్స్ ని బట్టి, ఎక్స్‌యూవీ400 4 మీటర్ల కంటే పొడవు ఉన్నట్లు తెలుస్తోంది. అదే కనుక నిజమైతే, ఎక్స్‌యూవీ400, నెక్సాన్ ఈవీ ప్రైమ్, నెక్సాన్ ఈవీ మ్యాక్స్ లపై పైచేయి సాధించడం ఖాయం. తన సహచర పోటీదారుల కంటే, ఎక్స్‌యూవీ400 లో సీటింగ్ స్పేస్, బూట్ స్పేస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక నెక్సాన్ సబ్-4ఎం కాంపాక్ట్ ఎస్‌యూవీ అని గమనించాలి.

ఎక్స్‌యూవీ400 ఈవీ-సెంట్రిక్ డిజైన్ డీటెయిల్స్, బ్లాంక్డ్-అవుట్ ఫ్రంట్ గ్రిల్, ఎయిర్ డ్యామ్ కలిగి ఉంది. ఈ ఎయిర్ డ్యామ్ బ్రేక్, బ్యాటరీ లను చల్లబరిచేందుకు పని చేస్తుంది. ఐసీఈ వర్షన్ కు భిన్నంగా ఉండే విధంగా ఎక్స్‌యూవీ400 డిజైన్ తీర్చబడింది. సరికొత్త హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, రీడిజైన్డ్ ఇంటర్నల్స్ తో వస్తోంది ఎక్స్‌యూవీ400.

ఈ మహింద్రా ఎలక్ట్రిక్ వెహికిల్ 150 బీహెచ్పీ ని కలిగి ఉంది. ఇందులో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎక్స్‌యూవీ400 లో ఫ్రంట్-వీల్ డ్రైవ్ పవర్‌ట్రెయిన్ లేఔట్ తో రానుందని అంచనా. ఇప్పుడు అడిషనల్ ఎక్విప్మెంట్ ఏమున్నాయో చూద్దాం. అడ్రెనోఎక్స్ ప్లాట్ఫామ్ పై కొత్త ఇన్ఫోటెయిన్మెంట్ ఉంటుందని అంచనా. టాప్ ఎండ్ మోడల్ లో ఏడీఏఎస్ ఫీచర్లు ఉంటాయని భావిస్తున్నారు.

The post సెప్టెంబర్ 6 న లాంచ్ కానున్న Mahindra XUV400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు రోడ్లపై కనిపించిన Mahindra XUV400 EV https://www.91mobiles.com/telugu/mahindra-xuv-400-ev-spotted-on-the-roads-testing-before-launch/ Wed, 03 Aug 2022 13:47:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=1459 హైలైట్స్: లాంచ్ కి ముందు రోడ్లపై కనిపించిన మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రెండు బ్యాటరీ ఆప్షన్స్ తో 150 హెచ్‌పీ ఎలక్ట్రిక్ మోటర్ తో వస్తున్న ఎక్స్‌యూవీ400 2023 మొదట్లో మార్కెట్ లోకి రానున్న మహీంద్రా ఎక్స్‌యూవీ400 లాంచ్ కి ముందు రోడ్లపైకి టెస్ట్ రైడ్ కోసం వచ్చిన మహీంద్రా ఎక్స్‌యూవీ400 అందరి దృష్టిని ఆకర్షించింది. 2020 లో జరిగిన ఆటో ఎక్స్‌పో లో కనిపించిన మహీంద్రా ఎక్స్‌యూవీ400, 2023 మొదట్లో సేల్ కి వస్తోంది. […]

The post లాంచ్ కి ముందు రోడ్లపై కనిపించిన Mahindra XUV400 EV first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • లాంచ్ కి ముందు రోడ్లపై కనిపించిన మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ
  • రెండు బ్యాటరీ ఆప్షన్స్ తో 150 హెచ్‌పీ ఎలక్ట్రిక్ మోటర్ తో వస్తున్న ఎక్స్‌యూవీ400
  • 2023 మొదట్లో మార్కెట్ లోకి రానున్న మహీంద్రా ఎక్స్‌యూవీ400

లాంచ్ కి ముందు రోడ్లపైకి టెస్ట్ రైడ్ కోసం వచ్చిన మహీంద్రా ఎక్స్‌యూవీ400 అందరి దృష్టిని ఆకర్షించింది. 2020 లో జరిగిన ఆటో ఎక్స్‌పో లో కనిపించిన మహీంద్రా ఎక్స్‌యూవీ400, 2023 మొదట్లో సేల్ కి వస్తోంది. మహీంద్రా ఎక్స్‌యూవీ300 బేస్ చేసుకునే లేటెస్ట్ మహీంద్రా ఎక్స్‌యూవీ400 వస్తోంది. అయితే, పొడవు తో పాటు పలు కాస్మటిక్ చేంజెస్ ఎక్స్‌యూవీ400 ఉండనున్నట్లు సమాచారం.

మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఒక ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ. భారత్ లో టాటా నెక్సాన్ ఈవీ ప్రైమ్, టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ లతో మహీంద్రా ఎక్స్‌యూవీ400 పోటీపడనుంది.

రోడ్లపై కనిపించిన Mahindra XUV400

మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ కోసం ఆటో లవర్స్ ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో పబ్లిక్ రోడ్లపైకి టెస్టింగ్ కి వచ్చి జనాల దృష్టిని ఆకర్షించింది మహీంద్రా ఎక్స్‌యూవీ400. చివరి దశ అభివృద్ధి పనుల్లో మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఉన్నట్లు స్పష్టమవుతోంది. 2023 మొదట్లో ఈ కారు మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశముంది. మొదటగా ఈ కారు ఆటో ఎక్స్‌పో 2020 లో తళుక్కున మెరిసింది.

మహీంద్రా ఎక్స్‌యూవీ400 ని చూస్తే, సాంగ్‌యాంగ్ టివోలి మాదిరే కనిపిస్తుంది. ఎక్స్‌యూవీ300 కూడా టివోలీ ని బేస్ చేసుకుని రూపొందించినదే. ఎక్స్‌యూవీ300 కంటే ఎక్స్‌యూవీ400 పొడవుగా ఉండనుంది. 4.2 మీటర్ల పొడవుతో మహీంద్రా ఎక్స్‌యూవీ400 రానుందని సమాచారం. 4 మీటర్ బండ్లకు ప్రభుత్వం ట్యాక్స్ బెనిఫిట్ అందిస్తుండటంతో, ఎక్స్‌యూవీ300 లెంగ్త్ ని 4 మీటర్ల లోపు ఉండేట్లు తయారు చేశారు.

ఎక్స్‌యూవీ400 కారు, టివోలీ మరియు ఎక్స్‌యూవీ300 లతో పోల్చినప్పుడు వేరుగా ఉంటుంది. ప్రత్యేకించి కాస్మెటిక్స్ విషయంలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ట్రాంగ్యులర్ ఫాగ్ ల్యాంప్, కంటూర్డ్ ఫ్రంట్ బంపర్, బ్లాంక్డ్-ఔట్ గ్రిల్ ఉంటాయి. హెడ్ ల్యాంప్ క్లస్టర్ ను కూడా మార్చినట్లు తెలుస్తోంది. సెంట్రల్ ఎయిర్ ఇన్‌టేక్ జత చేయబడింది. బ్రేక్స్ వంటి కొన్ని పరికరాలను చల్లబరచడానికి ఈ విధంగా చేసినట్లు తెలుస్తోంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ400 వెనకాల టెయిల్ గేట్ పై ర్యాప్ అరౌండ్ టెయిల్ ల్యాంప్స్, ఎల్ఈడీ ఎలిమెంట్స్ తో కనిపిస్తున్నాయి. సైడ్ ప్రొఫైల్ అల్లాయ్ వీల్స్ చే ఎన్హాన్స్ చేయబడినవి. ఎక్స్‌యూవీ400 17-ఇంచ్ అల్లాయ్ వీల్స్ ని కలిగి ఉండనుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ400 సింగిల్ ఎలక్ట్రిక్ మోటర్, ఫ్రంట్ వీల్ డ్రైవింగ్, 150 బీహెచ్‌పీ పీక్ పవర్ తో వస్తోంది. బ్యాటరీ కెపాసిటీ విషయానికి వస్తే, రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మహీంద్రా ఎక్స్‌యూవీ400 లో అప్‌గ్రేడెడ్ ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్ ని అందిస్తున్నారు. ఏడీఏఎస్ ఫంక్షనాలిటీస్ కోసం లేటెస్ట్ అడ్రెనాక్స్ ప్లాట్ఫామ్ ని పొందుపరిచారు.

మహీంద్రా నుంచి రానున్న రీషఫల్డ్ ఈవీ పోర్ట్ ఫోలియోకి మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎంట్రీ పాయింట్ అని చెప్పవచ్చు. అయితే, బార్న్ ఎలక్ట్రిక్ అనే ఇనీషియేటివ్ క్రింద ప్లాన్ చేసిన ఎలక్ట్రిక్ వెహికిల్స్ వరుస లో ఎక్స్‌యూవీ400 భిన్నంగా ఉండే అవకాశముంది. ఎందుకంటే అవి గ్లోబల్ ప్రోడక్ట్స్ కాబట్టి, ప్రీమియమ్ సెగ్మెంట్ క్రిందకు వస్తాయని అంచనా.

లేటెస్ట్ ఆటోమొబైల్స్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్‌సైట్ ని ఫాలో అవ్వండి.

The post లాంచ్ కి ముందు రోడ్లపై కనిపించిన Mahindra XUV400 EV first appeared on 91Mobiles Telugu.

]]>