లాంచ్ కి ముందు Mahindra XUV400 ఫస్ట్ లుక్ ని షేర్ చేసిన ఆనంద్ మహింద్రా

హైలైట్స్:

  • 2022, సెప్టెంబర్ 8 న లాంచ్ అవుతోన్న Mahindra XUV400
  • ఐసీఈ వర్షన్ XUV300 తో పోల్చితే పొడవుగా ఉండనున్న ఎలక్ట్రిక్ వర్షన్ XUV400
  • ఒకటి కంటే ఎక్కువ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో వస్తున్న XUV400

మహింద్రా అధినేత ఆనంద్ మహింద్రా తమ కంపెనీ నుంచి త్వరలో లాంచ్ కానున్న XUV400 కారు యొక్క ఫస్ట్ లుక్ ని వినాయక చవితి పండుగ రోజున టీజ్ చేశారు. XUV400 ఒక ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ. ప్యాసెంజర్ ఈవీ సెగ్మెంట్ లో మహింద్రా నుంచి వస్తున్న మొదటి ఎలక్ట్రిక్ వాహనం XUV400. టాటా నెక్సాన్ ఈవీ ప్రైమ్, టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ లతో ఈ కారు పోటీ పడనుంది. కొన్ని వారాల క్రితం XUV400 టెస్ట్ రైడ్ కై బయటకు వచ్చి, పబ్లిక్ రోడ్లపై కనిపించింది. దీంతో XUV400 హాట్ టాపిక్ గా మారింది. ఇక దేశంలో ఈవీ మార్కెట్ లో ఆధిపత్యం చెలాయించాలనే లక్ష్యంతో మహింద్రా కంపెనీ అడుగులు వేస్తోంది. XUV400 కాకుండా మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేసేందుకు మహింద్రా కంపెనీ ప్రణాళికలు వేస్తోంది. మరి XUV400 విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

మహింద్రా XUV400 ఎక్స్-షోరూమ్ ధర రూ.15 లక్షల నుంచి రూ.18 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ బండి 450 కిలోమీటర్ల రేంజ్ ని కలిగి ఉంది. సెప్టెంబర్ 8 న ఈ వాహనం లాంచ్ అవుతుంది.

సెప్టెంబర్ 8 న XUV400 ని లాంచ్ చేయనున్న మహింద్రా

మహింద్రా అండ్ మహింద్రా కంపెనీ చైర్మన్ అయిన ఆనంద్ మహింద్రా గణేశ్ చతుర్థి రోజున ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ XUV400 యొక్క ఫస్ట్ లుక్ ని టీజ్ చేశారు. ట్విట్టర్ ద్వారా ఆయన ఈ పోస్ట్ చేశారు. ఈ టీజర్ ద్వారా డిజైన్ హైలైట్స్, చార్జింగ్ పోర్ట్, ఎల్ఈడీ డీఆర్ఎల్, సరికొత్త బట్టర్ ఫ్లై స్టైల్ మహింద్రా లోగో, ఎక్స్-ప్యాటెర్న్ ఫ్రంట్ గ్రిల్ వంటివి కనిపిస్తున్నాయి.

XUV300 తో పోలిస్తే XUV400 విభిన్నంగా కనిపిస్తోంది. XUV400 4 మీటర్ల కంటే పొడవుగా ఉంది. XUV400 రీడిజైన్డ్ రియర్ ప్రొఫైల్ కలిగి, సీ-పిల్లర్ పై షీట్ మెటల్ తో ఉంది. XUV400 ఎక్స్-ప్యాటెర్న్ తో, కొత్త రకం గ్రిల్ ఎంబెలిష్మెంట్స్ తో కనిపిస్తోంది.

టీజర్ వీడియో ద్వారా XUV400 విడుదల తేదీ, 2022 సెప్టెంబర్ 8 అని తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీ ట్రెండ్స్ ని బట్టి, మహింద్రా ట్రాక్ రికార్డ్ ని కూడా గమనిస్తే, XUV400 యొక్క లాంచ్, ధరలు తర్వాత మరొక తేదీన తెలియనున్నాయి. మహింద్రా XUV400 ఎక్స్-షోరూమ్ ధర రూ.15 లక్షల నుంచి రూ.18 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ బండి 450 కిలోమీటర్ల రేంజ్ ని కలిగి ఉంది. సెప్టెంబర్ 8 న ఈ వాహనం లాంచ్ అవుతుంది.

లేటెస్ట్ ఆటోమొబైల్, స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.