Moto G55 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 30 Aug 2024 12:38:05 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Moto G55 5G: డైమెన్సిటీ 7025 చిప్సెట్‌తో లాంచైన మోటో జీ55 5జీ https://www.91mobiles.com/telugu/moto-g55-5g-globally-launched-dimensity-7025-processor/ https://www.91mobiles.com/telugu/moto-g55-5g-globally-launched-dimensity-7025-processor/#respond Fri, 30 Aug 2024 11:32:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=13260 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నేడు గ్లోబల్ మార్కెట్స్‌లో జీ-సిరీస్ లో కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. Moto G55 5G, Moto G35 5G పేర్లతో ఈ డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం Moto G55 5G గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 50ఎంపి కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ తో లాంచ్ అయ్యింది. ఓసారి ఈ డివైజ్ […]

The post Moto G55 5G: డైమెన్సిటీ 7025 చిప్సెట్‌తో లాంచైన మోటో జీ55 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 6.5-ఇంచ్ FHD+ డిస్ప్లే
  • 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ
  • 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నేడు గ్లోబల్ మార్కెట్స్‌లో జీ-సిరీస్ లో కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. Moto G55 5G, Moto G35 5G పేర్లతో ఈ డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం Moto G55 5G గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 50ఎంపి కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ తో లాంచ్ అయ్యింది. ఓసారి ఈ డివైజ్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Moto G55 5G ధర, కలర్స్

Moto G55 5G స్మార్ట్‌ఫోన్ ధరను 249 యూరోలుగా పెట్టారు. భారతీయ కరెన్సీలో ఇది సుమారు రూ.23,000. ప్రస్తుతం ఇండియా లాంచ్, సేల్ వివరాలు ఇంకా తెలియదు. Moto G55 5G స్మార్ట్‌పఓన్ ఫారెస్ట్ గ్రే, ట్విలైట్ పర్పుల్ మరియు స్మోకీ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. వీగన్ లెదర్ బ్యాక్ ఫినిష్ ఉంటుంది.

Moto G55 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Moto G55 5G లో 6.5-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, పంచ్ హోల్ కటౌట్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, రౌండ్ ఎడ్జ్ ఫ్లాట్ డిస్ప్లే ఉన్నాయి.

ప్రాసెసర్: Moto G55 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7025 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. ఈ ఆక్టా-కోర్ ప్రాసెసర్ యొక్క హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.5 గిగాహెర్ట్జ్.

సాఫ్ట్‌వేర్: Moto G55 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హలో యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

మెమొరీ: Moto G55 5G స్మార్ట్‌ఫోన్ 3 ర్యామ్ వేరియంట్స్ లో లభిస్తుంది. అవి 4జిబి/8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ. ఏయే వేరియంట్స్ భారత్ లో లాంచ్ అవుతాయో ఇంకా తెలియదు.

కెమెరా: Moto G55 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Moto G55 5G స్మార్ట్‌ఫోన్‌లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Moto G55 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

  • Moto G35 స్మార్ట్‌ఫోన్ ధరను గ్లోబల్ మార్కెట్ లో 199 యూరోలు (సుమారు రూ.18,500) గా పెట్టారు. ఈ ఫోన్ భారత్ లో కూడా లాంచ్ అవుతుంది. భారతీయ మార్కెట్ లో ఈ ఫోన్ ధర రూ.15,000 లోపు ఉంటుందని సమాచారం. Moto G35 యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

The post Moto G55 5G: డైమెన్సిటీ 7025 చిప్సెట్‌తో లాంచైన మోటో జీ55 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/moto-g55-5g-globally-launched-dimensity-7025-processor/feed/ 0
[Exclusive] Moto G55: లీకైన మోటో జీ55 డిజైన్, రెండర్స్, స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/moto-g55-design-renders-specs-leaked/ https://www.91mobiles.com/telugu/moto-g55-design-renders-specs-leaked/#respond Thu, 22 Aug 2024 12:42:02 +0000 https://www.91mobiles.com/telugu/?p=13116 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో జీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Moto G55 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా 91mobiles కి ఈ ఫోన్ కి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ సమాచారం లభించింది. దీంతో జీ55 యొక్క డిజైన్, రెండర్స్ మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలిసింది. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం. Moto G55 రెండర్స్: డిజైన్, కలర్స్ Moto G55 యొక్క రెండర్స్‌ను టిప్‌స్టర్ […]

The post [Exclusive] Moto G55: లీకైన మోటో జీ55 డిజైన్, రెండర్స్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Moto G55 లాంచ్
  • తాజాగా లీకైన రెండర్స్, స్పెక్స్
  • 50ఎంపి కెమెరా, 256జిబి స్టోరేజీ

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో జీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Moto G55 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా 91mobiles కి ఈ ఫోన్ కి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ సమాచారం లభించింది. దీంతో జీ55 యొక్క డిజైన్, రెండర్స్ మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలిసింది. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

Moto G55 రెండర్స్: డిజైన్, కలర్స్

Moto G55 యొక్క రెండర్స్‌ను టిప్‌స్టర్ సుదాన్శు షేర్ చేశారు. రెండర్స్‌ని గమనిస్తే, గ్రీన్, గ్రే మరియు పర్పుల్ కలర్స్ లో ఈ ఫోన్ రానున్నట్లు అర్థమవుతోంది.

డిజైన్ పరంగా, Moto G55 చూడటానికి, ఇటీవలె లాంచైన Moto G45 మాదిరి ఉంది. ఇంకా గతేడాది లాంచైన Moto G54 కంటే భిన్నంగా ఉంది. రియర్ కెమెరా మాడ్యూల్ బ్యాక్ ప్యానెల్ తో కలిసి కాస్త పైకి ఉబికి ఉంది.

కెమెరా మాడ్యూల్ లో రెండు సెన్సర్స్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఫ్లాష్‌లైట్ ఉంది. ఇంకా మోటోరోలా లోగో బ్యాక్ ప్యానెల్ మధ్యలో ఉంది.

ఇంకా Moto G55 లో కాస్త మందపాటి బెజెల్స్, చిన్ ఉన్నాయి. ఇంకా ఈ ఫోన్ లో 3.5ఎంఎం ఆడియో జాక్, టైప్-సీ పోర్ట్, పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.

Moto G55 స్పెసిఫికేషన్స్

కెమెరా: Moto G55 లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్/మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

ప్రాసెసర్: Moto G55 లో మీడియాటెక్ డైమెన్సిటీ 5జీ చిప్సెట్ ఉంటుంది. త్వరలోనే పేరు తెలుస్తుంది.

మెమొరీ: Moto G55 8జిబి వరకు ర్యామ్, ర్యామ్ బూస్ట్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉంటాయి.

బ్యాటరీ: Moto G55 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 30 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

ఇతర ఫీచర్లు: Moto G55 డివైజ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఐపీ54 ప్రొటెక్షన్ తో వస్తోంది.

Moto G54 స్మార్ట్‌ఫోన్, ఫుల్‌హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎల్సీడీ ప్యానెల్, డాల్బీ అట్మాస్ తో వచ్చింది. మరి Moto G55 ఏయే మార్పులతో వస్తుందో చూడాలి. ఇప్పటికి తెలిసిన సమాచారం ఇంతే, త్వరలోనే మరింత సమాచారంతో మీ ముందుకు వస్తాం.

The post [Exclusive] Moto G55: లీకైన మోటో జీ55 డిజైన్, రెండర్స్, స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/moto-g55-design-renders-specs-leaked/feed/ 0