Motorola Edge 30 Neo - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 05 Sep 2022 12:23:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 లాంచ్ కి ముందు లీకైన Motorola Edge 30 Neo స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/motorola-edge-30-neo-specs-leaked-before-launch/ Mon, 05 Sep 2022 12:22:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=2101 హైలైట్స్: సెప్టెంబర్ 8 న భారత్ లో ఓ ఈవెంట్ నిర్వహించనున్న మోటోరోలా ఈవెంట్ లో లాంచ్ కానున్న మోటో ఎడ్జ్ 30 అల్ట్రా, మోటోరోలా ఫ్యూజన్, మోటోరోలా ఎడ్జ్ 30 నియో తాజాగా నెట్టింట్లో ప్రత్యక్షమైన మోటోరోలా ఎడ్జ్ 30 నియో స్పెసిఫికేషన్స్ సెప్టెంబర్ 8 న జరగబోవు ఈవెంట్లో మోటోరోలా మూడు స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయబోతోంది. అవి: మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా, మోటోరోలా ఎడ్జ్ ఫ్యూజన్, మోటోరోలా ఎడ్జ్ 30 నియో. […]

The post లాంచ్ కి ముందు లీకైన Motorola Edge 30 Neo స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • సెప్టెంబర్ 8 న భారత్ లో ఓ ఈవెంట్ నిర్వహించనున్న మోటోరోలా
  • ఈవెంట్ లో లాంచ్ కానున్న మోటో ఎడ్జ్ 30 అల్ట్రా, మోటోరోలా ఫ్యూజన్, మోటోరోలా ఎడ్జ్ 30 నియో
  • తాజాగా నెట్టింట్లో ప్రత్యక్షమైన మోటోరోలా ఎడ్జ్ 30 నియో స్పెసిఫికేషన్స్

సెప్టెంబర్ 8 న జరగబోవు ఈవెంట్లో మోటోరోలా మూడు స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయబోతోంది. అవి: మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా, మోటోరోలా ఎడ్జ్ ఫ్యూజన్, మోటోరోలా ఎడ్జ్ 30 నియో. మోటోరోలా ఎడ్జ్ 30 నియో, ఎడ్జ్ 30 లైట్ అనే పేరుతో లాంచ్ అయ్యే అవకాశముంది. ఇటీవలె ఎడ్జ్ 30 నియో, ఎడ్జ్ 30 లైట్ కి సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్స్, రెండర్స్ ని మేం షేర్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రముఖ లీక్‌స్టర్ యోగేశ్ బ్రార్ ఎడ్జ్ 30 నియో యొక్క స్పెసిఫికేషన్స్ ని షేర్ చేశాడు.

ప్రస్తుతం మోటోరోలా ఎడ్జ్ సిరీస్ కు సంబంధించిన ఒక మైక్రోసైట్ ఫ్లిప్ కార్ట్ మొబైల్ యాప్ లో కనిపిస్తోంది. దీన్ని బట్టి భారత్ లో మోటోరోలా తన ఫోన్లను ఫ్లిప్ కార్ట్ ద్వారా అమ్మనుందని స్పష్టమైంది. మరి మోటోరోలా ఎడ్జ్ 30 నియో స్మార్ట్ ఫోన్ యొక్క లీకైన స్పెసిఫికేషన్స్ ఏంటో తెలుసుకుందాం. పదండి.

Motorola Edge 30 Neo స్పెసిఫికేషన్స్

లీకైన మోటోరోలా ఎడ్జ్ 30 నియో స్పెసిఫికేషన్స్ ప్రకారం, ఈ ఫోన్లో 6.28 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, పీఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్, 4020 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ టర్బో చార్జింగ్ సపోర్ట్, 6జిబి/8జిబి ర్యామ్, 128/256జిబి స్టోరేజీ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. మోటోరోలా ఎడ్జ్ 30 నియో లో డ్యూయల్ రియర్ కెమెరాలున్నాయి. ఇందులో మెయిన్ కెమెరా అయిన 64ఎంపి ఓఐఎస్ సపోర్ట్ ని కలిగి ఉంది. రెండోది 13ఎంపి అల్ట్రావైడ్ కెమెరా. సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ఇందులో ముందు వైపున 32ఎంపి కెమెరాను అమర్చారు. మోటోరోలా ఎడ్జ్ 30 నియో ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత మైయూఎక్స్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

మోటోరోలా ఎడ్జ్ 30 నియో ఫోన్ నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. అవి: బ్లాక్ ఒనిక్స్, వెరి పెరి, ఆక్వా ఫోమ్, ఐస్ ప్యాలెస్. మోటోరోలా ఎడ్జ్ 30 నియో ధర ప్రస్తుతానికి రహస్యంగానే ఉంది. సెప్టెంబర్ 8 న భారత్ లో లాంచ్ సందర్భంగా ఇతర వివరాలు తెలిసే అవకాశముంది. ఈలోపు ఏవైనా లీక్స్ ద్వారా కూడా సమాచారం తెలిసే చాన్సెస్ ఉన్నాయి.

Motorola Edge 30 Neo Specs

  • 6.28-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పీఓఎల్ఈడీ డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్
  • 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ
  • 4020 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్
  • 64ఎంపి + 13ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా
  • 32ఎంపి సెల్ఫీ కెమెరా
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్, మైయూఎక్స్ కస్టమ్ స్కిన్

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్, ఎంటర్టెయిన్మెంట్ వార్తల కొరకు 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post లాంచ్ కి ముందు లీకైన Motorola Edge 30 Neo స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
గీక్‌బెంచ్ పై కనిపించిన Motorola Edge 30 Neo https://www.91mobiles.com/telugu/motorola-edge-30-neo-spotted-on-geekbench-price-specs/ Thu, 04 Aug 2022 10:05:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=1492 హైలైట్స్: గీక్‌బెంచ్ పై కనిపించిన మోటోరోలా ఎడ్జ్ 30 నియో సింగిల్ కోర్ టెస్ట్ లో 664 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 1848 పాయింట్లు సాధించిన హ్యాండ్సెట్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 8జిబి ర్యామ్, స్నాప్ డ్రాగన్ చిప్సెట్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు తన మోటో ఎడ్జ్ 30 సిరీస్ ను మరింత విస్తృతం చేయాలని మోటోరోలా భావిస్తున్నట్లు అర్థమవుతోంది. రీసెంట్ గా మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా విషయంలో పలు కథనాలు వచ్చాయి. […]

The post గీక్‌బెంచ్ పై కనిపించిన Motorola Edge 30 Neo first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • గీక్‌బెంచ్ పై కనిపించిన మోటోరోలా ఎడ్జ్ 30 నియో
  • సింగిల్ కోర్ టెస్ట్ లో 664 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 1848 పాయింట్లు సాధించిన హ్యాండ్సెట్
  • ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 8జిబి ర్యామ్, స్నాప్ డ్రాగన్ చిప్సెట్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు

తన మోటో ఎడ్జ్ 30 సిరీస్ ను మరింత విస్తృతం చేయాలని మోటోరోలా భావిస్తున్నట్లు అర్థమవుతోంది. రీసెంట్ గా మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా విషయంలో పలు కథనాలు వచ్చాయి. వాటిని బట్టి, ఎడ్జ్ 30 అల్ట్రా 200ఎంపి కెమెరాతో వస్తోందని తెలుస్తోంది. ఈలోపే మరొక డివైజ్ గురించిన సమాచారం వెలుగులోకి వచ్చింది. అదే మోటోరోలా ఎడ్జ్ 30 నియో. ఇప్పుడు ఇదే ఫోన్ బెంచ్ మార్కింగ్ సైట్, గీక్ బెంచ్ లో కనిపించింది. దీంతో ఫోన్ కి సంబంధించిన కొన్ని వివరాలు బయటకు వచ్చాయి.

మైస్మార్ట్‌ప్రైస్ తొలుత గీక్ బెంచ్ పై మోటోరోలా ఎడ్జ్ 30 నియో ఫోన్ ని గుర్తించింది. ఈ ఫోన్ సింగిల్ కోర్ టెస్ట్ లో 664 పాయింట్లు, మల్టీ కోర్ టెస్ట్ లో 1848 పాయింట్లను సాధించింది.

Motorola Edge 30 Neo ధర, స్పెసిఫికేషన్స్ (అంచనా)

బెంచ్ మార్కింగ్ వెబ్ సైట్ గీక్‌బెంచ్ పై మోటోరోలా ఎడ్జ్ 30 నియో దర్శనమిచ్చింది. ఈ లిస్టింగ్ లో ఫోన్ కి సంబంధించిన కీలక ఫీచర్లైన ఓఎస్ వర్షన్, ర్యామ్, చిప్సెట్ కనిపించాయి. మోటో ఎడ్జ్ 30 నియో ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 8జిబి ర్యామ్ తో వస్తున్నట్లు సమాచారం. మయామీ అనే కోడ్ నేమ్ తో మోటో ఎడ్జ్ 30 నియో యొక్క మదర్‌బోర్డ్ సెక్షన్ మెన్షన్ చేయబడి ఉంది. ఇది స్నాప్ డ్రాగన్ 695 లేదా స్నాప్ డ్రాగన్ 750జి చిప్సెట్ అయి ఉండొచ్చని అంచనా.

అంతకు ముందు, ట్విట్టర్ యూజర్ నీల్స్ అహ్రెన్స్మెయిర్ మోటో ఎడ్జ్ 30 నియో ధర 399 యూరోలు (దాదాపు రూ.32,000) ఉంటుందని వెల్లడించాడు. ఎడ్జ్ 30 లైట్ యొక్క రీబ్రాండెడ్ వర్షన్ గా 30 నియో వస్తుందని చెప్పాడు. అదే కనుక నిజమైతే, ఇటీవలె ఆన్ లైన్లో కొన్ని స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. వాటి ఆధారంగా, ఎడ్జ్ 30 నియో లో 6.5 అంగుళాల డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 64ఎంపి కెమెరా (ఓఐఎస్), 4020ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది. రూమర్ల ఆధారంగా ఈ ఫీచర్లను అంచనా వేస్తున్నాం. ఇవే నిజమని కచ్చితంగా చెప్పలేం.

మోటోరోలా ఎడ్జ్ 30 నియో 64ఎంపి ప్రైమరీ కెమెరాను కలిగి ఉండే అవకాశముందని  తెలుస్తోంది. ఈ కెమెరా ఓఐఎస్ ఫీచర్ తో వస్తోంది. ఇప్పటి వరకు ఎడ్జ్ 30 నియో గురించి అనుకున్న ఫీచర్లను (అంచనా) బట్టి ఫోన్ ధర రూ.32,000 అంటే చాలా ఎక్కువనే చెప్పాలి. స్నాప్ డ్రాగన్ 695 లేదా స్నాప్ డ్రాగన్ 750జి చిప్సెట్స్ కి అంత ధర పెట్టడమంటే సరికాదు. ఇక్కడ హైలైట్ పాయింట్ ఏంటంటే, 64ఎంపి ఓఐఎస్ కెమెరా. ఈ ఒక్క ఫీచర్ ని సెల్లింగ్ పాయింట్ గా భావించి మార్కెట్ లోకి వెళ్తే దెబ్బపడే అవకాశముంది. కాస్త ధరను తగ్గిస్తే, యూజర్లు ఈ ఫోన్ పై కన్నేసే అవకాశముంది. త్వరలోనే మోటోరోలా ఎడ్జ్ 30 నియో కి సంబంధించిన అధికార ప్రకటన వెలువడుతుందేమో చూడాలి.

The post గీక్‌బెంచ్ పై కనిపించిన Motorola Edge 30 Neo first appeared on 91Mobiles Telugu.

]]>