లాంచ్ కి ముందు లీకైన Motorola Edge 30 Neo స్పెసిఫికేషన్స్

హైలైట్స్:

  • సెప్టెంబర్ 8 న భారత్ లో ఓ ఈవెంట్ నిర్వహించనున్న మోటోరోలా
  • ఈవెంట్ లో లాంచ్ కానున్న మోటో ఎడ్జ్ 30 అల్ట్రా, మోటోరోలా ఫ్యూజన్, మోటోరోలా ఎడ్జ్ 30 నియో
  • తాజాగా నెట్టింట్లో ప్రత్యక్షమైన మోటోరోలా ఎడ్జ్ 30 నియో స్పెసిఫికేషన్స్

సెప్టెంబర్ 8 న జరగబోవు ఈవెంట్లో మోటోరోలా మూడు స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయబోతోంది. అవి: మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా, మోటోరోలా ఎడ్జ్ ఫ్యూజన్, మోటోరోలా ఎడ్జ్ 30 నియో. మోటోరోలా ఎడ్జ్ 30 నియో, ఎడ్జ్ 30 లైట్ అనే పేరుతో లాంచ్ అయ్యే అవకాశముంది. ఇటీవలె ఎడ్జ్ 30 నియో, ఎడ్జ్ 30 లైట్ కి సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్స్, రెండర్స్ ని మేం షేర్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రముఖ లీక్‌స్టర్ యోగేశ్ బ్రార్ ఎడ్జ్ 30 నియో యొక్క స్పెసిఫికేషన్స్ ని షేర్ చేశాడు.

ప్రస్తుతం మోటోరోలా ఎడ్జ్ సిరీస్ కు సంబంధించిన ఒక మైక్రోసైట్ ఫ్లిప్ కార్ట్ మొబైల్ యాప్ లో కనిపిస్తోంది. దీన్ని బట్టి భారత్ లో మోటోరోలా తన ఫోన్లను ఫ్లిప్ కార్ట్ ద్వారా అమ్మనుందని స్పష్టమైంది. మరి మోటోరోలా ఎడ్జ్ 30 నియో స్మార్ట్ ఫోన్ యొక్క లీకైన స్పెసిఫికేషన్స్ ఏంటో తెలుసుకుందాం. పదండి.

Motorola Edge 30 Neo స్పెసిఫికేషన్స్

లీకైన మోటోరోలా ఎడ్జ్ 30 నియో స్పెసిఫికేషన్స్ ప్రకారం, ఈ ఫోన్లో 6.28 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, పీఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్, 4020 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ టర్బో చార్జింగ్ సపోర్ట్, 6జిబి/8జిబి ర్యామ్, 128/256జిబి స్టోరేజీ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. మోటోరోలా ఎడ్జ్ 30 నియో లో డ్యూయల్ రియర్ కెమెరాలున్నాయి. ఇందులో మెయిన్ కెమెరా అయిన 64ఎంపి ఓఐఎస్ సపోర్ట్ ని కలిగి ఉంది. రెండోది 13ఎంపి అల్ట్రావైడ్ కెమెరా. సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ఇందులో ముందు వైపున 32ఎంపి కెమెరాను అమర్చారు. మోటోరోలా ఎడ్జ్ 30 నియో ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత మైయూఎక్స్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

మోటోరోలా ఎడ్జ్ 30 నియో ఫోన్ నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. అవి: బ్లాక్ ఒనిక్స్, వెరి పెరి, ఆక్వా ఫోమ్, ఐస్ ప్యాలెస్. మోటోరోలా ఎడ్జ్ 30 నియో ధర ప్రస్తుతానికి రహస్యంగానే ఉంది. సెప్టెంబర్ 8 న భారత్ లో లాంచ్ సందర్భంగా ఇతర వివరాలు తెలిసే అవకాశముంది. ఈలోపు ఏవైనా లీక్స్ ద్వారా కూడా సమాచారం తెలిసే చాన్సెస్ ఉన్నాయి.

Motorola Edge 30 Neo Specs

  • 6.28-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పీఓఎల్ఈడీ డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్
  • 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ
  • 4020 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్
  • 64ఎంపి + 13ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా
  • 32ఎంపి సెల్ఫీ కెమెరా
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్, మైయూఎక్స్ కస్టమ్ స్కిన్

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్, ఎంటర్టెయిన్మెంట్ వార్తల కొరకు 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.