Motorola Edge 50 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 08 Aug 2024 04:24:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Motorola Edge 50 vs Nothing Phone (2a) Plus: బ్యాటరీ బ్యాకప్ లో ఏది బెస్ట్? https://www.91mobiles.com/telugu/motorola-edge-50-nothing-phone-2a-plus-battery-comparison-which-gives-best-backup/ https://www.91mobiles.com/telugu/motorola-edge-50-nothing-phone-2a-plus-battery-comparison-which-gives-best-backup/#respond Wed, 07 Aug 2024 18:24:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=12877 ఇటీవలె భారతీయ మార్కెట్ లో Motorola Edge 50 మరియు Nothing Phone (2a) Plus ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ రెండు ఫోన్లు కూడా యూజర్లకు నచ్చే ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చాయి. ఇక ఈ డివైజెస్ 8జిబి ర్యామ్ వేరియంట్ యొక్క ధర రూ.27,999 గా ఉంది. అలాగే ఈ రెండు ఫోన్లలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. మరి రెండింట్లో ఏది ఉత్తమమైన పవర్ బ్యాకప్ ఇస్తుందో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. మేం, […]

The post Motorola Edge 50 vs Nothing Phone (2a) Plus: బ్యాటరీ బ్యాకప్ లో ఏది బెస్ట్? first appeared on 91Mobiles Telugu.

]]>

ఇటీవలె భారతీయ మార్కెట్ లో Motorola Edge 50 మరియు Nothing Phone (2a) Plus ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ రెండు ఫోన్లు కూడా యూజర్లకు నచ్చే ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చాయి. ఇక ఈ డివైజెస్ 8జిబి ర్యామ్ వేరియంట్ యొక్క ధర రూ.27,999 గా ఉంది. అలాగే ఈ రెండు ఫోన్లలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. మరి రెండింట్లో ఏది ఉత్తమమైన పవర్ బ్యాకప్ ఇస్తుందో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. మేం, ఈ రెండు ఫోన్లను పీసీమార్క్ బ్యాటరీ బెంచ్‌మార్క్ వినియోగించి పరీక్షలు జరిపాం. అలాగే గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ టెస్ట్‌లు కూడా చేసి బ్యాటరీ పెర్ఫామెన్స్ ఎలా ఉందో పరిశీలించాం. ఆ వివరాలు మీకోసం అందిస్తున్నాం.

పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్

పీసీమార్క్ బ్యాటరీ టెస్ట్ రెండు ఫోన్ల బ్యాటరీ లైఫ్ కూడా 20 శాతానికి పడిపోయే దాకా చేయడం జరిగింది. మోటో ఎడ్జ్ 50 మరియు నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ ఫోన్లను 100 శాతం బ్యాటరీతో, 50 శాతం వాల్యూమ్ మరియు బ్రైట్నెస్ లెవెల్స్ తో టెస్ట్ చేయడం జరిగింది. ఈ టెస్ట్ లో Motorola Edge 50 స్మార్ట్‌ఫోన్ 10 గంటల 50 నిమిషాల స్కోర్ చేయగా, Nothing Phone 2a Plus 14 గంటల 34 నిమిషాల స్కోర్ చేసింది.

విజేత: Nothing Phone (2a) Plus

వీడియో స్ట్రీమింగ్

వీడియో స్ట్రీమింగ్ టెస్ట్ లో మోటోరోలా ఎడ్జ్ 50 యొక్క బ్యాటరీ 30 నిమిషాల తర్వాత 5 శాతం ఖర్చయ్యింది. టెస్టింగ్ సమయంలో మ్యాగ్జిమమ్ సపోర్టెడ్ రెజుల్యూషన్, 50 శాతం బ్రైట్నెస్, 50 శాతం వాల్యూమ్ లెవెల్స్ ఉన్నాయి. ఇవే సెట్టింగ్స్ తో నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ లో వీడియో స్ట్రీమింగ్ టెస్ట్ చేయగా, 4 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. దీన్ని 200mAh అని చెప్పవచ్చు. మరోవైపు మోటో ఎడ్జ్ 50 లో ఇది 250mAh గా ఉంది.

విజేత: Nothing Phone (2a) Plus

గేమింగ్

గేమింగ్ టెస్ట్ లో కూడా Nothing Phone (2a) Plus, Moto Edge 50 కంటే ఉత్తమమైన బ్యాటరీ పనితీరును కనబర్చింది. బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ మరియు రియల్ రేసింగ్ 3 గేమ్స్‌ను ప్రతీ ఒక్క దాన్ని 30 నిమిషాల చొప్పున ఆడితే నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ లో 19 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది. మరోవైపు మోటోరోలా ఎడ్జ్ 50 లో 26 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది.

విజేత: Nothing Phone (2a) Plus

చార్జింగ్ స్పీడ్స్

చార్జింగ్ స్పీడ్ విషయానికి వస్తే, Motorola Edge 50 తన 68W ఫాస్ట్ చార్జింగ్ సామర్థ్యంతో మెరుగ్గా కనిపిస్తోంది. కంపెనీ బాక్స్ లో అందించిన చార్జర్ తో రెగ్యులర్ మోడ్‌లో చార్జ్ చేసినప్పుడు, 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు ఈ ఫోన్‌కి 40 నిమిషాల సమయం పట్టింది. అదే, చార్జ్ బూస్ట్ మోడ్‌లో 30 నిమిషాల సమయం పట్టింది.

మరోవైపు, Nothing Phone (2a) Plus 50 వాట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. కానీ, బాక్స్ లో చార్జర్ తో రావడంలేదు. కంపాటిబుల్ థర్డ్-పార్టీ పీడీ చార్జర్ తో జరిపిన టెస్ట్ లో ఈ ఫోన్ 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 51 నిమిషాల సమయం పట్టింది.

విజేత: Motorola Edge 50

ఏది బెస్ట్?

Nothing Phone (2a) Plus మెరుగైన బ్యాటరీ పనితీరుతో Motorola Edge 50 తో పోల్చితే.. బెంచ్‌మార్క్ టెస్ట్‌లు, గేమింగ్ మరియు స్ట్రీమింగ్ విషయాల్లో మేటిగా నిలిచింది. అయితే, Motorola Edge 50 ఫాస్ట్ చార్జింగ్ స్పీడ్, బాక్స్ లో చార్జర్.. వంటి విషయాల్లో ముందు వరుసలో ఉంది. మీ అవసరానికి అనుగుణంగా రెండు ఫోన్లలో ఒకదానిని ఎంచుకోవాల్సి ఉంటుంది.

The post Motorola Edge 50 vs Nothing Phone (2a) Plus: బ్యాటరీ బ్యాకప్ లో ఏది బెస్ట్? first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/motorola-edge-50-nothing-phone-2a-plus-battery-comparison-which-gives-best-backup/feed/ 0
Motorola Edge 50: ఐపీ68 రేటింగ్, పీఓఎల్ఈడీ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన ఎడ్జ్ 50 https://www.91mobiles.com/telugu/motorola-edge-50-5g-launched-india-ip68-rating-poled-display/ https://www.91mobiles.com/telugu/motorola-edge-50-5g-launched-india-ip68-rating-poled-display/#respond Thu, 01 Aug 2024 08:28:15 +0000 https://www.91mobiles.com/telugu/?p=12780 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Motorola నేడు భారతీయ మార్కెట్ లో ఎడ్జ్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Motorola Edge 50 పేరుతో ఈ డివైజ్ విడుదలైంది. ప్రపంచపు మొట్టమొదటి సన్నని మిలిటరీ గ్రేడ్ రేటింగ్ గల ఫోన్ గా ఎడ్జ్ 50 నిలువననుంది. అంటే ఈ ఫోన్ ఎటువంటి పరిస్థితుల్లోనైనా తట్టుకోగలదు. అంతేకాదు, ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ కూడా ఈ ఫోన్ కి ఉంది. దీంతో నీరు, […]

The post Motorola Edge 50: ఐపీ68 రేటింగ్, పీఓఎల్ఈడీ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన ఎడ్జ్ 50 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో Motorola Edge 50 లాంచ్
  • IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్
  • 1.5కే సూపర్ హెచ్డీ 3డీ కర్వ్డ్ డిస్ప్లే

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Motorola నేడు భారతీయ మార్కెట్ లో ఎడ్జ్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Motorola Edge 50 పేరుతో ఈ డివైజ్ విడుదలైంది. ప్రపంచపు మొట్టమొదటి సన్నని మిలిటరీ గ్రేడ్ రేటింగ్ గల ఫోన్ గా ఎడ్జ్ 50 నిలువననుంది. అంటే ఈ ఫోన్ ఎటువంటి పరిస్థితుల్లోనైనా తట్టుకోగలదు. అంతేకాదు, ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ కూడా ఈ ఫోన్ కి ఉంది. దీంతో నీరు, దుమ్ము నుంచి ఫోన్ కి రక్షణ లభిస్తుంది. సరే, ఓసారి Motorola Edge 50 యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Motorola Edge 50 ధర, లభ్యత

Motorola Edge 50 స్మార్ట్‌ఫోన్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. మోటోరోలా వెబ్‌సైట్ తో పాటు, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.

Motorola Edge 50 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Motorola Edge 50 లో 6.67-ఇంచ్ పీఓఎల్ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1.5కే సూపర్ హెచ్డీ 3డీ కర్వ్డ్ ప్యానెల్, 1900 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 100% డీసీఐ పీ3 కలర్ గ్యామట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 10 బిలియన్ కలర్ సపోర్ట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Motorola Edge 50 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 యాక్సలరేటెడ్ ఎడిషన్ చిప్సెట్ వాడారు. 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై ఈ చిప్ తయారైంది. వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ను ఈ ఫోన్ లో అందించారు.

ర్యామ్, స్టోరేజీ: Motorola Edge 50 డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యింది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా ఈ ఫోన్ లో ఉంది.

కెమెరా: Motorola Edge 50 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-700సీ ప్రైమరీ కెమెరా, 13ఎంపి మ్యాక్రో కెమెరా, 10ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Motorola Edge 50 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Motorola Edge 50 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Motorola Edge 50: ఐపీ68 రేటింగ్, పీఓఎల్ఈడీ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన ఎడ్జ్ 50 first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/motorola-edge-50-5g-launched-india-ip68-rating-poled-display/feed/ 0
Motorola Edge 50 ఇండియా లాంచ్ తేదీ ఖరారు https://www.91mobiles.com/telugu/motorola-edge-50-india-launch-date-confirmed/ https://www.91mobiles.com/telugu/motorola-edge-50-india-launch-date-confirmed/#respond Thu, 25 Jul 2024 11:33:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=12679 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో ఎడ్జ్-50 సిరీస్ లో మరో ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సిరీస్ లో 3 మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఇప్పడు Motorola Edge 50 భారత్ లో లాంచ్ కాబోతోంది. తాజాగా మోటోరోలా సంస్థ లాంచ్ తేదీని ప్రకటించింది. ఆగస్టు నెలలో ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఓసారి లాంచ్ వివరాలు మరియు స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. Motorola Edge 50 ఇండియా లాంచ్ […]

The post Motorola Edge 50 ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Edge 50 లాంచ్ తేదీ వెల్లడి
  • ఆగస్టు 1 న భారత్ లో లాంచ్
  • ఐపీ68 వాటర్&డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో ఎడ్జ్-50 సిరీస్ లో మరో ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సిరీస్ లో 3 మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఇప్పడు Motorola Edge 50 భారత్ లో లాంచ్ కాబోతోంది. తాజాగా మోటోరోలా సంస్థ లాంచ్ తేదీని ప్రకటించింది. ఆగస్టు నెలలో ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఓసారి లాంచ్ వివరాలు మరియు స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం.

Motorola Edge 50 ఇండియా లాంచ్ తేదీ

Motorola Edge 50 స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో ఆగస్టు 1వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతోంది.

Motorola Edge 50 స్మార్ట్‌ఫోన్ యొక్క ఫీచర్లు ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ ద్వారా రివీల్ అయ్యాయి.

Motorola Edge 50 ఫోన్ ప్రత్యేకత ఏంటంటే, MIL-810H మిలిటరీ గ్రేడ్ తో వస్తోన్న ప్రపంచపు మొట్టమొదటి సన్నని ఫోన్ ఇదే.

మిలిటరీ గ్రేడ్ స్ట్రెంగ్త్ వల్లన, ఈ ఫోన్ అత్యల్ప మరియు అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకుని నిలవగలదు. అలాగే ఈ ఫోన్ ఒత్తిడి, షాక్, వైబ్రేషన్, దుమ్ము, పొగమంచు వంటి వాటి నుంచి రక్షణ పొందుతుంది. ఐపీ68 రేటింగ్ తో వస్తోన్న ఈ ఫోన్ నీరు, దుమ్మును ఎదుర్కొని నిలవగలదు.

Motorola Edge 50 స్మార్ట్‌ఫోన్ జంగిల్ గ్రీన్ మరియు పేంటోన్ పీచ్ ఫడ్జ్ కలర్స్ లో లభిస్తుంది. ఈ రెండు కలర్ వేరియంట్స్ వీగన్ లెదర్ ఫినిష్ తో వస్తున్నాయి. మరోవైపు, కోలా గ్రే కలర్ వీగన్ సూడో ఫినిష్ తో వస్తోంది.

Motorola Edge 50 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Motorola Edge 50 లో 6.67-ఇంచ్ పీఓఎల్ఈడీ స్క్రీన్, 1900 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Motorola Edge 50 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 యాక్సలరేటెడ్ ఎడిషన్ చిప్ వాడారు. ఇది 4 ఎన్ఎమ్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.

ర్యామ్, స్టోరేజీ: Motorola Edge 50 డివైజ్ 256జిబి స్టోరేజీ, ర్యామ్ బూస్టర్ ఫీచర్ తో వస్తోంది.

కెమెరా: Motorola Edge 50 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-700సీ మెయిన్ కెమెరా, 13ఎంపి 120-డిగ్రీ అల్ట్రావైడ్ లెన్స్, 10ఎంపి టెలీఫోటో 30ఎక్స్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: Motorola Edge 50 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 68 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Motorola Edge 50 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అవుతుంది. 3 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్, 4 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

కనెక్టివిటీ: Motorola Edge 50 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి.

The post Motorola Edge 50 ఇండియా లాంచ్ తేదీ ఖరారు first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/motorola-edge-50-india-launch-date-confirmed/feed/ 0
Motorola Edge 50 5G: లీకైన మోటోరోలా ఎడ్జ్ 50 5జీ ఇండియన్ మోడల్ ఇమేజెస్, కలర్స్ మరియు డిజైన్ https://www.91mobiles.com/telugu/motorola-edge-50-pro-5g-indian-model-images-colors-design/ https://www.91mobiles.com/telugu/motorola-edge-50-pro-5g-indian-model-images-colors-design/#respond Wed, 24 Jul 2024 16:14:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=12668 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో ఎడ్జ్-50 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ లైనప్ లో Edge 50 Pro, Edge 50 Fusion, Edge 50 Ultra ఫోన్లు విడుదలయ్యాయి. ఇప్పుడు Motorola Edge 50 5G ని లాంచ్ చేసేందుకు మోటోరోలా సిద్ధమవుతోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఎక్స్‌క్లూజివ్ సమాచారం 91mobiles కి టిప్‌స్టర్ సుదాన్శు ద్వారా లభించింది. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం. Motorola Edge […]

The post Motorola Edge 50 5G: లీకైన మోటోరోలా ఎడ్జ్ 50 5జీ ఇండియన్ మోడల్ ఇమేజెస్, కలర్స్ మరియు డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Motorola Edge 50 5G లాంచ్
  • కర్వ్డ్ పీఓఎల్ఈడీ డిస్ప్లే
  • మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో ఎడ్జ్-50 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ లైనప్ లో Edge 50 Pro, Edge 50 Fusion, Edge 50 Ultra ఫోన్లు విడుదలయ్యాయి. ఇప్పుడు Motorola Edge 50 5G ని లాంచ్ చేసేందుకు మోటోరోలా సిద్ధమవుతోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఎక్స్‌క్లూజివ్ సమాచారం 91mobiles కి టిప్‌స్టర్ సుదాన్శు ద్వారా లభించింది. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

Motorola Edge 50 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

స్క్రీన్: Motorola Edge 50 5G లో 6.4-ఇంచ్ పంచ్-హోల్ డిస్ప్లే, పీఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: Motorola Edge 50 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ ఉంటుంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన చిప్. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.5 గిగాహెర్ట్జ్.

కెమెరా: Motorola Edge 50 5G డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 13ఎంపి సెకండరీ లెన్స్, 10ఎంపి థర్డ్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: Motorola Edge 50 5G లో పవర్ బ్యాకప్ కోసం 4,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Motorola Edge 50 5G ఇండియా లాంచ్ టైమ్‌లైన్

Motorola Edge 50 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ వివరాలను మోటోరోలా రహస్యంగానే ఉంచింది. కానీ, ఈ ఫోన్ ఆగస్టు నెలలో లాంచ్ అవుతుందని మేం అంచనా వేస్తున్నారు. మోటోరోలా తన అధికార వెబ్‌సైట్ పై ‘క్రాఫ్టెడ్ ఫర్ ద బోల్డ్’ అనే ట్యాగ్‌లైన్ తో ఒక కొత్త పేజీని క్రియేట్ చేసింది. ఇందులో కమింగ్ సూన్ అని రాసి ఉంది. ఈ పేజీ Motorola Edge 50 5G కోసమే అని అంచనా వేస్తున్నారు. రానున్న కొన్ని రోజుల్లో ఈ ఫోన్ వివరాలు వెల్లడి కానున్నాయి.

The post Motorola Edge 50 5G: లీకైన మోటోరోలా ఎడ్జ్ 50 5జీ ఇండియన్ మోడల్ ఇమేజెస్, కలర్స్ మరియు డిజైన్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/motorola-edge-50-pro-5g-indian-model-images-colors-design/feed/ 0