
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Motorola నేడు భారతీయ మార్కెట్ లో ఎడ్జ్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Motorola Edge 50 పేరుతో ఈ డివైజ్ విడుదలైంది. ప్రపంచపు మొట్టమొదటి సన్నని మిలిటరీ గ్రేడ్ రేటింగ్ గల ఫోన్ గా ఎడ్జ్ 50 నిలువననుంది. అంటే ఈ ఫోన్ ఎటువంటి పరిస్థితుల్లోనైనా తట్టుకోగలదు. అంతేకాదు, ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ కూడా ఈ ఫోన్ కి ఉంది. దీంతో నీరు, దుమ్ము నుంచి ఫోన్ కి రక్షణ లభిస్తుంది. సరే, ఓసారి Motorola Edge 50 యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.
Motorola Edge 50 ధర, లభ్యత
Motorola Edge 50 స్మార్ట్‌ఫోన్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. మోటోరోలా వెబ్‌సైట్ తో పాటు, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.
Motorola Edge 50 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Motorola Edge 50 లో 6.67-ఇంచ్ పీఓఎల్ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1.5కే సూపర్ హెచ్డీ 3డీ కర్వ్డ్ ప్యానెల్, 1900 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 100% డీసీఐ పీ3 కలర్ గ్యామట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 10 బిలియన్ కలర్ సపోర్ట్ ఉన్నాయి.
ప్రాసెసర్: Motorola Edge 50 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 యాక్సలరేటెడ్ ఎడిషన్ చిప్సెట్ వాడారు. 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై ఈ చిప్ తయారైంది. వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ను ఈ ఫోన్ లో అందించారు.
ర్యామ్, స్టోరేజీ: Motorola Edge 50 డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యింది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా ఈ ఫోన్ లో ఉంది.
కెమెరా: Motorola Edge 50 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-700సీ ప్రైమరీ కెమెరా, 13ఎంపి మ్యాక్రో కెమెరా, 10ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ, చార్జింగ్: Motorola Edge 50 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ: Motorola Edge 50 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.











