MWC 2024 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 26 Feb 2024 17:47:06 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 HONOR: మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఈవెంట్‌లో ఎంట్రీ ఇచ్చిన HONOR Pad 9 https://www.91mobiles.com/telugu/honor-pad-9-introduced-in-mobile-world-congress-2024/ Mon, 26 Feb 2024 17:47:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=10433 MWC 2024 లో ఎన్నో బ్రాండ్స్ తమ ఉత్పత్తులను పరిచయం చేస్తున్నాయి. HONOR కూడా Magic 6 Pro స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ తో పాటు HONOR Pad 9 కూడా గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. ఈ ట్యాబ్లెట్ 12.1-ఇంచ్ భారీ స్క్రీన్, 16జిబి వరకు ర్యామ్, 256జిబి స్టోరేజీ, 8300 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్‌ను కలిగి ఉంది. సరే, ఓసారి HONOR Pad 9 యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర […]

The post HONOR: మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఈవెంట్‌లో ఎంట్రీ ఇచ్చిన HONOR Pad 9 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఎమ్‌డబ్ల్యూసీ 2024 లో లాంచైన HONOR Pad 9
  • 16జిబి టర్బో ర్యామ్ తో వచ్చిన డివైజ్
  • HONOR Pad 9 ధర 349 యూరోలు

MWC 2024 లో ఎన్నో బ్రాండ్స్ తమ ఉత్పత్తులను పరిచయం చేస్తున్నాయి. HONOR కూడా Magic 6 Pro స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ తో పాటు HONOR Pad 9 కూడా గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. ఈ ట్యాబ్లెట్ 12.1-ఇంచ్ భారీ స్క్రీన్, 16జిబి వరకు ర్యామ్, 256జిబి స్టోరేజీ, 8300 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్‌ను కలిగి ఉంది. సరే, ఓసారి HONOR Pad 9 యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు లభ్యత గురించి తెలుసుకుందాం పదండి.

HONOR Pad 9 ధర (గ్లోబల్)

  • HONOR Pad 9 యునైటెడ్ కింగ్‌డమ్ లో 349 యూరోల ధరతో లాంచ్ అయ్యింది. భారతీయ కరెన్సీలో ఇది రూ.31,358 గా ఉంటుంది.
  • యూకే మరియు ఐర్లాండ్ దేశాల్లో డిస్కౌంట్ ఆఫర్లతో వివిధ ఆన్‌లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా HONOR Pad 9 విక్రయించబడనుంది.
  • HONOR Pad 9 డివైజ్ గ్లోబల్‌గా స్పేస్ గ్రే మరియు సైయన్ లేక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

HONOR Pad 9 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: HONOR Pad 9 లో 12.1-ఇంచ్ స్క్రీన్, 2.5కే ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, టీయూవీ రెయిన్‌ల్యాండ్ రేటింగ్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: HONOR Pad 9 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: HONOR Pad 9 ట్యాబ్లెట్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో వచ్చింది. టర్బో ర్యామ్ ఫీచర్ తో 16జిబి వరకు ర్యామ్ పవర్ పొందవచ్చు.
  • కెమెరా: HONOR Pad 9 లో బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
  • బ్యాటరీ: HONOR Pad 9 లో పవర్ బ్యాకప్ కోసం 8,300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 35 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: HONOR Pad 9 ట్యాబ్లెట్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.2 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post HONOR: మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఈవెంట్‌లో ఎంట్రీ ఇచ్చిన HONOR Pad 9 first appeared on 91Mobiles Telugu.

]]>
MWC 2024: 108MP కెమెరాతో వస్తోన్న Tecno Pova 6 Pro; డివైజ్‌ని రివీల్ చేసిన టెక్నో! https://www.91mobiles.com/telugu/tecno-pova-6-pro-showcased-mwc-2024-featuring-108mp-camera/ Mon, 26 Feb 2024 16:02:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=10430 చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు Tecno మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఈవెంట్ లో Tecno Pova 6 Pro డివైజ్ ని ప్రదర్శించింది. ఆకట్టుకునే డిజైన్‌ని ఈ ఫోన్ కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్, 108ఎంపి మెయిన్ కెమెరా, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్‌ని ఈ ఫోన్ కలిగి ఉంది. సరే, ఓసారి Tecno Pova 6 Pro యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు లభ్యత […]

The post MWC 2024: 108MP కెమెరాతో వస్తోన్న Tecno Pova 6 Pro; డివైజ్‌ని రివీల్ చేసిన టెక్నో! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఎండబ్ల్యూసీ 2024 లో Tecno Pova 6 Pro ప్రదర్శన
  • ఇంకా వెల్లడి కాని లాంచ్ తేదీ, లభ్యత వివరాలు
  • కలర్స్: మిటియోరైట్ గ్రే, కామెట్ గ్రీన్

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు Tecno మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఈవెంట్ లో Tecno Pova 6 Pro డివైజ్ ని ప్రదర్శించింది. ఆకట్టుకునే డిజైన్‌ని ఈ ఫోన్ కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్, 108ఎంపి మెయిన్ కెమెరా, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్‌ని ఈ ఫోన్ కలిగి ఉంది. సరే, ఓసారి Tecno Pova 6 Pro యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు లభ్యత వివరాలను తెలుసుకుందాం పదండి.

Tecno Pova 6 Pro ధర, లభ్యత

  • Tecno Pova 6 Pro స్మార్ట్‌ఫోన్ ధర ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. మార్చి మొదటి వారంలో ఈ ఫోన్ ఫిలిప్పైన్స్ లో లాంచ్ కానుంది. తర్వాత ఇతర మార్కెట్స్ లోకి ప్రవేశిస్తుంది.
  • Tecno Pova 6 Pro భారత మార్కెట్ లాంచ్ తేదీ వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో టెక్నో నుంచి ప్రకటన రానుంది.

Tecno Pova 6 Pro స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

Tecno Pova 6 Pro డివైజ్ లో డైనమిక్-ఐ డిజైన్ హైలైట్ గా చెప్పవచ్చు. 210 సింగిల్-పాయింట్ కంట్రోల్డ్ మినీఎల్ఈడీ‌లు రింగ్-షేప్ లో పేర్చబడి ఉన్నాయి.

Tecno Pova 6 Pro డివైజ్ మీటియోరైట్ గ్రే మరియు కామెట్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

  • డిస్ప్లే: Tecno Pova 6 Pro లో 6.78-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్‌హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Tecno Pova 6 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్, మాలి జీ57 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Tecno Pova 6 Pro డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Tecno Pova 6 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Tecno Pova 6 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి 3ఎక్స్ జూమ్ ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, ఏఐ లెన్స్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ప్రైమరీ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Tecno Pova 6 Pro లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 70 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సెక్యూరిటీ: Tecno Pova 6 Pro లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు.
  • బరువు, మందం: Tecno Pova 6 Pro డివైజ్ 7.8 మి.మీ మందం, 195 గ్రాముల బరువు ఉంటుంది.
  • ఆడియో: Tecno Pova 6 Pro లో 3.5ఎంఎం ఆడియో జాక్ ఉంది.
  • కనెక్టివిటీ: Tecno Pova 6 Pro లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై ఉన్నాయి.

The post MWC 2024: 108MP కెమెరాతో వస్తోన్న Tecno Pova 6 Pro; డివైజ్‌ని రివీల్ చేసిన టెక్నో! first appeared on 91Mobiles Telugu.

]]>
Infinix: పవర్ఫుల్ ప్రాసెసర్‌తో లాంచ్ కానున్న GT Ultra 5G గేమింగ్ ఫోన్ https://www.91mobiles.com/telugu/infinix-gt-ultra-5g-gaming-phone-to-launch-with-powerful-processor/ Mon, 26 Feb 2024 05:05:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=10418 ప్రస్తుతం స్పెయిన్ లోని బార్సిలోనా నగరంలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఈవెంట్ జరుగుతోంది. అక్కడ అన్ని బ్రాండ్స్ కి చెందిన అప్‌కమింగ్ ఫోన్లను ప్రదర్శిస్తున్నారు. Infinix సంస్థ కూడా తాను త్వరలో లాంచ్ చేయబోయే గేమింగ్ స్మార్ట్‌ఫోన్ Infinix GT Ultra 5G ని ఎండబ్ల్యూసీ 2024 లో ప్రదర్శించింది. పవర్ఫుల్ చిప్సెట్ తో ఈ ఫోన్ వస్తోంది. అయితే కంపెనీ Infinix GT Ultra 5G యొక్క ఫీచర్స్, లాంచ్ తేదీని వెల్లడించలేదు. కానీ, […]

The post Infinix: పవర్ఫుల్ ప్రాసెసర్‌తో లాంచ్ కానున్న GT Ultra 5G గేమింగ్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Infinix GT Ultra 5G
  • ఎండబ్ల్యూసీ 2024 లో ప్రదర్శన
  • డైమెన్సిటీ 9300 చిప్‌తో రానున్న డివైజ్

ప్రస్తుతం స్పెయిన్ లోని బార్సిలోనా నగరంలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఈవెంట్ జరుగుతోంది. అక్కడ అన్ని బ్రాండ్స్ కి చెందిన అప్‌కమింగ్ ఫోన్లను ప్రదర్శిస్తున్నారు. Infinix సంస్థ కూడా తాను త్వరలో లాంచ్ చేయబోయే గేమింగ్ స్మార్ట్‌ఫోన్ Infinix GT Ultra 5G ని ఎండబ్ల్యూసీ 2024 లో ప్రదర్శించింది. పవర్ఫుల్ చిప్సెట్ తో ఈ ఫోన్ వస్తోంది. అయితే కంపెనీ Infinix GT Ultra 5G యొక్క ఫీచర్స్, లాంచ్ తేదీని వెల్లడించలేదు. కానీ, ఇదే సంవత్సరంలో ఫోన్ లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

డైమెన్సిటీ 9300 చిప్సెట్ తో వస్తోన్న Infinix GT Ultra 5G

  • త్వరలో Infinix నుంచి ఒక గేమింగ్ ఫ్లాగ్షిప్ ఫోన్ లాంచ్ కానుందని ఇన్ఫినిక్స్ వెల్లడించింది.
  • Infinix GT Ultra 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకా వస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ ఈ ఫోన్ లో ఉంటుంది.
  • ఈ చిప్సెట్ గల Infinix GT Ultra 5G యొక్క అంటుటు బెంచ్‌మార్క్ స్కోర్ 2215639 గా ఉంటుందని కంపెనీ చెబుతోంది.

Infinix ఇ-కలర్ షిప్ట్ టెక్నాలజీ

  • మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 లో Infinix కంపెనీ ఇ-కలర్ షిఫ్ట్ టెక్నాలజీని ప్రదర్శించింది. ఇది ఇ-ఇంక్ ప్రిజమ్ 3 ఫీచర్ ని కలిగి ఉంటుంది.
  • దీని ద్వారా యూజర్లు తమ ఫోన్ ని తమకు నచ్చిన విధంగా బ్యాటరీకి నష్టం కలగకుండా కస్టమైజ్ చేసుకోవచ్చు.

Infinix ఎయిర్‌చార్జ్ టెక్నాలజీ

  • ఇన్ఫినిక్స్ సంస్థ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఈవెంట్ లో AirCharge అనే మరొక టెక్నాలజీని పరిచయం చేసింది.
  • ఈ సాంకేతికత ద్వారా యూజర్లు కేబుల్ లేదా ఏదైనా చార్జింగ్ ప్యాడ్ సాయం లేకుండానే ఫోన్‌ని చార్జ్ చేయవచ్చు.
  • అంటే ఇన్ఫినిక్స్ తీసుకొచ్చిన ఎయిర్‌చార్జ్ టెక్నాలజీ ద్వారా మీరు మీ డివైజెస్ ని గాలిలోనే చార్జ్ చేసుకోవచ్చన్నమాట.
  • 20 సెంటీమీటర్ల దూరం మరియు 60 డిగ్రీల కోణం వరకు ఈ ఎయిర్‌చార్జ్ ద్వారా చార్జింగ్ చేసుకోవచ్చు.

Infinix ఎక్స్‌ట్రిమ్-టెంప్ బ్యాటరీ

  • Infinix సంస్థ బ్యాటరీ సమస్యలు, పరిధులను అధిగమించేందుకు ఎక్స్‌ట్రిమ్-టెంప్ బ్యాటరీ అనే ఉపాయంతో వచ్చింది.
  • అతి శీతల పరిస్థితుల్లో కూడా బ్యాటరీలు పని చేసేందుకు వీలుగా బ్యాటరీలను బయోమిమెటిక్ ఎలక్ట్రోలైట్ మరియు ఫ్యూజన్ సాలిడ్-స్టేట్ టెక్నాలజీతో అనుసంధానం చేయనున్నారు.
  • దీంతో బ్యాటరీలు -40 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద కూడా ఏ ఆటంకం లేకుండా పని చేస్తాయి.

The post Infinix: పవర్ఫుల్ ప్రాసెసర్‌తో లాంచ్ కానున్న GT Ultra 5G గేమింగ్ ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
MWC 2024 ఈవెంట్‌లో భారత్‌తో పాటు గ్లోబల్‌గా లాంచ్ కానున్న Xiaomi 14? https://www.91mobiles.com/telugu/xiaomi-14-india-and-global-launch-likely-mwc-2024/ Wed, 27 Dec 2023 14:34:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=9462 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi ఈ ఏడాది అక్టోబర్ నెలలో Xiaomi 14 సిరీస్ ని లాంచ్ చేసింది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో వచ్చిన ఈ సిరీస్ కేవలం చైనా మార్కెట్ లో మాత్రమే లాంచ్ అయ్యింది. ఈ తరుణంలో, యూజర్లు Xiaomi 14 గ్లోబల్ మరియు ఇండియా లాంచ్ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా Xiaomi 14 గ్లోబల్ మరియు ఇండియా లాంచ్ కి సంబంధించిన సమాచారం […]

The post MWC 2024 ఈవెంట్‌లో భారత్‌తో పాటు గ్లోబల్‌గా లాంచ్ కానున్న Xiaomi 14? first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Xiaomi 14
  • MWC 2024 ఈవెంట్‌లో లాంచ్ అయ్యే అవకాశం
  • Snapdragon 8 Gen 3 చిప్‌తో వస్తోన్న Xiaomi 14

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi ఈ ఏడాది అక్టోబర్ నెలలో Xiaomi 14 సిరీస్ ని లాంచ్ చేసింది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ తో వచ్చిన ఈ సిరీస్ కేవలం చైనా మార్కెట్ లో మాత్రమే లాంచ్ అయ్యింది. ఈ తరుణంలో, యూజర్లు Xiaomi 14 గ్లోబల్ మరియు ఇండియా లాంచ్ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా Xiaomi 14 గ్లోబల్ మరియు ఇండియా లాంచ్ కి సంబంధించిన సమాచారం 91మొబైల్స్ కి అందింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

MWC 2024 లో అనౌన్స్ కానున్న Xiaomi 14

  • టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ ప్రకారం, Xiaomi 14 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఈవెంట్ లో లాంచ్ కానుందని సమాచారం.
  • MWC 2024 ఫిబ్రవరి 26, 29 తేదీల్లో జరిగే అవకాశం ఉంది. ఫిబ్రవరి 25 న లాంచ్ ఈవెంట్ జరగుతుందని భావిస్తున్నారు.
  • అదే రోజున భారత్ లో కూడా Xiaomi 14 సిరీస్ ఫోన్లు లాంచ్ అవుతాయని టిప్‌స్టర్ తెలిపారు.
  • Xiaomi 14 ఇటీవలె బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) వెబ్‌సైట్ పై కనిపించింది.

Xiaomi 14 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Xiaomi 14 లో 6.36-ఇంచ్ సీ8 1.5కే ఓఎల్ఈడీ 12-బిట్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+ సపోర్ట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Xiaomi 14 లో లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ వాడారు. ఇది 4 నానో మీటర్ ప్రాసెస్ పై తయారైంది.
  • మెమొరీ: Xiaomi 14 లో 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 1టిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉన్నాయి.
  • కెమెరా: Xiaomi 14 లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ లెన్స్, 50ఎంపి జెఎన్1 అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఒవి32బి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: Xiaomi 14 లో పవర్ బ్యాకప్ కోసం 4,160 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Xiaomi 14 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Xiaomi 14 లో యూఎస్బీ 3.2 జెన్ 1 పోర్ట్, ఐపీ68 రేటింగ్, వై-ఫై 7, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.4, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ ఉన్నాయి.

The post MWC 2024 ఈవెంట్‌లో భారత్‌తో పాటు గ్లోబల్‌గా లాంచ్ కానున్న Xiaomi 14? first appeared on 91Mobiles Telugu.

]]>