Netflix India - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 30 Jan 2023 12:13:17 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Netflix లో దూసుకెళ్తోన్న మాస్ మహారాజా నటించిన ధమాకా! https://www.91mobiles.com/telugu/mass-maharaja-raviteja-dhamaka-trending-number-2-netflix-ott/ Mon, 30 Jan 2023 12:12:03 +0000 https://www.91mobiles.com/telugu/?p=4689 రవితేజ నటించిన లేటెస్ట్ సినిమా ధమాకా థియేటర్లలో బంపర్ హిట్ అయ్యింది. వినోదంతో పాటు, యాక్షన్ అంశాలతో కూడిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక రవితేజ సినిమాలంటే యాక్షన్ కామెడీ చిత్రాలే గుర్తుకువస్తాయి. ఆ జోనర్ మాస్ మహారాజాకి బాగా కలిసొచ్చిన జోనర్. మాస్ మహారాజా చిత్రాలంటే ఇటు యూత్, అటు ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయి. దీంతో సినిమా బాగుంటే కాసుల వర్షం కురవడం ఖాయమే. ఎన్నో రోజులుగా సరైన […]

The post Netflix లో దూసుకెళ్తోన్న మాస్ మహారాజా నటించిన ధమాకా! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోన్న లేటెస్ట్ సినిమా ధమాకా
  • ప్రస్తుతం టాప్-10 మూవీస్ లో ట్రెండ్ అవుతోన్న ధమాకా చిత్రం
  • ధమాకా చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన రవితేజ, శ్రీలీల.. దర్శకత్వం వహించిన త్రినాథరావు నక్కిన

రవితేజ నటించిన లేటెస్ట్ సినిమా ధమాకా థియేటర్లలో బంపర్ హిట్ అయ్యింది. వినోదంతో పాటు, యాక్షన్ అంశాలతో కూడిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక రవితేజ సినిమాలంటే యాక్షన్ కామెడీ చిత్రాలే గుర్తుకువస్తాయి. ఆ జోనర్ మాస్ మహారాజాకి బాగా కలిసొచ్చిన జోనర్. మాస్ మహారాజా చిత్రాలంటే ఇటు యూత్, అటు ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయి. దీంతో సినిమా బాగుంటే కాసుల వర్షం కురవడం ఖాయమే.

ఎన్నో రోజులుగా సరైన హిట్ లేని రవితేజకి దర్శకుడు త్రినాథ రావు నక్కిన అద్భుతమైన విజయాన్ని అందించారు. ధమాకా దనాదన్ హిట్టు సాధించడంతో బాక్సాఫీస్ వద్ద మరోసారి రవితేజ మాస్ జాతర కొనసాగింది. ఇక థియెట్రికల్ రన్ సక్సెస్‌ఫుల్ గా ముగుంచికుని ఓటీటీలోకి వచ్చిన ధమాకా చిత్రం అక్కడ కూడా వంద మార్కులు సంపాదించింది.

ధమాకా చిత్రం కోసం ఎదురు చూసిన ఓటీటీ ఆడియన్స్ కోసం వారం క్రితం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీకి వచ్చిన సినిమా ఓ రేంజ్ లో దూసుకెళ్తోంది. ప్రస్తుతం టాప్-2 లో ట్రెండ్ అవుతోందని నెట్‌ఫ్లిక్స్ అఫీషియల్ గా ప్రకటించింది. దీంతో మాస్ మహారాజా చిత్రానికి ఓటీటీ ఆడియన్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అర్థమవుతోంది.

మాస్ అంశాలు పుష్కలంగా ఉండటం, రవితేజ యాక్షన్, శ్రీలీల అందం, భీమ్స్ సంగీతం, దర్శకుడి ప్రతిభ వెరసి ధమాకా చిత్రం ఓటీటీలో తన విజయపరంపరను కొనసాగిస్తోంది.

ధమాకా చిత్ర కథ

ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు. కథ విషయానికి వస్తే, కథానాయకుడి తండ్రి నుంచి కంపెనీని లాగేసుకోవాలని శతవిధాలా ప్రయత్నించే విలన్ ని హీరో ఎలా నిలువరించాడన్నదే కథ. కథానాయికగా శ్రీలీల నటించింది. విలన్ పాత్రలో జయరామ్ నటించారు. రావు రమేశ్, పవిత్ర లోకేశ్, సచిన్ ఖేడేకర్, తనికెళ్ళ భరణి, తులసి, అలీ, హైపర్ ఆది చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు.

ధమాకా చిత్రానికి త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహించారు. ప్రసన్న కుమార్ బెజవాడ కథను సమకూర్చారు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చేశారు. భీమ్స్ సెసిరొలియో సంగీతం అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈ చిత్రం నిర్మితమైంది.

ధమాకా బాక్సాఫీస్

రవితేజ, శ్రీలీల ప్రధాన పాత్రల్లో, త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ధమాకా చిత్రం 2022 డిసెంబర్ 23 న థియేటర్లలో విడుదలైంది. క్రిటిక్స్ నుంచి ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ప్రేక్షకుల పాజిటివ్ మౌత్ టాక్ కారణంగా వెంటనే పుంజుకుంది. రూ.40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.110 కోట్లను కలెక్ట్ చేసి మాస్ మహారాజా కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Netflix లో దూసుకెళ్తోన్న మాస్ మహారాజా నటించిన ధమాకా! first appeared on 91Mobiles Telugu.

]]>
ఇవాళ OTT లోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు సినిమాలు ఇవే https://www.91mobiles.com/telugu/four-telugu-films-streaming-on-ott-today/ Fri, 09 Dec 2022 09:38:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=3903 హైలైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5, ఆహా, నెట్‌ఫ్లిక్స్ లలో స్ట్రీమ్ కానున్న పలు తెలుగు సినిమాలు ఓటీటీ ఆడియన్స్ ని పలకరించనున్న నితిన్ మాచర్ల నియోజకవర్గం, అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షసివో, యశోద చిత్రాలు సోని లివ్ లో అందుబాటులో ఉన్న లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ సినిమా శుక్రవారం వచ్చిందంటే సినీ ప్రేమికులకు పండగేనని చెప్పాలి. ఎందుకంటే ఇదే రోజున ఎక్కువగా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఇటీవలి కాలంలో, ఓటీటీల ప్రభావం కూడా చాలా […]

The post ఇవాళ OTT లోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు సినిమాలు ఇవే first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5, ఆహా, నెట్‌ఫ్లిక్స్ లలో స్ట్రీమ్ కానున్న పలు తెలుగు సినిమాలు
  • ఓటీటీ ఆడియన్స్ ని పలకరించనున్న నితిన్ మాచర్ల నియోజకవర్గం, అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షసివో, యశోద చిత్రాలు
  • సోని లివ్ లో అందుబాటులో ఉన్న లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ సినిమా

శుక్రవారం వచ్చిందంటే సినీ ప్రేమికులకు పండగేనని చెప్పాలి. ఎందుకంటే ఇదే రోజున ఎక్కువగా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఇటీవలి కాలంలో, ఓటీటీల ప్రభావం కూడా చాలా పెరిగింది. దీంతో థియేటర్లలో సినిమాలను మిస్ అయ్యే వారు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు ఒకేసారి 4 సినిమాలు ఓటీటీ లో స్ట్రీమింగ్ కి వచ్చేశాయి. ఆ సినిమాలేంటో తెలుసుకుందాం పదండి.

1.మాచర్ల నియోజకవర్గం
2.యశోద
3.ఊర్వశివో రాక్షసివో
4.లైక్-షేర్ & సబ్‌స్క్రైబ్

1.మాచర్ల నియోజకవర్గం

నితిన్, కృతిశెట్టి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో నితిన్ కలెక్టర్ గా కనిపించారు. పొలిటికల్ త్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా థియేటర్లలో పర్వాలేదనిపించింది. అయితే కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. మరి ఓటీటీ ఆడియన్స్ ని అయినా మెప్పిస్తుందో లేదో చూడాలి. ఈ చిత్రం జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది.

2.యశోద

సమంతా ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం ఇటీవలె థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఓపెనింగ్స్ బాగానే రాబట్టినప్పటికీ, తర్వాత అదే ఊపుని కొనసాగించలేకపోయింది. దీంతో త్వరగానే థియేటర్ల నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. సమంతా ఈ చిత్రంలో పోరాట సన్నివేశాల్లో కూడా నటించి మెప్పించింది. వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, దివ్య శ్రీపాద ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి హరి-హరీశ్ దర్శకత్వం వహించారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. శివలెంక కే ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఈ చిత్రం అందుబాటులో ఉంది.

3.ఊర్వశివో రాక్షసివో

ఈ చిత్రంలో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రలు పోషించారు. రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేటి నుంచి ఆహా ఓటీటీ తో పాటు, నెట్‌ఫ్లిక్స్ లో కూడా స్ట్రీమ్ అవుతోంది. వివాహం గొప్పదా లేక లివ్-ఇన్ రిలేషన్షిప్ బెటరా? అనే విషయాన్ని ఈ చిత్రంలో చర్చించారు.

4.లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్

ఈ చిత్రంలో సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, సుదర్శన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా సోనిలివ్ ఓటీటీ లో అందుబాటులో ఉంది. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. రాము తూము ఎడిటింగ్ చేశాడు. ప్రవీణ్ లక్కరాజు ఈ చిత్రానికి సంగీతం అందించాడు.

మరింకేంటి, ఈ 4 తెలుగు సినిమాలని చూసేసి ఈ వీకెండ్ ని బాగా ఎంజాయ్ చేయండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఇవాళ OTT లోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు సినిమాలు ఇవే first appeared on 91Mobiles Telugu.

]]>
Netflix లో మిమ్మల్ని భయపెట్టే 5 తెలుగు సినిమాలు https://www.91mobiles.com/telugu/telugu-horror-films-on-netflix/ Tue, 15 Nov 2022 09:40:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=3432 Netflix లో టాప్-5 తెలుగు హారర్ సినిమాలు సినీ ప్రేమికుల్లో హారర్ చిత్రాలను ఇష్టపడే ఓ ప్రత్యేక వర్గం ఉంటుంది. హారర్ చిత్రం వచ్చిందంటే వారికి పండగేనని చెప్పాలి. రాత్రివేళ దుప్పటి కప్పుకుని భయపడుతూ చూసే హారర్ మూవీ లవర్స్ కొందరైతే, నన్నేది భయపెట్టలేదని ధైర్యంగా చూసే వారు మరికొందరు. ఎలా అయితేనేం, హారర్ చిత్రాల పట్ల ఉన్న మక్కువతో భయం ఉన్నా ఏకపోయినా వాటిని ఎంజాయ్ చేయక మానరు. హారర్ చిత్రాల దర్శకులు తమ వినూత్నమైన […]

The post Netflix లో మిమ్మల్ని భయపెట్టే 5 తెలుగు సినిమాలు first appeared on 91Mobiles Telugu.

]]>

Netflix లో టాప్-5 తెలుగు హారర్ సినిమాలు

సినీ ప్రేమికుల్లో హారర్ చిత్రాలను ఇష్టపడే ఓ ప్రత్యేక వర్గం ఉంటుంది. హారర్ చిత్రం వచ్చిందంటే వారికి పండగేనని చెప్పాలి. రాత్రివేళ దుప్పటి కప్పుకుని భయపడుతూ చూసే హారర్ మూవీ లవర్స్ కొందరైతే, నన్నేది భయపెట్టలేదని ధైర్యంగా చూసే వారు మరికొందరు. ఎలా అయితేనేం, హారర్ చిత్రాల పట్ల ఉన్న మక్కువతో భయం ఉన్నా ఏకపోయినా వాటిని ఎంజాయ్ చేయక మానరు. హారర్ చిత్రాల దర్శకులు తమ వినూత్నమైన ఐడియాలతో సన్నివేశాలను తీర్చిదిద్ది ప్రేక్షకులను మరింతగా భయపెడతారు.

ఇప్పుడు ఓటీటీ కంటెంట్ కి జనాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంట్లో కూర్చొని కావాల్సిన జోనర్ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. మరి నెట్‌ఫ్లిక్స్ లో మిమ్మల్ని భయపెట్టే పలు చిత్రాలు ఉన్నాయి. వాటిలో కొన్ని తెలుగు హారర్ చిత్రాలను ఇక్కడ అందిస్తున్నాం. ఆ సినిమాలను చూడకపోతే చూసేయండి. ఒకవేళ ఇదివరకే చూస్తే, మరోసారి స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించండి.

1. గేమ్ ఓవర్

సైకలాజికల్ హారర్ త్రిల్లర్ గా వచ్చిన గేమ్ ఓవర్ లో తాప్సీ పన్ను ప్రధాన పాత్ర పోషించింది. ఈ చిత్రానికి అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ఆద్యాంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. తాప్సీ నటన, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఈ చిత్రానికి ప్రధాన బలాలు. తెలుగు, తమిళ వర్షన్స్ లో ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

2. ఆవిరి

నటుడు, దర్శకుడు రవి బాబు దర్శకత్వంలో 2019 లో వచ్చిన చిత్రం ‘ఆవిరి’. ఆవిరి చిత్రంలో నేహా చౌహాన్, ప్రియా వడ్లమాని, రవి బాబు, శ్రీ ముక్తా, హిమజ, భరణి శంకర్ ప్రధాన పాత్రలు పోషించారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ హారర్ త్రిల్లర్ ని నెట్‌ఫ్లిక్స్ లో చూడండి.

3. భూమిక

ఆర్. రతీంద్రన్ ప్రసాద్ దర్శకత్వంలో 2021 లో వచ్చిన తమిళ సినిమా భూమిక. మాధురి జైన్, అవంతికా, ఐశ్వర్యా రాజేశ్, మాధురి ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. నేరుగా ఈ చిత్రం ఓటీటీ లో విడుదలైంది. తెలుగులో కూడా ఈ చిత్రం అందుబాటులో ఉంది. నెట్‌ఫ్లిక్స్ లో ఈ చిత్రాన్ని చూడండి.

4. గృహం

సిద్ధార్థ్, ఆండ్రియా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. 2017 లో The House Next Door గా తమిళంలో వచ్చిన ఈ చిత్రాన్ని గృహం పేరుతో తెలుగు లో విడుదల చేశారు. మిలింద్ రావ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అనీశా విక్టర్ కీలక పాత్ర పోషించారు. ఈ హారర్ త్రిల్లర్ నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

5. అంధకారం

అర్జున్ దాస్ ప్రధాన పాత్ర పోషించిన తమిళ సినిమా అంధకారం. దీని తెలుగు వర్షన్ నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. అంధకారం చిత్రంలో పూజా రామచంద్రన్, వినోద్ కిషన్, మిషా ఘోషాల్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి వి. విజ్ఞరాజన్ దర్శకత్వం వహించాడు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Netflix లో మిమ్మల్ని భయపెట్టే 5 తెలుగు సినిమాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Netflix లో దూసుకెళ్తోన్న నాగార్జున నటించిన ‘The Ghost’ https://www.91mobiles.com/telugu/the-ghost-starring-nagarjuna-trending-number-1-on-netflix-india/ Tue, 08 Nov 2022 13:44:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=3315 హైలైట్స్ Netflix లో దూసుకెళ్తోన్న ‘ది ఘోస్ట్’ ప్రధాన పాత్రలు పోషించిన నాగార్జున, సోనాల్ చౌహన్. ముఖ్య పాత్రల్లో కనిపించిన గుల్ పనాగ్, అనికా సురేంద్రన్ తెలుగు, హిందీ, తమిళ భాషల్లో అందుబాటులో ఉన్న ‘ది ఘోస్ట్’ కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘ది ఘోస్ట్’ చిత్రం రూపొందింది. ఇటీవలె థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రానికి యాక్షన్ లవర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఓవరాల్ రేస్ లో నెగ్గలేకపోయింది. […]

The post Netflix లో దూసుకెళ్తోన్న నాగార్జున నటించిన ‘The Ghost’ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • Netflix లో దూసుకెళ్తోన్న ‘ది ఘోస్ట్’
  • ప్రధాన పాత్రలు పోషించిన నాగార్జున, సోనాల్ చౌహన్. ముఖ్య పాత్రల్లో కనిపించిన గుల్ పనాగ్, అనికా సురేంద్రన్
  • తెలుగు, హిందీ, తమిళ భాషల్లో అందుబాటులో ఉన్న ‘ది ఘోస్ట్’

కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘ది ఘోస్ట్’ చిత్రం రూపొందింది. ఇటీవలె థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రానికి యాక్షన్ లవర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఓవరాల్ రేస్ లో నెగ్గలేకపోయింది. అయితేనేం, వెంటనే ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన ది ఘోస్ట్ తన సత్తా చూపిస్తోంది. త్రిల్లింగ్ యాక్షన్, ఎమోషనల్ కంటెంట్ తో ఈ చిత్రం తెరకెక్కింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్ట్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై శరత్ మరార్, సునీల్ నారంగ్, రామ్మోహన్ రావు పుస్కూరు ఈ చిత్రాన్ని నిర్మించారు.

Netflix లో ప్రసారమవుతోన్న The Ghost

థియెట్రికల్ రన్ ని ముగించుకున్న ‘ది ఘోస్ట్’ ఓటీటీ లో ప్రదర్శితమవుతోంది. నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్ర డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో టాప్ 1, టాప్ 2 ప్లేసెస్ లో ఈ చిత్రం ట్రెండ్ అవుతోంది. జనాలను ఈ చిత్రంలోని యాక్షన్ అమితంగా ఆకట్టుకుందని అర్థమవుతోంది. నాగార్జున నటన, ఎమోషన్, యాక్షన్ కొరియోగ్రఫీ, రిచ్‌నెస్ ఈ చిత్రానికి ప్రధాన బలాలు. చిత్రకథ సాధారణమైనదే అయినప్పటికీ, యాక్షన్ సీక్వెన్స్ ని జనాలు ఎంజాయ్ చేస్తారు.

ది ఘోస్ట్ చిత్రానికి భరత్ సౌరభ్ సంగీతం సమకూర్చారు. వీరు అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. సినిమాను నేపథ్య సంగీతం ఒక లెవెల్ పైకి తీసుకెళ్ళింది. ఖడ్గంతో నాగార్జున విలన్స్ ని మట్టుబెట్టే సన్నివేశాలు, చేజింగ్ సీన్స్ ఆకట్టుకుంటాయి. దుబాయ్ లో మొదలయ్యే సినిమా తర్వాత ఊటీ కి చేరుతుంది. ఊటీలో చిత్రీకరణ బాగుంది.

ఎవరెలా చేశారు?

కింగ్ నాగార్జున, ఈ చిత్రంలో విక్రమ్ అనే రా ఏజెంట్ పాత్రలో కనిపిస్తారు. తన అక్క, మేనకోడలిని కాపాడుకునేందుకు ఆయన అనుక్షణం పోరాడుతుంటారు. ఎమోషనల్ సన్నివేశాల్లో, యాక్షన్ సీన్స్ లో నాగ్ నటన అదరహో అనిపించింది. కథానాయిక సోనాల్ చౌహన్ కూడా చక్కటి పాత్రలో కనిపించింది. పోరాట సన్నివేశాల్లో సోనాల్ మెప్పించింది. మేనకోడలి పాత్రలో అనికా సురేంద్రన్ నేచురల్ గా కనిపించింది. నాగ్ అక్కగా నటించిన గుల్ పనాగ్ హుందాగా కనిపించారు.

సినిమాని ఎంజాయ్ చేయొచ్చా?

ది ఘోస్ట్ చిత్రం యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి కచ్చితంగా నచ్చుతుంది. హింస కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఖడ్గాలతో ఫైట్స్ ఉండటం వల్లన రక్తపాతం ఎక్కువ కనిపిస్తుంది. కానీ, అది కూడా వెరైటీగానే ఉంటుంది. నాగార్జునకి ఆయన మేనకోడలికి మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి. తన మేనకోడలిని క్రమశిక్షణలో పెట్టే క్రమంలో వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. ఓవరాల్ గా సినిమాను ఎంజాయ్ చేయవచ్చు. మరింకెందుకు ఆలస్యం మీరు గనుక ‘ది ఘోస్ట్’ ఇంకా చూడకపోతే వెంటనే నెట్‌ఫ్లిక్స్ ద్వారా చూసేయండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Netflix లో దూసుకెళ్తోన్న నాగార్జున నటించిన ‘The Ghost’ first appeared on 91Mobiles Telugu.

]]>
నాగార్జున నటించిన The Ghost మూవీ OTT అప్డేట్ https://www.91mobiles.com/telugu/nagarjuna-the-ghost-movie-ott-update-premiere-on-netflix/ Wed, 26 Oct 2022 16:08:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=3088 హైలైట్స్ స్ట్రీమింగ్ పార్ట్నర్ ని ఖరారు చేసుకున్న The Ghost మూవీ నవంబర్ 2 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం కానున్న చిత్రం ప్రధాన పాత్రల్లో నటించిన నాగార్జున, సోనాల్ చౌహన్, గుల పనాగ్, అనికా సురేంద్రన్ కింగ్ నాగార్జున నటించిన యాక్షన్ త్రిల్లర్ ది ఘోస్ట్ ఇటీవలె ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ తోనే ఈ సినిమా ఆడియన్స్ లో మాంచి బజ్ క్రియేట్ చేసింది. అయితే విడుదల తర్వాత ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని […]

The post నాగార్జున నటించిన The Ghost మూవీ OTT అప్డేట్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • స్ట్రీమింగ్ పార్ట్నర్ ని ఖరారు చేసుకున్న The Ghost మూవీ
  • నవంబర్ 2 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం కానున్న చిత్రం
  • ప్రధాన పాత్రల్లో నటించిన నాగార్జున, సోనాల్ చౌహన్, గుల పనాగ్, అనికా సురేంద్రన్

కింగ్ నాగార్జున నటించిన యాక్షన్ త్రిల్లర్ ది ఘోస్ట్ ఇటీవలె ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ తోనే ఈ సినిమా ఆడియన్స్ లో మాంచి బజ్ క్రియేట్ చేసింది. అయితే విడుదల తర్వాత ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేక పోయింది. సినిమాను సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయకపోవడంతో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే యాక్షన్ లవర్స్ కి మాత్రం ఈ చిత్రం నచ్చే విధంగా ఉంది. ఏదేమైనా కాసులు కురిస్తేనే సినిమా హిట్టైనట్లు కదా. ఆ లెక్కన చూస్తే ఈ చిత్రం నిరాశనే మిగిల్చింది. ఈ చిత్రంలో నాగార్జున ప్రధాన పాత్రధారి. ఆయన సరసన సోనాల్ చౌహన్ నటించింది. గరుడ వేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకుడు.

తాజాగా ది ఘోస్ట్ చిత్రం ఓటీటీ భాగస్వామిని ఖరారు చేసుకుంది. ఓటీటీ దిగ్గజం Netflix ఈ చిత్ర డిజిటల్ హక్కులను కైవసం చేసుకుంది. నవంబర్ 2 నుంచి ది ఘోస్ట్ చిత్రం నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. థియేటర్లలో సినిమా బాగా ఆడలేదు కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ తెరకెక్కించిన విధానం, స్టైలిష్ గా వాటిని ప్రజెంట్ చేసిన తీరుకి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. సినిమా కథకు బ్లాక్ బస్టర్ అయ్యే సత్తా ఉంది కానీ, దర్శకుడు తన ఆలోచనలను ప్రజెంట్ చేయడంలో తడబడినట్లు పలువురు అభిప్రాయపడ్డారు.

ది ఘోస్ట్ చిత్రంలో నాగార్జున, సోనాల్ చౌహన్ కాకుండా, ఇంకా గుల్ పనాగ్, అనికా సురేంద్రన్, మనీశ్ చౌదరి, రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, బిలాల్ హొస్సేన్ ముఖ్య పాత్రలు పోషించారు. తొలుత కథానాయిక పాత్రకి కాజల్ అగర్వాల్ ని అనుకున్నారు. కానీ ప్రెగ్నెన్సీ కారణంగా కాజల్ డేట్స్ సర్దుబాటు చేయకపోవడంతో ఆ అవకాశం సోనాల్ కి దక్కింది.

సోనాలి రంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ & నార్త్ స్టార్ ఎంటర్టెయిన్మెంట్ బ్యానర్స్ పై ‘ది ఘోస్ట్’ చిత్రాన్ని సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించారు. ఈ చిత్రానికి భరత్-సౌరభ్ మరియు మార్క్ కే రాబిన్ సంగీతం అందించారు. మార్క్ కే రాబిన్ ది ఘోస్ట్ కి నేపథ్య సంగీతం సమకూర్చారు. ముకేశ్ జి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్ గా చేశారు.

చిత్ర కథ:

ఈ చిత్ర కథ ఇంటర్‌పోల్ ఫీల్డ్ ఏజెంట్ విక్రమ్ చుట్టూ తిరుగుతుంది. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కుమారుడిని రక్షించే మిషన్ పై ఉంటాడు విక్రమ్. యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్, గత జ్ఞాపకాలు పీడ కలల్లా వెంటాడుతున్నప్పటికీ, విక్రమ్ ఈ మిషన్ ని ఎంచుకుంటాడు. అయితే తర్వాత మరింత ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్తాడు విక్రమ్.

ఇక అటు తర్వాత జరిగిన వరుస సంఘటనలు ఎటువంటి మలుపులకు దారి తీశాయి, అలాగే తన సమస్యలతో పోరాడటంతో పాటు, మరోవైపు అండర్ వరల్డ్ ని ఎలా ఎదుర్కున్నాడనేది చిత్ర మిగతా కథ.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post నాగార్జున నటించిన The Ghost మూవీ OTT అప్డేట్ first appeared on 91Mobiles Telugu.

]]>