Netflix - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Sun, 20 Aug 2023 18:05:21 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 రూ.1,099, రూ.1,499 ప్రీపెయిడ్ ప్లాన్స్ లాంచ్ చేసిన Jio; ఉచిత నెట్‌ఫ్లిక్స్ తో పాటు మరెన్నో ప్రయోజనాలు! https://www.91mobiles.com/telugu/jio-new-prepaid-plans-free-netflix-subscription-other-benefits/ Sun, 20 Aug 2023 18:05:21 +0000 https://www.91mobiles.com/telugu/?p=7663 ప్రీపెయిడ్ ప్లాన్స్ తో ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్స్ ని ఆఫర్ చేస్తోన్న మొట్టమొదటి టెలీకామ్ ఆపరేటర్ గా జియో నిలిచింది. జియో తో సహా, ఇతర టెలీకామ్ ఆపరేటర్లు ఇప్పటికే ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ని పోస్ట్‌పెయిడ్ మరియు బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ద్వారా అందిస్తున్నాయి. ఇప్పుడు ముకేశ్ అంబాని నేతృత్వంలోని టెలీకామ్ ఆపరేటర్ జియో ఒక అడుగు ముందుకేసింది. ప్రీపెయిడ్ ప్లాన్స్ తో కూడా నెట్‌ఫ్లిక్స్ ని ఉచితంగా అందిస్తోంది. జియో తాజాగా తీసుకొచ్చిన ప్రీపెయిడ్ ప్లాన్స్ […]

The post రూ.1,099, రూ.1,499 ప్రీపెయిడ్ ప్లాన్స్ లాంచ్ చేసిన Jio; ఉచిత నెట్‌ఫ్లిక్స్ తో పాటు మరెన్నో ప్రయోజనాలు! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ లాంచ్ చేసిన జియో
  • ప్లాన్స్ తో లభించనున్న ఉచిత మొబైల్ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్
  • ఇప్పటికే పోస్ట్‌పెయిడ్ ప్లస్ పై అందుబాటులో ఉన్న నెట్‌ఫ్లిక్స్ ఆఫర్

ప్రీపెయిడ్ ప్లాన్స్ తో ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్స్ ని ఆఫర్ చేస్తోన్న మొట్టమొదటి టెలీకామ్ ఆపరేటర్ గా జియో నిలిచింది. జియో తో సహా, ఇతర టెలీకామ్ ఆపరేటర్లు ఇప్పటికే ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ని పోస్ట్‌పెయిడ్ మరియు బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ద్వారా అందిస్తున్నాయి. ఇప్పుడు ముకేశ్ అంబాని నేతృత్వంలోని టెలీకామ్ ఆపరేటర్ జియో ఒక అడుగు ముందుకేసింది. ప్రీపెయిడ్ ప్లాన్స్ తో కూడా నెట్‌ఫ్లిక్స్ ని ఉచితంగా అందిస్తోంది.

జియో తాజాగా తీసుకొచ్చిన ప్రీపెయిడ్ ప్లాన్స్ ద్వారా ఉచిత నెట్‌ఫ్లిక్స్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ఈ ప్లాన్స్ ద్వారా 84 రోజుల వ్యాలిడిటీని కస్టమర్స్ పొందుతారు. సరే, ప్లాన్స్ యొక్క ధర, ఇతర ప్రయోజనాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Jio రూ.1,099 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

  • జియో పరిచయం చేసిన ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లకు అపరిమిత వాయిస్ కాలింగ్, డెయిలీ 2జిబి డేటా లభిస్తుంది.
  • ఇంకా జియో వెల్కమ్ ఆఫర్ లో భాగంగా ఎలిజిబుల్ కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా లభిస్తుంది.
  • ఇంకా జియో ఈ ప్లాన్ ద్వారా ఉచిత నెట్‌ఫ్లిక్స్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది.
  • ఈ సబ్‌స్క్రిప్షన్ ధర రూ.149 కాగా, 480p స్ట్రీమింగ్ ని యూజర్స్ తమ స్మార్ట్ ఫోన్లు మరియు ట్యాబ్‌లెట్స్ పై ఎంజాయ్ చేయవచ్చు.

Jio రూ.1,499 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు

  • జియో పరిచయం చేసిన రూ.1,499 ప్లాన్ ద్వారా కస్టమర్లకు డెయిలీ 3జిబి డేటా లభిస్తుంది.
  • ఇంకా జియో వెల్కమ్ ఆఫర్ లో భాగంగా అపరిమిత 5జీ డేటా కూడా లభిస్తుంది.
  • ఇంకా అపరిమిత వాయిస్ కాల్స్, ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తాయి.
  • నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ విలువ రూ.199. ఈ బేసిక్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా 720p స్ట్రీమింగ్ ని టీవీలు, కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లెట్స్ పై పొందవచ్చు.

మీరు గనుక నెట్‌ఫ్లిక్స్ ని కేవలం ఫోన్ లేదా ట్యాబ్‌లెట్ పై మాత్రమే చూస్తే, మీకు రూ.1,099 ప్రీపెయిడ్ ప్లాన్ సరిపోతుంది. కానీ, మీరు బిగ్ స్క్రీన్ పై నెట్‌ఫ్లిక్స్ ని ఉచితంగా ఎంజాయ్ చేయాలనుకుంటే, మీరు రూ.1,499 ప్లాన్ ని ఎంచుకోవాలి.

The post రూ.1,099, రూ.1,499 ప్రీపెయిడ్ ప్లాన్స్ లాంచ్ చేసిన Jio; ఉచిత నెట్‌ఫ్లిక్స్ తో పాటు మరెన్నో ప్రయోజనాలు! first appeared on 91Mobiles Telugu.

]]>
OTT: ఓటీటీల్లో ఉన్న బెస్ట్ తెలుగు సినిమాలు (2023) https://www.91mobiles.com/telugu/best-telugu-films-on-ott-2023/ Sun, 13 Aug 2023 17:52:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=7525 ఇప్పుడంతా ఓటీటీల హవా నడుస్తోంది. ఏ కొత్త సినిమా అయినా సరే, థియేటర్లలో విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీల్లో ప్రత్యక్షమవుతోంది. అయితే ఆడని సినిమాలు ఓటీటీల్లోకి త్వరగా రావడం మామూలు విషయమే. కానీ, ఇటీవలి కాలంలో థియేటర్లలో సినిమా ఆడినా, ఆడకపోయినా సరే, ఓటీటీల్లోకి వెంటనే వచ్చేస్తున్నాయి. థియెట్రికల్ రిలీజ్ కి ముందు నిర్మాతలు చేసుకున్న ఒప్పందాల మేరకు ఈ విధంగా డిజిటల్ రిలీజెస్ త్వరగా అవుతున్నాయని చెప్పవచ్చు. ఇక థియేటర్లలో సరిగా ఆడని సినిమాలను ఓటీటీ […]

The post OTT: ఓటీటీల్లో ఉన్న బెస్ట్ తెలుగు సినిమాలు (2023) first appeared on 91Mobiles Telugu.

]]>

ఇప్పుడంతా ఓటీటీల హవా నడుస్తోంది. ఏ కొత్త సినిమా అయినా సరే, థియేటర్లలో విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీల్లో ప్రత్యక్షమవుతోంది. అయితే ఆడని సినిమాలు ఓటీటీల్లోకి త్వరగా రావడం మామూలు విషయమే. కానీ, ఇటీవలి కాలంలో థియేటర్లలో సినిమా ఆడినా, ఆడకపోయినా సరే, ఓటీటీల్లోకి వెంటనే వచ్చేస్తున్నాయి. థియెట్రికల్ రిలీజ్ కి ముందు నిర్మాతలు చేసుకున్న ఒప్పందాల మేరకు ఈ విధంగా డిజిటల్ రిలీజెస్ త్వరగా అవుతున్నాయని చెప్పవచ్చు. ఇక థియేటర్లలో సరిగా ఆడని సినిమాలను ఓటీటీ సంస్థలు అంత ఈజీగా కొనడం లేదు. అంతేకదా, సినిమాలో దమ్ము లేకపోతే ఓటీటీల్లో అయినా ఏ ప్రేక్షకుడు చూస్తాడు చెప్పండి?

సరే, విషయంలోకి వద్దాం. 2023 లో విడుదలై ప్రస్తుతం ఓటీటీల్లో బాగా అలరిస్తోన్న తెలుగు సినిమాలేవో ఇక్కడ తెలుసుకుందాం. ఈ జాబితాలో మెగాస్టార్ నటించిన వాల్తేరు వీరయ్య, బాలయ్య నటించిన వీర సింహారెడ్డి, నాని నటించిన దసరా, నాగ శౌర్య ‘రంగబలి’ వంటి ఎన్నో చిత్రాలున్నాయి. సరే, పదండి మరి ఆ జాబితాపై ఓ లుక్ వేద్దాం.

Best Telugu Films On Netflix (2023)

రంగబలి

రంగబలి చిత్రం 2023 జులై 7 న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ లో చూసేందుకు అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో నాగశౌర్య, యుక్తి తరేజా ప్రధాన పాత్రలు పోషించారు.

  • సినిమా పేరు: రంగబలి
  • ఐఎండీబి రేటింగ్ – 4.9/10
  • ఎక్కడ చూడాలి – నెట్‌ఫ్లిక్స్
  • నటీనటులు – నాగశౌర్య, యుక్తి తరేజా
  • విడుదల తేదీ – 7 జులై 2023

వాల్తేరు వీరయ్య

వాల్తేరు వీరయ్య చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, శృతిహాసన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. 2023 జనవరి 12 న ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది.

  • సినిమా పేరు: వాల్తేరు వీరయ్య
  • ఐఎండిబి రేటింగ్– 6.2/10
  • ఎక్కడ చూడాలి – నెట్‌ఫ్లిక్స్
  • నటీనటులు – చిరంజీవి, రవితేజ, శృతిహాసన్
  • విడుదల తేదీ – 12 జనవరి 2023

దసరా

దసరా చిత్రంలో నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ చిత్రం 2023 మార్చి 30 న థియేటర్లలో విడుదలైంది.

  • సినిమా పేరు: దసరా
  • ఐఎండిబి రేటింగ్ – 6.7/10
  • ఎక్కడ చూడాలి – నెట్‌ఫ్లిక్స్
  • నటీనటులు – నాని, కీర్తి సురేశ్
  • విడుదల తేదీ – 30 మార్చి 2023

Best Telugu Films On Amazon Prime (2023)

ఆదిపురుష్

ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. రామాయణ గాథను స్పూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం 2023 జూన్ 16 న థియేటర్లలో విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఈ చిత్రం స్ట్రీమ్ అవుతోంది.

  • సినిమా పేరు: ఆదిపురుష్
  • ఐఎండీబి రేటింగ్ – 3.2/10
  • ఎక్కడ చూడాలి – అమెజాన్ ప్రైమ్ వీడియో
  • నటీనటులు – ప్రభాస్, కృతీసనన్
  • విడుదల తేదీ – 16 జూన్ 2023

రుద్రాంగి

జగపతి బాబు, మమతా మోహన్ దాస్ ప్రధాన పాత్రల్లో నటించిన రుద్రాంగి చిత్రం 2023 జులై 7 న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమ్ అవుతోంది. ఈ చిత్ర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. విభిన్న నేపథ్యం ఉన్న చిత్రాన్ని చూడాలనుకుంటే రుద్రాంగి ని చూసేయండి.

  • సినిమా పేరు: రుద్రాంగి
  • ఐఎమ్‌డిబి రేటింగ్ – 7.3/10
  • ఎక్కడ చూడాలి – అమెజాన్ ప్రైమ్ వీడియో
  • నటీనటులు – జగపతి బాబు, మమతా మోహన్ దాస్
  • విడుదల తేదీ – 7 July 2023

స్పై

నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య మేనెన్ ప్రధాన పాత్రలు పోషించిన స్పై సినిమా 2023 జూన్ 29 న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమ్ అవుతోంది.

  • సినిమా పేరు: స్పై
  • ఐఎండిబి రేటింగ్ – 5.4/10
  • ఎక్కడ చూడాలి – అమెజాన్ ప్రైమ్ వీడియో
  • నటీనటులు – నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య మేనెన్
  • విడుదల తేదీ – 29 జూన్ 2023

రావణాసుర

రవితేజ, దక్షా నగర్కర్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలు పోషించిన రావణాసుర చిత్రం 2023 ఏప్రిల్ 7 వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమ్ అవుతోంది.

  • సినిమా పేరు: రావణాసుర
  • ఐఎండిబి రేటింగ్र – 5.7/10
  • ఎక్కడ చూడాలి – అమెజాన్ ప్రైమ్
  • నటీనటులు – రవితేజ, దక్షా నగర్కర్, ఫరియా అబ్దుల్లా
  • విడుదల తేదీ – 7 ఏప్రిల్ 2023

Best Telugu Films on Disney+ Hotstar (2023)

వీరసింహారెడ్డి

వీరసింహారెడ్డి చిత్రం డిస్నీ+ హాట్‌స్టార్ లో అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో బాలకృష్ణ, హనీరోజ్, శృతీహాసన్ ప్రధాన పాత్రలు పోషించారు. 2023 జనవరి 11 న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది.

  • సినిమా పేరు: వీర సింహారెడ్డి
  • ఐఎండిబి రేటింగ్ – 4.9/10
  • ఎక్కడ చూడాలి – డిస్నీ+ హాట్‌స్టార్
  • నటీనటులు – బాలకృష్ణ, హనీరోజ్, శృతీహాసన్
  • విడుదల తేదీ – 11 జనవరి 2023

బిచ్చగాడు 2

బిచ్చగాడు 2 చిత్రంలో విజయ్ ఆంటోని, కావ్యా తాపర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా 2023 మే 19 వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం డిస్నీ+ హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది.

  • సినిమా పేరు: బిచ్చగాడు 2
  • ఐఎండిబి రేటింగ్ – 5.6/10
  • ఎక్కడ చూడాలి – డిస్నీ+ హాట్‌స్టార్
  • నటీనటులు – విజయ్ ఆంటోని, కావ్యా తాపర్
  • విడుదల తేదీ – 19 మే 2023

Best Telugu Films on Sony Liv (2023)

పరేషాన్

పరేషాన్ చిత్రంలో తిరువీర్, పావని కరణం ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా సోని లివ్ లో స్ట్రీమ్ అవుతోంది. 2023 జూన్ 2 వ తేదీన థియేటర్లలో విడుదలైంది.

  • సినిమా పేరు: పరేషాన్
  • ఐఎండిబి రేటింగ్ – 6.1/10
  • ఎక్కడ చూడాలి – సోని లివ్
  • నటీనటులు – తిరువీర్, పావని కరణం
  • విడుదల తేదీ – 2 June 2023

Best Telugu Films On Zee5 (2023)

రైటర్ పద్మభూషణ్

రైటర్ పద్మభూషణ్ చిత్రంలో సుహాస్, టీనా శిల్పరాజ్, శ్రీ గౌరి ప్రియ ప్రధాన పాత్రలు పోషించారు. 2023 ఫిబ్రవరి 3 వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. జీ5 లో ఈ చిత్రం స్ట్రీమ్ అవుతోంది.

  • సినిమా పేరు: రైటర్ పద్మభూషణ్
  • ఐఎండిబి రేటింగ్ – 7.7/10
  • ఎక్కడ చూడాలి – జీ5
  • నటీనటులు – సుహాస్, టీనా శిల్పరాజ్, శ్రీ గౌరి ప్రియ
  • విడుదల తేదీ – 3 ఫిబ్రవరి 2023

The post OTT: ఓటీటీల్లో ఉన్న బెస్ట్ తెలుగు సినిమాలు (2023) first appeared on 91Mobiles Telugu.

]]>
Netflix లో అందుబాటులో ఉన్న విజయ్ సేతుపతి చిత్రాలు https://www.91mobiles.com/telugu/vijay-sethupathi-films-available-on-netflix/ Wed, 22 Feb 2023 14:44:54 +0000 https://www.91mobiles.com/telugu/?p=5059 విజయ్ సేతుపతికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళంలో తన కెరీర్ ని ప్రారంభించిన విజయ్ సేతుపతి అనతి కాలంలోనే తెలుగు, హిందీ భాషల్లో నటించారు. విజయ్ సేతుపతికి యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ లోనూ క్రేజ్ ఉంది. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన విజయ్ సేతుపతి ప్రస్తుతం హిందీలో అట్లీ దర్శకత్వంలో జవాన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్, నయనతార ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మరి ఈ […]

The post Netflix లో అందుబాటులో ఉన్న విజయ్ సేతుపతి చిత్రాలు first appeared on 91Mobiles Telugu.

]]>

విజయ్ సేతుపతికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళంలో తన కెరీర్ ని ప్రారంభించిన విజయ్ సేతుపతి అనతి కాలంలోనే తెలుగు, హిందీ భాషల్లో నటించారు. విజయ్ సేతుపతికి యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ లోనూ క్రేజ్ ఉంది.

ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన విజయ్ సేతుపతి ప్రస్తుతం హిందీలో అట్లీ దర్శకత్వంలో జవాన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్, నయనతార ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మరి ఈ చిత్రంతో సేతుపతి తన నట విశ్వరూపం చూపిస్తారేమో చూడాలి. విజయ్ నటించిన ఎన్నో సినిమాలు వివిధ ఓటీటీ సైట్స్ లో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మనం Netflix లో అందుబాటులో ఉన్న విజయ్ సేతుపతి చిత్రాలేవో తెలుసుకుందాం.

Netflix లో అందుబాటులో ఉన్న విజయ్ సేతుపతి సినిమాలు

1. డీఎస్పీ (DSP)

తమిళంలో రూపొందిన ఈ యాక్షన్ కామెడీ చిత్రానికి పొన్‌రామ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ వర్షన్ నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, అనుకీర్తి వ్యాస్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రభాకర్ విలన్ పాత్ర పోషించారు. పుగళ్, ఇళవరసు, జి. జ్ఞానసంబంధం, దీప, సింగంపులి ఇతర కీలక పాత్రల్లో నటించారు.

2. సూపర్ డీలక్స్

ఈ చిత్రంలో తమిళం, తెలుగు భాషల్లో నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఈ చిత్రానికి త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వం వహించారు. విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సమంతా రుత్ ప్రభు, రమ్య కృష్ణన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. విజయ్ సేతుపతి ఈ చిత్రంలో ట్రాన్స్‌జెండర్ గా నటించారు.

3. లాభం

లాభం చిత్రంలో విజయ్ సేతుపతి, జగపతి బాబు, శృతిహాసన్ ప్రధాన పాత్రలు పోషించారు. ధన్సికా, కళయరసన్ కీలక పాత్రల్లో నటించారు. డి. ఇమ్మాన్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి జననాదన్ దర్శకత్వం వహించారు. నెట్‌ఫ్లిక్స్ లో ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు భాషలో అందుబాటులో ఉంది. చూసి ఆనందించండి.

4. తుగ్లక్ దర్బార్

తుగ్లక్ దర్బార్ రాజకీయాలపై వ్యంగ్యాస్త్రంగా రూపొందింది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా, ఆర్. పార్తీబన్ ప్రధాన పాత్రలు పోషించారు. మంజిమా మోహన్, కరుణాకరన్, భగవతి పెరుమాళ్, రాజ్ కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. గోవింద్ వసంత ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ లో తమిళంతో పాటు తెలుగులో అందుబాటులో ఉంది.

5. ఉప్పెన

ఈ తెలుగు రొమాంటిక్ డ్రామా లో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా చేశారు. ఈ చిత్రంలో పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ప్రధాన పాత్రలు పోషించారు. కాకినాడ బ్రాక్‌డ్రాప్ లో రూపొందిన ఈ ప్రేమకథా చిత్రంలో విజయ్ సేతుపతి జమిందారుగా నటించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Netflix లో అందుబాటులో ఉన్న విజయ్ సేతుపతి చిత్రాలు first appeared on 91Mobiles Telugu.

]]>
ధనుష్ నటించిన ‘సార్’ మూవీ ఓటీటీ మరియు శాటిలైట్ అప్డేట్ https://www.91mobiles.com/telugu/dhanush-starrer-sir-ott-satellite-rights-netflix-sun-network/ Tue, 21 Feb 2023 13:44:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=5036 తమిళంతో పాటు తెలుగునాట కూడా క్రేజ్ ఉన్న నటుడు ధనుష్. తమిళంలో స్టార్ స్టేటస్ ని అనుభవిస్తోన్న ధనుష్ భాషా బేధం లేకుండా తమిళం, హిందీ, ఇంగ్లీషు అంటూ అన్ని భాషల్లోనూ నటిస్తూ పోతున్నాడు. తాజాగా తెలుగులో నేరుగా ఓ చిత్రానికి కమిట్ అయ్యాడు ధనుష్. ఆ చిత్రం పేరు సార్. ఈ ద్విభాషా చిత్రం తమిళంలో వాతి అనే పేరుతో విడుదలైంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అయిన ఈ చిత్రం హిట్ టాక్ […]

The post ధనుష్ నటించిన ‘సార్’ మూవీ ఓటీటీ మరియు శాటిలైట్ అప్డేట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఇటీవలె థియేటర్లలోకి వచ్చి విజయవంతంగా ప్రదర్శితమవుతోన్న సార్ సినిమా
  • డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకున్న ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్
  • శాటిలైట్ హక్కులను కైవసం చేసుకున్న సన్ నెట్వర్క్, త్వరలో జెమినీ టీవీలో ప్రసారం కానున్న సార్
  • సార్ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన ధనుష్, సంయుక్తా మీనన్

తమిళంతో పాటు తెలుగునాట కూడా క్రేజ్ ఉన్న నటుడు ధనుష్. తమిళంలో స్టార్ స్టేటస్ ని అనుభవిస్తోన్న ధనుష్ భాషా బేధం లేకుండా తమిళం, హిందీ, ఇంగ్లీషు అంటూ అన్ని భాషల్లోనూ నటిస్తూ పోతున్నాడు. తాజాగా తెలుగులో నేరుగా ఓ చిత్రానికి కమిట్ అయ్యాడు ధనుష్. ఆ చిత్రం పేరు సార్. ఈ ద్విభాషా చిత్రం తమిళంలో వాతి అనే పేరుతో విడుదలైంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అయిన ఈ చిత్రం హిట్ టాక్ తో దూసుకెళ్తోంది.

ధనుష్ నటించిన గత చిత్రాలు తిరు, నేనే వస్తున్నా చిత్రాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో అభిమానుల గురి ధనుష్ తదుపరి చిత్రమైన సార్ పై పడింది. ఈ సినిమాతో తమ హీరోకి హిట్టు పడాలి అని అనుకున్న వారి కోరిక ఫలించింది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో సార్ చిత్రం మంచి వసూళ్ళతో దూసుకెళ్తోంది. సార్ మూవీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కైవసం చేసుకోగా, శాటిలైట్ రైట్స్ ని సన్ నెట్వర్క్ కొనుగోలు చేసింది.

సార్ బాక్సాఫీస్ విశేషాలు

ఫిబ్రవరి 17 న సార్ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఇక ఆ రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద సార్ మోత మోగిస్తోంది. సినిమా కంటెంట్ ప్రేక్షకులకు బాగా నచ్చడంతో పాజిటివ్ మౌత్ టాక్ తో సార్ దూసుకెళ్తోంది. ధనుష్ గత చిత్రాలు దాదాపుగా తమిళంతో పాటు తెలుగులో కూడా డబ్ అయిన సంగతి తెలిసిందే. ఈసారి తెలుగులో తన తొలి ప్రయత్నంలోనే విజయం సాధించిన ధనుష్ పాజిటివ్ ఎంట్రీతో అందరి మనసులు గెలుచుకున్నాడు.

సార్ (వాతి) చిత్ర కథ

విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపే కథతో వచ్చిన సార్ చిత్రానికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. భారీ ఫీజులు వసూలు చేస్తూ సామాన్యుడి నడ్డి విరిచే కార్పొరేట్ మాఫియా ఆగడాలను చిత్రంలో బాగా చూపించారు. ప్రస్తుతం విద్యా వ్యవస్థ పరిస్థితి ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. అదే బర్నింగ్ ఇష్యూని దర్శకుడు వెంకీ తన చిత్ర కథగా ఎంచుకుని వంద మార్కులు కొట్టేశాడు. ఇంకేముంది, ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు.

సార్ (వాతి) ఓటీటీ, శాటిలైట్ అప్డేట్

థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడటం కుదరని వారి కోసం ఓటీటీ మరియు టీవీల రూపంలో వినోద మాధ్యమాలు ఎంతగానో ఉపకరిస్తున్నాయి. తాజాగా ఈ చిత్ర ఓటీటీ హక్కులను దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కైవసం చేసుకుంది. తెలుగు, తమిళ భాషా ఓటీటీ హక్కులు నెట్‌ఫ్లిక్స్ వద్ద ఉన్నాయి.

మరోవైపు సన్ నెట్వర్క్ సంస్థ సార్ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను కైవసం చేసుకుంది. సార్ చిత్రం జెమినీ టీవీలో ప్రసారం కానుంది. థియెట్రికల్ రన్ ముగిసాక ఈ చిత్రం టీవీ మరియు ఓటీటీలో ప్రసారం అవుతుంది. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ కన్ఫర్మ్ అవుతుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ధనుష్ నటించిన ‘సార్’ మూవీ ఓటీటీ మరియు శాటిలైట్ అప్డేట్ first appeared on 91Mobiles Telugu.

]]>
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ ఓటీటీ అప్డేట్ https://www.91mobiles.com/telugu/megastar-chiranjeevi-starring-waltair-veerayya-film-ott-update-netflix/ Wed, 08 Feb 2023 14:31:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=4851 మెగాస్టార్ చిరంజీవి చిత్రం వస్తుందంటే తెలుగు ప్రేక్షకుల్లో లేని ఉత్సాహం వచ్చేస్తుంది. ఎప్పుడెప్పుడు మెగాస్టార్ చిత్రం అనౌన్స్‌మెంట్ ఉంటుందా, ఇంకెప్పుడు థియేటర్లలో ఆ చిత్రాన్ని చూద్దామా అని మెగా అభిమానులు ఎదురు చూస్తుంటారు. ఆచార్య, గాడ్ ఫాదర్ చిత్రాలతో చిరు నిరాశలో కూరుకుపోయారు. అయినప్పటికీ రెట్టించిన ఉత్సాహంతో తన తదుపరి చిత్రాలను చేస్తూ పోతున్నారు. ఆయన కష్టానికి తగిన ఫలితం వాల్తేరు వీరయ్య రూపంలో దొరికింది. బాబీ దర్శకత్వంలో రూపొందిన వాల్తేరు వీరయ్య చిత్రం బాక్సాఫీస్ వద్ద […]

The post మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ ఓటీటీ అప్డేట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఓటీటీ ఎంట్రీకి సిద్ధమవుతోన్న మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య
  • ఫిబ్రవరి 27 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం కానున్న చిత్రం
  • బాబీ దర్శకత్వంలో రూపొందిన వాల్తేరు వీరయ్య చిత్రంలో కీలక పాత్ర పోషించిన రవితేజ

మెగాస్టార్ చిరంజీవి చిత్రం వస్తుందంటే తెలుగు ప్రేక్షకుల్లో లేని ఉత్సాహం వచ్చేస్తుంది. ఎప్పుడెప్పుడు మెగాస్టార్ చిత్రం అనౌన్స్‌మెంట్ ఉంటుందా, ఇంకెప్పుడు థియేటర్లలో ఆ చిత్రాన్ని చూద్దామా అని మెగా అభిమానులు ఎదురు చూస్తుంటారు. ఆచార్య, గాడ్ ఫాదర్ చిత్రాలతో చిరు నిరాశలో కూరుకుపోయారు. అయినప్పటికీ రెట్టించిన ఉత్సాహంతో తన తదుపరి చిత్రాలను చేస్తూ పోతున్నారు. ఆయన కష్టానికి తగిన ఫలితం వాల్తేరు వీరయ్య రూపంలో దొరికింది.

బాబీ దర్శకత్వంలో రూపొందిన వాల్తేరు వీరయ్య చిత్రం బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టింది. కేవలం హిట్ మాత్రమే కాదండోయ్, చిరు కెరీర్ లో అత్యధిక వసూళ్ళు రాబట్టిన చిత్రాల జాబితాలో ఒకటిగా వాల్తేరు వీరయ్య నిలిచింది. తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా ఓటీటీ అప్డేట్ వచ్చింది. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

Netflix లో ప్రసారం కానున్న వాల్తేరు వీరయ్య

చిరంజీవి, శృతిహాసన్ జంటగా నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కైవసం చేసుకుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 27 న నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం కానుందని సదరు సంస్థ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. నెట్‌ఫ్లిక్స్ ప్రకటనతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఎప్పుడెప్పుడు ఫిబ్రవరి 27 వస్తుందా అని మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. థియేటర్లలో మెగా మాస్ యాక్షన్ ని చూడని వారు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఆత్రుతగా వేచి చూస్తున్నారు.

చిత్ర తారాగణం, సాంకేతిక వర్గం

వాల్తేరు వీరయ్య చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్, రవితేజ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రకాశ్ రాజ్, బాబీ సింహా, సత్యరాజ్, కేథరిన్, జాన్ విజయ్, నాజర్ ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిశోర్, సప్తగిరి, షకలక శంకర్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో కనిపించారు. బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నవీన్ యెర్నేని, రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఆర్థర్ ఏ విల్సన్ సినిమాటోగ్రఫర్ గా చేశారు. నిరంజన్ దేవరమానే ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

చిత్ర కథ

2023 జనవరి 13 న వాల్తేరు వీరయ్య చిత్రం థియేటర్లలో విడుదలైంది. వైజాగ్ లో స్మగ్లింగ్ చేసే వీరయ్య (చిరంజీవి)ని, ఏసీపీ విక్రమ్ సాగర్ (రవితేజ) ఎలా అడ్డుకున్నాడు? తదనంతర పరిణామాలే చిత్ర కథ. వీరయ్య పాత్రలో చిరంజీవి తన నట విశ్వరూపం చూపించారు. మాస్ అవతారంలో చిరు రఫ్ గా కనిపంచారు. మరోవైపు పోలీసు అధికారి పాత్రలో రవితేజ తన మాస్ యాంగిల్ ని పర్ఫెక్ట్ గా చూపించారు. యాక్షన్ సీక్వెన్స్ లో ఇటు చిరు, అటు రవితేజ ఇరగదీశారు. కథానాయిక పాత్రలో శృతిహాసన్ బాగా చేశారు. చిరు, శృతి ఆన్‌స్క్రీన్ కెమెస్ట్రీ బాగుంది.

దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్రేక్షకులకు బాగా నచ్చింది. వీరయ్య టైటిల్ సాంగ్, నీకేమో అందమెక్కువ, బాస్ పార్టీ సాంగ్, పూనకాలు లోడింగ్ ఇలా అన్నీ పాటలు వేటికవే ప్రత్యేకంగా నిలిచాయి. బాబీ తన దర్శకత్వ ప్రతిభను మరోసారి చాటారు. ఆయన రాసుకున్న పాత్రలు, సన్నివేశాలు, చిత్రీకరణ బాగున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ ఓటీటీ అప్డేట్ first appeared on 91Mobiles Telugu.

]]>
Netflix, Aha ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో స్ట్రీమ్ అవుతోన్న 18 Pages https://www.91mobiles.com/telugu/18-pages-film-streaming-on-netflix-aha/ Wed, 01 Feb 2023 14:24:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=4739 2022 డిసెంబర్ 23 న 18 Pages సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా నిడివి 137 నిమిషాలు. ఈ చిత్రానికి క్రిటిక్స్ నుంచి మిశ్రమం నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. 16 కోట్ల బడ్జెట్ తో 18 Pages చిత్రం రూపొందింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.25 కోట్లు వసూలు చేసింది. సినిమా చిత్రీకరణ అప్పుడెప్పుడో 2020 డిసెంబర్ లో మొదలై, కరోనా కారణంగా ఆలస్యంగా పూర్తై, ఇటీవలె థియేటర్లలోకి వచ్చింది. థియెట్రికల్ రన్ […]

The post Netflix, Aha ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో స్ట్రీమ్ అవుతోన్న 18 Pages first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రెండు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో ప్రసారమవుతోన్న తెలుగు రొమాంటిక్ కామెడీ చిత్రం 18 పేజెస్
  • ఆహా, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీల్లో స్ట్రీమ్ అవుతోన్న సినిమా; 18 పేజెస్ లో ప్రధాన పాత్రలు పోషించిన నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్
  • 2023 జనవరి 27 న ఓటీటీలో విడుదలైన 18 పేజెస్ చిత్రం

2022 డిసెంబర్ 23 న 18 Pages సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా నిడివి 137 నిమిషాలు. ఈ చిత్రానికి క్రిటిక్స్ నుంచి మిశ్రమం నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. 16 కోట్ల బడ్జెట్ తో 18 Pages చిత్రం రూపొందింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.25 కోట్లు వసూలు చేసింది. సినిమా చిత్రీకరణ అప్పుడెప్పుడో 2020 డిసెంబర్ లో మొదలై, కరోనా కారణంగా ఆలస్యంగా పూర్తై, ఇటీవలె థియేటర్లలోకి వచ్చింది.

థియెట్రికల్ రన్ ముగించుకున్న 18 Pages చిత్రం విడుదలైన నెల రోజులకు డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. 2023 జనవరి 27 న ఈ సినిమా ఓటీటీలో విడుదలైంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ మరియు ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో 18 Pages చిత్రం ప్రసారమవుతోంది.

18 Pages సినిమా ఓటీటీ హక్కులను రెండు ప్రముఖ ఓటీటీ సైట్స్ దక్కించుకున్నాయి. 18 Pages చిత్రం నెట్‌ఫ్లిక్స్, ఆహా ఓటీటీల్లో స్ట్రీమ్ అవుతోంది. జనవరి 27, 2023 నుంచి రెండు ప్లాట్ఫామ్స్ లో 18 Pages ప్రసారమవుతోంది.

18 Pages నటీనటులు, సాంకేతిక బృందం

ఈ రొమాంటిక్ కామెడీకి ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథను సమకూర్చారు. పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. బన్నీ వాస్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాడు. సుకుమార్ రైటింగ్స్ మరియు జీఏ2 పిక్చర్స్ బ్యానర్స్ పై సినిమా రూపొందింది. నిఖిల్ సిద్ధార్థ, అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.

దినేశ్ తేజ్, అజయ్, సరయు రాయ్, రాజ్ తీరందాస్, మౌనికా రెడ్డి, గోల్డీ నిస్సీ, బ్రహ్మాజీ, పోసాని కృష్ణ మురళి ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. అల్లు అరవింద్ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించారు.

18 Pages చిత్ర కథ

18 Pages చిత్ర కథ సిద్ధు (నిఖిల్ సిద్దార్థ), నందిని (అనుపమ పరమేశ్వరన్) పాత్రల చుట్టూ తిరుగుతుంది. నందిని షార్ట్-టర్మ్ మెమొరీ లాస్ తో బాధపడుతుంటుంది. కాబట్టి, తనకు సంబంధించిన అన్ని విషయాలను గుర్తు పెట్టుకునేందుకై ఒక డైరీని మెయింటైన్ చేస్తుంటుంది. అయితే నందిని తన డైరీని పోగొట్టుకోగా, అది కాస్తా సిద్ధ వద్దకు చేరుతుంది. డైరీని చదవడం ప్రారంభించిన సిద్ధు, మెల్లగా నందినికి ఎట్రాక్ట్ అవుతాడు. ఇక అంతే ఆమె కోసం వెతకడం మొదలెడతాడు. స్టోరీలోని అసలు విషయం డైరీలోని 18 పేజీల్లో దాగి ఉంటుంది. మరి చివరకు సిద్దు, నందిని కలుస్తారా? అనేది చిత్ర మిగతా కథ.

ఎంతో సరదాగా అలాగే ఎమోషనల్ గా సాగే ఈ చిత్రాన్ని మీ కుటుంబ సభ్యులతో కలిసి చూసేయండి. సినిమా చూడాలంటే మీరు నెట్‌ఫ్లిక్స్ లేదా ఆహా సబ్‌స్క్రిప్షన్ ని తీసుకోవాల్సి ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Netflix, Aha ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో స్ట్రీమ్ అవుతోన్న 18 Pages first appeared on 91Mobiles Telugu.

]]>
రవితేజ నటించిన ‘ధమాకా’ మూవీ ఓటీటీ అప్డేట్ https://www.91mobiles.com/telugu/raviteja-sreeleela-dhamaka-movie-ott-update-netflix/ Wed, 28 Dec 2022 14:42:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=4223 హైలైట్స్ ఇటీవలె థియేటర్లలో విడుదలైన రవితేజ నటించిన ధమాకా సినిమా థియేటర్లలో దూసుకెళ్తోన్న ధమాకా చిత్రం, కథానాయికగా చేసిన శ్రీలీల ధమాకా చిత్రానికి దర్శకత్వం వహించిన త్రినాథరావు నక్కినా మాస్ మహారాజా రవితేజ చిత్రమంటే యూత్ తో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా మాంచి బజ్ ఉంటుంది. ఇంటిల్లిపాది కలిసి చూసే విధంగా రవితేజ సినిమాలు ఉంటాయి. యాక్షన్ కామెడీ ఎంటర్టెయినర్లకు కేరాఫ్ అడ్రస్ మాస్ రాజా రవితేజ. అయితే ఇటీవలి కాలంలో సరైన హిట్టు […]

The post రవితేజ నటించిన ‘ధమాకా’ మూవీ ఓటీటీ అప్డేట్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ఇటీవలె థియేటర్లలో విడుదలైన రవితేజ నటించిన ధమాకా సినిమా
  • థియేటర్లలో దూసుకెళ్తోన్న ధమాకా చిత్రం, కథానాయికగా చేసిన శ్రీలీల
  • ధమాకా చిత్రానికి దర్శకత్వం వహించిన త్రినాథరావు నక్కినా

మాస్ మహారాజా రవితేజ చిత్రమంటే యూత్ తో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా మాంచి బజ్ ఉంటుంది. ఇంటిల్లిపాది కలిసి చూసే విధంగా రవితేజ సినిమాలు ఉంటాయి. యాక్షన్ కామెడీ ఎంటర్టెయినర్లకు కేరాఫ్ అడ్రస్ మాస్ రాజా రవితేజ. అయితే ఇటీవలి కాలంలో సరైన హిట్టు లేక రవితేజ ఢీలా పడిపోయారు.

కానీ, తాజాగా వచ్చిన ధమాకా చిత్రంతో త్రినాథ రావు నక్కిన, మాస్ మహారాజా రవితేజకి బంపర్ హిట్ ఇచ్చారు. తొలుత ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే ఆడియన్స్ మౌత్ టాక్ వల్లన తర్వాత మెల్లగా పుంజుకుంది. ఇక రవితేజ చిత్రం థియేటర్లలో కాసుల వర్షాన్ని కురిపించడం మొదలు పెట్టింది. మాస్ అంశాలు పుష్కలంగా ఉండటం, రవితేజ యాక్షన్, శ్రీలీల అందం, భీమ్స్ సంగీతం, దర్శకుడి ప్రతిభ వెరసి ధమాకా పేరుకి తగినట్లుగానే అందరికీ ధమాకా హిట్ ఇచ్చింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్ర డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది.

ధమాకా మూవీ ఓటీటీ పార్ట్నర్

ఒక చిత్రం థియేటర్లలో సక్సెస్ అయ్యిందంటే ఆ చిత్రానికి ఓటీటీ సైట్స్ నుంచి భారీ డిమాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ ధమాకా చిత్రం యొక్క డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ధమాకా తన థియెట్రికల్ రన్ ముగించాక నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. థియేటర్లలో చిత్రాన్ని చూడలేని వారికి, మరోసారి ఫ్యామిలీతో కలిసి చిత్రాన్ని ఎంజాయ్ చేయాలనుకునే వారి కోసం ధమాకా ఓటీటీ మాధ్యమం లోకి వచ్చేస్తోంది. ధమాకా రాకతో ఇక ఓటీటీ ఆడియన్స్ కి పండగేనని చెప్పాలి.

రవితేజ, శ్రీలీల ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ధమాకా చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందించారు. తనికెళ్ళ భరణి, తులసి, సచిన్ ఖేడేకర్, పవిత్ర లోకేశ్, అలీ, రావు రమేశ్, హైపర్ ఆది తదితరలు కీలక పాత్రలు పోషించారు.

విదేశాల్లో ధనాధన్ ‘ధమాకా’

రవితేజ, శ్రీలీల ప్రధాన పాత్రలు పోషించిన ధమాకా చిత్రం తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము రేపుతోంది. ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. అయితే ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే ఈ చిత్రం ఓవర్సీస్ లో కూడా తన సత్తా చూపెడుతోంది. నిజానికి, మాస్ మసాలా చిత్రాలకు ఓవర్సీస్ లో పెద్దగా ఆదరణ ఉండదు. కానీ మాస్ మహారాజా చిత్రానికి అక్కడి ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారు.

రవితేజ కెరీర్ లో ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా ధమాకా నిలుస్తుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి మాస్ మహారాజా తన ఖాతాలో చాలా కాలం తర్వాత హిట్ వేసుకోవడమే గాక, జనాలను కూడా విపరీతంగా అలరిస్తున్నారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post రవితేజ నటించిన ‘ధమాకా’ మూవీ ఓటీటీ అప్డేట్ first appeared on 91Mobiles Telugu.

]]>
నవంబర్ 1 న లాంచ్ అవుతోన్న చౌకైన Netflix ప్లాన్ https://www.91mobiles.com/telugu/netflix-ad-based-plan-launch-november/ Wed, 07 Sep 2022 11:20:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=2166 హైలైట్స్: యాడ్స్ తో కూడిన తక్కువ ధర ప్లాన్ ని నవంబర్ 1 న లాంచ్ చేయనున్న నెట్‌ఫ్లిక్స్ 2023 లో లాంచ్ కావాల్సిన ప్లాన్ ని చాలా రోజుల ముందే లాంచ్ చేస్తున్న నెట్‌ఫ్లిక్స్ డిస్నీ+ లో ఈ తరహా ప్లాన్స్ ఉండటం చేత, త్వరగానే ప్లాన్ ని పరిచయం చేస్తున్న నెట్‌ఫ్లిక్స్ తక్కువ ధర కలిగిన యాడ్-సపోర్టెడ్ ప్లాన్ ని నవంబర్ 1 న లాంచ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్ నిర్ణయించింది. వెరైటీ వెబ్ సైట్ […]

The post నవంబర్ 1 న లాంచ్ అవుతోన్న చౌకైన Netflix ప్లాన్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • యాడ్స్ తో కూడిన తక్కువ ధర ప్లాన్ ని నవంబర్ 1 న లాంచ్ చేయనున్న నెట్‌ఫ్లిక్స్
  • 2023 లో లాంచ్ కావాల్సిన ప్లాన్ ని చాలా రోజుల ముందే లాంచ్ చేస్తున్న నెట్‌ఫ్లిక్స్
  • డిస్నీ+ లో ఈ తరహా ప్లాన్స్ ఉండటం చేత, త్వరగానే ప్లాన్ ని పరిచయం చేస్తున్న నెట్‌ఫ్లిక్స్

తక్కువ ధర కలిగిన యాడ్-సపోర్టెడ్ ప్లాన్ ని నవంబర్ 1 న లాంచ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్ నిర్ణయించింది. వెరైటీ వెబ్ సైట్ కథనం ద్వారా ఈ విషయం స్పష్టమవుతోంది. త్వరలో డిస్నీ+ కూడా ఆ తరహా ప్లాన్ ని లాంచ్ చేస్తున్న క్రమంలో, నవంబర్ లోనే తమ ప్లాన్ ని పరిచయం చేయాలని నెట్‌ఫ్లిక్స్ డిసైడ్ అయ్యింది. 2023 నుంచి యాడ్-సపోర్టెడ్ ప్లాన్ ని తీసుకొస్తామని జులై త్రైమాసికంలో నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.

నెట్‌ఫ్లిక్స్ పోటీదారు అయిన డిస్నీ+ ఓటీటీ డిసెంబర్ 8 నుంచి యూఎస్ లో యాడ్-బేస్డ్ ప్లాన్ ని 7.99 డాలర్ల (దాదాపు రూ.639) కి అందించనుంది. తొలుత తన యాడ్-బేస్డ్ ప్లాన్ ని యూఎస్, యూకే, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో ప్రారంభిస్తామని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. కన్జూమర్ల రియాక్షన్ ని బట్టి, తన యాడ్-సపోర్టెడ్ ప్లాన్ ని మెల్లగా ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్ భావిస్తోంది. అయితే ఈ యాడ్-సపోర్టెడ్ ప్లాన్ భారత్ లో లాంచ్ అవుతుందా లేదా అన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు.

యాడ్-సపోర్టెడ్ ప్లాన్ ఎలా వర్కవుట్ అవుతుంది?

నెట్‌ఫ్లిక్స్ యొక్క తక్కువ ధర కలిగిన యాడ్-బేస్డ్ ప్లాన్ నెలవారీ ధర 7 డాలర్ల (రూ.560) నుంచి 9 డాలర్ల (రూ.720) ఉండనుంది. ఈ ధర యూఎస్ఏ యూజర్లకు వర్తిస్తుంది. ఇక స్టాండర్డ్ ప్లాన్ ధర 15.49 డాలర్లు (రూ.1237) గా ఉంది. ఈ ప్లాన్ ద్వారా రెండు స్క్రీన్స్ పై ఒకేసారి 1080పి వీడియో స్ట్రీమింగ్ ను పొందవచ్చు. మరి తక్కువ ధర కలిగిన యాడ్-సపోర్టెడ్ ప్లాన్ వివరాలను ఇంకా నెట్‌ఫ్లిక్స్ వెల్లడించలేదు. అయితే ఈ ప్లాన్ తో యూజర్లు కంటెంట్ ని డౌన్‌లోడ్ చేసుకుని ఆఫ్‌లైన్ లో చూసే అవకాశం ఉండదని సమాచారం.

సిరీస్ అయితే గంటకు నాలుగు నిమిషాల పాటు నెట్‌ఫ్లిక్స్ యాడ్స్ ని రన్ చేయనుంది. ఇక సినిమాలకైతే, ముందుగానే ప్రీ-ఆడ్స్ నిక్షిప్తమై ఉంటాయి. తక్కువ ధర కలిగిన యాడ్-బేస్డ్ ప్లాన్ ని ఎలా లాంచ్ చేయాలనే దానిపై ఇంకా కసరత్తులు చేస్తున్నామని, ఇప్పటికైతే ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధి తెలిపారు.

నెట్‌ఫ్లిక్స్ తన యాడ్-సపోర్టెడ్ ప్లాన్ కోసం టెక్నాలజీ అండ్ సేల్స్ పార్ట్నర్ గా మైక్రోసాఫ్ట్ ని ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ లో నెట్‌ఫ్లిక్స్ తాను ఎంతమంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయిందో తెలిపింది. దశాబ్ద కాలంలో నెట్‌ఫ్లిక్స్ ఇలా ప్రకటించడం ఇదే తొలిసారి. త్వరలో ఒక యాడ్-సపోర్టెడ్ ప్లాన్ ని లాంచ్ చేయబోతున్నట్లు తర్వాత నెట్‌ఫ్లిక్స్ కో-సీఈవో రీడ్ హేస్టింగ్స్ ప్రకటించారు. దశాబ్దాలుగా యాడ్-ఫ్రీ సేవలను అందిస్తోన్న నెట్‌ఫ్లిక్స్ లో ఇది భారీ మార్పు అని చెప్పవచ్చు.

తక్కువ ధర ప్లాన్ తో పాటు, పాస్‌వర్డ్-షేరింగ్ చేసే యూజర్ల నుంచి డబ్బులు వసూలు చేయాలని నెట్‌ఫ్లిక్స్ నిర్ణయించింది. దీంతో ఇక నుంచి కొందరు యూజర్లు కలిసి ఒక నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ తీసుకొని, యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఒకరికొకరు షేర్ చేసుకోవాలి. అలాగే వారి వాటా డబ్బు (చందా రుసుము) ని ఎవరిది వారు చెల్లించాల్సి ఉంటుంది. పాస్‌వర్డ్ షేర్ చేసుకోవడం వల్లన నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్ కౌంట్ పై చాలా ప్రభావం పడింది. ఇకపై అలా చేసే అవకాశం ఉండదు.

The post నవంబర్ 1 న లాంచ్ అవుతోన్న చౌకైన Netflix ప్లాన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Adipurush ఓటీటీ రైట్స్: భారత్ లో ఆల్ టైమ్ రికార్డ్ https://www.91mobiles.com/telugu/adipurush-digital-rights-bagged-by-netflix-rs-250-crores/ Wed, 03 Aug 2022 17:07:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=1474 హైలైట్స్: త్వరలో రిలీజ్ కానున్న ప్యాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ ప్రధాన పాత్రలో ప్రభాస్, దర్శకత్వం వహించిన ఓం రౌత్ ఆదిపురుష్ డిజిటల్ హక్కులను రూ.250 కోట్లకు సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ ఆలిండియా స్టార్ ప్రభాస్ సినిమాల గురించి ఏ చిన్న విషయమైనా అది ఫ్యాన్స్ కి పెద్ద న్యూస్ అనే చెప్పాలి. ప్రభాస్ కి ఉన్న క్రేజ్ అటువంటిది. ఇక్కడ బాహుబలి సినిమాలకు థాంక్స్ చెప్పుకోవాలి. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని ఖండాతరాలు దాటించాయి బాహుబలి సినిమాలు. […]

The post Adipurush ఓటీటీ రైట్స్: భారత్ లో ఆల్ టైమ్ రికార్డ్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • త్వరలో రిలీజ్ కానున్న ప్యాన్ ఇండియా సినిమా ఆదిపురుష్
  • ప్రధాన పాత్రలో ప్రభాస్, దర్శకత్వం వహించిన ఓం రౌత్
  • ఆదిపురుష్ డిజిటల్ హక్కులను రూ.250 కోట్లకు సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్

ఆలిండియా స్టార్ ప్రభాస్ సినిమాల గురించి ఏ చిన్న విషయమైనా అది ఫ్యాన్స్ కి పెద్ద న్యూస్ అనే చెప్పాలి. ప్రభాస్ కి ఉన్న క్రేజ్ అటువంటిది. ఇక్కడ బాహుబలి సినిమాలకు థాంక్స్ చెప్పుకోవాలి. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని ఖండాతరాలు దాటించాయి బాహుబలి సినిమాలు. అలాగే ప్రభాస్ కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించి పెట్టాయి. ప్రభాస్ నుంచి వచ్చిన సాహో, రాధేశ్యామ్ చిత్రాలు నిరాశపరిచిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభాస్ నుంచి రాబోవు తదుపరి చిత్రం ఆదిపురుష్ పై ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఆదిపురుష్ తో హిట్టు కొట్టి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని ప్రభాస్ భావిస్తున్నాడు. తమ హీరోకి బ్లాక్ బస్టర్ పడాలని ప్రభాస్ ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు.

రూ.250 కోట్లకు డిజిటల్ రైట్స్ కొన్న నెట్‌ఫ్లిక్స్

తాజాగా ఆదిపురుష్ కి సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఆదిపురుష్ చిత్ర డిజిటల్ హక్కులను రూ.250 కోట్లకు కైవసం చేసుకున్నట్లు సమాచారం. ఇంత భారీ మొత్తం వెచ్చించి ఆదిపురుష్ డిజిటల్ రైట్స్ కొనడమంటే తేలికైన విషయం కాదు. ఎందుకుంటే సినిమా నుంచి ఇంకా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ వంటివేమీ బయటకు రాలేదు. రూ.250 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ ఆదిపురుష్ డిజిటల్ రైట్స్ కొన్నట్లు ప్రముఖ క్రిటిక్ ఉమేర్ సందు కూడా రివీల్ చేశారు. ఇది ముమ్మాటికీ ప్రభాస్ స్టార్ పవర్ అని ఉమేర్ సందు ట్వీట్ చేశారు.

ఇటీవలె వచ్చిన రాధేశ్యామ్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినప్పటికీ, ఇంత భారీ ధరకు డిజిటల్ రైట్స్ అమ్ముడయ్యాయంటే ప్రభాస్ స్టార్ పవర్ అస్సలు తగ్గలేదని స్పష్టమవుతోంది. ఇక ఆదిపురుష్ సినిమా విషయానికి వస్తే, ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటు, కృతీసనన్, సన్నీ సింగ్ ప్రధాన పాత్రలు పోషించారు. హిందూ ఇతిహాసమైన రామాయణం ఆధారంగా ఆదిపురుష్ రూపొందింది. హిందీ భాషతో పాటు అన్ని దక్షిణాది భాషల్లో ఆదిపురుష్ విడుదలవుతోంది. ఆదిపురుష్ ఐమ్యాక్స్ ఫార్మాట్ లో కూడా వస్తోంది.

టీ-సిరీస్ ఫిల్మ్స్, రెట్రోఫైల్స్ కలిసి ఆదిపురుష్ చిత్రాన్ని రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. 2023 జనవరి 12 న సంక్రాంతి పండుగకు ముందు ఆదిపురుష్ చిత్రం విడుదలవుతోంది. ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఆదిపురుష్ సినిమా ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. సచేత్-పరంపర ఈ చిత్రానికి సంప్రదాయ బాణీలను అందించారు. కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వర్తించారు. అపూర్వ మోతివాలే ఎడిటింగ్ చేశారు.

ఆదిపురుష్ ని క్రోమా ద్వారా షూట్ చేశారు. అంటే బ్యాగ్రౌండ్ తర్వాత యాడ్ చేయబడుతుంది. సినిమాకు భారీతనం తెచ్చేందుకై హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ టెక్నీషియన్లు అహర్నిశలు శ్రమించారు. ఇప్పుడు ఆదిపురుష్ చిత్రం రిలీజ్ కు ముందు రికార్డు క్రియేట్ చేసింది. నెట్‌ఫ్లిక్స్ అన్ని భాషలకు కలుపుకుని చిత్ర హక్కుల్ని భారీ మొత్తానికి కొనుగోలు చేసింది.

The post Adipurush ఓటీటీ రైట్స్: భారత్ లో ఆల్ టైమ్ రికార్డ్ first appeared on 91Mobiles Telugu.

]]>
లావణ్యా త్రిపాఠి నటించిన Happy Birthday మూవీ OTT అప్డేట్ https://www.91mobiles.com/telugu/happy-birthday-movie-to-stream-on-netflix/ Tue, 02 Aug 2022 14:31:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=1442 హైలైట్స్: 2022, జులై 8 న థియేటర్లలో రిలీజ్ అయిన హ్యాపీ బర్త్ డే సినిమా చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన లావణ్యా త్రిపాఠి మత్తు వదలరా ఫేమ్ రితేశ్ రానా తెరకెక్కించిన హ్యాపీ బర్త్ డే చిత్ర ఓటీటీ హక్కులను కైవసం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సైట్ నెట్ ఫ్లిక్స్, ఆగస్టు 8 న చిత్రం ప్రీమియర్ అవుతుందని ప్రకటన మత్తు వదలరా సినిమాతో బంపర్ హిట్ కొట్టిన దర్శకుడు రితేశ్ రానా తెరకెక్కించిన చిత్రమే […]

The post లావణ్యా త్రిపాఠి నటించిన Happy Birthday మూవీ OTT అప్డేట్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • 2022, జులై 8 న థియేటర్లలో రిలీజ్ అయిన హ్యాపీ బర్త్ డే సినిమా
  • చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన లావణ్యా త్రిపాఠి
  • మత్తు వదలరా ఫేమ్ రితేశ్ రానా తెరకెక్కించిన హ్యాపీ బర్త్ డే
  • చిత్ర ఓటీటీ హక్కులను కైవసం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సైట్ నెట్ ఫ్లిక్స్, ఆగస్టు 8 న చిత్రం ప్రీమియర్ అవుతుందని ప్రకటన

మత్తు వదలరా సినిమాతో బంపర్ హిట్ కొట్టిన దర్శకుడు రితేశ్ రానా తెరకెక్కించిన చిత్రమే ఈ హ్యాపీ బర్త్ డే. కొత్తదనం కోరుకునే వారిలో ముందు వరుసలో ఉంటారు మన తెలుగు వారు. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక ప్రయోగాత్మక చిత్రాలు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. కమర్షియల్ సినిమాకు మరో మీనింగ్ గా స్థిరపడిన తెలుగు చిత్రసీమ, బాహుబలి వంటి సినిమాలతో ప్రపంచ స్థాయి సినిమాలను రూపొందించగలదని నిరూపించింది. ఇంక అంతే, అదే స్పూర్తితో వరుసబెట్టి ప్రయోగాత్మక చిత్రాలు వస్తూనే ఉన్నాయి.

వైవిధ్యానికి తెలుగు సినిమా అవకాశం వచ్చినప్పుడల్లా ఎర్ర తివాచీ పరుస్తుందన్న సంగతి తెలిసిందే. అయితే ఆ వైవిధ్యం, వినోదం సగటు సినీ ప్రేక్షకుడుకి అర్దమవ్వడంతో పాటు అలరించగలగాలి. ఆ క్రమంలోనే వచ్చిన చిత్రం ‘హ్యాపీ బర్త్ డే’. తెలుగుకు కొత్త జోనర్ అయిన ‘సర్రియల్ హ్యూమర్’ తో ఈ సినిమా తెరకెక్కింది.

త్వరలోనే హ్యాపీ బర్త్ డే చిత్రం ఓటీటీ ద్వారా ప్రసారం కానుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ ఈ చిత్ర ఓటీటీ హక్కులను కైవసం చేసుకుంది. 2022, ఆగస్టు 8 న చిత్రం ప్రీమియర్ అవుతుందని నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన వారు తప్పకుండా ఓటీటీ ద్వారా చూడండి.

చిత్ర తారాగణం:

లావణ్య త్రిపాఠి, నరేశ్ అగస్త్య, వెన్నెల కిశోర్, సత్య, తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టెయిన్మెంట్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. కాల భైరవ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు.

చిత్ర కథ:

రక్షణ శాఖ మంత్రి రిత్విక్ సోధీ (వెన్నెల కిషోర్‌) ఇంటికో గన్ తెస్తాడు. ఇదే అదునుగా దేశంలో అందరూ గన్స్ ని కొనుక్కొని తిరగాలనుకుంటారు. ఎక్కడ చూసినా ఈ గన్స్ గోలే. బహిరంగ మార్కెట్ లో గన్స్ దొరకడం సాధారణ విషయం అయిపోతుంది. క్యాజువల్ గా షాప్ కు వెళ్లి జనం కొనుక్కుంటారు. ఇదిలా ఉంటే పసుపులేటి హ్యాపీ త్రిపాఠీ (లావణ్యా త్రిపాఠీ), తన ఫ్రెండ్ స‌ర్‌ప్రైజ్‌ బర్త్ డే పార్టీ ప్లాన్ చేశానంటే రిట్జ్ గ్రాండ్ హోటల్‌కు వెళుతుంది. పార్టీ విసుగ్గా, చిరాగ్గా ఉండటంతో సేమ్ హోటల్‌లో ఉన్న పోష్ పబ్‌కు వెళుతుంది. హ్యాపీ ఆర్డర్ చేసిన డ్రింక్ లో మత్తు మందు కలవడం, ఆమెను వెయిటర్ కిడ్నాప్ చేయడం జరిగిపోతాయి. ఆ తర్వాత ఏం జరగనుందన్నదే ఈ చిత్ర కథ.

ఆగస్టు 8 న నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానున్న ఈ హిలేరియస్ మూవీని చూసి ఆనందించండి.

The post లావణ్యా త్రిపాఠి నటించిన Happy Birthday మూవీ OTT అప్డేట్ first appeared on 91Mobiles Telugu.

]]>