Nokia C22 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 11 May 2023 12:47:29 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 3 రోజుల బ్యాటరీ లైఫ్, ఐపీ52 రేటింగ్‌తో భారత్‌లో లాంచైన Nokia C22; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/nokia-c22-launched-india-price-specs-availablity/ Thu, 11 May 2023 12:47:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=6252 Nokia C22 స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచ్ అయ్యింది. ఫిబ్రవరి లో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023 లో ఈ ఫోన్ ని కంపెనీ అనౌన్స్ చేసింది. Nokia C32, Nokia G22 డివైజెస్ తో పాటు Nokia C22 కొన్ని యూరోపియన్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యింది. లేటెస్ట్ సీ-సిరీస్ స్మార్ట్ ఫోన్ ధర భారత్ లో రూ.10,000 లోపే ఉంది. ఈ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ మొదటిసారి స్మార్ట్ ఫోన్ […]

The post 3 రోజుల బ్యాటరీ లైఫ్, ఐపీ52 రేటింగ్‌తో భారత్‌లో లాంచైన Nokia C22; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రూ.10,000 లోపు ధరతో భారత్‌లో లాంచైన Nokia C22
  • ఐపీ52 రేటింగ్ తో వచ్చిన Nokia C22
  • ఆండ్రాయిడ్ 13 (గో-ఎడిషన్) పై పని చేయనున్న డివైజ్

Nokia C22 స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచ్ అయ్యింది. ఫిబ్రవరి లో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023 లో ఈ ఫోన్ ని కంపెనీ అనౌన్స్ చేసింది. Nokia C32, Nokia G22 డివైజెస్ తో పాటు Nokia C22 కొన్ని యూరోపియన్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యింది. లేటెస్ట్ సీ-సిరీస్ స్మార్ట్ ఫోన్ ధర భారత్ లో రూ.10,000 లోపే ఉంది. ఈ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ మొదటిసారి స్మార్ట్ ఫోన్ కొనే వారికి బాగా ఉపయోగపడుతుంది.

Nokia C22 స్మార్ట్ ఫోన్ లో ఐపీ52 రేటింగ్, ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్, 13ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా, 8ఎంపి సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఈ ఫోన్ 3 రోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

భారత్ లో Nokia C22 ధర, లభ్యత

Nokia C22 స్మార్ట్ ఫోన్ చార్కోల్, శాండ్, పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అన్ని ప్రముఖ ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్లలో ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 2జిబి మరియు 4జిబి వేరియంట్ లో లభిస్తుంది. రెండు వేరియంట్లు కూడా 64జిబి స్టోరేజీని కలిగి ఉన్నాయి. 256జిబి వరకు మెమొరీని ఎక్స్‌పాండ్ చేసుకునే అవకాశం ఉంది. భారత్ లో Nokia C22 ధర రూ.7,999 నుంచి మొదలవుతుంది.

హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ జియో తో జట్టుకట్టి Nokia C22 కొనుగోలుదారులకు టెలీకామ్ ఆఫర్లను అందిస్తోంది. రూ.399 విలువగల జియో ప్లస్ పోస్ట్‌పెయిడ్ వాడుతోన్న యూజర్లు రూ.3,500 విలువజేసే ప్రయోజనాలను పొందుతారు. రూ.1000 విలువగల 100జిబి డేటా (10 నెలల వరకు 10జిబి అదనపు డేటా), అదనపు కూపన్లు (రూ.1000) వీటిలో ఉన్నాయి. రూ.700 ఈజీ డిన్నర్ 3-నెలల సబ్‌స్క్రిప్షన్, ఇక్సిగో పై రూ.4500 పైన కొనే టిక్కెట్లపై రూ.750 తగ్గింపు ఈ కూపన్లలో ఉన్నాయి. ఇంకా రూ.1,100 విలువగల ఈటీ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ని రూ.49 కే పొందవచ్చు.

Nokia C22 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే, ప్రాసెసర్

  • 6.5-ఇంచ్ డిస్ప్లే
  • యూనిసాక్ ఎస్‌సీ9863ఏ

Nokia C22 స్మార్ట్ ఫోన్ లో 6.5-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 20:9 యాస్పెక్ట్ రేషియో, వాటర్ డ్రాప్ నాచ్, ఐపీ52 రేటింగ్ ఉన్నాయి. Nokia C22 లో యూనిసాక్ ఎస్‌సీ9863ఏ చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ

  • 4జిబి ర్యామ్
  • 64జిబి స్టోరేజీ

Nokia C22 స్మార్ట్ ఫోన్ లో 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 256జిబి వరకు పెంచుుకోవచ్చు.

బ్యాటరీ

  • 5000ఎంఏహెచ్
  • 10 వాట్ చార్జింగ్

Nokia C22 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 10 వాట్ చార్జింగ్, టైప్-సీ పోర్ట్ తో వస్తోంది.

కెమెరా విభాగం

  • 13ఎంపి మెయిన్
  • 8ఎంపి ఫ్రంట్ కెమెరా

Nokia C22 స్మార్ట్ ఫోన్ లో 13ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ అందించారు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

కనెక్టివిటీ

  • 4జీ
  • బ్లూటూత్ 5.2

Nokia C22 హ్యాండ్సెట్ లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్ మరియు గ్లొనాస్ ఉన్నాయి.

The post 3 రోజుల బ్యాటరీ లైఫ్, ఐపీ52 రేటింగ్‌తో భారత్‌లో లాంచైన Nokia C22; ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
ఎండబ్ల్యూసీ 2023: 90హెర్ట్జ్ డిస్ప్లే, 50ఎంపి కెమెరాతో లాంచైన Nokia C22, C32, G22 https://www.91mobiles.com/telugu/nokia-c22-nokia-c32-nokia-g22-launched-mwc-2023-barcelona-price-specs/ Sun, 26 Feb 2023 17:15:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=5101 హెచ్‌ఎండీ గ్లోబల్ కి చెందిన నోకియా బ్రాండ్ స్పెయిన్ లోని బార్సిలోనాలో జరుగుతోన్న ఎండబ్ల్యూసీ 2023 ఈవెంట్ లో Nokia G22, Nokia C32, Nokia C22 ఫోన్లను లాంచ్ చేసింది. ఈ ఫోన్లు 3 రోజుల బ్యాటరీ లైఫ్, బెటర్ ఇమేజింగ్ క్వాలిటీస్ తో వచ్చాయి. Nokia G22 హైలీ రిపెయిరబుల్ డివైజ్ అని కంపెనీ చెబుతోంది. మరోవైపు Nokia C32 ఉత్తమమైన ఇమేజింగ్ సిస్టమ్ కలిగిన సీ-సిరీస్ ఫోన్ అని సమాచారం. ఇకపోతే Nokia […]

The post ఎండబ్ల్యూసీ 2023: 90హెర్ట్జ్ డిస్ప్లే, 50ఎంపి కెమెరాతో లాంచైన Nokia C22, C32, G22 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్ గా Nokia C22, Nokia C32, Nokia G22 ఫోన్లను లాంచ్ చేసిన నోకియా కంపెనీ
  • మంచి బిల్డ్ క్వాలిటీతో వచ్చిన Nokia C22, మోస్ట్ అడ్వాన్స్డ్ ఇమేజింగ్ సిస్టమ్ తో వచ్చిన Nokia C32
  • హై-రిపెయిరబులిటీ తో వచ్చిన Nokia G22, ఐఫిక్సిట్ టూల్స్ తో రిపెయిర్ చేయదగిన Nokia G22

హెచ్‌ఎండీ గ్లోబల్ కి చెందిన నోకియా బ్రాండ్ స్పెయిన్ లోని బార్సిలోనాలో జరుగుతోన్న ఎండబ్ల్యూసీ 2023 ఈవెంట్ లో Nokia G22, Nokia C32, Nokia C22 ఫోన్లను లాంచ్ చేసింది. ఈ ఫోన్లు 3 రోజుల బ్యాటరీ లైఫ్, బెటర్ ఇమేజింగ్ క్వాలిటీస్ తో వచ్చాయి. Nokia G22 హైలీ రిపెయిరబుల్ డివైజ్ అని కంపెనీ చెబుతోంది. మరోవైపు Nokia C32 ఉత్తమమైన ఇమేజింగ్ సిస్టమ్ కలిగిన సీ-సిరీస్ ఫోన్ అని సమాచారం. ఇకపోతే Nokia C22 స్మార్ట్ ఫోన్ మంచి బిల్డ్ క్వాలిటీతో వచ్చిందని నోకియా చెబుతోంది.

Nokia G22, C32, C22 ధర, లభ్యత

Nokia C22 రెండు ర్యామ్ వేరియంట్స్ లో లభిస్తుంది. అవి: 2జిబి+64జిబి, 3జిబి+64జిబి. ధరలు 129 యూరోలు (సుమారు రూ.11,310) తో ప్రారంభమవుతాయి. Nokia C22 మిడ్నైట్ బ్లాక్, స్యాండ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Nokia C32 డివైజ్ 3జిబి + 64జిబి మరియు 4జిబి + 128జిబి వేరియంట్స్ లో లభించనుంది. ఈ ఫోన్ ధరలు 129 యూరోలు (రూ.12,187) తో ప్రారంభమవుతుంది. చార్కోల్, ఆటమ్న్ గ్రీన్, బీచ్ పింక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Nokia G22 స్మార్ట్ ఫోన్ మీటియోర్ గ్రే, లగూన్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 4జిబి+64జిబి మరియు 4జిబి+128జిబి వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ ధర రూ.179 యూరోలు (రూ.15,694) తో ప్రారంభమవుతుంది.

Nokia G22, C32, C22 స్పెసిఫికేషన్స్

Nokia C22 స్మార్ట్ ఫోన్ ఐపీ52 స్ప్లాష్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్, టఫెండ్ 2.5డీ డిస్ప్లే గ్లాస్, రిజిడ్ మెటల్ చాసిస్, పాలీకార్బొనేట్ యూనిబాడీ డిజైన్ తో దృఢమైన నిర్మాణంతో వచ్చింది. ఈ డివైజ్ లో యూనిఎస్ఓసీ 9863ఏ1 ప్రాసెసర్ వాడారు. ఈ ఫోన్ 3జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ తో వచ్చింది. మెమొరీని 256జిబి వరకు పెంచుకోవచ్చు.

ఈ డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ చార్జింగ్, 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 13ఎంపి డ్యూయల్ కెమెరా, 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ డివైజ్ 4జీ ఎల్టీఈ, డ్యూయల్ సిమ్, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

Nokia C32 50ఎంపి మెయిన్ కెమెరాతో వచ్చింది. ఈ ఫోన్ ఇప్పటి వరకు వచ్చిన సీ-సిరీస్ డివైజెస్ లో ఉత్తమమైనదని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ లో మెయిన్ కెమెరాతో పాటు 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉంటుంది. ఇంకా సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ డివైజ్ 4జిబి ర్యామ్ వేరియంట్ లో లభిస్తుంది. మిగతా ఫీచర్లు Nokia C22 మాదిరే ఉంటాయి.

Nokia G22 స్మార్ట్ ఫోన్ లో యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్ ను వాడారు. ఈ ఫోన్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ తో లాంచైంది. ఈ డివైజ్ లో 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఉన్నాయి. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి.

ఈ డివైజ్ నోకియా కంపెనీ ప్రకారం, అత్యధిక రిపెయిరింగ్ సంభావ్యతను కలిగి ఉందని తెలుస్తోంది. ఐఫిక్సిట్ తో నోకియా జట్టు కట్టి మాన్యువల్స్, పార్ట్స్ ని రోలౌట్ చేయబోతోంది. Nokia G22 లో ఫింగర్ ప్రింట్ స్కానర్, 5050 ఎంఏహెచ్ బ్యాటరీ, 20 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఎండబ్ల్యూసీ 2023: 90హెర్ట్జ్ డిస్ప్లే, 50ఎంపి కెమెరాతో లాంచైన Nokia C22, C32, G22 first appeared on 91Mobiles Telugu.

]]>