Nokia C32 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 23 May 2023 10:15:03 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 50ఎంపి కెమెరాతో భారత్‌లో లాంచైన Nokia C32 https://www.91mobiles.com/telugu/nokia-c32-launched-india-price-specs-availability/ Tue, 23 May 2023 10:15:03 +0000 https://www.91mobiles.com/telugu/?p=6449 ఈ ఏడాది ఆరంభంలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో నోకియా సంస్థ నోకియా జీ22, సీ22, సీ32 ఫోన్లను పరిచయం చేసింది. ఇటీవలె నోకియా సీ22 డివైజ్ భారత్ లో రూ.7,999 ధరతో లాంచ్ అయ్యింది. ఇప్పుడు, కంపెనీ Nokia C32 స్మార్ట్ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసింది. ఇదొక ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ 6.5-ఇంచ్ డిస్ప్లే, హెచ్డీ+ రెజుల్యూషన్, 1.6 గిగాహెర్ట్జ్ చిప్సెట్, 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో […]

The post 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 50ఎంపి కెమెరాతో భారత్‌లో లాంచైన Nokia C32 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన Nokia C32 డివైజ్
  • ఐపీ52 రేటింగ్, 5000ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన ఫోన్
  • భారత్ లో Nokia C32 ప్రారంభ ధర రూ.8,999

ఈ ఏడాది ఆరంభంలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో నోకియా సంస్థ నోకియా జీ22, సీ22, సీ32 ఫోన్లను పరిచయం చేసింది. ఇటీవలె నోకియా సీ22 డివైజ్ భారత్ లో రూ.7,999 ధరతో లాంచ్ అయ్యింది. ఇప్పుడు, కంపెనీ Nokia C32 స్మార్ట్ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసింది. ఇదొక ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ 6.5-ఇంచ్ డిస్ప్లే, హెచ్డీ+ రెజుల్యూషన్, 1.6 గిగాహెర్ట్జ్ చిప్సెట్, 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో వచ్చింది.

సరే, ఓసారి Nokia C32 స్మార్ట్ ఫోన్ ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం.

భారత్ లో Nokia C32 ధర, లభ్యత

  • 4జిబి+64జిబి= రూ.8,999
  • 4జిబి+128జిబి= రూ.9,499

Nokia C32 స్మార్ట్ ఫోన్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లభ్యం అవుతుంది. అవి: 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ. మరొకటి 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ. ఈ స్మార్ట్ ఫోన్ బీచ్ పింక్, చార్కోల్ మరియు మింట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. నోకియా ఇండియా ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. కొనుగోలుదారులు నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్ ని 6 నెలల కాలపరిమితితో రూ.1,584 (ఒక నెలకు) కి పొందవచ్చు. ఈ ఫోన్ ఒక ఏడాది రీప్లేస్మెంట్ గ్యారంటీతో వస్తోంది.

Nokia C32 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

  • ఐపీఎస్ ఎల్సీడీ
  • 720*1600 పిక్సెల్ రెజుల్యూషన్

Nokia C32 స్మార్ట్ ఫోన్ లో 6.5-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, హెచ్డీ+ రెజుల్యూషన్ (720*1600 పిక్సెల్స్), 60హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో, వాటర్ డ్రాప్ నాచ్ ఉన్నాయి.

చిప్సెట్, ర్యామ్, స్టోరేజీ

  • యూనిఎస్ఓసీ ఎస్‌సీ9863ఏ
  • 4జిబి ర్యామ్ + 3జిబి వర్చువల్ ర్యామ్

Nokia C32 స్మార్ట్ ఫోన్ లో యూనిఎస్ఓసీ ఎస్‌సీ9863ఏ చిప్సెట్ వాడారు. ఈ ఫోన్ లో 4జిబి ర్యామ్, 3జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీ అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ లో మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ఉంటుంది.

కెమెరా విభాగం

  • 50ఎంపి మెయిన్ కెమెరా
  • 8ఎంపి ఫ్రంట్ కెమెరా

Nokia C32 డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

ఓఎస్, బ్యాటరీ

  • ఆండ్రాయిడ్ 13
  • 5000 ఎంఏహెచ్

Nokia C32 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ

  • ఐపీ52 రేటింగ్
  • 4జీ, డ్యూయల్ సిమ్

Nokia C32 స్మార్ట్ ఫోన్ ఐపీ52 రేటింగ్ తో వచ్చింది. ఈ ఫోన్ లో 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్, డ్యూయల్ సిమ్ ఉంటాయి.

The post 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 50ఎంపి కెమెరాతో భారత్‌లో లాంచైన Nokia C32 first appeared on 91Mobiles Telugu.

]]>
మే 23న భారత్ లో లాంచ్ కానున్న Nokia C32 https://www.91mobiles.com/telugu/nokia-c32-india-launch-date-may-23-expected-specs/ Fri, 19 May 2023 06:07:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=6384 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Nokia త్వరలో భారత్ లో చవకైన స్మార్ట్ ఫోన్ Nokia C32 ని లాంచ్ చేయబోతోంది. ఇటీవలె ఈ సంస్థ Nokia C22ని లాంచ్ చేసింది. తాజాగా 91మొబైల్స్ కి Nokia C32 లాంచ్ సమాచారం అందింది. ఈ ఫోన్ మే 23 న భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. సరే, ఓసారి Nokia C32 కి సంబంధించిన అంచనా స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి. […]

The post మే 23న భారత్ లో లాంచ్ కానున్న Nokia C32 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 7జిబి ర్యామ్ (4జిబి + 3జిబి) తో వస్తోన్న డివైజ్
  • యూజర్‌కి లభించనున్న ఒక ఏడాది రిప్లేస్మెంట్ గ్యారంటీ
  • Nokia C32 ప్రారంభ ధర రూ.9,999 గా ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Nokia త్వరలో భారత్ లో చవకైన స్మార్ట్ ఫోన్ Nokia C32 ని లాంచ్ చేయబోతోంది. ఇటీవలె ఈ సంస్థ Nokia C22ని లాంచ్ చేసింది. తాజాగా 91మొబైల్స్ కి Nokia C32 లాంచ్ సమాచారం అందింది. ఈ ఫోన్ మే 23 న భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. సరే, ఓసారి Nokia C32 కి సంబంధించిన అంచనా స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Nokia C32 ధర

Nokia C32 స్మార్ట్ ఫోన్ ధర భారత్ లో రూ.12,000 లోపు ఉంటుందని అంచనా వేశారు. కానీ, ఈ ఫోన్ ని సదరు సంస్థ రూ.9,999 లోపే తీసుకురానుందని తాజాగా తెలుస్తోంది. అసలు ధర ఎంతో మే 23 న ఫోన్ లాంచ్ తర్వాతే తెలియనుంది. సరే, ఓసారి ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Nokia C32 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

  • 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే
  • 2.5డి కవర్ గ్లాస్

Nokia C32 ఫోన్ లో 20:9 యాస్పెక్ట్ రేషియో, 1600*720 పిక్సెల్ రెజుల్యూషన్, 6.5-హెచ్డీ+ వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే, 2.5డీ గ్లాస్ ఉన్నాయి. ఈ ఫోన్ ఐపీ52 రేటింగ్ కలిగి ఉంది.

ర్యామ్, చిప్సెట్

  • 4జిబి + 3జిబి ర్యామ్
  • యూనిసాక్ ఎస్‌సీ9863ఏ

Nokia C32 లో 4జిబి + 3జిబి ర్యామ్ ఉంటుందని అంచనా. యూనిసాక్ ఎస్‌సీ9863ఏ అనే చిప్సెట్ ని ఈ ఫోన్ లో అందించనున్నారు.

కెమెరా విభాగం

  • 50ఎంపి రియర్
  • 8ఎంపి సెల్ఫీ

Nokia C32 లో 50ఎంపి రియర్ కెమెరా, 8ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటుంది. రియర్ కెమెరాకి తోడు ఒక 2ఎంపి మ్యాక్రో లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి.

బ్యాటరీ, చార్జింగ్

  • 5000ఎంఏహెచ్
  • 10వాట్ చార్జింగ్

Nokia C32 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ

కనెక్టివిటీ ఫీచర్ల విషయానికి వస్తే, Nokia C32 లో 4జీ ఎల్టీఈ, 3.5ఎంఎం ఆడియో జాక్, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి బేసిక్ ఫీచర్లు ఉంటాయి.

The post మే 23న భారత్ లో లాంచ్ కానున్న Nokia C32 first appeared on 91Mobiles Telugu.

]]>
ఎండబ్ల్యూసీ 2023: 90హెర్ట్జ్ డిస్ప్లే, 50ఎంపి కెమెరాతో లాంచైన Nokia C22, C32, G22 https://www.91mobiles.com/telugu/nokia-c22-nokia-c32-nokia-g22-launched-mwc-2023-barcelona-price-specs/ Sun, 26 Feb 2023 17:15:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=5101 హెచ్‌ఎండీ గ్లోబల్ కి చెందిన నోకియా బ్రాండ్ స్పెయిన్ లోని బార్సిలోనాలో జరుగుతోన్న ఎండబ్ల్యూసీ 2023 ఈవెంట్ లో Nokia G22, Nokia C32, Nokia C22 ఫోన్లను లాంచ్ చేసింది. ఈ ఫోన్లు 3 రోజుల బ్యాటరీ లైఫ్, బెటర్ ఇమేజింగ్ క్వాలిటీస్ తో వచ్చాయి. Nokia G22 హైలీ రిపెయిరబుల్ డివైజ్ అని కంపెనీ చెబుతోంది. మరోవైపు Nokia C32 ఉత్తమమైన ఇమేజింగ్ సిస్టమ్ కలిగిన సీ-సిరీస్ ఫోన్ అని సమాచారం. ఇకపోతే Nokia […]

The post ఎండబ్ల్యూసీ 2023: 90హెర్ట్జ్ డిస్ప్లే, 50ఎంపి కెమెరాతో లాంచైన Nokia C22, C32, G22 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్ గా Nokia C22, Nokia C32, Nokia G22 ఫోన్లను లాంచ్ చేసిన నోకియా కంపెనీ
  • మంచి బిల్డ్ క్వాలిటీతో వచ్చిన Nokia C22, మోస్ట్ అడ్వాన్స్డ్ ఇమేజింగ్ సిస్టమ్ తో వచ్చిన Nokia C32
  • హై-రిపెయిరబులిటీ తో వచ్చిన Nokia G22, ఐఫిక్సిట్ టూల్స్ తో రిపెయిర్ చేయదగిన Nokia G22

హెచ్‌ఎండీ గ్లోబల్ కి చెందిన నోకియా బ్రాండ్ స్పెయిన్ లోని బార్సిలోనాలో జరుగుతోన్న ఎండబ్ల్యూసీ 2023 ఈవెంట్ లో Nokia G22, Nokia C32, Nokia C22 ఫోన్లను లాంచ్ చేసింది. ఈ ఫోన్లు 3 రోజుల బ్యాటరీ లైఫ్, బెటర్ ఇమేజింగ్ క్వాలిటీస్ తో వచ్చాయి. Nokia G22 హైలీ రిపెయిరబుల్ డివైజ్ అని కంపెనీ చెబుతోంది. మరోవైపు Nokia C32 ఉత్తమమైన ఇమేజింగ్ సిస్టమ్ కలిగిన సీ-సిరీస్ ఫోన్ అని సమాచారం. ఇకపోతే Nokia C22 స్మార్ట్ ఫోన్ మంచి బిల్డ్ క్వాలిటీతో వచ్చిందని నోకియా చెబుతోంది.

Nokia G22, C32, C22 ధర, లభ్యత

Nokia C22 రెండు ర్యామ్ వేరియంట్స్ లో లభిస్తుంది. అవి: 2జిబి+64జిబి, 3జిబి+64జిబి. ధరలు 129 యూరోలు (సుమారు రూ.11,310) తో ప్రారంభమవుతాయి. Nokia C22 మిడ్నైట్ బ్లాక్, స్యాండ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Nokia C32 డివైజ్ 3జిబి + 64జిబి మరియు 4జిబి + 128జిబి వేరియంట్స్ లో లభించనుంది. ఈ ఫోన్ ధరలు 129 యూరోలు (రూ.12,187) తో ప్రారంభమవుతుంది. చార్కోల్, ఆటమ్న్ గ్రీన్, బీచ్ పింక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Nokia G22 స్మార్ట్ ఫోన్ మీటియోర్ గ్రే, లగూన్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 4జిబి+64జిబి మరియు 4జిబి+128జిబి వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ ధర రూ.179 యూరోలు (రూ.15,694) తో ప్రారంభమవుతుంది.

Nokia G22, C32, C22 స్పెసిఫికేషన్స్

Nokia C22 స్మార్ట్ ఫోన్ ఐపీ52 స్ప్లాష్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్, టఫెండ్ 2.5డీ డిస్ప్లే గ్లాస్, రిజిడ్ మెటల్ చాసిస్, పాలీకార్బొనేట్ యూనిబాడీ డిజైన్ తో దృఢమైన నిర్మాణంతో వచ్చింది. ఈ డివైజ్ లో యూనిఎస్ఓసీ 9863ఏ1 ప్రాసెసర్ వాడారు. ఈ ఫోన్ 3జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ తో వచ్చింది. మెమొరీని 256జిబి వరకు పెంచుకోవచ్చు.

ఈ డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ చార్జింగ్, 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 13ఎంపి డ్యూయల్ కెమెరా, 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ డివైజ్ 4జీ ఎల్టీఈ, డ్యూయల్ సిమ్, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

Nokia C32 50ఎంపి మెయిన్ కెమెరాతో వచ్చింది. ఈ ఫోన్ ఇప్పటి వరకు వచ్చిన సీ-సిరీస్ డివైజెస్ లో ఉత్తమమైనదని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ లో మెయిన్ కెమెరాతో పాటు 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉంటుంది. ఇంకా సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ డివైజ్ 4జిబి ర్యామ్ వేరియంట్ లో లభిస్తుంది. మిగతా ఫీచర్లు Nokia C22 మాదిరే ఉంటాయి.

Nokia G22 స్మార్ట్ ఫోన్ లో యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్ ను వాడారు. ఈ ఫోన్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ తో లాంచైంది. ఈ డివైజ్ లో 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఉన్నాయి. ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి.

ఈ డివైజ్ నోకియా కంపెనీ ప్రకారం, అత్యధిక రిపెయిరింగ్ సంభావ్యతను కలిగి ఉందని తెలుస్తోంది. ఐఫిక్సిట్ తో నోకియా జట్టు కట్టి మాన్యువల్స్, పార్ట్స్ ని రోలౌట్ చేయబోతోంది. Nokia G22 లో ఫింగర్ ప్రింట్ స్కానర్, 5050 ఎంఏహెచ్ బ్యాటరీ, 20 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఎండబ్ల్యూసీ 2023: 90హెర్ట్జ్ డిస్ప్లే, 50ఎంపి కెమెరాతో లాంచైన Nokia C22, C32, G22 first appeared on 91Mobiles Telugu.

]]>