
ఈ ఏడాది ఆరంభంలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో నోకియా సంస్థ నోకియా జీ22, సీ22, సీ32 ఫోన్లను పరిచయం చేసింది. ఇటీవలె నోకియా సీ22 డివైజ్ భారత్ లో రూ.7,999 ధరతో లాంచ్ అయ్యింది. ఇప్పుడు, కంపెనీ Nokia C32 స్మార్ట్ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసింది. ఇదొక ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ 6.5-ఇంచ్ డిస్ప్లే, హెచ్డీ+ రెజుల్యూషన్, 1.6 గిగాహెర్ట్జ్ చిప్సెట్, 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో వచ్చింది.
సరే, ఓసారి Nokia C32 స్మార్ట్ ఫోన్ ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం.
భారత్ లో Nokia C32 ధర, లభ్యత
- 4జిబి+64జిబి= రూ.8,999
- 4జిబి+128జిబి= రూ.9,499
Nokia C32 స్మార్ట్ ఫోన్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లభ్యం అవుతుంది. అవి: 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ. మరొకటి 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ. ఈ స్మార్ట్ ఫోన్ బీచ్ పింక్, చార్కోల్ మరియు మింట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. నోకియా ఇండియా ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. కొనుగోలుదారులు నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్ ని 6 నెలల కాలపరిమితితో రూ.1,584 (ఒక నెలకు) కి పొందవచ్చు. ఈ ఫోన్ ఒక ఏడాది రీప్లేస్మెంట్ గ్యారంటీతో వస్తోంది.
Nokia C32 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే
- ఐపీఎస్ ఎల్సీడీ
- 720*1600 పిక్సెల్ రెజుల్యూషన్
Nokia C32 స్మార్ట్ ఫోన్ లో 6.5-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, హెచ్డీ+ రెజుల్యూషన్ (720*1600 పిక్సెల్స్), 60హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో, వాటర్ డ్రాప్ నాచ్ ఉన్నాయి.
చిప్సెట్, ర్యామ్, స్టోరేజీ
- యూనిఎస్ఓసీ ఎస్‌సీ9863ఏ
- 4జిబి ర్యామ్ + 3జిబి వర్చువల్ ర్యామ్
Nokia C32 స్మార్ట్ ఫోన్ లో యూనిఎస్ఓసీ ఎస్‌సీ9863ఏ చిప్సెట్ వాడారు. ఈ ఫోన్ లో 4జిబి ర్యామ్, 3జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీ అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ లో మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ఉంటుంది.
కెమెరా విభాగం
- 50ఎంపి మెయిన్ కెమెరా
- 8ఎంపి ఫ్రంట్ కెమెరా
Nokia C32 డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
ఓఎస్, బ్యాటరీ
- ఆండ్రాయిడ్ 13
- 5000 ఎంఏహెచ్
Nokia C32 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ
- ఐపీ52 రేటింగ్
- 4జీ, డ్యూయల్ సిమ్
Nokia C32 స్మార్ట్ ఫోన్ ఐపీ52 రేటింగ్ తో వచ్చింది. ఈ ఫోన్ లో 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్, డ్యూయల్ సిమ్ ఉంటాయి.











