OnePlus 10T - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 04 Aug 2022 05:38:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OnePlus 10T లాంచ్: స్పెసిఫికేషన్స్, బ్యాంక్ ఆఫర్ https://www.91mobiles.com/telugu/oneplus-10t-launched-india-price-specs-availability/ Thu, 04 Aug 2022 05:38:20 +0000 https://www.91mobiles.com/telugu/?p=1483 హైలైట్స్: భారత్ లో లాంచ్ అయిన వన్ ప్లస్ 10టీ, ప్రారంభ ధర రూ.49,999 స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1, 4,800ఎంఏహెచ్ బ్యాటరీ, 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 120హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్ ఈ ఫోన్ ప్రత్యేకతలు ఆగస్టు 6 నుంచి వన్ ప్లస్ 10టీ సేల్స్ ప్రారంభం, అమెజాన్, వన్ ప్లస్ వెబ్ సైట్ ద్వారా లభ్యత మొట్టమొదటి 16జిబి ర్యామ్ కలిగిన వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ గా లాంచ్ అయిన వన్ […]

The post OnePlus 10T లాంచ్: స్పెసిఫికేషన్స్, బ్యాంక్ ఆఫర్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత్ లో లాంచ్ అయిన వన్ ప్లస్ 10టీ, ప్రారంభ ధర రూ.49,999
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1, 4,800ఎంఏహెచ్ బ్యాటరీ, 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 120హెర్ట్జ్ అమోలెడ్ ప్యానెల్ ఈ ఫోన్ ప్రత్యేకతలు
  • ఆగస్టు 6 నుంచి వన్ ప్లస్ 10టీ సేల్స్ ప్రారంభం, అమెజాన్, వన్ ప్లస్ వెబ్ సైట్ ద్వారా లభ్యత

మొట్టమొదటి 16జిబి ర్యామ్ కలిగిన వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ గా లాంచ్ అయిన వన్ ప్లస్ 10టీ. ఇదే ఫోన్ వన్ ప్లస్ ఏస్ ప్రో అనే పేరుతో చైనాలో లాంచ్ కావల్సి ఉండగా, కొన్ని కారణాల వల్లన లాంచ్ ఈవెంట్ ని వన్ ప్లస్ వాయిదా వేసింది.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, నాన్-ప్రో మోడల్ అయిన వన్ ప్లస్ 10టీ, ఇంతకు ముందు లాంచ్ అయిన వన్ ప్లస్ 10 ప్రో ఫోన్ కి అప్ గ్రేడ్ గా వస్తోంది. మరో సంగతేంటంటే, ఈ ఏడాది వన్ ప్లస్ 10 సిరీస్ లో భాగంగా స్టాండర్డ్ వేరియంట్ వన్ ప్లస్ 10 రాలేదు. వన్ ప్లస్ 10 లైనప్ లో వన్ ప్లస్ 10 ప్రో, వన్ ప్లస్ 10ఆర్, ఇప్పుడు వన్ ప్లస్ 10టీ మాత్రమే ఉన్నాయి.

ఇది 16జిబి ర్యామ్ కలిగిన మొదటి వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ మాత్రమే కాదు, తొలిసారిగా ఐకానిక్ స్లైడర్ ని తీసివేయబడిన తొలి ఫ్లాగ్ షిప్ ఫోన్ కూడా వన్ ప్లస్ 10టీ కావడం గమనార్హం. ఇక ఈ ఫోన్ లో హాజెల్‌బ్లడ్ కెమెరాలు ఉండబోవు. వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉండదు. మరి వన్ ప్లస్ 10టీ ఆఫర్ చేస్తున్న ఫీచర్లేంటో చూద్దాం పదండి.

భారత్ లో OnePlus 10T ధర, లభ్యత

భారత్ లో వన్ ప్లస్ 10టీ బేస్ వేరియంట్ ధర రూ.49,999 గా ఉంది. ఆగస్టు 6 నుంచి అమెజాన్ మరియు వన్ ప్లస్ వెబ్ సైట్ ద్వారా ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. మూన్ స్టోన్ బ్యాక్, జేడ్ గ్రీన్ అనే రెండు రంగుల ఆప్షన్స్ లో ఫోన్ లభ్యమవుతుంది. ఈ ఫోన్ మూడు వేరియంట్స్ లో లభిస్తుంది: 8జిబి+128జిబి (రూ.49,999), 12జిబి+256జిబి (రూ.54,999), 16జిబి+256జిబి (రూ.55,999). ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ కార్డ్స్ ద్వారా వన్ ప్లస్ 10టీ ని కొంటే, యూజర్లు రూ.5,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.

OnePlus 10T స్పెసిఫికేషన్స్

క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 16జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ (పెంచడానికి వీలులేదు), ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్ లాక్ వంటి ఫీచర్లు వన్ ప్లస్ 10టీ స్మార్ట్ ఫోన్లో ఉన్నాయి.

6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్టీపీవో2 10-బిట్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+, 394 పీపీఐ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, 4,800ఎంఏహెచ్ బ్యాటరీ, 150 వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ (బాక్స్ లో 160 వాట్ ఛార్జర్ అందించబడుతుంది) వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. వన్ ప్లస్ చెబుతున్న దాన్ని బట్టి, వన్ ప్లస్ 10టీ పూర్తిగా చార్జ్ అవ్వడానికి పట్టే సమయం 19 నిమిషాలు.

వన్ ప్లస్ 10టీ స్మార్ట్ ఫోన్ లో వెనకాల 50ఎంపి సోనీ ఐఎంఎక్స్766 ప్రైమరీ కెమెరా (ఓఐఎస్), 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపున 16ఎంపి కెమెరాను ఇచ్చారు. వై-ఫై 6, బ్లూటూత్ 5.2, 5జీ, డ్యూయల్ స్టీరియో, ఆండ్రాయిడ్ 12 ఆధారిత, ఆక్సిజన్ ఓఎస్ 12.1 కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

The post OnePlus 10T లాంచ్: స్పెసిఫికేషన్స్, బ్యాంక్ ఆఫర్ first appeared on 91Mobiles Telugu.

]]>
హయ్యస్ట్ AnTuTu స్కోర్ నమోదు చేసిన OnePlus 10T https://www.91mobiles.com/telugu/oneplus-10t-registered-highest-score-on-antutu-platform/ Tue, 26 Jul 2022 15:33:01 +0000 https://www.91mobiles.com/telugu/?p=1272 హైలైట్స్: అన్ టు టు బెంచ్ మార్క్ పై అత్యధిక స్కోర్ నమోదు చేసిన ఆండ్రాయిడ్ డివైజ్ గా నిలిచిన వన్ ప్లస్ 10టీ ఆగస్టు 3 న గ్లోబల్ గా లాంచ్ కానున్న స్మార్ట్ ఫోన్ భారత్ లో 10టీ కోసం ఒక ఫిజికల్ ఈవెంట్ ను నిర్వహిస్తోన్న వన్ ప్లస్ వన్ ప్లస్ సంస్థ నుంచి వస్తున్న లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ 10టీ. ఆగస్టు 3 న ప్రపంచ […]

The post హయ్యస్ట్ AnTuTu స్కోర్ నమోదు చేసిన OnePlus 10T first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • అన్ టు టు బెంచ్ మార్క్ పై అత్యధిక స్కోర్ నమోదు చేసిన ఆండ్రాయిడ్ డివైజ్ గా నిలిచిన వన్ ప్లస్ 10టీ
  • ఆగస్టు 3 న గ్లోబల్ గా లాంచ్ కానున్న స్మార్ట్ ఫోన్
  • భారత్ లో 10టీ కోసం ఒక ఫిజికల్ ఈవెంట్ ను నిర్వహిస్తోన్న వన్ ప్లస్

వన్ ప్లస్ సంస్థ నుంచి వస్తున్న లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ 10టీ. ఆగస్టు 3 న ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫోన్ లాంచ్ అవుతోంది. లాంచ్ కి ముందు కంపెనీ చేస్తున్న టీజర్లను బట్టి, 10టీ బెంచ్ మార్క్ ప్లాట్ఫామ్ అన్ టు టు పై అత్యధిక స్కోర్ ని నమోదు చేసినట్లు తెలుస్తోంది. అంటే దీన్ని బట్టి వన్ ప్లస్ 10టీ టాప్ పెర్ఫామింగ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ గా నిలిచినట్లైంది. మరి ఇతర వివరాలేంటో చూద్దాం పదండి.

OnePlus 10T అన్ టు టు ర్యాంక్

ఇప్పటి వరకు అన్ టు టు ప్రచురించిన ర్యాంకింగ్స్ జాబితాలో నుబియా రెడ్ మ్యాజిక్ 7 స్మార్ట్ ఫోన్ ప్రపంచంలోనే శక్తివంతమైన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ గా ఉంది. దీంట్లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్సెట్, 16జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి. దీని స్కోర్ 1,046,552. మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ కలిగిన వివో ఎక్స్80 స్మార్ట్ ఫోన్ 1,000,443 స్కోరుతో రెండో స్థానంలో ఉంది.

ఇప్పుడు వీటన్నింటినీ వన్ ప్లస్ 10టీ స్మార్ట్ ఫోన్ వెనక్కి నెట్టేయగలదని తెలుస్తోంది. ప్రముఖ టిప్ స్టర్ ముకుల్ శర్మ పోస్ట్ చేసిన స్మార్ట్ ఫోన్ యొక్క టీజర్ ఇమేజ్ ని బట్టి తెలుస్తున్నదేంటంటే, వన్ ప్లస్ 10టీ 1,141,383 పాయింట్లతో అగ్రస్థానంలోకి దూసుకెళ్ళింది. ఇదే కనుక నిజమైతే, ఇకపై మార్కెట్ లో వన్ ప్లస్ 10టీ శక్తివంతమైన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ గా నిలవనుంది.

అయితే, ఓవరాల్ గా మోస్ట్ పవర్ఫుల్ మొబైల్ డివైజ్ విషయానికి వస్తే, అన్ టు టు ప్రకారం, ఆపిల్ యొక్క ఎమ్1 చిప్ కలిగిన, ఐప్యాడ్ ప్రో 5th జనరేషన్, 1,203,916 పాయింట్లతో టాప్ పొజిషన్ లో ఉంది.

OnePlus 10T స్పెసిఫికేషన్స్ (అంచనా)

వన్ ప్లస్ 10టీ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తోంది. ఇందులో 16జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి. 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ను ఈ ఫోన్ కలిగి ఉంది. ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. వన్ ప్లస్ 10టీ లో 50ఎంపి + 50ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇప్పుడు బ్యాటరీ విభాగం ఫీచర్లు చూద్దాం. ఈ ఫోన్లో 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ, 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. వన్ ప్లస్ 10టీ కి సంబంధించిన వివరాలు ఆగస్టు 3 న జరగబోవు లాంచ్ ఈవెంట్ లో తెలియనున్నాయి. అదే రోజున భారత్ లో కూడా వన్ ప్లస్ 10టీ లాంచ్ అవుతోంది.

The post హయ్యస్ట్ AnTuTu స్కోర్ నమోదు చేసిన OnePlus 10T first appeared on 91Mobiles Telugu.

]]>
రూపాయి చెల్లించి OnePlus 10T ఈవెంట్ కు హాజరవ్వొచ్చు..!! https://www.91mobiles.com/telugu/oneplus-10t-launch-event-one-rupee-entry-ticket/ Mon, 25 Jul 2022 15:06:01 +0000 https://www.91mobiles.com/telugu/?p=1227 హైలైట్స్: బెంగళూరులో జరగనున్న వన్ ప్లస్ 10టీ ఈవెంట్ ఫోన్ ని కొనాలనుకునే వారు రూ.1 టిక్కెట్టు కొని ఈవెంట్ కి హాజరయ్యే అవకాశం ఈవెంట్లో యూజర్లు వన్ ప్లస్ 10టీ ని గెలిచే అవకాశం వచ్చే నెల మొదటి వారంలో వన్ ప్లస్ 10టీ భారత్ లో లాంచ్ అవుతోంది. ఆగస్టు 3, బుధవారం నాడు బెంగళూరులో లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఇక గ్లోబల్ గా ఫోన్ అమెరికాలోని న్యూయార్క్ నగరంలో విడుదల కానుంది. ఇక […]

The post రూపాయి చెల్లించి OnePlus 10T ఈవెంట్ కు హాజరవ్వొచ్చు..!! first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • బెంగళూరులో జరగనున్న వన్ ప్లస్ 10టీ ఈవెంట్
  • ఫోన్ ని కొనాలనుకునే వారు రూ.1 టిక్కెట్టు కొని ఈవెంట్ కి హాజరయ్యే అవకాశం
  • ఈవెంట్లో యూజర్లు వన్ ప్లస్ 10టీ ని గెలిచే అవకాశం

వచ్చే నెల మొదటి వారంలో వన్ ప్లస్ 10టీ భారత్ లో లాంచ్ అవుతోంది. ఆగస్టు 3, బుధవారం నాడు బెంగళూరులో లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఇక గ్లోబల్ గా ఫోన్ అమెరికాలోని న్యూయార్క్ నగరంలో విడుదల కానుంది. ఇక భారత్ లో ఒక కమ్యూనిటీ ఈవెంట్ ద్వారా భౌతిక అనుభూతిని కల్పించాలని వన్ ప్లస్ భావిస్తోంది. ఇక ఈవెంట్ వద్ద, ఆసక్తి గల వన్ ప్లస్ యూజర్లు, ఫాలోవర్లు స్మార్ట్ ఫోన్ ని తరచి చూసే అవకాశాన్ని పొందుతారు. అలాగే వన్ ప్లస్ యాక్ససరీలతో పాటు వన్ ప్లస్ 10టీ ఫోన్ ని కూడా గెలుచుకునే అవకాశముంది.

OnePlus 10T స్మార్ట్ ఫోన్ ని ఎలా గెలవాలి

వన్ ప్లస్ అనౌన్స్ చేసిన విధంగా, ఎంపిక కాబడిన యూజర్లు వన్ ప్లస్ 10టీ ఫోన్ ని గెలుచుకునే అవకాశముంది. ఈవెంట్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ లో జరగనుంది. అయితే, యూజర్లు టిక్కెట్టుకి ఒక్క రూపాయి చెల్లించి ప్రీ-రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రీ-రిజిస్టర్ చేసుకునేందుకు యూజర్లు వన్ ప్లస్ ఇండియా వెబ్ సైట్ పై ఈ పేజీని యాక్సెస్ చేయగలరు. నేడు జరుగుతోన్న 24 గంటల స్పెషల్ సేల్ లో భాగంగా, ప్రీ-రిజిస్ట్రేషన్ ను చేసుకునే వీలుంది. ఇందుకోసం మీరు ఈమెయిల్ ను రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్స్ సైన్ అప్ అయ్యాక, యూజర్లు రూ.1 చెల్లించేందుకై ఇన్వైట్ లింక్ పొందుతారు. అప్పుడు టిక్కెట్టు పొంది లాంచ్ ఈవెంట్ ను ఎక్స్ పీరియన్స్ చేయవచ్చు. పేమెంట్ అయ్యాక, ఈవెంట్ కు వచ్చేందుకై యూజర్లకు కన్ఫర్మేషన్ అందుతుంది.

ఫిజికల్ ఈవెంట్ కు హాజరయ్యే యూజర్లు ఈవెంట్ వద్ద నుంచే వన్ ప్లస్ 10టీ ఫోన్ ని ప్రీ-ఆర్డర్ చేసుకునే అవకాశముంటుందని , వన్ ప్లస్ తెలిపింది. అలాగే ఈవెంట్ వద్ద స్మార్ట్ ఫోన్ ని ఎక్స్ పీరియన్స్ చేసే అవకాశం కూడా లభించనుంది. ఇంకా 10టీ ఫోన్ తో పాటు, వన్ ప్లస్ యాక్ససరీలను గెలుచుకునే చాన్స్ ఉంది.

OnePlus 10T స్పెసిపికేషన్స్ (అంచనా)

వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ ను అమర్చారు. అలాగే ఈ ఫోన్ 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీతో వస్తుందని అంచనా. ఇక ఈ ఫోన్ లో 6.7 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50ఎంపి + 50ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనున్నాయి. ఇప్పుడు బ్యాటరీ విభాగం గురించి తెలుసుకుందాం. వన్ ప్లస్ 10టీ లో 4,800 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఇది 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ని కలిగి ఉంది.

The post రూపాయి చెల్లించి OnePlus 10T ఈవెంట్ కు హాజరవ్వొచ్చు..!! first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు గీక్ బెంచ్ పై కనిపించిన OnePlus 10T 5G https://www.91mobiles.com/telugu/oneplus-10t-5g-appeared-on-geekbench-specs-and-score-details/ Wed, 20 Jul 2022 14:20:44 +0000 https://www.91mobiles.com/telugu/?p=1113 హైలైట్స్: త్వరలో వన్ ప్లస్ 10టీ 5జీ స్మార్ట్ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేయనున్న వన్ ప్లస్ 2022, ఆగస్టు 3 న వన్ ప్లస్ 10టీ 5జీ లాంచ్ అవ్వనుందని సమాచారం లాంచ్ కి ముందు గీక్ బెంచ్ పై దర్శనమిచ్చిన డివైజ్, 16జిబి వేరియంట్ రావడం కన్ఫర్మ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో కూడిన తన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ 10టీ 5జీ ని […]

The post లాంచ్ కి ముందు గీక్ బెంచ్ పై కనిపించిన OnePlus 10T 5G first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • త్వరలో వన్ ప్లస్ 10టీ 5జీ స్మార్ట్ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేయనున్న వన్ ప్లస్
  • 2022, ఆగస్టు 3 న వన్ ప్లస్ 10టీ 5జీ లాంచ్ అవ్వనుందని సమాచారం
  • లాంచ్ కి ముందు గీక్ బెంచ్ పై దర్శనమిచ్చిన డివైజ్, 16జిబి వేరియంట్ రావడం కన్ఫర్మ్

స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో కూడిన తన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ 10టీ 5జీ ని లాంచ్ చేసేందుకు ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వన్ ప్లస్ సిద్దమవుతోంది. 2022, ఆగస్టు 3 న వన్ ప్లస్ 10టీ 5జీ భారత్ లో లాంచ్ అవ్వనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు వన్ ప్లస్ 10టీ 5జీ ఫోన్ కి సంబంధించిన ఇమేజెస్, ముఖ్య ఫీచర్లతో సహా ఎన్నో రిపోర్ట్స్ ని మనం చూశాం. వన్ ప్లస్ 10టీ 5జీ ఇప్పుడు గీక్ బెంచ్ డేటా బేస్ వెబ్ సైట్ ను విజిట్ చేసింది. దీంతో ఇప్పటికే బయటకు వచ్చిన ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ నిజమేనని స్పష్టమైంది.

గీక్ బెంచ్ కు చేరిన OnePlus 10T 5G

గీక్ బెంచ్ డేటాబేస్ ఇమేజ్ లో కనిపిస్తున్నట్లుగా, వన్ ప్లస్ 10టీ 5జీ (మోడల్ నంబర్ వన్ ప్లస్ పీజీపీ110) సింగిల్ కోర్ టెస్ట్ లో 1,049 స్కోర్ ని సాధించింది. ఇక మల్టీ స్కోర్ టెస్ట్ లో 3,495 స్కోర్ సాధించింది. ఇంకా గీక్ బెంచ్ లిస్టింగ్ రుజువు చేస్తున్నదేంటంటే, వన్ ప్లస్ 10టీ 5జీ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్, 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ కెపాసిటీతో వస్తోంది. ఖరారైన మరో విషయం ఏంటంటే, వన్ ప్లస్ 10టీ 5జీ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో వస్తోంది. ఎలాగూ ఈ విషయం తెలిసిన విషయమే అనుకోండి.

OnePlus 10T 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ను ఈ ఫోన్ కలిగి ఉంటుందని సమాచారం. ఇంకా ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుంది. దీంట్లో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉండనున్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం వన్ ప్లస్ 10టీ 5జీ లో ముందు భాగాన 16ఎంపి కెమెరా ఉండనుంది.

ఇప్పుడు బ్యాటరీ విభాగం గురించి తెలుసుకుందాం. వన్ ప్లస్ 10టీ 5జీ 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ని కలిగి ఉండనుంది. అలాగే ఈ ఫోన్ 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేయనున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ ఫోన్లో యూఎస్బీ టైప్-సీ చార్జింగ్ పోర్ట్ ఉంది. చివరగా, వన్ ప్లస్ 10టీ 5జీ జేడ్ గ్రీన్, మూన్ స్టోన్ బ్లాక్ రంగుల్లో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది.

వన్ ప్లస్ 10టీ 5జీ ఫోన్లో 8ఎంపి వైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరాలు ఉండటం గమనించాల్సిన విషయం. ఈ రెండు తప్పితే, మిగతా అన్ని విభాగాల్లో ఈ ఫోన్ ఫీచర్లు చాలా బాగున్నాయనే చెప్పాలి. ఈ ఫోన్ ధర కూడా అందుబాటు శ్రేణిలో ఉంటే కచ్చితంగా మార్కెట్ లో విజయం సాధించే అవకాశముంది. మరి రానున్న రోజుల్లో ఈ ఫోన్ కి సంబంధించిన ఇతర వివరాలను కంపెనీ టీజ్ చేస్తుందేమో వేచి చూద్దాం. అప్పటి వరకు మీకోసం ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తూనే ఉంటాం. లేటెస్ట్ అప్డేట్స్ కోసం 91మొబైల్స్ తెలుగు ని తప్పకుండా ఫాలో అవ్వండి.

The post లాంచ్ కి ముందు గీక్ బెంచ్ పై కనిపించిన OnePlus 10T 5G first appeared on 91Mobiles Telugu.

]]>
16జిబి ర్యామ్ తో వస్తున్న OnePlus 10T https://www.91mobiles.com/telugu/oneplus-10t-16gb-ram-india-launch-highest-ram-for-oneplus-phone/ Mon, 11 Jul 2022 07:04:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=867 హైలైట్స్: * 16జిబి ర్యామ్ తో వస్తున్న మొట్టమొదటి వన్ ప్లస్ ఫోన్ * ఆగస్టు నెలలో వన్ ప్లస్ 10టీ భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం * 6.7 అంగుళాల డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 8+ జెన్1, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 150W ఫాస్ట్ ఛార్జింగ్ వన్ ప్లస్ 8టీ తర్వాత వన్ ప్లస్ కంపెనీ నుంచి వస్తున్న టీ సిరీస్ ఫ్లాగ్ షిప్ ఫోన్ వన్ ప్లస్ 10టీ. ఇప్పటికే ఈ ఫోన్ […]

The post 16జిబి ర్యామ్ తో వస్తున్న OnePlus 10T first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

* 16జిబి ర్యామ్ తో వస్తున్న మొట్టమొదటి వన్ ప్లస్ ఫోన్

* ఆగస్టు నెలలో వన్ ప్లస్ 10టీ భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం

* 6.7 అంగుళాల డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 8+ జెన్1, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 150W ఫాస్ట్ ఛార్జింగ్

వన్ ప్లస్ 8టీ తర్వాత వన్ ప్లస్ కంపెనీ నుంచి వస్తున్న టీ సిరీస్ ఫ్లాగ్ షిప్ ఫోన్ వన్ ప్లస్ 10టీ. ఇప్పటికే ఈ ఫోన్ కి సంబంధించిన డిజైన్, స్పెసిఫికేషన్స్ కి సంబంధించి రూమర్లు, లీక్స్ ఎన్నో బయటకు వచ్చాయి. ఆగస్టు నెలలో భారత గడ్డపై ఈ ఫోన్ లాంచ్ అవుతుందని తాజాగా ఓ నివేదిక ద్వారా స్పష్టమవుతోంది. అయితే దీనిపై వన్ ప్లస్ నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పుడు ప్రముఖ టిప్ స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ మరోసారి ఫోన్ స్పెసిఫికేషన్స్ ని బయటకు వదిలింది. ఇది వరకు వచ్చిన స్పెసిఫికేషన్సే అయినప్పటికీ, ఇక్కడ ర్యామ్ ఆప్షన్ మన దృష్టిని ఆకర్షిస్తోంది.

లీక్ స్టర్ ప్రకారం, వన్ ప్లస్ టీ ఫోన్ 16జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్ ఆప్షన్ తో వస్తున్నట్లు సమాచారం. దీన్ని బట్టి, ఇంత భారీ ర్యామ్ తో వస్తున్న తొలి వన్ ప్లస్ ఫోన్ ఇదేనని అర్థమవుతోంది. AnTuTu బెంచ్ మార్క్ ప్లాట్ఫామ్ పై 1131151 స్కోర్ చేసిన ఫోన్, ఈ వన్ ప్లస్ 10టీ నే అని అనిపిస్తోంది. ఇక ఈ మోడల్ లో 8జిబి ర్యామ్, 12జిబి ర్యామ్ వేరియంట్స్ కూడా లభించనున్నాయి.

వన్ ప్లస్ 10టీ ధర (Oneplus 10T Price)

వన్ ప్లస్ 10టీ 8జిబి+128జిబి వేరియంట్ ధర 799 యూరోలు (దాదాపు రూ.65,300) గా ఉంటుందని అంచనా. ఇది మూన్ స్టోన్ బ్లాక్ కలర్ ఆప్షన్ లో లభించనుంది.

ఇక బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే, బాక్స్ లో ఛార్జర్, యూఎస్బీ కేబుల్, ఫోన్ కేస్, సిమ్ ఎజెక్టర్ టూల్ వంటివి ఉంటాయి.

OnePlus 10T ఇండియా లాంచ్ టైమ్ లైన్

వన్ ప్లస్ 10టీ భారత్ లో ఆగస్టు మొదటి వారంలో లాంచ్ కానుందని అంచనా. దీన్ని బట్టి, సదరు సంస్థ ఓ రెండు వారాల్లో ఈ ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ తో టీజ్ చేయడం మొదలుపెట్టనుందని అర్థమవుతోంది.

OnePlus 10T స్పెసిఫికేషన్స్

  • 6.7-inch ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్1 చిప్సెట్
  • 12జిబి వరకు ర్యామ్, 256జిబి దాకా స్టోరేజీ ఆప్షన్
  • ఆండ్రాయిడ్ 12 ఓఎస్
  • 50ఎంపి + 8ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరాలు
  • 16ఎంపి సెల్ఫీ కెమెరా
  • 4,800mAh బ్యాటరీ, 150W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్

వన్ ప్లస్ 10టీ ఫోన్లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్టీపీవో 2.0 అమోలెడ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్, హెచ్డీఆర్10+, ఆర్జీబీ, డిస్ప్లే పీ3 కలర్ గేముత్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, స్నాప్ డ్రాగన్ 8+ జెన్1 చిప్సెట్, 16జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12, ఆక్సిజన్ ఓఎస్ కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

ఇక కెమెరాల విషయానికి వస్తే, వన్ ప్లస్ 10టీ లో 50ఎంపి సోనీ ఐఎంఎక్స్766 ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్, 16ఎంపి ఫ్రంట్ కెమెరాలున్నాయి. అయితే ఈ మోడల్ కేవలం చైనాలో మాత్రమే లాంచ్ కానున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. గ్లోబల్ వేరియంట్ లో ఫీచర్లు మారే అవకాశమున్నట్లు అంచనా. గ్లోబల్ వేరియంట్ లో 50ఎంపి ప్రైమరీ సెన్సర్, 16ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనున్నట్లు తెలుస్తోంది.

వన్ ప్లస్ 10టీ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, 4,800ఎంఏహెచ్ బ్యాటరీ, 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండనున్నాయి. 2×2 MIMO, WiFi 802.11 a/b/g/n/ac/ax, బ్లూటూత్ 5.3, NFC, SBC & aptX HD & LDAC, USB టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉండనున్నాయి.

The post 16జిబి ర్యామ్ తో వస్తున్న OnePlus 10T first appeared on 91Mobiles Telugu.

]]>