హైలైట్స్:
* 16జిబి ర్యామ్ తో వస్తున్న మొట్టమొదటి వన్ ప్లస్ ఫోన్
* ఆగస్టు నెలలో వన్ ప్లస్ 10టీ భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం
* 6.7 అంగుళాల డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 8+ జెన్1, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 150W ఫాస్ట్ ఛార్జింగ్
వన్ ప్లస్ 8టీ తర్వాత వన్ ప్లస్ కంపెనీ నుంచి వస్తున్న టీ సిరీస్ ఫ్లాగ్ షిప్ ఫోన్ వన్ ప్లస్ 10టీ. ఇప్పటికే ఈ ఫోన్ కి సంబంధించిన డిజైన్, స్పెసిఫికేషన్స్ కి సంబంధించి రూమర్లు, లీక్స్ ఎన్నో బయటకు వచ్చాయి. ఆగస్టు నెలలో భారత గడ్డపై ఈ ఫోన్ లాంచ్ అవుతుందని తాజాగా ఓ నివేదిక ద్వారా స్పష్టమవుతోంది. అయితే దీనిపై వన్ ప్లస్ నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పుడు ప్రముఖ టిప్ స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ మరోసారి ఫోన్ స్పెసిఫికేషన్స్ ని బయటకు వదిలింది. ఇది వరకు వచ్చిన స్పెసిఫికేషన్సే అయినప్పటికీ, ఇక్కడ ర్యామ్ ఆప్షన్ మన దృష్టిని ఆకర్షిస్తోంది.
లీక్ స్టర్ ప్రకారం, వన్ ప్లస్ టీ ఫోన్ 16జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్ ఆప్షన్ తో వస్తున్నట్లు సమాచారం. దీన్ని బట్టి, ఇంత భారీ ర్యామ్ తో వస్తున్న తొలి వన్ ప్లస్ ఫోన్ ఇదేనని అర్థమవుతోంది. AnTuTu బెంచ్ మార్క్ ప్లాట్ఫామ్ పై 1131151 స్కోర్ చేసిన ఫోన్, ఈ వన్ ప్లస్ 10టీ నే అని అనిపిస్తోంది. ఇక ఈ మోడల్ లో 8జిబి ర్యామ్, 12జిబి ర్యామ్ వేరియంట్స్ కూడా లభించనున్నాయి.
వన్ ప్లస్ 10టీ ధర (Oneplus 10T Price)
వన్ ప్లస్ 10టీ 8జిబి+128జిబి వేరియంట్ ధర 799 యూరోలు (దాదాపు రూ.65,300) గా ఉంటుందని అంచనా. ఇది మూన్ స్టోన్ బ్లాక్ కలర్ ఆప్షన్ లో లభించనుంది.
ఇక బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే, బాక్స్ లో ఛార్జర్, యూఎస్బీ కేబుల్, ఫోన్ కేస్, సిమ్ ఎజెక్టర్ టూల్ వంటివి ఉంటాయి.
OnePlus 10T ఇండియా లాంచ్ టైమ్ లైన్
వన్ ప్లస్ 10టీ భారత్ లో ఆగస్టు మొదటి వారంలో లాంచ్ కానుందని అంచనా. దీన్ని బట్టి, సదరు సంస్థ ఓ రెండు వారాల్లో ఈ ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ తో టీజ్ చేయడం మొదలుపెట్టనుందని అర్థమవుతోంది.
OnePlus 10T స్పెసిఫికేషన్స్
- 6.7-inch ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్
- క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్1 చిప్సెట్
- 12జిబి వరకు ర్యామ్, 256జిబి దాకా స్టోరేజీ ఆప్షన్
- ఆండ్రాయిడ్ 12 ఓఎస్
- 50ఎంపి + 8ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరాలు
- 16ఎంపి సెల్ఫీ కెమెరా
- 4,800mAh బ్యాటరీ, 150W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
వన్ ప్లస్ 10టీ ఫోన్లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్టీపీవో 2.0 అమోలెడ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్, హెచ్డీఆర్10+, ఆర్జీబీ, డిస్ప్లే పీ3 కలర్ గేముత్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, స్నాప్ డ్రాగన్ 8+ జెన్1 చిప్సెట్, 16జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12, ఆక్సిజన్ ఓఎస్ కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.
ఇక కెమెరాల విషయానికి వస్తే, వన్ ప్లస్ 10టీ లో 50ఎంపి సోనీ ఐఎంఎక్స్766 ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్, 16ఎంపి ఫ్రంట్ కెమెరాలున్నాయి. అయితే ఈ మోడల్ కేవలం చైనాలో మాత్రమే లాంచ్ కానున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. గ్లోబల్ వేరియంట్ లో ఫీచర్లు మారే అవకాశమున్నట్లు అంచనా. గ్లోబల్ వేరియంట్ లో 50ఎంపి ప్రైమరీ సెన్సర్, 16ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్, 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనున్నట్లు తెలుస్తోంది.
వన్ ప్లస్ 10టీ లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, 4,800ఎంఏహెచ్ బ్యాటరీ, 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండనున్నాయి. 2×2 MIMO, WiFi 802.11 a/b/g/n/ac/ax, బ్లూటూత్ 5.3, NFC, SBC & aptX HD & LDAC, USB టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉండనున్నాయి.














