OnePlus Ace 3V - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 21 Mar 2024 17:04:04 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OnePlus: 100W ఫాస్ట్ చార్జింగ్‌తో చైనాలో లాంచైన Ace 3V https://www.91mobiles.com/telugu/oneplus-ace-3v-launched-china-100w-fast-charging/ Thu, 21 Mar 2024 17:04:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=10769 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నేడు చైనాలో Ace 3V డివైజ్‌ని లాంచ్ చేసింది. స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ తో వచ్చిన మొదటి ఫోన్ OnePlus Ace 3V కావడం విశేషం. ఈ ఫోన్ లో 16జిబి ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ, ఓఎల్ఈడీ డిస్ప్లే, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి OnePlus Ace 3V ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ […]

The post OnePlus: 100W ఫాస్ట్ చార్జింగ్‌తో చైనాలో లాంచైన Ace 3V first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో OnePlus Ace 3V లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్
  • 6.74-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నేడు చైనాలో Ace 3V డివైజ్‌ని లాంచ్ చేసింది. స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ తో వచ్చిన మొదటి ఫోన్ OnePlus Ace 3V కావడం విశేషం. ఈ ఫోన్ లో 16జిబి ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ, ఓఎల్ఈడీ డిస్ప్లే, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి OnePlus Ace 3V ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

OnePlus Ace 3V ధర

OnePlus Ace 3V స్మార్ట్‌ఫోన్ చైనాలో 3 మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

OnePlus Ace 3V 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర CNY 1,999 యువాన్లు (సుమారు రూ.23,399) గా ఉంది.

OnePlus Ace 3V 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 2,299 (సుమారు రూ.26,914) గా ఉంది.

OnePlus Ace 3V 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర CNY 2,599 (సుమారు రూ.30,000) గా ఉంది.

OnePlus Ace 3V స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: OnePlus Ace 3V లో 6.74-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, రెయిన్ టచ్ టెక్నాలజీ, 2,150 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: OnePlus Ace 3V లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. ఏరోస్పేస్-గ్రేడ్ వీసీ కూలింగ్ సిస్టమ్ ని ఈ ఫోన్ లో అందించారు.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus Ace 3V 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ + 512జిబి వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: OnePlus Ace 3V లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: OnePlus Ace 3V లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: OnePlus Ace 3V డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: OnePlus Ace 3V లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్, ఐపీ65 రేటింగ్, డ్యూయల్ గేమింగ్ యాంటెన్నా, ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post OnePlus: 100W ఫాస్ట్ చార్జింగ్‌తో చైనాలో లాంచైన Ace 3V first appeared on 91Mobiles Telugu.

]]>
OnePlus: మార్చి 19న చైనాలో లాంచ్ అవుతోన్న OnePlus Ace 3V https://www.91mobiles.com/telugu/oneplus-ace-3v-launch-date-march-19-china/ Thu, 14 Mar 2024 06:58:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=10680 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో OnePlus Ace 3V డివైజ్ ని చైనాలో లాంచ్ చేయనుంది. చైనాలో ఈ ఫోన్ మార్చి 19న లాంచ్ అవుతోందని సమాచారం. ఇదే ఫోన్ భారత్ లో OnePlus Nord CE 4 లేదా OnePlus Nord 4 పేరుతో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. OnePlus Ace 3V స్పెసిఫికేషన్స్ (లీక్) స్క్రీన్: OnePlus Ace 3V లో 1.5కే రెజుల్యూషన్, […]

The post OnePlus: మార్చి 19న చైనాలో లాంచ్ అవుతోన్న OnePlus Ace 3V first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Nord CE 4 లాంచ్
  • ఏప్రిల్ 1న భారత్‌లో లాంచ్
  • మార్చి 19న చైనాలో ఎంట్రీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో OnePlus Ace 3V డివైజ్ ని చైనాలో లాంచ్ చేయనుంది. చైనాలో ఈ ఫోన్ మార్చి 19న లాంచ్ అవుతోందని సమాచారం. ఇదే ఫోన్ భారత్ లో OnePlus Nord CE 4 లేదా OnePlus Nord 4 పేరుతో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

OnePlus Ace 3V స్పెసిఫికేషన్స్ (లీక్)

  • స్క్రీన్: OnePlus Ace 3V లో 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OnePlus Ace 3V డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 732 జీపీయూ ఉంటాయి.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus Ace 3V స్మార్ట్‌ఫోన్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: OnePlus Ace 3V లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: OnePlus Ace 3V లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

OnePlus Nord CE 4 5G ఇండియా లాంచ్ వివరాలు

OnePlus Nord CE 4 5G డివైజ్ భారతీయ మార్కెట్ లో ఏప్రిల్ 1న లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఏప్రిల్ 1న సాయంత్రం 6.30 గంటలకు ఈవెంట్ ప్రారంభమవుతుంది.

OnePlus యొక్క అధికార వెబ్‌సైట్ మరియు ఆన్‌లైన్ షాపింగ్ సైట్ అమెజాన్ ద్వారా ఈవెంట్‌ని చూడవచ్చు.

OnePlus Nord CE 4 5G స్మార్ట్‌ఫోన్‌ డార్క్ క్రోమ్ మరియు సెలడన్ మార్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

త్వరలోనే వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 5జీ డివైజ్ ఇండియా లాంచ్ కి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

The post OnePlus: మార్చి 19న చైనాలో లాంచ్ అవుతోన్న OnePlus Ace 3V first appeared on 91Mobiles Telugu.

]]>
OnePlus: లాంచ్‌కి ముందు రివీలైన Ace 3V లైవ్ ఇమేజ్ https://www.91mobiles.com/telugu/oneplus-ace-3v-live-image-revealed-before-launch/ Wed, 13 Mar 2024 13:17:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=10672 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో ఏస్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OnePlus Ace 3V పేరుతో ఈ ఫోన్ లాంచ్ కానుంది. కొన్ని రోజుల క్రితం వన్‌ప్లస్ ప్రెసిడెంట్ OnePlus Ace 3V లాంచ్ కన్ఫర్మ్ చేశారు. తాజాగా OnePlus Ace 3V లైవ్ ఇమేజ్ ని స్వయంగా కంపెనీ ప్రెసిడెంట్ షేర్ చేశారు. దీంతో ఫోన్ డిజైన్, లుక్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి. […]

The post OnePlus: లాంచ్‌కి ముందు రివీలైన Ace 3V లైవ్ ఇమేజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OnePlus Ace 3V లాంచ్
  • తాజాగా లీకైన లైవ్ ఇమేజ్
  • స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో ఏస్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OnePlus Ace 3V పేరుతో ఈ ఫోన్ లాంచ్ కానుంది. కొన్ని రోజుల క్రితం వన్‌ప్లస్ ప్రెసిడెంట్ OnePlus Ace 3V లాంచ్ కన్ఫర్మ్ చేశారు. తాజాగా OnePlus Ace 3V లైవ్ ఇమేజ్ ని స్వయంగా కంపెనీ ప్రెసిడెంట్ షేర్ చేశారు. దీంతో ఫోన్ డిజైన్, లుక్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

OnePlus Ace 3V లైవ్ ఇమేజ్ డిజైన్

వన్‌ప్లస్ చైనా ప్రెసిడెంట్ లీ జీ, OnePlus Ace 3V యొక్క లైవ్ ఫోటోలను షేర్ చేశారు. డివైజ్ ఫ్రంట్ డిజైన్ ఎలా ఉంటుందో రివీల్ అయ్యింది.

OnePlus Ace 3V లో ముందువైపున పంచ్ హోల్ కటౌట్ ఉంది. బెజెల్స్ సన్నగా ఉన్నాయి. దీంతో ఫోన్ హై స్క్రీన్-టు-బాడీ రేషియోతో వస్తుందని తెలుస్తోంది.

విశేషమేంటంటే, ఈ ఫోన్ అలర్ట్ స్లైడర్ తో వస్తోంది. వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఫోన్‌కి కుడివైపున ఉన్నాయి.

OnePlus Ace 3V స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: OnePlus Ace 3V లో 1.5కే ఓఎల్ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • చిప్సెట్: OnePlus Ace 3V లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 ప్రాసెసర్ ఉంటుంది. ఈ చిప్సెట్ మార్చి 18న లాంచ్ అవుతోంది.
  • కెమెరా: OnePlus Ace 3V లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇతర సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus Ace 3V లో 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
  • బ్యాటరీ: OnePlus Ace 3V లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ లేదా 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది.
  • ఓఎస్: OnePlus Ace 3V డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది.
  • ఇతర ఫీచర్లు: OnePlus Ace 3V లో ఏఐ టెక్నాలజీ, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ వంటి ఫీచర్లు ఉంటాయి.

The post OnePlus: లాంచ్‌కి ముందు రివీలైన Ace 3V లైవ్ ఇమేజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
OnePlus: లాంచ్‌కి ముందు లీకైన Ace 3V స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oneplus-ace-3v-key-specs-leaked-before-launch/ Wed, 28 Feb 2024 08:36:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=10476 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus ఏస్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OnePlus Ace 3V పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తొలుత ఈ ఫోన్ చైనాలో లాంచ్ అవుతుంది. తర్వాత OnePlus Nord 5 పేరుతో ఈ ఫోన్ భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ కానుంది. కొన్ని రోజుల్లో లాంచ్ అవుతుందనగా, ఈ ఫోన్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్‌ని టిప్‌స్టర్ లీక్ చేశారు. ఓసారి ఆ […]

The post OnePlus: లాంచ్‌కి ముందు లీకైన Ace 3V స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న OnePlus Ace 3V
  • తొలుత చైనాలో ఎంట్రీ ఇవ్వనున్న డివైజ్
  • భారత్‌లో Nord 5 పేరుతో రానున్న హ్యాండ్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus ఏస్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OnePlus Ace 3V పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తొలుత ఈ ఫోన్ చైనాలో లాంచ్ అవుతుంది. తర్వాత OnePlus Nord 5 పేరుతో
ఈ ఫోన్ భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ కానుంది. కొన్ని రోజుల్లో లాంచ్ అవుతుందనగా, ఈ ఫోన్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్‌ని టిప్‌స్టర్ లీక్ చేశారు. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

OnePlus Ace 3V స్పెసిఫికేషన్స్ (లీక్)

  • టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా OnePlus Ace 3V యొక్క ప్రధాన ఫీచర్లు రివీల్ అయ్యాయి. మైక్రో బ్లాగింగ్ సైట్ వీబో పై డీసీఎస్ ఈ వివరాలను షేర్ చేసింది.
  • SM7675 అనే చిప్సెట్ తో OnePlus Ace 3V డివైజ్ లాంచ్ కానుంది. కోడ్ ప్రకారం, ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ అయ్యే అవకాశం ఉంది.
  • అయితే గతంలో ఇదే టిప్‌స్టర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ గురించి ప్రస్తావించారు. లాంచ్ సమయంలో దీనిపై స్పష్టత రానుంది.
  • ప్రాసెసర్ హై క్లాక్ స్పీడ్ 2.9 గిగాహెర్ట్జ్ గా ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 732 జీపీయూని వాడనున్నారు.
  • లీక్ ప్రకారం, OnePlus Ace 3V డివైజ్ 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీతో వస్తున్నట్లు తెలుస్తోంది.
  • OnePlus Ace 3V ఫోన్‌లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని సమాచారం. అలాగే 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ని ఈ ఫోన్ లో అందించే అవకాశం ఉంది.

OnePlus Ace 3V లాంచ్ టైమ్‌లైన్ (అంచనా)

OnePlus Ace 3V స్మార్ట్‌ఫోన్ లాంచ్ వివరాలను కంపెనీ ఇంకా షేర్ చేయలేదు. కానీ, లీక్ లో పేర్కొనబడిన ప్రాసెసర్ మార్చిలో లాంచ్ అవుతోంది. దీన్ని బట్టి, ఫోన్ కూడా వచ్చే నెలలో లాంచ్ అవుతుందని భావించవచ్చు.

OnePlus Ace 3V లాంచ్ కి సంబంధించిన వివరాలను త్వరలోనే వన్‌ప్లస్ సంస్థ వెల్లడించే అవకాశం ఉంది.

OnePlus Ace 3V స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిజైన్: OnePlus Ace 3V డివైజ్ గ్లాస్ బ్యాక్ మరియు ప్లాస్టిక్ ఫ్రేమ్ తో వస్తుందని చెప్పవచ్చు. రెండు మోడల్స్ లో ఫోన్ లాంచ్ అవుతుంది. వీటిలో ఒకటి ఫ్లాట్, మరొకటి కర్వ్డ్-ఎడ్జ్ బాడీని కలిగి ఉంటాయి.
  • డిస్ప్లే: OnePlus Ace 3V లో 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • చిప్సెట్: OnePlus Ace 3V లో స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 732 జీపీయూ ఉంటాయి.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus Ace 3V లో 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
  • బ్యాటరీ: OnePlus Ace 3V లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

The post OnePlus: లాంచ్‌కి ముందు లీకైన Ace 3V స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు లీకైన OnePlus Ace 3V చిప్సెట్, డిస్ప్లే స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oneplus-ace-3v-display-chipset-specs-leaked/ Sun, 24 Dec 2023 18:07:03 +0000 https://www.91mobiles.com/telugu/?p=9421 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus మార్చి నెలలో చైనాలో OnePlus Ace 2V ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 1.5కే ఓఎల్ఈడీ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్, 16జిబి వరకు ర్యామ్, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లతో వచ్చింది. ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్స్ లో OnePlus Nord 3 పేరుతో లాంచ్ అయ్యింది. ఇప్పుడు OnePlus Ace 3V కి సంబంధించి లీక్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. ఈ లీక్స్ ద్వారా […]

The post లాంచ్‌కి ముందు లీకైన OnePlus Ace 3V చిప్సెట్, డిస్ప్లే స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న OnePlus Ace 3V
  • OnePlus Ace 2V కి సక్సెసర్‌గా వస్తోన్న Ace 3V
  • గ్లోబల్ గా Nord 4 పేరుతో లాంచ్ కానున్న Ace 3V

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus మార్చి నెలలో చైనాలో OnePlus Ace 2V ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 1.5కే ఓఎల్ఈడీ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్, 16జిబి వరకు ర్యామ్, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లతో వచ్చింది. ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్స్ లో OnePlus Nord 3 పేరుతో లాంచ్ అయ్యింది. ఇప్పుడు OnePlus Ace 3V కి సంబంధించి లీక్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. ఈ లీక్స్ ద్వారా చిప్సెట్, డిస్ప్లే, లాంచ్ టైమ్‌లైన్ వంటి వివరాలు తెలిసాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

OnePlus Ace 3V ప్రధాన స్పెసిఫికేషన్స్ (లీక్)

  • చైనీస్ సామాజిక మాధ్యమం Weibo పై టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ OnePlus Ace 3V యొక్క చిప్సెట్ మరియు డిస్ప్లే స్పెసిఫికేషన్స్ షేర్ చేశారు.
  • టిప్‌స్టర్ ప్రకారం, OnePlus సంస్థ Ace బ్రాండ్ లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ తో ఓ స్మార్ట్‌ఫోన్ ని తీసుకురానుందని సమాచారం.

  • త్వరలో రాబోవు ఈ స్మార్ట్‌ఫోన్ 1.5కే రెజుల్యూషన్ గల డిస్ప్లేని కలిగి ఉంటుందని తెలుస్తోంది.
  • అయితే లీక్‌స్టర్ ఫోన్ పేరుని తెలపలేదు. కానీ, ఇది OnePlus Ace 3V కావచ్చని అందరూ అంచనా వేస్తున్నారు.

OnePlus Ace 3V లాంచ్ టైమ్‌లైన్, ఇతర వివరాలు

  • OnePlus Ace 3V స్మార్ట్‌ఫోన్ 2024 ఫిబ్రవరి లేదా మార్చి నెలలో మార్కెట్ లో లాంచ్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
  • OnePlus Ace 2V భారత్ తో పాటు గ్లోబల్ గా OnePlus Nord 3 పేరుతో లాంచ్ అయ్యింది. భారత్ లో ఈ ఫోన్ లాంచ్ ధర రూ.33,999 గా ఉంది.
  • OnePlus Ace 3V గ్లోబల్ గా OnePlus Nord 4 పేరుతో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. అయితే కంపెనీ దీని గురించి ఇంకా ఏ ప్రకటన చేయలేదు.

OnePlus Ace 2V స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OnePlus Ace 2V లో 6.74-ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1450 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 100 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్, 1440 హెర్ట్జ్ హై-ఫ్రీక్వెన్సీ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి.
  • చిప్సెట్: OnePlus Ace 2V లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్, మాలి-జీ710 10-కోర్ జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: OnePlus Ace 2V లో 16జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి.
  • ఓఎస్: OnePlus Ace 2V ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: OnePlus Ace 2V లో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రా-వైడ్ సోని ఐఎంఎక్స్355 సెన్సర్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: OnePlus Ace 2V లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది.
  • కనెక్టివిటీ: OnePlus Ace 2V లో 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ ఉన్నాయి.
  • కలర్స్: OnePlus Ace 2V డివైజ్ మిస్టీ గ్రీన్ మరియు టెంపెస్ట్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post లాంచ్‌కి ముందు లీకైన OnePlus Ace 3V చిప్సెట్, డిస్ప్లే స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
1.5K అమోలెడ్ స్క్రీన్‌తో వస్తోన్న OnePlus Nord 4 https://www.91mobiles.com/telugu/oneplus-nord-4-5g-specs-leaked-before-launch-rebrand-oneplus-ace-3v/ Tue, 17 Oct 2023 11:55:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=8438 ఫ్లాగ్షిప్ కిల్లర్ గా OnePlus కి పేరుంది. వన్‌ప్లస్ నుంచి వచ్చే ఫోన్లకు మార్కెట్ లో ఎంతో డిమాండ్ ఉంది. త్వరలో ఈ సంస్థ చైనాలో OnePlus Ace 3V డివైజ్ ని లాంచ్ చేయబోతోంది. OnePlus Ace 3V ని తీసుకొచ్చే పనిలో వన్‌ప్లస్ నిమగ్నమైందని ఒక విదేశీ టిప్‌స్టర్ సమాచారాన్ని లీక్ చేశారు. ఇదే ఫోన్ భారత్ తో పాటు ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో OnePlus Nord 4 పేరుతో లాంచ్ కానుందని […]

The post 1.5K అమోలెడ్ స్క్రీన్‌తో వస్తోన్న OnePlus Nord 4 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న OnePlus Nord 4
  • OnePlus Ace 3V కి రీబ్రాండ్‌గా రానున్న Nord 4
  • Snapdragon 7 Gen 3 చిప్‌తో వస్తోన్న Nord 4

ఫ్లాగ్షిప్ కిల్లర్ గా OnePlus కి పేరుంది. వన్‌ప్లస్ నుంచి వచ్చే ఫోన్లకు మార్కెట్ లో ఎంతో డిమాండ్ ఉంది. త్వరలో ఈ సంస్థ చైనాలో OnePlus Ace 3V డివైజ్ ని లాంచ్ చేయబోతోంది. OnePlus Ace 3V ని తీసుకొచ్చే పనిలో వన్‌ప్లస్ నిమగ్నమైందని ఒక విదేశీ టిప్‌స్టర్ సమాచారాన్ని లీక్ చేశారు. ఇదే ఫోన్ భారత్ తో పాటు ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో OnePlus Nord 4 పేరుతో లాంచ్ కానుందని సమాచారం. ఓసారి OnePlus Nord 4 యొక్క లీకైన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

OnePlus Nord 4 (OnePlus Ace 3V) స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: OnePlus Nord 4 లో 1.5కే అమోలెడ్ డిస్ప్లే, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.
  • చిప్సెట్: OnePlus Nord 4 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ ఉంటుందని సమాచారం.
  • కెమెరా: OnePlus Nord 4 లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది.
  • మెమొరీ: OnePlus Nord 4 డివైజ్ 8జిబి/16జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అవ్వనుందని అంచనా వేస్తున్నారు.

ఇప్పటి వరకు OnePlus Nord 4 గురించి తెలిసిన స్పెసిఫికేషన్స్ ఇవే. ఓసారి గత మోడల్ OnePlus Nord 3 స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

OnePlus Nord 3 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OnePlus Nord 3 5G లో 6.74-ఇంచ్ సూపర్ ఫ్లూయిడ్ అమోలెడ్ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 10-బిట్ కలర్ డెప్త్, హెచ్డీఆర్10+ సపోర్ట్ ఉంటాయి.
  • మెమొరీ: OnePlus Nord 3 5G లో 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉంటాయి. ఈ ఫోన్ లో వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంది.
  • ప్రాసెసర్: OnePlus Nord 3 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్సెట్ ఉంది. ఇది 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది.
  • ఓఎస్: OnePlus Nord 3 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: OnePlus Nord 3 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ సెన్సర్, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: OnePlus Nord 3 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: OnePlus Nord 3 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post 1.5K అమోలెడ్ స్క్రీన్‌తో వస్తోన్న OnePlus Nord 4 first appeared on 91Mobiles Telugu.

]]>