OPPO Reno 10 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 20 Jul 2023 10:59:35 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OPPO Reno 10 5G భారతీయ మార్కెట్ ధరను ప్రకటించిన కంపెనీ https://www.91mobiles.com/telugu/oppo-reno-10-5g-price-revealed-offers-availability/ Thu, 20 Jul 2023 10:59:35 +0000 https://www.91mobiles.com/telugu/?p=7262 OPPO Reno 10 సిరీస్ రీసెంట్ గా భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో భాగంగా 3 మోడల్స్ ఎంట్రీ ఇచ్చాయి. అవి: OPPO Reno 10 5G, OPPO Reno 10 Pro 5G, OPPO Reno 10 Pro+ 5G. తాజాగా ఒప్పో సంస్థ, OPPO Reno 10 5G డివైజ్ ధరను రివీల్ చేసింది. సరే, ఓసారి OPPO Reno 10 5G ధర, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు […]

The post OPPO Reno 10 5G భారతీయ మార్కెట్ ధరను ప్రకటించిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఇటీవలె భారత్ లో లాంచైన OPPO Reno 10 5G
  • లైనప్ లో వచ్చిన 3 రెనో సిరీస్ మోడల్స్
  • భారత్ లో OPPO Reno 10 5G ధర రూ.32,999

OPPO Reno 10 సిరీస్ రీసెంట్ గా భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో భాగంగా 3 మోడల్స్ ఎంట్రీ ఇచ్చాయి. అవి: OPPO Reno 10 5G, OPPO Reno 10 Pro 5G, OPPO Reno 10 Pro+ 5G. తాజాగా ఒప్పో సంస్థ, OPPO Reno 10 5G డివైజ్ ధరను రివీల్ చేసింది. సరే, ఓసారి OPPO Reno 10 5G ధర, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

OPPO Reno 10 5G ధర

OPPO Reno 10 5G డివైజ్ సింగిల్ మెమొరీ వేరియంట్ లో భారత మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఇది 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. దీని ధరను రూ.32,999 గా నిర్ణయించారు. జులై 27 న OPPO Reno 10 5G సేల్ మొదలవుతుంది. డివైజ్ ని రిటైల్స్ స్టోర్స్ తో పాటు ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. సిల్వరీ గ్రే, ఐస్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

OPPO Reno 10 5G సేల్ ఆఫర్

ఫ్లిప్ కార్ట్ ద్వారా OPPO Reno 10 5G కొనుగోలు చేసే కస్టమర్లు రూ.3,000 డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. హెచ్డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ కార్డ్స్ ద్వారా ఫోన్ ని కొంటే ఈ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో పాటు, 6 నెలల కాలపరిమితితో నో-కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీని కూడా కంపెనీ అందిస్తోంది.

ఎస్బీఐ, కొటక్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, వన్‌కార్డ్, ఏయూ స్మాట్ ఫైనాన్స్ ద్వారా ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ ద్వారా OPPO Reno 10 5G ని కొనుగోలు చేస్తే కస్టమర్లకు 10 శాం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇంకా 3-నెలల యూట్యూబ్ ప్రీమియమ్ సబ్‌స్క్రిప్షన్, గూగుల్ వన్ ఉచితంగా లభిస్తాయి.

OPPO Reno 10 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: OPPO Reno 10 5G డివైజ్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పంచ్-హోల్ డిస్ప్లే, 2412*1080 పిక్సెల్ రెజుల్యూషన్, 3డీ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 950 నిట్స్ బ్రైట్నెస్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉన్నాయి.
  • ప్రాసెసర్: OPPO Reno 10 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • చిప్సెట్: OPPO Reno 10 5G డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఆక్టా-కోర్ ప్రాసెసర్, మాలి-జీ68 జీపీయూ ఉన్నాయి.
  • కెమెరా: OPPO Reno 10 5G డివైజ్ లో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 32ఎంపి టెలీఫోటో లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాలింగ్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: OPPO Reno 10 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ సూపర్‌వూక్ 2.0 ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post OPPO Reno 10 5G భారతీయ మార్కెట్ ధరను ప్రకటించిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
Dimensity 7050 చిప్, 64MP కెమెరాతో భారత్‌లో లాంచైన OPPO Reno 10 5G https://www.91mobiles.com/telugu/oppo-reno-10-5g-launched-india-price-specs-availability/ Mon, 10 Jul 2023 12:58:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=7142 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO నేడు భారతీయ మార్కెట్ లో Reno 10 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో భాగంగా OPPO Reno 10 5G, OPPO Reno 10 Pro 5G, OPPO Reno 10 Pro+ 5G ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం OPPO Reno 10 5G గురించి తెలుసుకుందాం. OPPO Reno 10 5G మీడియాటెక్ 7050 చిప్, 64ఎంపి కెమెరాతో […]

The post Dimensity 7050 చిప్, 64MP కెమెరాతో భారత్‌లో లాంచైన OPPO Reno 10 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన OPPO Reno 10 సిరీస్
  • మార్కెట్ లోకి వచ్చిన మూడు మోడల్స్
  • 32ఎంపి సెల్ఫీ కెమెరాతో ఎంట్రీ ఇచ్చిన OPPO Reno 10 5G

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO నేడు భారతీయ మార్కెట్ లో Reno 10 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో భాగంగా OPPO Reno 10 5G, OPPO Reno 10 Pro 5G, OPPO Reno 10 Pro+ 5G ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం OPPO Reno 10 5G గురించి తెలుసుకుందాం. OPPO Reno 10 5G మీడియాటెక్ 7050 చిప్, 64ఎంపి కెమెరాతో వచ్చింది. సిల్వరీ గ్రే, ఐస్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో రెనో 10 5జీ లభించనుంది.

OPPO Reno 10 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పంచ్-హోల్ డిస్ప్లే, 2412*1080 పిక్సెల్ రెజుల్యూషన్, 3డీ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 950 నిట్స్ బ్రైట్నెస్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉన్నాయి. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 67 వాట్ సూపర్‌వూక్ 2.0 టెక్నాలజీని కలిగి ఉంది. ఇది కొన్ని నిమిషాల్లోనే బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేస్తుంది. సరే, ఓసారి OPPO Reno 10 5G ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

OPPO Reno 10 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: OPPO Reno 10 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పంచ్-హోల్ డిస్ప్లే, 2412*1080 పిక్సెల్ రెజుల్యూషన్, 3డీ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 950 నిట్స్ బ్రైట్నెస్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉన్నాయి.
  • ప్రాసెసర్: OPPO Reno 10 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఆక్టా-కోర్ చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో మాలి-జీ68 జీపీయూ వినియోగించారు.
  • రియర్ కెమెరా: OPPO Reno 10 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 32ఎంపి టెలీఫోటో లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి.
  • ఫ్రంట్ కెమెరా: OPPO Reno 10 5G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి సెల్ఫీ కెమెరా ఉంది.
  • బ్యాటరీ: OPPO Reno 10 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 67 వాట్ సూపర్‌వూక్ 2.0 టెక్నాలజీని కలిగి ఉంది. ఇది కొన్ని నిమిషాల్లోనే బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేస్తుందని కంపెనీ చెబుతోంది.

OPPO Reno 10 5G ధర, సేల్

OPPO Reno 10 5G డివైజ్ ధరను ఇంకా కంపెనీ ప్రకటించలేదు. జులై 20 వ తేదీన రాత్రి 7 గంటలకు ఈ ఫోన్ ధరను ప్రకటించనున్నారు. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ ద్వారా ధర వివరాలు వెల్లడవుతాయి. OPPO Reno 10 5G డివైజ్ ఏయే కలర్ ఆప్షన్స్ లో లభించనుందో తెలుసుకుందాం. ఈ స్మార్ట్ ఫోన్ సిల్వరీ గ్రే, ఐస్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

The post Dimensity 7050 చిప్, 64MP కెమెరాతో భారత్‌లో లాంచైన OPPO Reno 10 5G first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్‌కి ముందు గీక్‌బెంచ్ పై కనిపించిన OPPO Reno 10 5G https://www.91mobiles.com/telugu/oppo-reno-10-5g-spotted-geekbench-key-details/ Tue, 27 Jun 2023 10:23:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=6947 OPPO Reno 10 సిరీస్ జులై లో భారత్ తో పాటు గ్లోబల్ గా లాంచ్ కానుందని సమాచారం. ఈ లైనప్ లో మొత్తం 3 మోడల్స్ రానున్నాయి. తాజాగా OPPO Reno 10 5G డివైజ్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై కనిపించింది. తొలుత ఈ విషయాన్ని 91mobiles గుర్తించింది. గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా ఫోన్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు బయటకు వచ్చాయి. OPPO Reno 10 5G స్మార్ట్ ఫోన్ 8జిబి […]

The post లాంచ్‌కి ముందు గీక్‌బెంచ్ పై కనిపించిన OPPO Reno 10 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • CPH2531 అనే మోడల్ నంబర్‌తో కనిపించిన OPPO Reno 10 5G
  • సింగిల్ కోర్ టెస్ట్ లో 956, మల్టీ-కోర్ టెస్ట్ లో 2340 పాయింట్లు నమోదు
  • 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తోన్న OPPO Reno 10 5G

OPPO Reno 10 సిరీస్ జులై లో భారత్ తో పాటు గ్లోబల్ గా లాంచ్ కానుందని సమాచారం. ఈ లైనప్ లో మొత్తం 3 మోడల్స్ రానున్నాయి. తాజాగా OPPO Reno 10 5G డివైజ్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై కనిపించింది. తొలుత ఈ విషయాన్ని 91mobiles గుర్తించింది. గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా ఫోన్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు బయటకు వచ్చాయి. OPPO Reno 10 5G స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తున్నట్లు గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

ఇకపోతే ఇప్పటికే రెనో 10 సిరీస్ లో టాప్ మోడల్స్ అయిన OPPO Reno 10 Pro, OPPO Reno 10 Pro+ డివైజెస్ గీక్‌బెంచ్ పై కనిపించాయి. సరే, ఓసారి OPPO Reno 10 5G స్మార్ట్ ఫోన్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

గీక్‌బెంచ్ పై కనిపించిన OPPO Reno 10 5G

  • OPPO Reno 10 5G స్మార్ట్ ఫోన్ CPH2531 మోడల్ నంబర్ ని కలిగి ఉంది.
  • ఈ హ్యాండ్సెట్ సింగిల్-కోర్ టెస్ట్ లో 956 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2340 పాయింట్లు నమోదు చేసింది.
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 8జిబి ర్యామ్ తో OPPO Reno 10 5G డివైజ్ వస్తున్నట్లు లిస్టింగ్ లో పేర్కొనబడి ఉంది.
  • మదర్‌బోర్డ్ సెక్షన్ లో MT6877V అని పేర్కొని ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్ కి సంబంధించినదని భావిస్తున్నారు.

OPPO Reno 10 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OPPO Reno 10 5G లో 6.74-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 950 నిట్స్ బ్రైట్నెస్, పంచ్-హోల్ కటౌట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OPPO Reno 10 5G డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్ వాడనున్నట్లు సమాచారం.
  • కెమెరా: OPPO Reno 10 5G లో 64ఎంపి ప్రైమరీ ఒమ్నీవిజన్ ఓవీ64బి సెన్సర్, 8ఎంపి ఐఎంఎక్స్355 అల్ట్రా-వైడ్ లెన్స్ ఉంటాయి. ఇంకా వీటికి తోడు ఒక 32ఎంపి ఐఎంఎక్స్709 2ఎక్స్ టెలీఫోటో లెన్స్ ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: OPPO Reno 10 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుందని సమాచారం.
  • ఓఎస్, కనెక్టివిటీ: OPPO Reno 10 5G ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటాయి.
  • ఇతర ఫీచర్లు: OPPO Reno 10 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది.

The post లాంచ్‌కి ముందు గీక్‌బెంచ్ పై కనిపించిన OPPO Reno 10 5G first appeared on 91Mobiles Telugu.

]]>