
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో నేడు భారత్ లో OPPO Reno 10 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో మొత్తం 3 ఫోన్లు వచ్చాయి. అవి: OPPO Reno 10 Pro+ 5G, OPPO Reno 10 Pro 5G, OPPO Reno 10 5G. 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 20జిబి ర్యామ్ పవర్ తో OPPO Reno 10 Pro+ 5G డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. ఓసారి OPPO Reno 10 Pro+ 5G భారతీయ మార్కెట్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్, లభ్యత తదితర వివరాలను తెలుసుకుందాం.
భారతీయ మార్కెట్ లో OPPO Reno 10 Pro+ 5G ధర
భారత్ లో OPPO Reno 10 Pro+ 5G సింగిల్ మెమొరీ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ కలిగి ఈ మోడల్ ధరను రూ.54,999 గా నిర్ణయించారు. గ్లాసీ పర్పుల్, సిల్వరీ గ్రే కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.
OPPO Reno 10 Pro+ 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: OPPO Reno 10 Pro+ 5G లో6.74-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2772*1240 పిక్సెల్ రెజుల్యూషన్, 3డీ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
- ప్రాసెసర్: OPPO Reno 10 Pro+ 5G స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ వాడారు. ఇది 4 నానో-మీటర్ ప్రాసెస్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్. ఇది 1.8 గిగాహెర్ట్జ్ నుంచి 3 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 730 జీపీయూ వాడారు.
- ఓఎస్: OPPO Reno 10 Pro+ 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- ర్యామ్: OPPO Reno 10 Pro+ 5G డివైజ్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి. ఎల్పీడీడీఆర్5 ర్యామ్, యూఎఫ్ఎస్3.1 టెక్నాలజీని ఈ ఫోన్ లో వాడారు. OPPO Reno 10 Pro+ 5G డివైజ్ 8జిబి వర్చువల్ ర్యామ్ ని కూడా కలిగి ఉంది. దీంతో యూజర్ కి మొత్తం 20జిబి ర్యామ్ లభించనుంది.
- కెమెరా: OPPO Reno 10 Pro+ 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 64ఎంపి టెలీఫోటో లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. రియర్ కెమెరా ఓఐఎస్ టెక్నాలజీని కలిగి ఉంది. అలాగే 3ఎక్స్ ఆప్టికల్, 120ఎక్స్ డిజిటల్ జూమ్ కేపబులిటీస్ ఈ కెమెరా యూనిట్ కి ఉన్నాయి.
- ఫ్రంట్ కెమెరా: OPPO Reno 10 Pro+ 5G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: OPPO Reno 10 Pro+ 5G లో పవర్ బ్యాకప్ కోసం 4700 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 100 వాట్ సూపర్‌వూక్ ఫ్లాష్ చార్జ్ కి సపోర్ట్ చేస్తుంది. 27 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.
- ఇతర ఫీచర్లు: OPPO Reno 10 Pro+ 5G లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ రిమోట్ కంట్రోల్, డ్యూయల్ ట్రాక్ స్టీరియో స్పీకర్స్, డైరాక్ ఆడియో ట్యూనర్ ఉన్నాయి.











