
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో భారతీయ మార్కెట్ లో OPPO Reno 10 Pro 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో భాగంగా 3 స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ స్మార్ట్ ఫోన్ 20జిబి ర్యామ్, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 4600 ఎంఏహెచ్ బ్యాటరీ తో వచ్చింది. ఓసారి, OPPO Reno 10 Pro 5G స్మార్ట్ ఫోన్ డిజైన్, పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం.
OPPO Reno 10 Pro 5G డిజైన్
OPPO Reno 10 Pro 5G స్మార్ట్ ఫోన్ 3డీ కర్వ్డ్ డిజైన్ తో వచ్చింది. ఈ ఫోన్ ఎంతో స్లిమ్ గా, తేలికగా ఉంది. బ్యాక్ ప్యానెల్ మెటల్ తో తయారైంది. రియర్ ప్యానెల్ రెండు కలర్స్ లో కనిపిస్తుంది. కెమెరా మాడ్యూల్ విషయానికి వస్తే, ఇందులో భారీ కెమెరా యూనిట్ ఉంది. ఇందులో 3 కెమెరా సెన్సర్స్ ఉన్నాయి. ఇంకా వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ అందించారు. OPPO Reno 10 Pro 5G ఫోన్ గ్లాసీ పర్పుల్, సిల్వరీ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.
OPPO Reno 10 Pro 5G ధర
భారత్ లో OPPO Reno 10 Pro 5G 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.39,999 గా నిర్ణయించారు. జులై 13 నుంచి ఈ ఫోన్ సేల్స్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్ కార్ట్ లో మొదలవుతుంది.
OPPO Reno 10 Pro 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: OPPO Reno 10 Pro 5G లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ 3డీ కర్వ్డ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2412*1080 పిక్సెల్ రెజుల్యూషన్, 950 నిట్స్ బ్రైట్నెస్, 93 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఉన్నాయి.
- చిప్సెట్: OPPO Reno 10 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి 5జీ ప్రాసెసర్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్. ఇంకా ఈ ఫోన్ లో వీసీ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఉంది. దీని వల్లన ఫోన్ వేడెక్కకుండా ఉంటుంది.
- స్టోరేజీ: OPPO Reno 10 Pro 5G లో 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ ఉన్నాయి. ర్యామ్ ఎక్స్‌పాన్షన్ ఫీచర్ ద్వారా 8జిబి వరకు ర్యామ్ ని పెంచుకోవచ్చు.
- కెమెరా: OPPO Reno 10 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఐఎంఎక్స్890 అల్ట్రా క్లియర్ లెన్స్, 32ఎంపి టెలీఫోటో పొట్రెయిట్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఐఎంఎక్స్709 లెన్స్ ఉంది.
- బ్యాటరీ: OPPO Reno 10 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 28 నిమిషాల్లో ఫోన్ పూర్తిగా చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.
- ఓఎస్: OPPO Reno 10 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.











