OPPO Reno 9 Pro+ 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 24 Nov 2022 10:26:45 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 అదిరిపోయే స్పెసిఫికేషన్స్ తో లాంచ్ అయిన OPPO Reno 9 Pro, Reno 9 Pro+ https://www.91mobiles.com/telugu/oppo-reno-9-pro-9-pro-plus-launched-china-price-specs/ Thu, 24 Nov 2022 10:26:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=3642 హైలైట్స్ చైనాలో లాంచ్ అయిన OPPO Reno 9 సిరీస్ 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 5జీ కనెక్టివిటీ, 512జిబి స్టోరేజీతో లాంచ్ అయిన OPPO Reno 9 సిరీస్ ఫోన్లు క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో లాంచ్ OPPO Reno 9 Pro+ OPPO Reno 9 సిరీస్ అధికారికంగా చైనాలో లాంచ్ అయ్యింది. రెనో 8 సిరీస్ కి సక్సెసర్ గా OPPO Reno […]

The post అదిరిపోయే స్పెసిఫికేషన్స్ తో లాంచ్ అయిన OPPO Reno 9 Pro, Reno 9 Pro+ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • చైనాలో లాంచ్ అయిన OPPO Reno 9 సిరీస్
  • 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 5జీ కనెక్టివిటీ, 512జిబి స్టోరేజీతో లాంచ్ అయిన OPPO Reno 9 సిరీస్ ఫోన్లు
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో లాంచ్ OPPO Reno 9 Pro+

OPPO Reno 9 సిరీస్ అధికారికంగా చైనాలో లాంచ్ అయ్యింది. రెనో 8 సిరీస్ కి సక్సెసర్ గా OPPO Reno 9 సిరీస్ మార్కెట్ లోకి వచ్చింది. ఈ లైనప్ లో మొత్తం మూడు మోడల్స్ ఉంటాయి. అవి: OPPO Reno 9, OPPO Reno 9 Pro, OPPO Reno 9 Pro+. టాప్ వేరియంట్ అయిన రెనో ప్రో+ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

OPPO Reno 9 Pro విషయానికి వస్తే, ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8100 మ్యాక్స్ ప్రాసెసర్ తో వస్తోంది. ఇందులో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇక్కడ OPPO Reno 9 Pro, OPPO Reno 9 Pro+ డివైజెస్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, ధరల వివరాలు అందిస్తున్నాం. ఓసారి చదివేయండి. OPPO Reno 9 గురించి తెలుసుకోవాలనుంటే ఇక్కడ చదవండి.

OPPO Reno 9 Pro స్పెసిఫికేషన్స్, ధర

OPPO Reno 9 Pro లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2412 పిక్సెల్స్ రెజుల్యూషన్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 100 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్, 93 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, హెచ్డీఆర్10+, 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి. ఈ హ్యాండ్సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 మ్యాక్స్ ప్రాసెసర్ ని కలిగి ఉంది. గ్రాఫిక్స్ కోసం ఇందులో Mali-G610 MC6 జీపీయూ వాడారు. ఈ ఫోన్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్స్ తో లభిస్తుంది.

OPPO Reno 9 Pro ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో 5G SA/NSA, వై-ఫై, బ్లూటూత్ 5.3, యూట్యూబ్ టైప్-సీ, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు.

ఇప్పుడు OPPO Reno 9 Pro యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ షూటర్, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32 ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

OPPO Reno 9 Pro 16జిబి + 256జిబి వేరియంట్ ధర RMB 3,499 (సుమారు రూ.40,000), 16జిబి + 512జిబి యూనిట్ ధర RMB 3,799 (సుమారు రూ.43,500) గా ఉంటుంది.

OPPO Reno 9 Pro+ స్పెసిఫికేషన్స్

OPPO Reno 9 Pro+ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2412 పిక్సెల్స్ రెజుల్యూషన్, 394పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 240 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్, 93 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, హెచ్డీఆర్10+, 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం Adreno 730 GPU వినియోగించారు. 16జిబి/256జిబి మరియు 16జిబి/512జిబి ర్యామ్ మరియు స్టోరేజీ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

OPPO Reno 9 Pro+ ఆండ్రాయిడ్ 13 ఆధారిత కలర్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో 4700 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి. OPPO Reno 9 Pro+ లో 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

OPPO Reno 9 Pro+ యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. బ్యాక్ ప్యానెల్ పై 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ ప్రైమరీ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

OPPO Reno 9 Pro+ ఫోన్ 16జిబి + 256జిబి వేరియంట్ ధర RMB 3,999 (సుమారు రూ.45,700), 16జిబి + 512జిబి యూనిట్ ధర RMB 4,399 (సుమారు రూ.50,300) గా ఉన్నాయి. ఈ డివైజ్ గోల్డ్, బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post అదిరిపోయే స్పెసిఫికేషన్స్ తో లాంచ్ అయిన OPPO Reno 9 Pro, Reno 9 Pro+ first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన OPPO Reno 9, Reno 9 Pro, Reno 9 Pro+ ప్రధాన స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oppo-reno-9-series-specs-leaked-ahead-of-launch/ Fri, 11 Nov 2022 14:09:53 +0000 https://www.91mobiles.com/telugu/?p=3393 హైలైట్స్ వచ్చే ఏడాది భారత్ లో లాంచ్ కానున్న OPPO Reno 9 సిరీస్ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా లీకైన OPPO Reno 9 సిరీస్ స్పెసిఫికేషన్స్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ తో రానున్న OPPO Reno 9 Pro+ OPPO Reno 9 సిరీస్ లాంచ్ దగ్గర్లోనే ఉంది. అయితే OPPO Reno 9 సిరీస్ లాంచ్ తేదీని కంపెనీ ఇంకా అధికారికంగా ఖరారు చేయలేదు. ఈ లైనప్ […]

The post లీకైన OPPO Reno 9, Reno 9 Pro, Reno 9 Pro+ ప్రధాన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • వచ్చే ఏడాది భారత్ లో లాంచ్ కానున్న OPPO Reno 9 సిరీస్
  • టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా లీకైన OPPO Reno 9 సిరీస్ స్పెసిఫికేషన్స్
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ తో రానున్న OPPO Reno 9 Pro+

OPPO Reno 9 సిరీస్ లాంచ్ దగ్గర్లోనే ఉంది. అయితే OPPO Reno 9 సిరీస్ లాంచ్ తేదీని కంపెనీ ఇంకా అధికారికంగా ఖరారు చేయలేదు. ఈ లైనప్ లో కనీసం 3 మోడల్స్ ఉంటాయని చెబుతున్నారు. అవి: OPPO Reno 9, OPPO Reno 9 Pro, OPPO Reno 9 Pro+. వచ్చే ఏడాది ఆరంభంలో OPPO Reno 9 సిరీస్ భారత్ లో ఎంట్రీ ఇవ్వనుంది. ఈలోపు OPPO Reno 9 సిరీస్ కి సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ నెట్టింట్లో లీక్ అయ్యాయి.

తాజాగా లీకైన సమాచారం ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ నుంచి వచ్చింది. OPPO Reno 9 సిరీస్ యొక్క ప్రాసెసర్, బ్యాటరీ, కెమెరా, డిస్ప్లే, ఫాస్ట్ చార్జింగ్ వివరాలను టిప్‌స్టర్ రివీల్ చేశారు. ఓసారి OPPO Reno 9, Reno 9 Pro, Reno 9 Pro+ యొక్క లీకైన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

OPPO Reno 9 Pro+ 5G స్పెసిఫికేషన్స్

OPPO Reno 9 Pro+ 5G స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో రానుంది. ఇదివరకు స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో వస్తుందని రూమర్లు వచ్చాయి. అయితే 8+ జెన్ 1 కూడా శక్తివంతంగా పని చేస్తుందని గమనించాలి. దాదాపుగా 8 జెన్ 2 చిప్ కి అటు ఇటుగా సమానమైన పెర్ఫామెన్స్ ని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో పెద్దగా బాధపడాల్సిన పని లేదు.

OPPO Reno 9 Pro+ 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50 మెగా పిక్సెల్ సోని ఐఎంఎక్స్890 మెయిన్ కెమెరా ఉండనుంది. అలాగే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఆప్షన్ ఇందులో ఉంటుంది. అలాగే 8ఎంపి అల్ట్రావైడ్, 2ఎంపి మ్యాక్రో కెమెరాలు ఇందులో ఉండనున్నాయి.

OPPO Reno 9 Pro+ 5G లో 4700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది.

OPPO Reno 9 Pro స్పెసిఫికేషన్స్

OPPO Reno 9 Pro స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్ తో వస్తోంది. ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 మెయిన్ కెమెరా సెన్సర్ ఉండనుంది. దీంతో పాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. OPPO Reno 9 Pro మరియు OPPO Reno 9 Pro+ ఫోన్లలో మారిసిలికాన్ ఎక్స్ ఎన్‌‌పీయూ ఉంటుంది. ఇది లో-లైట్ ఫోటోగ్రఫీని మెరుగుపరచడంలో సాయపడుతుంది.

OPPO Reno 9 Pro లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ని కలిగి ఉంటుంది.

OPPO Reno 9 స్పెసిఫికేషన్స్

స్టాండర్డ్ వేరియంట్ అయిన OPPO Reno 9 లో స్నాప్ డ్రాగన్ 778జి చిప్సెట్ ఉంటుంది. ఇందులో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

OPPO Reno 9 సిరీస్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160హెర్ట్జ్ పీడబ్ల్యూఎం ఉంటాయని డిజిటల్ చాట్ స్టేషన్ చెబుతోంది. అలాగే కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, బిలియన్ కలర్ సపోర్ట్ ఉంటాయని టిప్‌స్టర్ వెల్లడించింది. ఫోన్ చిన్ సైజ్ 2.3 ఎంఎం ఉండనుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన OPPO Reno 9, Reno 9 Pro, Reno 9 Pro+ ప్రధాన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
లాంచ్ కి ముందు రివీల్ అయిన OPPO Reno 9 Pro+ 5G స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oppo-reno-9-pro-plus-5g-specs-revealed-before-launch/ Fri, 04 Nov 2022 13:23:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=3252 హైలైట్స్ Reno 9 Pro 5G పేరుతో భారత్ లో లాంచ్ కానున్న OPPO Reno 9 Pro+ 5G త్వరలో చైనాలో లాంచ్ కానున్న OPPO Reno 9 సిరీస్ రివీల్ అయిన OPPO Reno 9 Pro+ 5G స్పెసిఫికేషన్స్ త్వరలో OPPO Reno 9 సిరీస్ చైనాలో లాంచ్ అవుతోంది. ఈ ఏడాది మూడు కొత్త ఫోన్లను ఒప్పో లాంచ్ చేయనున్నట్లు సమాచారం. వీటిలో OPPO Reno 9, OPPO Reno 9 […]

The post లాంచ్ కి ముందు రివీల్ అయిన OPPO Reno 9 Pro+ 5G స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • Reno 9 Pro 5G పేరుతో భారత్ లో లాంచ్ కానున్న OPPO Reno 9 Pro+ 5G
  • త్వరలో చైనాలో లాంచ్ కానున్న OPPO Reno 9 సిరీస్
  • రివీల్ అయిన OPPO Reno 9 Pro+ 5G స్పెసిఫికేషన్స్

త్వరలో OPPO Reno 9 సిరీస్ చైనాలో లాంచ్ అవుతోంది. ఈ ఏడాది మూడు కొత్త ఫోన్లను ఒప్పో లాంచ్ చేయనున్నట్లు సమాచారం. వీటిలో OPPO Reno 9, OPPO Reno 9 Pro, OPPO Reno 9 Pro+ 5G ఉన్నాయి. 2023 జనవరిలో ఈ డివైజెస్ భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. లాంచ్ కి సంబంధించిన వివరాలను ఒప్పో ఇంకా వెల్లడించలేదు. ఈలోపు OPPO Reno 9 యొక్క స్పెసిఫికేషన్స్ నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా లీకైన సమాచారం ద్వారా OPPO Reno 9 Pro+ 5G యొక్క స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి.

OPPO Reno 9 Pro+ 5G స్పెసిఫికేషన్స్ (లీక్డ్)

OPPO Reno 9 Pro+ 5G ఈ నెలలోనే చైనాలో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. లాంచ్ కి ముందు ఆన్‌లైన్ లో స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ప్రముఖ టిప్ స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ OPPO Reno 9 Pro+ 5G యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ చేసింది. దాని ప్రకారం, OPPO Reno 9 Pro+ 5G క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్ తో వస్తున్నట్లు స్పష్టమైంది.

OPPO Reno 9 Pro+ 5G స్మార్ట్ ఫోన్ 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 2412*1080 పిక్సెల్స్ ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ తో వస్తోంది. సెంటర్ హోల్ పంచ్ కటౌట్ డిజైన్ ని ఈ ఫోన్ కలిగి ఉంది. డిస్ప్లే సైడ్స్ కాస్త కర్వ్డ్ గా కనిపిస్తున్నాయి. OPPO Reno 9 Pro+ 5G స్మార్ట్ ఫోన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తోంది.

OPPO Reno 9 Pro+ 5G స్మార్ట్ ఫోన్ లో 4700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. ఈ ఫోన్ మెటల్ ఫ్రేమ్ తో వస్తున్నట్లు డిజిటల్ చాట్ స్టేషన్ వెల్లడించింది. అయితే రియర్ ప్యానెల్ గ్లాస్ లేదా ప్లాస్టిక్ తో తయారైందా అనే విషయాన్ని టిప్‌స్టర్ తెలపలేదు. ప్రీమియమ్ కేటగిరీ ఫోన్ కాబట్టి కచ్చితంగా గ్లాస్ బ్యాక్ తో వస్తుందని అంచనా వేయవచ్చు.

OPPO Reno 9 Pro+ 5G కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. టిప్‌స్టర్ కెమెరా స్పెసిఫికేషన్స్ ని వెల్లడించారు. OPPO Reno 9 Pro+ 5G లో 50 మెగా పిక్సెల్ సోని ఐఎంఎక్స్890 సెన్సర్ ఉండనుంది. మారి సిలికాన్ ఎన్‌పీయూ కూడా ఉండనుంది. ఇకపోతే ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో రానుంది. అయితే మిగతా సెన్సర్స్ గురించి డిజిటల్ చాట్ స్టేషన్ సమాచారం ఇవ్వలేదు. అయితే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనుందని తెలుస్తోంది.

ప్రస్తుతం OPPO Reno 9 Pro+ 5G యొక్క ఇతర వివరాలు తెలియలేదు. లాంచ్ అయ్యాక ఈ ఫోన్ ఐకూ 11, వన్‌ప్లస్ 11 మరియు ఇతర బడ్జెట్ ఫ్లాగ్షిప్ ఫోన్లతో పోటీ పడనుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లాంచ్ కి ముందు రివీల్ అయిన OPPO Reno 9 Pro+ 5G స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>