హైలైట్స్
- వచ్చే ఏడాది భారత్ లో లాంచ్ కానున్న OPPO Reno 9 సిరీస్
- టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా లీకైన OPPO Reno 9 సిరీస్ స్పెసిఫికేషన్స్
- స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ తో రానున్న OPPO Reno 9 Pro+
OPPO Reno 9 సిరీస్ లాంచ్ దగ్గర్లోనే ఉంది. అయితే OPPO Reno 9 సిరీస్ లాంచ్ తేదీని కంపెనీ ఇంకా అధికారికంగా ఖరారు చేయలేదు. ఈ లైనప్ లో కనీసం 3 మోడల్స్ ఉంటాయని చెబుతున్నారు. అవి: OPPO Reno 9, OPPO Reno 9 Pro, OPPO Reno 9 Pro+. వచ్చే ఏడాది ఆరంభంలో OPPO Reno 9 సిరీస్ భారత్ లో ఎంట్రీ ఇవ్వనుంది. ఈలోపు OPPO Reno 9 సిరీస్ కి సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ నెట్టింట్లో లీక్ అయ్యాయి.
తాజాగా లీకైన సమాచారం ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ నుంచి వచ్చింది. OPPO Reno 9 సిరీస్ యొక్క ప్రాసెసర్, బ్యాటరీ, కెమెరా, డిస్ప్లే, ఫాస్ట్ చార్జింగ్ వివరాలను టిప్‌స్టర్ రివీల్ చేశారు. ఓసారి OPPO Reno 9, Reno 9 Pro, Reno 9 Pro+ యొక్క లీకైన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
OPPO Reno 9 Pro+ 5G స్పెసిఫికేషన్స్
OPPO Reno 9 Pro+ 5G స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో రానుంది. ఇదివరకు స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో వస్తుందని రూమర్లు వచ్చాయి. అయితే 8+ జెన్ 1 కూడా శక్తివంతంగా పని చేస్తుందని గమనించాలి. దాదాపుగా 8 జెన్ 2 చిప్ కి అటు ఇటుగా సమానమైన పెర్ఫామెన్స్ ని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో పెద్దగా బాధపడాల్సిన పని లేదు.
OPPO Reno 9 Pro+ 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50 మెగా పిక్సెల్ సోని ఐఎంఎక్స్890 మెయిన్ కెమెరా ఉండనుంది. అలాగే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఆప్షన్ ఇందులో ఉంటుంది. అలాగే 8ఎంపి అల్ట్రావైడ్, 2ఎంపి మ్యాక్రో కెమెరాలు ఇందులో ఉండనున్నాయి.
OPPO Reno 9 Pro+ 5G లో 4700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది.
OPPO Reno 9 Pro స్పెసిఫికేషన్స్
OPPO Reno 9 Pro స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్ తో వస్తోంది. ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 మెయిన్ కెమెరా సెన్సర్ ఉండనుంది. దీంతో పాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. OPPO Reno 9 Pro మరియు OPPO Reno 9 Pro+ ఫోన్లలో మారిసిలికాన్ ఎక్స్ ఎన్‌పీయూ ఉంటుంది. ఇది లో-లైట్ ఫోటోగ్రఫీని మెరుగుపరచడంలో సాయపడుతుంది.
OPPO Reno 9 Pro లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ని కలిగి ఉంటుంది.
OPPO Reno 9 స్పెసిఫికేషన్స్
స్టాండర్డ్ వేరియంట్ అయిన OPPO Reno 9 లో స్నాప్ డ్రాగన్ 778జి చిప్సెట్ ఉంటుంది. ఇందులో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
OPPO Reno 9 సిరీస్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160హెర్ట్జ్ పీడబ్ల్యూఎం ఉంటాయని డిజిటల్ చాట్ స్టేషన్ చెబుతోంది. అలాగే కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, బిలియన్ కలర్ సపోర్ట్ ఉంటాయని టిప్‌స్టర్ వెల్లడించింది. ఫోన్ చిన్ సైజ్ 2.3 ఎంఎం ఉండనుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












