ott - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Sun, 13 Aug 2023 17:56:40 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OTT: ఓటీటీల్లో ఉన్న బెస్ట్ తెలుగు సినిమాలు (2023) https://www.91mobiles.com/telugu/best-telugu-films-on-ott-2023/ Sun, 13 Aug 2023 17:52:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=7525 ఇప్పుడంతా ఓటీటీల హవా నడుస్తోంది. ఏ కొత్త సినిమా అయినా సరే, థియేటర్లలో విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీల్లో ప్రత్యక్షమవుతోంది. అయితే ఆడని సినిమాలు ఓటీటీల్లోకి త్వరగా రావడం మామూలు విషయమే. కానీ, ఇటీవలి కాలంలో థియేటర్లలో సినిమా ఆడినా, ఆడకపోయినా సరే, ఓటీటీల్లోకి వెంటనే వచ్చేస్తున్నాయి. థియెట్రికల్ రిలీజ్ కి ముందు నిర్మాతలు చేసుకున్న ఒప్పందాల మేరకు ఈ విధంగా డిజిటల్ రిలీజెస్ త్వరగా అవుతున్నాయని చెప్పవచ్చు. ఇక థియేటర్లలో సరిగా ఆడని సినిమాలను ఓటీటీ […]

The post OTT: ఓటీటీల్లో ఉన్న బెస్ట్ తెలుగు సినిమాలు (2023) first appeared on 91Mobiles Telugu.

]]>

ఇప్పుడంతా ఓటీటీల హవా నడుస్తోంది. ఏ కొత్త సినిమా అయినా సరే, థియేటర్లలో విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీల్లో ప్రత్యక్షమవుతోంది. అయితే ఆడని సినిమాలు ఓటీటీల్లోకి త్వరగా రావడం మామూలు విషయమే. కానీ, ఇటీవలి కాలంలో థియేటర్లలో సినిమా ఆడినా, ఆడకపోయినా సరే, ఓటీటీల్లోకి వెంటనే వచ్చేస్తున్నాయి. థియెట్రికల్ రిలీజ్ కి ముందు నిర్మాతలు చేసుకున్న ఒప్పందాల మేరకు ఈ విధంగా డిజిటల్ రిలీజెస్ త్వరగా అవుతున్నాయని చెప్పవచ్చు. ఇక థియేటర్లలో సరిగా ఆడని సినిమాలను ఓటీటీ సంస్థలు అంత ఈజీగా కొనడం లేదు. అంతేకదా, సినిమాలో దమ్ము లేకపోతే ఓటీటీల్లో అయినా ఏ ప్రేక్షకుడు చూస్తాడు చెప్పండి?

సరే, విషయంలోకి వద్దాం. 2023 లో విడుదలై ప్రస్తుతం ఓటీటీల్లో బాగా అలరిస్తోన్న తెలుగు సినిమాలేవో ఇక్కడ తెలుసుకుందాం. ఈ జాబితాలో మెగాస్టార్ నటించిన వాల్తేరు వీరయ్య, బాలయ్య నటించిన వీర సింహారెడ్డి, నాని నటించిన దసరా, నాగ శౌర్య ‘రంగబలి’ వంటి ఎన్నో చిత్రాలున్నాయి. సరే, పదండి మరి ఆ జాబితాపై ఓ లుక్ వేద్దాం.

Best Telugu Films On Netflix (2023)

రంగబలి

రంగబలి చిత్రం 2023 జులై 7 న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ లో చూసేందుకు అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో నాగశౌర్య, యుక్తి తరేజా ప్రధాన పాత్రలు పోషించారు.

  • సినిమా పేరు: రంగబలి
  • ఐఎండీబి రేటింగ్ – 4.9/10
  • ఎక్కడ చూడాలి – నెట్‌ఫ్లిక్స్
  • నటీనటులు – నాగశౌర్య, యుక్తి తరేజా
  • విడుదల తేదీ – 7 జులై 2023

వాల్తేరు వీరయ్య

వాల్తేరు వీరయ్య చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, శృతిహాసన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. 2023 జనవరి 12 న ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది.

  • సినిమా పేరు: వాల్తేరు వీరయ్య
  • ఐఎండిబి రేటింగ్– 6.2/10
  • ఎక్కడ చూడాలి – నెట్‌ఫ్లిక్స్
  • నటీనటులు – చిరంజీవి, రవితేజ, శృతిహాసన్
  • విడుదల తేదీ – 12 జనవరి 2023

దసరా

దసరా చిత్రంలో నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ చిత్రం 2023 మార్చి 30 న థియేటర్లలో విడుదలైంది.

  • సినిమా పేరు: దసరా
  • ఐఎండిబి రేటింగ్ – 6.7/10
  • ఎక్కడ చూడాలి – నెట్‌ఫ్లిక్స్
  • నటీనటులు – నాని, కీర్తి సురేశ్
  • విడుదల తేదీ – 30 మార్చి 2023

Best Telugu Films On Amazon Prime (2023)

ఆదిపురుష్

ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. రామాయణ గాథను స్పూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం 2023 జూన్ 16 న థియేటర్లలో విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఈ చిత్రం స్ట్రీమ్ అవుతోంది.

  • సినిమా పేరు: ఆదిపురుష్
  • ఐఎండీబి రేటింగ్ – 3.2/10
  • ఎక్కడ చూడాలి – అమెజాన్ ప్రైమ్ వీడియో
  • నటీనటులు – ప్రభాస్, కృతీసనన్
  • విడుదల తేదీ – 16 జూన్ 2023

రుద్రాంగి

జగపతి బాబు, మమతా మోహన్ దాస్ ప్రధాన పాత్రల్లో నటించిన రుద్రాంగి చిత్రం 2023 జులై 7 న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమ్ అవుతోంది. ఈ చిత్ర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. విభిన్న నేపథ్యం ఉన్న చిత్రాన్ని చూడాలనుకుంటే రుద్రాంగి ని చూసేయండి.

  • సినిమా పేరు: రుద్రాంగి
  • ఐఎమ్‌డిబి రేటింగ్ – 7.3/10
  • ఎక్కడ చూడాలి – అమెజాన్ ప్రైమ్ వీడియో
  • నటీనటులు – జగపతి బాబు, మమతా మోహన్ దాస్
  • విడుదల తేదీ – 7 July 2023

స్పై

నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య మేనెన్ ప్రధాన పాత్రలు పోషించిన స్పై సినిమా 2023 జూన్ 29 న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమ్ అవుతోంది.

  • సినిమా పేరు: స్పై
  • ఐఎండిబి రేటింగ్ – 5.4/10
  • ఎక్కడ చూడాలి – అమెజాన్ ప్రైమ్ వీడియో
  • నటీనటులు – నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య మేనెన్
  • విడుదల తేదీ – 29 జూన్ 2023

రావణాసుర

రవితేజ, దక్షా నగర్కర్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలు పోషించిన రావణాసుర చిత్రం 2023 ఏప్రిల్ 7 వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమ్ అవుతోంది.

  • సినిమా పేరు: రావణాసుర
  • ఐఎండిబి రేటింగ్र – 5.7/10
  • ఎక్కడ చూడాలి – అమెజాన్ ప్రైమ్
  • నటీనటులు – రవితేజ, దక్షా నగర్కర్, ఫరియా అబ్దుల్లా
  • విడుదల తేదీ – 7 ఏప్రిల్ 2023

Best Telugu Films on Disney+ Hotstar (2023)

వీరసింహారెడ్డి

వీరసింహారెడ్డి చిత్రం డిస్నీ+ హాట్‌స్టార్ లో అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో బాలకృష్ణ, హనీరోజ్, శృతీహాసన్ ప్రధాన పాత్రలు పోషించారు. 2023 జనవరి 11 న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది.

  • సినిమా పేరు: వీర సింహారెడ్డి
  • ఐఎండిబి రేటింగ్ – 4.9/10
  • ఎక్కడ చూడాలి – డిస్నీ+ హాట్‌స్టార్
  • నటీనటులు – బాలకృష్ణ, హనీరోజ్, శృతీహాసన్
  • విడుదల తేదీ – 11 జనవరి 2023

బిచ్చగాడు 2

బిచ్చగాడు 2 చిత్రంలో విజయ్ ఆంటోని, కావ్యా తాపర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా 2023 మే 19 వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం డిస్నీ+ హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది.

  • సినిమా పేరు: బిచ్చగాడు 2
  • ఐఎండిబి రేటింగ్ – 5.6/10
  • ఎక్కడ చూడాలి – డిస్నీ+ హాట్‌స్టార్
  • నటీనటులు – విజయ్ ఆంటోని, కావ్యా తాపర్
  • విడుదల తేదీ – 19 మే 2023

Best Telugu Films on Sony Liv (2023)

పరేషాన్

పరేషాన్ చిత్రంలో తిరువీర్, పావని కరణం ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా సోని లివ్ లో స్ట్రీమ్ అవుతోంది. 2023 జూన్ 2 వ తేదీన థియేటర్లలో విడుదలైంది.

  • సినిమా పేరు: పరేషాన్
  • ఐఎండిబి రేటింగ్ – 6.1/10
  • ఎక్కడ చూడాలి – సోని లివ్
  • నటీనటులు – తిరువీర్, పావని కరణం
  • విడుదల తేదీ – 2 June 2023

Best Telugu Films On Zee5 (2023)

రైటర్ పద్మభూషణ్

రైటర్ పద్మభూషణ్ చిత్రంలో సుహాస్, టీనా శిల్పరాజ్, శ్రీ గౌరి ప్రియ ప్రధాన పాత్రలు పోషించారు. 2023 ఫిబ్రవరి 3 వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. జీ5 లో ఈ చిత్రం స్ట్రీమ్ అవుతోంది.

  • సినిమా పేరు: రైటర్ పద్మభూషణ్
  • ఐఎండిబి రేటింగ్ – 7.7/10
  • ఎక్కడ చూడాలి – జీ5
  • నటీనటులు – సుహాస్, టీనా శిల్పరాజ్, శ్రీ గౌరి ప్రియ
  • విడుదల తేదీ – 3 ఫిబ్రవరి 2023

The post OTT: ఓటీటీల్లో ఉన్న బెస్ట్ తెలుగు సినిమాలు (2023) first appeared on 91Mobiles Telugu.

]]>
OTT ప్లాట్ఫామ్స్ vs Tollywood ప్రొడ్యూసర్స్ https://www.91mobiles.com/telugu/ott-platforms-decision-made-producers-unhappy/ Tue, 23 Aug 2022 13:54:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=1843 హైలైట్స్: ఓటీటీ సైట్స్ లో సినిమాల విడుదలపై నిర్మాతల కఠిన నిర్ణయం సినిమా థియెట్రికల్ రిలీజ్ తర్వాత రిజల్ట్ ని బట్టి, డిజిటల్ రైట్స్ ధర నిర్ణయించాలనే ప్రతిపాదనను నిర్మాతల ముందు పెట్టిన ఓటీటీ సంస్థలు ఓటీటీ సంస్థల ప్రతిపాదన పట్ల సుముఖంగా లేని నిర్మాతల మండలి కొన్ని వారాల క్రితం టాలీవుడ్ నిర్మాతల మండలి ప్రస్తుతం కొనసాగుతోన్న సినిమాల చిత్రీకరణను ఆపేయాలని నిర్ణయించింది. బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కొట్టేందుకు బడ్జెట్ ను తగ్గించుకోవాలని నిర్మాతల మండలి […]

The post OTT ప్లాట్ఫామ్స్ vs Tollywood ప్రొడ్యూసర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఓటీటీ సైట్స్ లో సినిమాల విడుదలపై నిర్మాతల కఠిన నిర్ణయం
  • సినిమా థియెట్రికల్ రిలీజ్ తర్వాత రిజల్ట్ ని బట్టి, డిజిటల్ రైట్స్ ధర నిర్ణయించాలనే ప్రతిపాదనను నిర్మాతల ముందు పెట్టిన ఓటీటీ సంస్థలు
  • ఓటీటీ సంస్థల ప్రతిపాదన పట్ల సుముఖంగా లేని నిర్మాతల మండలి

కొన్ని వారాల క్రితం టాలీవుడ్ నిర్మాతల మండలి ప్రస్తుతం కొనసాగుతోన్న సినిమాల చిత్రీకరణను ఆపేయాలని నిర్ణయించింది. బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కొట్టేందుకు బడ్జెట్ ను తగ్గించుకోవాలని నిర్మాతల మండలి అభిప్రాయపడింది. బడ్జెట్ ను తగ్గించాలంటే, స్టార్ హీరోలు మరియు దర్శకుల రెమ్యునరేషన్ ను తగ్గించాల్సిందేనని తెలుగు చిత్ర నిర్మాతల మండలి ప్రెసిడెంట్ దిల్ రాజు అన్నారు.

అయితే రీసెంట్ గా స్ట్రైక్ విరమణకు పిలుపునిచ్చిన నిర్మాతల మండలి, కొన్ని ఆదేశాలను జారీ చేసింది. “థియెట్రికల్ రిలీజ్ తర్వాత ఓటీటీ లో సినిమా విడుదలను 8 వారాలకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాం. ఇకపై అందరు నిర్మాతలు కూడా ఈ నిబంధనకు కట్టుబడి ఉండాలి. నిబంధనను అతిక్రమించడానికి అస్సలు వీలులేదు. ప్రస్తుతం ఉన్న ఒప్పందాలను కొనసాగిస్తున్నాం. ఒకవేళ అవసరమైతే, నియమ నిబంధనలను వెంటనే మార్చుతాం,” అని నిర్మాత దిల్ రాజు వెల్లడించారు.

అయితే, ఓటీటీ ప్లాట్ఫామ్స్ మాత్రం నిర్మాతల మండలి డిక్లరేషన్ పై పాజిటివ్ గా లేదు. దీంతో వారు మరొక ప్రత్యామ్నాయ ప్రతిపాదనను నిర్మాతల మండలి ముందు ఉంచారు. ఓటీటీ ప్లాట్ఫామ్స్ చెబుతున్నదేంటో ఇక్కడ చూద్దాం. ముందు నిర్మాతలు థియెట్రికల్ రిలీజ్ కి వెళ్ళాక, సినిమా ఫలితాన్ని బట్టి ఫైనల్ డిజిటల్ రేట్ ను సర్దుబాటు చేసుకుందామని ఓటీటీ సైట్స్ చెబుతున్నాయి. అయితే ఈ ప్లాన్ పట్ల నిర్మాతల మండలి సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో మళ్ళీ కథ మొదటికి వచ్చింది. చివరకు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

దిల్ రాజు నిర్ణయంపై హ్యాపీగా లేని స్టార్ హీరోలు, డైరెక్టర్లు

కథానాయకులు, దర్శకుల రెమ్యునరేషన్ ను తగ్గించాలని దిల్ రాజు తీసుకున్న నిర్ణయం పట్ల వారు సానుకూలంగా లేరు. వారు తమ పారితోషికాన్ని తగ్గించుకునే స్థితిలో లేరు. వేరే సినిమాలు ఓటమి పాలైతే, దానికి తామెందుకు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని ప్రశ్నిస్తున్నారు. తమ సినిమాలు బాగా ఆడుతున్నాయని, తాము తమ యొక్క బ్రాండ్ మరియు కంటెంట్ తో ప్రేక్షకులను థియేటర్లకు రాబట్టగలమని స్టార్ హీరోలు, దర్శకులు చెబుతున్నారు.

ఇటీవల బొక్క బోర్లాపడ్డ సినిమాలు

రీసెంట్ గా దిల్ రాజు నిర్మించిన సినిమా థాంక్యూ సినిమా భారీ నష్టాలను మిగిల్చింది. మరో సినిమా ఎఫ్3 అనుకున్న రేంజ్ లో ఆడలేదు. షాహిద్ కపూర్ ని హీరోగా పెట్టి జెర్సీ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేశారు దిల్ రాజు. అయితే ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో దిల్ రాజు భారీ నష్టాలను చవి చూశారు. మరోవైపు, షూటింగ్స్ ఆపడం వల్లన చిత్రసీమ మరింత కష్టాల్లోకి వెళ్తుందని, దిల్ రాజు టీమ్ నిర్ణయాన్ని మరో నిర్మాతల వర్గం తప్పుబడుతోంది.

దిల్ రాజు పై బహిరంగంగా స్టేట్మెంట్స్ ఇచ్చిన నిర్మాతలు

నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్న దిల్ రాజు ఇతర నిర్మాతలతో చర్చించి తీసుకున్న నిర్ణయం సీనియర్ నిర్మాత అయిన అశ్వినీ దత్, మరో నిర్మాత బండ్ల గణేశ్ కు ఎందుకో నచ్చలేదు. దీంతో బాహాటంగానే దిల్ రాజు పై సదరు నిర్మాతలు తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. తన సినిమాల చిత్రీకరణను ఆపేది లేదని అశ్వినీ దత్ వెల్లడించారు. దిల్ రాజు నిబంధనలు తమ సినిమాలకు వర్తించవని, తమ సినిమాల షూటింగ్స్ ని కొనసాగిస్తామని అశ్వినీ దత్ అన్నారు.

లేటెస్ట్ ఓటీటీ వార్తల కొరకు 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ ని విజిట్ చేయండి.

The post OTT ప్లాట్ఫామ్స్ vs Tollywood ప్రొడ్యూసర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
థియెట్రికల్ రిలీజ్ తర్వాత 6 నెలలకు నా సినిమాలు OTT కి వస్తాయి – ఆమిర్ ఖాన్ https://www.91mobiles.com/telugu/aamirkhan-on-ott-and-theatrical-release-gap/ Tue, 09 Aug 2022 15:29:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=1587 హైలైట్స్: తన సినిమాల ఓటీటీ స్ట్రీమింగ్ పై బాలీవుడ్ టాప్ హీరో ఆమిర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు థియెట్రికల్ రిలీజ్ తర్వాత 6 నెలలకు ఓటీటీ లోకి తన సినిమాలు వస్తాయంటోన్న ఆమిర్ ఖాన్ త్వరలో లాల్ సింగ్ చడ్డా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆమిర్ మరికొన్ని రోజుల్లో ఆమిర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా చిత్రం థియేటర్లలోకి వస్తోంది. దీంతో ఆమిర్ ఖాన్ అండ్ టీమ్ పలు నగరాల్లో తమ చిత్రాన్ని విస్తృతంగా […]

The post థియెట్రికల్ రిలీజ్ తర్వాత 6 నెలలకు నా సినిమాలు OTT కి వస్తాయి – ఆమిర్ ఖాన్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • తన సినిమాల ఓటీటీ స్ట్రీమింగ్ పై బాలీవుడ్ టాప్ హీరో ఆమిర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
  • థియెట్రికల్ రిలీజ్ తర్వాత 6 నెలలకు ఓటీటీ లోకి తన సినిమాలు వస్తాయంటోన్న ఆమిర్ ఖాన్
  • త్వరలో లాల్ సింగ్ చడ్డా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆమిర్

మరికొన్ని రోజుల్లో ఆమిర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా చిత్రం థియేటర్లలోకి వస్తోంది. దీంతో ఆమిర్ ఖాన్ అండ్ టీమ్ పలు నగరాల్లో తమ చిత్రాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమిర్ ఖాన్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రస్తుత సినిమాల థియెట్రికల్ మరియు ఓటీటీ రిలీజ్ కి మధ్య వస్తున్న గ్యాప్ గురించి ఆయనకు ప్రశ్న ఎదురైంది.

“అతి త్వరగా సినిమాలు ఓటీటీ సైట్స్ లో విడుదలైతే జనాలు థియేటర్లకు ఎలా వస్తారు? కొన్ని సినిమాలు 3 నుంచి 4 వారాల్లో ఓటీటీ కి వస్తున్నాయి. ఇలా త్వరగా వస్తే, సినిమాలు థియేటర్లలో నిలిచే అవకాశాలు చాలా తక్కువైపోతాయి.” అని ఆమిర్ అభిప్రాయపడ్డారు.

“నా సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన 6 నెలల తర్వాత ఓటీటీ లో ప్రసారమయ్యేలా చూసుకుంటాను. దాన్ని బట్టి ప్రేక్షకులకు సదరు సినిమా థియేటర్లలో చూడటానికి తీసిందని తెలియజెప్పవచ్చు. ఒకవేళ వారికి మరలా సినిమాను చూడాలనిపిస్తే, వారు ఆ చిత్రాన్ని ఓటీటీ లో చూడవచ్చు.” అని ఆమిర్ అన్నారు.

“స్వల్ప కాలం కోసం ఆలోచిస్తే, డబ్బులు బాగానే వస్తాయి. కానీ, దీర్ఘకాలంలో మీ చర్యలతో మీకు మీరే హాని చేసుకోవడమే గాక, మొత్తం చిత్రసీమకే హాని చేస్తున్నారు. అందుకే జనాలు థియేటర్లకు రావడం లేదు.” అంటూ చెప్పుకొచ్చారు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్.

ఇప్పుడు ఆమిర్ ఖాన్ రాబోవు చిత్రం లాల్ సింగ్ చడ్డా గురించి తెలుసుకుందాం. లాల్ సింగ్ చడ్డా చిత్రం ఆగస్టు 11 న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలవుతోంది. అమెరికన్ కల్ట్ క్లాసిక్ ఫారెస్ట్ గంప్ చిత్రానికి లాల్ సింగ్ చడ్డా అఫీషియల్ రీమేక్. ఈ చిత్రంలో కరీనా కపూర్, నాగ చైతన్య, మానవ్ విజ్ ప్రధాన పాత్రలు పోషించారు. అద్వైత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.

నాగచైతన్య పాత్ర విశేషాలు:

లాల్ సింగ్ చడ్డా చిత్రంలో నాగచైతన్య కీలక పాత్ర పోషించాడు. బాలరాజు బోడిపాలెం అనే పాత్రలో చైతన్య కనిపించనున్నాడు. చిత్రంలో అందరూ అతన్ని బాల అని పిలుస్తుంటారు. చిన్న పట్టణం నుంచి వచ్చిన బాలరాజు జవాన్ కావాలనే లక్ష్యంతో తన కలను నెరవేర్చుకుంటాడు. లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఐకానిక్ చిత్రం పేరు కూడా బాలరాజు కావడం విశేషం. బాలరాజు చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు యొక్క లుక్ ని ఇన్‌స్పైర్ అయ్యి లాల్ సింగ్ చడ్డాలో నాగ చైతన్య పాత్రను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. పాత్రకు మరింత ఆకర్షణను తెచ్చేందుకు చైతన్య పాత్ర దళసరి మీసం కట్టుతో కనిపిస్తుంది.

మరిన్ని ఓటీటీ వార్తలకై 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ ని విజిట్ చేయండి.

The post థియెట్రికల్ రిలీజ్ తర్వాత 6 నెలలకు నా సినిమాలు OTT కి వస్తాయి – ఆమిర్ ఖాన్ first appeared on 91Mobiles Telugu.

]]>