థియెట్రికల్ రిలీజ్ తర్వాత 6 నెలలకు నా సినిమాలు OTT కి వస్తాయి – ఆమిర్ ఖాన్

హైలైట్స్:

  • తన సినిమాల ఓటీటీ స్ట్రీమింగ్ పై బాలీవుడ్ టాప్ హీరో ఆమిర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
  • థియెట్రికల్ రిలీజ్ తర్వాత 6 నెలలకు ఓటీటీ లోకి తన సినిమాలు వస్తాయంటోన్న ఆమిర్ ఖాన్
  • త్వరలో లాల్ సింగ్ చడ్డా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆమిర్

మరికొన్ని రోజుల్లో ఆమిర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా చిత్రం థియేటర్లలోకి వస్తోంది. దీంతో ఆమిర్ ఖాన్ అండ్ టీమ్ పలు నగరాల్లో తమ చిత్రాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమిర్ ఖాన్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రస్తుత సినిమాల థియెట్రికల్ మరియు ఓటీటీ రిలీజ్ కి మధ్య వస్తున్న గ్యాప్ గురించి ఆయనకు ప్రశ్న ఎదురైంది.

“అతి త్వరగా సినిమాలు ఓటీటీ సైట్స్ లో విడుదలైతే జనాలు థియేటర్లకు ఎలా వస్తారు? కొన్ని సినిమాలు 3 నుంచి 4 వారాల్లో ఓటీటీ కి వస్తున్నాయి. ఇలా త్వరగా వస్తే, సినిమాలు థియేటర్లలో నిలిచే అవకాశాలు చాలా తక్కువైపోతాయి.” అని ఆమిర్ అభిప్రాయపడ్డారు.

“నా సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన 6 నెలల తర్వాత ఓటీటీ లో ప్రసారమయ్యేలా చూసుకుంటాను. దాన్ని బట్టి ప్రేక్షకులకు సదరు సినిమా థియేటర్లలో చూడటానికి తీసిందని తెలియజెప్పవచ్చు. ఒకవేళ వారికి మరలా సినిమాను చూడాలనిపిస్తే, వారు ఆ చిత్రాన్ని ఓటీటీ లో చూడవచ్చు.” అని ఆమిర్ అన్నారు.

“స్వల్ప కాలం కోసం ఆలోచిస్తే, డబ్బులు బాగానే వస్తాయి. కానీ, దీర్ఘకాలంలో మీ చర్యలతో మీకు మీరే హాని చేసుకోవడమే గాక, మొత్తం చిత్రసీమకే హాని చేస్తున్నారు. అందుకే జనాలు థియేటర్లకు రావడం లేదు.” అంటూ చెప్పుకొచ్చారు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్.

ఇప్పుడు ఆమిర్ ఖాన్ రాబోవు చిత్రం లాల్ సింగ్ చడ్డా గురించి తెలుసుకుందాం. లాల్ సింగ్ చడ్డా చిత్రం ఆగస్టు 11 న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలవుతోంది. అమెరికన్ కల్ట్ క్లాసిక్ ఫారెస్ట్ గంప్ చిత్రానికి లాల్ సింగ్ చడ్డా అఫీషియల్ రీమేక్. ఈ చిత్రంలో కరీనా కపూర్, నాగ చైతన్య, మానవ్ విజ్ ప్రధాన పాత్రలు పోషించారు. అద్వైత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.

నాగచైతన్య పాత్ర విశేషాలు:

లాల్ సింగ్ చడ్డా చిత్రంలో నాగచైతన్య కీలక పాత్ర పోషించాడు. బాలరాజు బోడిపాలెం అనే పాత్రలో చైతన్య కనిపించనున్నాడు. చిత్రంలో అందరూ అతన్ని బాల అని పిలుస్తుంటారు. చిన్న పట్టణం నుంచి వచ్చిన బాలరాజు జవాన్ కావాలనే లక్ష్యంతో తన కలను నెరవేర్చుకుంటాడు. లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఐకానిక్ చిత్రం పేరు కూడా బాలరాజు కావడం విశేషం. బాలరాజు చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు యొక్క లుక్ ని ఇన్‌స్పైర్ అయ్యి లాల్ సింగ్ చడ్డాలో నాగ చైతన్య పాత్రను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. పాత్రకు మరింత ఆకర్షణను తెచ్చేందుకు చైతన్య పాత్ర దళసరి మీసం కట్టుతో కనిపిస్తుంది.

మరిన్ని ఓటీటీ వార్తలకై 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ ని విజిట్ చేయండి.

Previous articleకన్ఫర్మ్ అయిన Xiaomi MIX Fold 2 లాంచ్
Next articleగూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ లిస్ట్ లో కనిపించిన iQOO Z6x, Vivo X80 Lite 5G
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.