POCO C55 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 21 Feb 2023 09:05:52 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 MediaTek Helio G85 చిప్, 50MP మెయిన్ కెమెరాతో భారత్‌లో లాంచైన POCO C55 https://www.91mobiles.com/telugu/poco-c55-launched-india-price-specs-availablity/ Tue, 21 Feb 2023 09:05:52 +0000 https://www.91mobiles.com/telugu/?p=5026 ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ POCO భారత్ లో POCO C55 ఫోన్ ని లాంచ్ చేసింది. తక్కువ ధర కలిగిన ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 5ఎంపి సెల్ఫీ కెమెరాతో వచ్చింది. ఈ ఎంట్రీ లెవెల్ ఫోన్ లో 6.71-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ ఉన్నాయి. POCO C55 లో రియర్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 4జీ కనెక్టివిటీ, ఎంఐయూఐ 13 […]

The post MediaTek Helio G85 చిప్, 50MP మెయిన్ కెమెరాతో భారత్‌లో లాంచైన POCO C55 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన చవకైన స్మార్ట్ ఫోన్ POCO C55
  • మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్, 50ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి సెల్ఫీ కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన POCO C55
  • భారత్ లో POCO C55 స్మార్ట్ ఫోన్ 4జిబి + 64జిబి వేరియంట్ ధర రూ.9,499

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ POCO భారత్ లో POCO C55 ఫోన్ ని లాంచ్ చేసింది. తక్కువ ధర కలిగిన ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 5ఎంపి సెల్ఫీ కెమెరాతో వచ్చింది. ఈ ఎంట్రీ లెవెల్ ఫోన్ లో 6.71-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ ఉన్నాయి. POCO C55 లో రియర్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 4జీ కనెక్టివిటీ, ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉన్నాయి.

భారత్ లో POCO C55 ధర

భారత్ లో POCO C55 డివైజ్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.9,499 గా నిర్ణయించారు. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ యూనిట్ ధర రూ.10,999 గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ కూల్ బ్లూ, ఫారెస్ట్ గ్రీన్, పవర్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఫిబ్రవరి 28 నుంచి ఫ్లిప్ కార్ట్ మరియు కంపెనీ వెబ్‌సైట్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.

స్పెషల్ ఫస్ట్ డే ప్రైస్ ఆఫర్ లో భాగంగా POCO C55 బేస్ వేరియంట్ రూ.8,499 కే లభించనుంది. హైఎండ్ వేరియంట్ రూ.9,999 కే లభిస్తుంది. ఈ ధరలు HDFC, SBI, ICICI బ్యాంక్ కస్టమర్లకు ఆఫర్ ద్వారా వర్తిస్తాయి.

POCO C55 స్పెసిఫికేషన్స్

POCO C55 స్మార్ట్ ఫోన్ లో 6.71-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్, 534 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ జీ85 చిప్సెట్ వాడారు. POCO C55 డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ హ్యాండ్సెట్ 6జిబి ర్యామ్ ఆప్షన్ లో లభిస్తుంది.

POCO C55 స్మార్ట్ ఫోన్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. దీనికి తోడు ఒక సెకండరీ సెన్సర్ ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. POCO C55 లో 64జిబి స్టోరేజీ ఇచ్చారు. మైక్రోఎస్డీకార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ లో యాక్సలరోమీటర్, వర్చువల్ ప్రాక్సిమిటీ సెన్సర్, రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.

POCO C55 లో వై-ఫై, 4జీ, బ్లూటూత్ 5.1, జీపీఎస్, మైక్రో-యూఎస్బీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఐపీ52 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ తో వచ్చింది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post MediaTek Helio G85 చిప్, 50MP మెయిన్ కెమెరాతో భారత్‌లో లాంచైన POCO C55 first appeared on 91Mobiles Telugu.

]]>
IMDA సర్టిఫికేషన్‌ని క్లియర్ చేసిన POCO C55 https://www.91mobiles.com/telugu/poco-c55-imda-certification-key-specs-redmi12c-rebrand/ Tue, 17 Jan 2023 05:53:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=4484   కొన్ని వారాల క్రితం పోకో సంస్థ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ POCO C50 ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. ప్రముఖ టిప్‌స్టర్ కాస్పర్ స్క్రైజిపెక్ త్వరలో రాబోవు POCO C55 స్మార్ట్ ఫోన్ గురించి ఓ సమాచారాన్ని బయటకు వదిలాడు. POCO C55 స్మార్ట్ ఫోన్ 221227PC5G అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఇది ఐఎండీఏ సర్టిఫికేషన్ ద్వారా తెలిసింది. అయితే ఇది గ్లోబల్ వేరియంట్ కాబట్టి, భారత […]

The post IMDA సర్టిఫికేషన్‌ని క్లియర్ చేసిన POCO C55 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Redmi 12C ఫోన్ కి రీబ్రాండ్ గా వస్తోన్న POCO C55 స్మార్ట్ ఫోన్
  • అత్యధిక ఫీచర్లతో వస్తోన్న సీ-సిరీస్ ఫోన్ గా నిలవనున్న POCO C55
  • భారత మార్కెట్ లో POCO C55 లాంచ్ పై ఇంకా రావాల్సిన అధికార ప్రకటన

కొన్ని వారాల క్రితం పోకో సంస్థ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ POCO C50 ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేసింది. ప్రముఖ టిప్‌స్టర్ కాస్పర్ స్క్రైజిపెక్ త్వరలో రాబోవు POCO C55 స్మార్ట్ ఫోన్ గురించి ఓ సమాచారాన్ని బయటకు వదిలాడు. POCO C55 స్మార్ట్ ఫోన్ 221227PC5G అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఇది ఐఎండీఏ సర్టిఫికేషన్ ద్వారా తెలిసింది. అయితే ఇది గ్లోబల్ వేరియంట్ కాబట్టి, భారత మార్కెట్ లో ఈ ఫోన్ లాంచ్ అవుతుందా లేదా అనేది ఇంకా తెలియదు.

IMDA సర్టిఫికేషన్ ద్వారా POCO C55 బ్లూటూత్, వై-ఫై సపోర్ట్ కి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. అయితే సర్టిఫికేషన్ లిస్టింగ్ ద్వారా ఇంకా ఇతర వివరాలు ఏవీ తెలియలేదు. సరే POCO C55 కి సంబంధించి ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సమాచారంపై ఓ లుక్ వేద్దాం పదండి.

POCO C55 స్మార్ట్ ఫోన్ 22127PC95G మోడల్ నంబర్ తో ఐఎండీఏ సర్టిఫికేషన్ పై కనిపించింది. అయితే ఈ పోకో స్మార్ట్ ఫోన్ కి చెందిన విషయాలేవీ పెద్దగా బయటకు రాలేదు. అయితే టిప్‌స్టర్ క్యాస్పర్ ప్రకారం, Redmi 12C ఫోన్ POCO C55 పేరుతో రీబ్రాండ్ అయి వస్తోందని సమాచారం. ఇక రెడ్మీ 12సీ విషయానికి వస్తే, ఈ ఫోన్ చైనీస్ మార్కెట్ లో గత నెలలో లాంచ్ అయ్యింది. ఓసారి రెడ్మీ 12సీ యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ధర గురించి తెలుసుకుందాం.

Redmi 12C స్పెసిఫికేషన్స్

Redmi 12C స్మార్ట్ ఫోన్ లో 6.71-ఇంచ్ హెచ్డీ+ (1650*720 పిక్సెల్స్) రెజుల్యూషన్, 500 నిట్స్ బ్రైట్నెస్, 1500:1 కాంట్రాస్ట్ రేషియో, వాటర్ డ్రాప్ నాచ్ ఉంటాయి. ఇకపోతే ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి జీ52 జీపీయూ ఉపయోగించారు. హీలియో జీ85 చిప్సెట్ మూడేళ్ళ క్రితం ఇంట్రడ్యూస్ అయ్యింది. ఎన్నో మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్ లో దీన్ని వాడారు. రెడ్మీ నోట్ 9, రియల్మీ నార్జో 20, మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1, మోటో జీ31 తదితర ఫోన్లలో ఈ చిప్ ని ఉపయోగించారు.

Redmi 12C లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. ఇకపోతే పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఇందులో మైక్రో యూఎస్బీ పోర్ట్ ప్రొవైడ్ చేశారు.

Redmi 12C స్మార్ట్ ఫోన్ బ్లాక్, బ్లూ, గ్రీన్, పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ బరువు 192 గ్రాములు. మైక్రోఎస్డీ కార్డ్ సౌకర్యం, రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.

Redmi 12C స్మార్ట్ ఫోన్ 4జిబి + 64జిబి, 4జిబి + 128జిబి స్టోరేజీ మరియు 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 4జిబి+64జిబి వేరియంట్ ధర RMB 699 (సుమారు రూ.8,500), 4జిబి+128జిబి వేరియంట్ ధర RMB 799 (సుమారు రూ.9,700), 6జిబి+128జిబి వేరియంట్ ధర RMB 899 (సుమారు రూ.11,000) గా ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post IMDA సర్టిఫికేషన్‌ని క్లియర్ చేసిన POCO C55 first appeared on 91Mobiles Telugu.

]]>
MediaTek Helio G85 చిప్సెట్, 5000mAh బ్యాటరీతో రానున్న POCO C55 (Redmi 12C) https://www.91mobiles.com/telugu/poco-c55-launch-on-cards-rebrand-of-redmi-12c/ Tue, 10 Jan 2023 10:35:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=4413 హైలైట్స్ అత్యధిక ఫీచర్లు కలిగిన సీ-సిరీస్ ఫోన్ గా వస్తోన్న POCO C55 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ తో రానున్న POCO C55 Redmi 12C ఫోన్ కి రీబ్రాండెడ్ వర్షన్ గా వస్తోన్న POCO C55 పోకో సంస్థ ఇటీవలె భారత్ లో POCO C50 అనే ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ కంపెనీ సీ-సిరీస్ లో POCO C55 అనే ఫోన్ ని […]

The post MediaTek Helio G85 చిప్సెట్, 5000mAh బ్యాటరీతో రానున్న POCO C55 (Redmi 12C) first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • అత్యధిక ఫీచర్లు కలిగిన సీ-సిరీస్ ఫోన్ గా వస్తోన్న POCO C55 స్మార్ట్ ఫోన్
  • మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ తో రానున్న POCO C55
  • Redmi 12C ఫోన్ కి రీబ్రాండెడ్ వర్షన్ గా వస్తోన్న POCO C55

పోకో సంస్థ ఇటీవలె భారత్ లో POCO C50 అనే ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ కంపెనీ సీ-సిరీస్ లో POCO C55 అనే ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ టిప్‌స్టర్ Kacper Skrzypek ప్రకారం, POCO C55 ఫోన్ రెడ్మీ 12సీ కి రీబ్రాండెడ్ వర్షన్ గా వస్తున్నట్లు సమాచారం. రెడ్మీ 12సీ ఫోన్ ఇటీవలె చైనీస్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది.

POCO C55 కూడా రీబ్రాండ్ చేయబడిన రెడ్మీ డివైజ్. అసలైతే, పోకో సీ-సిరీస్ ఫోన్లన్నీ రీబ్రాండ్ చేయబడిన రెడ్మీ ఫోన్స్ అని చెప్పాలి. 2021 లో లాంచైన పోకో సీ31 ఫోన్, రెడ్మీ 9 యాక్టివ్ యొక్క రీబ్రాండ్ వర్షన్. తన లేటెస్ట్ ఫైండింగ్ ని టిప్ స్టర్ క్యాస్పర్ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశాడు. అయితే ఎంఐయూఐ కోడ్ ఆధారంగా ఈ విషయాన్ని తెలుసుకున్నట్లు క్యాస్పర్ వెల్లడించలేదు. కానీ, తరచూ ఇతడు ఎంఐయూఐ కోడ్ ద్వారానే తన లీక్స్ ని బయటపెడుతుంటాడు. సరే, ఓసారి Redmi 12C యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ధర వివరాలను తెలుసుకుందాం. పదండి.

Redmi 12C స్పెసిఫికేషన్స్, ధర