MediaTek Helio G85 చిప్సెట్, 5000mAh బ్యాటరీతో రానున్న POCO C55 (Redmi 12C)

హైలైట్స్

  • అత్యధిక ఫీచర్లు కలిగిన సీ-సిరీస్ ఫోన్ గా వస్తోన్న POCO C55 స్మార్ట్ ఫోన్
  • మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ తో రానున్న POCO C55
  • Redmi 12C ఫోన్ కి రీబ్రాండెడ్ వర్షన్ గా వస్తోన్న POCO C55

పోకో సంస్థ ఇటీవలె భారత్ లో POCO C50 అనే ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ కంపెనీ సీ-సిరీస్ లో POCO C55 అనే ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ టిప్‌స్టర్ Kacper Skrzypek ప్రకారం, POCO C55 ఫోన్ రెడ్మీ 12సీ కి రీబ్రాండెడ్ వర్షన్ గా వస్తున్నట్లు సమాచారం. రెడ్మీ 12సీ ఫోన్ ఇటీవలె చైనీస్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది.

POCO C55 కూడా రీబ్రాండ్ చేయబడిన రెడ్మీ డివైజ్. అసలైతే, పోకో సీ-సిరీస్ ఫోన్లన్నీ రీబ్రాండ్ చేయబడిన రెడ్మీ ఫోన్స్ అని చెప్పాలి. 2021 లో లాంచైన పోకో సీ31 ఫోన్, రెడ్మీ 9 యాక్టివ్ యొక్క రీబ్రాండ్ వర్షన్. తన లేటెస్ట్ ఫైండింగ్ ని టిప్ స్టర్ క్యాస్పర్ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశాడు. అయితే ఎంఐయూఐ కోడ్ ఆధారంగా ఈ విషయాన్ని తెలుసుకున్నట్లు క్యాస్పర్ వెల్లడించలేదు. కానీ, తరచూ ఇతడు ఎంఐయూఐ కోడ్ ద్వారానే తన లీక్స్ ని బయటపెడుతుంటాడు. సరే, ఓసారి Redmi 12C యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ధర వివరాలను తెలుసుకుందాం. పదండి.

Redmi 12C స్పెసిఫికేషన్స్, ధర

Redmi 12C స్మార్ట్ ఫోన్ లో 6.71-ఇంచ్ హెచ్డీ+ (1650*720 పిక్సెల్స్) రెజుల్యూషన్, 500 నిట్స్ బ్రైట్నెస్, 1500:1 కాంట్రాస్ట్ రేషియో, వాటర్ డ్రాప్ నాచ్ ఉంటాయి. ఇకపోతే ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి జీ52 జీపీయూ ఉపయోగించారు. హీలియో జీ85 చిప్సెట్ మూడేళ్ళ క్రితం ఇంట్రడ్యూస్ అయ్యింది. ఎన్నో మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్ లో దీన్ని వాడారు. రెడ్మీ నోట్ 9, రియల్మీ నార్జో 20, మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1, మోటో జీ31 తదితర ఫోన్లలో ఈ చిప్ ని ఉపయోగించారు.

Redmi 12C లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. ఇకపోతే పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఇందులో మైక్రో యూఎస్బీ పోర్ట్ ప్రొవైడ్ చేశారు.

Redmi 12C స్మార్ట్ ఫోన్ బ్లాక్, బ్లూ, గ్రీన్, పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ బరువు 192 గ్రాములు. మైక్రోఎస్డీ కార్డ్ సౌకర్యం, రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.

Redmi 12C స్మార్ట్ ఫోన్ 4జిబి + 64జిబి, 4జిబి + 128జిబి స్టోరేజీ మరియు 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 4జిబి+64జిబి వేరియంట్ ధర RMB 699 (సుమారు రూ.8,500), 4జిబి+128జిబి వేరియంట్ ధర RMB 799 (సుమారు రూ.9,700), 6జిబి+128జిబి వేరియంట్ ధర RMB 899 (సుమారు రూ.11,000) గా ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.