POCO F5 Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 27 Apr 2023 07:57:51 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 లాంచ్ కి ముందే POCO F5 Pro అన్‌బాక్సింగ్ వీడియో చూడండి! https://www.91mobiles.com/telugu/poco-f5-pro-unboxing-video-specs-leak/ Thu, 27 Apr 2023 07:57:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=6060 POCO F5 సిరీస్ మే 9 న గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ కానుంది. ఈ లైనప్ లో POCO F5, POCO F5 Pro డివైజెస్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సిరీస్ పోకో ఎఫ్4 కి సక్సెసర్ గా వస్తోంది. POCO F5 స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 2 చిప్సెట్ తో రానున్నట్లు సమాచారం. POCO F5 Pro డివైజ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 […]

The post లాంచ్ కి ముందే POCO F5 Pro అన్‌బాక్సింగ్ వీడియో చూడండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మే 9 వ తేదీన లాంచ్ కానున్న POCO F5 Pro
  • లాంచ్ కి ముందే వైరల్ అవుతోన్న అన్‌బాక్సింగ్ వీడియో
  • క్వాల్కమ్ ప్రాసెసర్ తో వస్తోన్న POCO F5 సిరీస్

POCO F5 సిరీస్ మే 9 న గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ కానుంది. ఈ లైనప్ లో POCO F5, POCO F5 Pro డివైజెస్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సిరీస్ పోకో ఎఫ్4 కి సక్సెసర్ గా వస్తోంది. POCO F5 స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 2 చిప్సెట్ తో రానున్నట్లు సమాచారం. POCO F5 Pro డివైజ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్సెట్ తో రానున్నట్లు తెలుస్తోంది. తాజాగా POCO F5 Pro యొక్క అన్‌బాక్సింగ్ వీడియోని ప్రముఖ టిప్‌స్టర్ సుదాన్శు అంభోరే షేర్ చేశాడు. దీంతో ఫోన్ వివరాలు బయటకు వచ్చాయి.

POCO F5 Pro అన్‌బాక్సింగ్ వీడియో

POCO F5 Pro స్మార్ట్ ఫోన్ అన్‌బాక్సింగ్ వీడియో బయటకు వచ్చింది. దీంతో ఈ ఫోన్ కోసం ఎదురు చూస్తున్న వారు లాంచ్ కి ముందుగానే ఈ డివైజ్ అన్‌బాక్సింగ్ విశేషాలను తెలుసుకునే అవకాశం దొరికింది. అన్ బాక్సింగ్ వీడియోని లీక్ చేసిన టిప్‌స్టర్ సుదాన్శు ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ ని కూడా పంచుకున్నాడు. సరే, ఓసారి Poco F5 Pro స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

POCO F5 Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

POCO F5 Pro లో 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 3200*1440 పిక్సెల్ క్యూహెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజీ

POCO F5 Pro స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ వాడారు. దీనికి తోడు 12జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీని జోడించారు. మిగతా ర్యామ్, స్టోరేజీ వేరియంట్స్ కూడా ఉండే అవకాశం ఉంది. లాంచ్ రోజున అన్ని వివరాలు తెలుస్తాయి.

బ్యాటరీ మరియు చార్జింగ్

POCO F5 Pro స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5160 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా 30 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్ లో ఉంటుందని అంచనా.

కెమెరా విభాగం

POCO F5 Pro స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో కూడిన 64ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయని సమాచారం. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లాంచ్ కి ముందే POCO F5 Pro అన్‌బాక్సింగ్ వీడియో చూడండి! first appeared on 91Mobiles Telugu.

]]>
ఎన్బీటీసీ సర్టిఫికేషన్ పొందిన POCO F5 Pro; త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/poco-f5-pro-nbtc-certification-thailand-launch-imminent/ Wed, 12 Apr 2023 13:52:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=5853 POCO F5 సిరీస్ గురించి నెట్టింట్లో రూమర్లు తెగ చక్కర్లు కొడుతున్నాయి. POCO F5 తో పాటు POCO F5 Pro కూడా గ్లోబ్ లగా త్వరలోనే లాంచ్ కానుందని సమాచారం. POCO F5 Pro గురించి మాట్లాడితే ఈ డివైజ్ తాజాగా NBTC సర్టిఫికేషన్ ప్రాసెస్ ని పూర్తి చేసినట్లు నేడు సమాచారం బయటకు వచ్చింది. దీన్ని బట్టి ఈ డివైజ్ త్వరలోనే లాంచ్ కానుందని స్పష్టమవుతోంది. NBTC సర్టిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్న POCO […]

The post ఎన్బీటీసీ సర్టిఫికేషన్ పొందిన POCO F5 Pro; త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • థాయిలాండ్ ఎన్బీటీసీ సర్టిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేసిన POCO F5 Pro
  • త్వరలోనే లాంచ్ కానున్న POCO F5 Pro డివైజ్
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోన్న ఫోన్

POCO F5 సిరీస్ గురించి నెట్టింట్లో రూమర్లు తెగ చక్కర్లు కొడుతున్నాయి. POCO F5 తో పాటు POCO F5 Pro కూడా గ్లోబ్ లగా త్వరలోనే లాంచ్ కానుందని సమాచారం. POCO F5 Pro గురించి మాట్లాడితే ఈ డివైజ్ తాజాగా NBTC సర్టిఫికేషన్ ప్రాసెస్ ని పూర్తి చేసినట్లు నేడు సమాచారం బయటకు వచ్చింది. దీన్ని బట్టి ఈ డివైజ్ త్వరలోనే లాంచ్ కానుందని స్పష్టమవుతోంది.

NBTC సర్టిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్న POCO F5 Pro

పైన ట్వీట్ లో కనిపిస్తోన్న విధంగా, POCO F5 Pro డివైజ్ POCO23013PC75G అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. థాయిలాండ్ కి చెందిన ఎన్బీటీసీ సర్టిఫికేషన్ ప్రక్రియను ఈ డివైజ్ పూర్తి చేసింది. దీంతో త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ ఉండనుందని స్పష్టమైంది. ఇది గ్లోబల్ వేరియంట్ అని చెప్పడానికి కారణం, మోడల్ నంబర్ లో G అనే అక్షరం ఉండటమే. ఇండియన్ వేరియంట్ కి చెందిన సమాచారం తెలుసుకునేందుకు వివిధ సర్టిఫికేషన్ వెబ్ సైట్స్ జల్లెడ పట్టాం. కానీ, ఎటువంటి సమాచారం దొరకలేదు.

అంటే POCO F5 Pro డివైజ్ భారత్ లో లాంచ్ కాకపోవచ్చు. లేదంటే ఈ ఏడాది మరొక సమయంలో లాంచ్ అవ్వవచ్చు. అయితే ఈ ఏడాది ఏదో ఒక సమయంలో లాంచ్ అయ్యేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

ఎన్బీటీసీ సర్టిఫికేషన్ ద్వారా ఫోన్ పేరుతో పాటు, డివైజ్ 5జీ కనెక్టివిటీతో వస్తున్నట్లు తెలిసింది. అలాగే ఈ లిస్టింగ్ ద్వారా POCO F5 Pro డివైజ్ ని Redmi K60 తో పోల్చి చూసేందుకు అవకాశం దొరికినట్లైంది.

POCO F5 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్
  • 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ
  • 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా
  • 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా
  • 2ఎంపి మ్యాక్రో లెన్స్
  • 16ఎంపి ఫ్రంట్ కెమెరా
  • 5500 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్
  • 30 వాట్ వైర్లెస్ చార్జింగ్
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్

డిస్ప్లే మరియు కెమెరా

POCO F5 Pro స్మార్ట్ ఫోన్ లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అండర్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండే అవకాశం ఉంది. ఈ డివైజ్ లో 64ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండే ఛాన్స్ ఉంది.

చిప్సెట్, బ్యాటరీ, స్టోరేజీ

POCO F5 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. అలాగే ఈ ఫోన్ 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చే చాన్స్ ఉంది. ఇంకా 30 వాట్ వైర్లెస్ ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్ కూడా ఉంటుందని సమాచారం. ఈ డివైజ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో రానుంది.

ఓఎస్

POCO F5 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ14 కస్టమ్ స్కిన్ పై పని చేసేందుకు అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఎన్బీటీసీ సర్టిఫికేషన్ పొందిన POCO F5 Pro; త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్ తో వస్తోన్న POCO F5 Pro? https://www.91mobiles.com/telugu/poco-f5-pro-imei-database-specs-redmi-k60-rebrand/ Wed, 04 Jan 2023 05:03:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=4317 హైలైట్స్ ఐఎంఈఐ డేటాబేస్ పై కనిపించిన POCO F5 Pro స్మార్ట్ ఫోన్ 23013PC75G అనే మోడల్ నంబర్ ని కలిగి ఉన్న POCO F5 Pro క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ తో రానున్న POCO F5 Pro ఇటీవలె షావోమి సంస్థ చైనాలో Redmi K60 సిరీస్ ని లాంచ్ చేసింది. లేటెస్ట్ కే-సిరీస్ లో 3 స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. అవి: రెడ్మీ కే60ఈ, రెడ్మీ కే60, […]

The post స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్ తో వస్తోన్న POCO F5 Pro? first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ఐఎంఈఐ డేటాబేస్ పై కనిపించిన POCO F5 Pro స్మార్ట్ ఫోన్
  • 23013PC75G అనే మోడల్ నంబర్ ని కలిగి ఉన్న POCO F5 Pro
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ తో రానున్న POCO F5 Pro

ఇటీవలె షావోమి సంస్థ చైనాలో Redmi K60 సిరీస్ ని లాంచ్ చేసింది. లేటెస్ట్ కే-సిరీస్ లో 3 స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. అవి: రెడ్మీ కే60ఈ, రెడ్మీ కే60, రెడ్మీ కే60 ప్రో. Redmi K60 ఫోన్ గ్లోబల్ మార్కెట్స్ లో POCO F5 Pro గా లాంచ్ అవుతుందని కొన్ని రోజుల క్రితం టిప్‌స్టర్ కాస్పర్ స్క్రైజిపెక్ తెలిపాడు. ఇకపోతే POCO F5 Pro ఫోన్ 23013PC75G అనే మోడల్ నంబర్ తో ఐఎంఈఐ డేటాబేస్ పై కనిపించింది. ఈ విషయం Xiaomiui అనే వెబ్ సైట్ ద్వారా బయటకు వచ్చింది.

IMEI డేటాబేస్ లిస్టింగ్ ద్వారా ఫోన్ పేరుతో పాటు, మోడల్ నంబర్ కూడా రివీల్ అయ్యింది. ఇది ఎఫ్-సిరీస్ ఫోన్ గా కన్ఫర్మ్ అయ్యింది. మోడల్ నంబర్ ని బట్టి POCO F5 Pro, Redmi K60 యొక్క రీబ్రాండ్ వర్షన్ అని తెలుస్తోంది. ఇక Redmi K60 ఫోన్ 23013RK75C అనే మోడల్ నంబర్ ని కల్గి ఉండేది. దీంతో ఈ ఫోన్ గ్లోబల్ గా POCO F5 Pro పేరుతో లాంచ్ కానున్నట్లు స్పష్టమైంది. సరే ఓసారి పూర్తి వివరాలను ఇక్కడ చూద్దాం.

POCO F5 Pro స్మార్ట్ ఫోన్ 23010PC75G మోడల్ నంబర్ తో ఐఎంఈఐ మరియు ఐఎండీఏ సర్టిఫికేషన్స్ ని క్లియర్ చేసింది. ఈ లిస్టింగ్స్ స్పెసిఫికేషన్స్ పరంగా వేటిని రివీల్ చేయలేదు. అయితే POCO F5 Pro డివైజ్ రెడ్మీ కే60 కి రీబ్రాండ్ వర్షన్ గా వస్తోందని ప్రాథమికంగా తెలియడం వల్లన, స్పెసిఫికేషన్స్ కూడా రెండింటివి ఒకే విధంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి, ఒకసారి Redmi K60 స్పెసిఫికేషన్స్ చూద్దాం పదండి.

Redmi K60 లో 6.67-ఇంచ్ 2కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హోల్-పంచ్ కటౌట్, 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఈ డివైజ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వచ్చింది. ఇందులో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 30 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Redmi K60 యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ ప్రైమరీ లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉంటాయి. Redmi K60 ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్ తో వస్తోన్న POCO F5 Pro? first appeared on 91Mobiles Telugu.

]]>
గ్లోబల్ మార్కెట్స్ లో POCO F5 Pro గా లాంచ్ కానున్న Redmi K60? https://www.91mobiles.com/telugu/redmi-k60-to-launch-globally-as-poco-f5-pro/ Thu, 29 Dec 2022 13:35:49 +0000 https://www.91mobiles.com/telugu/?p=4245 హైలైట్స్ ఇటీవలె చైనాలో లాంచైన Redmi K60 5G డివైజ్ భారత్ తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో POCO F5 Pro గా లాంచ్ కానున్న Redmi K60 5G 6.67-ఇంచ్ 2కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో లాంచైన Redmi K60 5G రీసెంట్ గా చైనాలో Redmi K60 సిరీస్ లాంచైంది. ఈ లైనప్ లో భాగంగా మొత్తం 3 ఫోన్లు లాంచ్ అయ్యాయి. అవి: Redmi […]

The post గ్లోబల్ మార్కెట్స్ లో POCO F5 Pro గా లాంచ్ కానున్న Redmi K60? first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ఇటీవలె చైనాలో లాంచైన Redmi K60 5G డివైజ్
  • భారత్ తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో POCO F5 Pro గా లాంచ్ కానున్న Redmi K60 5G
  • 6.67-ఇంచ్ 2కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో లాంచైన Redmi K60 5G

రీసెంట్ గా చైనాలో Redmi K60 సిరీస్ లాంచైంది. ఈ లైనప్ లో భాగంగా మొత్తం 3 ఫోన్లు లాంచ్ అయ్యాయి. అవి: Redmi K60 5G, Redmi K60 Pro, Redmi K60e. అయితే తాజాగా వచ్చిన సమాచారాన్ని బట్టి, Redmi K60 5G స్మార్ట్ ఫోన్ చైనాకు బయట, అంటే గ్లోబల్ మార్కెట్స్ లో POCO F5 Pro గా లాంచ్ కానుందని తెలుస్తోంది.

గతంలో కూడా షావోమి తన రెడ్మీ బ్రాండ్ డివైజెస్ ని పోకో బ్రాండ్ నేమ్ తో లాంచ్ చేసిన సందర్భాలున్నాయి. Redmi K50 Gaming ఫోన్ ని కొన్ని ఇతర మార్కెట్స్ లో POCO F4 GT అనే పేరుతో లాంచ్ చేసింది. ఇక భారత్ లో POCO F4 గా లాంచైన ఫోన్ ఇతర మార్కెట్స్ లో Redmi K40s అనే పేరుతో అందుబాటులోకి వచ్చింది.

ఇకపోతే భారత్ లో Redmi K50i కి సక్సెసర్ గా Redmi K60e లాంచ్ అవ్వనుందని సమాచారం. అయితే Redmi K60e కేవలం చైనాకు మాత్రమే పరిమితమని ప్రముఖ టిప్‌స్టర్ Kacper Skrzypek వెల్లడించాడు. ఇక విషయంలోకి వస్తే, Redmi K60 5G స్మార్ట్ ఫోన్ POCO F5 Pro పేరుతో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. మిగతా Redmi K60 సిరీస్ ఫోన్లకు సంబంధించి ఇంకా ఏ విషయం తెలియలేదు. అవి కూడా రీబ్రాండ్ అవుతాయా? లేదా? అనేది త్వరలోనే తెలుస్తుంది.

షావోమి ఇప్పటికైతే ఏ విషయం కూడా ఖరారు చేయలేదు. ఒకవేళ Redmi K60 5G గ్లోబల్ మార్కెట్స్ లో POCO F5 Pro గా లాంచ్ అయినప్పటికీ, ఆ డివైజ్ భారత్ కి వస్తుందా లేదా అన్నది కూడా కచ్చితంగా చెప్పలేం. అంతా షావోమి చేతిలో ఉంటుంది. ఏం జరగనుందో వేచి చూడాల్సిందే. ఈలోపు ఓసారి Redmi K60 5G యొక్క స్పెసిఫికేషన్స్ పై ఓ లుక్ వేద్దాం పదండి.

Redmi K60 5G స్పెసిఫికేషన్స్

Redmi K60 లో 6.67-ఇంచ్ 2కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హోల్-పంచ్ కటౌట్, 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఈ డివైజ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వచ్చింది. ఇందులో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 30 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Redmi K60 యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ ప్రైమరీ లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉంటాయి. Redmi K60 ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post గ్లోబల్ మార్కెట్స్ లో POCO F5 Pro గా లాంచ్ కానున్న Redmi K60? first appeared on 91Mobiles Telugu.

]]>