హైలైట్స్
- ఐఎంఈఐ డేటాబేస్ పై కనిపించిన POCO F5 Pro స్మార్ట్ ఫోన్
- 23013PC75G అనే మోడల్ నంబర్ ని కలిగి ఉన్న POCO F5 Pro
- క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ తో రానున్న POCO F5 Pro
ఇటీవలె షావోమి సంస్థ చైనాలో Redmi K60 సిరీస్ ని లాంచ్ చేసింది. లేటెస్ట్ కే-సిరీస్ లో 3 స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. అవి: రెడ్మీ కే60ఈ, రెడ్మీ కే60, రెడ్మీ కే60 ప్రో. Redmi K60 ఫోన్ గ్లోబల్ మార్కెట్స్ లో POCO F5 Pro గా లాంచ్ అవుతుందని కొన్ని రోజుల క్రితం టిప్‌స్టర్ కాస్పర్ స్క్రైజిపెక్ తెలిపాడు. ఇకపోతే POCO F5 Pro ఫోన్ 23013PC75G అనే మోడల్ నంబర్ తో ఐఎంఈఐ డేటాబేస్ పై కనిపించింది. ఈ విషయం Xiaomiui అనే వెబ్ సైట్ ద్వారా బయటకు వచ్చింది.
IMEI డేటాబేస్ లిస్టింగ్ ద్వారా ఫోన్ పేరుతో పాటు, మోడల్ నంబర్ కూడా రివీల్ అయ్యింది. ఇది ఎఫ్-సిరీస్ ఫోన్ గా కన్ఫర్మ్ అయ్యింది. మోడల్ నంబర్ ని బట్టి POCO F5 Pro, Redmi K60 యొక్క రీబ్రాండ్ వర్షన్ అని తెలుస్తోంది. ఇక Redmi K60 ఫోన్ 23013RK75C అనే మోడల్ నంబర్ ని కల్గి ఉండేది. దీంతో ఈ ఫోన్ గ్లోబల్ గా POCO F5 Pro పేరుతో లాంచ్ కానున్నట్లు స్పష్టమైంది. సరే ఓసారి పూర్తి వివరాలను ఇక్కడ చూద్దాం.
POCO F5 Pro స్మార్ట్ ఫోన్ 23010PC75G మోడల్ నంబర్ తో ఐఎంఈఐ మరియు ఐఎండీఏ సర్టిఫికేషన్స్ ని క్లియర్ చేసింది. ఈ లిస్టింగ్స్ స్పెసిఫికేషన్స్ పరంగా వేటిని రివీల్ చేయలేదు. అయితే POCO F5 Pro డివైజ్ రెడ్మీ కే60 కి రీబ్రాండ్ వర్షన్ గా వస్తోందని ప్రాథమికంగా తెలియడం వల్లన, స్పెసిఫికేషన్స్ కూడా రెండింటివి ఒకే విధంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి, ఒకసారి Redmi K60 స్పెసిఫికేషన్స్ చూద్దాం పదండి.
Redmi K60 లో 6.67-ఇంచ్ 2కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హోల్-పంచ్ కటౌట్, 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఈ డివైజ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వచ్చింది. ఇందులో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 30 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
Redmi K60 యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి ఓఐఎస్ ప్రైమరీ లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉంటాయి. Redmi K60 ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











