POCO X5 Pro 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 09 Mar 2023 12:53:54 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 First Sale: నేడే POCO X5 Pro 5G ఫస్ట్ సేల్ https://www.91mobiles.com/telugu/poco-x5-pro-5g-india-first-sale-via-flipkart-price-launch-offers/ Mon, 13 Feb 2023 05:13:02 +0000 https://www.91mobiles.com/telugu/?p=4886 POCO X5 Pro 5G స్మార్ట్ ఫోన్ గత వారం భారత్ లో లాంచైంది. నేడు ఈ ఫోన్ సేల్ కి రానుంది. నేడు మధ్యాహ్నం 12 గంటల నుంచి POCO X5 Pro 5G సేల్ మొదలు కానుంది. ఆసక్తిగల వారు ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. అందుబాటు ధరలో అద్భుతమైన ఫీచర్లతో POCO X5 Pro 5G మార్కెట్ లోకి వచ్చింది. POCO X5 Pro 5G స్మార్ట్ […]

The post First Sale: నేడే POCO X5 Pro 5G ఫస్ట్ సేల్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్ కార్ట్ ద్వారా POCO X5 Pro 5G స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి ప్రాసెసర్, 108ఎంపి ఓఐఎస్ కెమెరా, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చిన POCO X5 Pro 5G
  • భారత్ లో POCO X5 Pro 5G ధర రూ.22,999 నుంచి ప్రారంభం

POCO X5 Pro 5G స్మార్ట్ ఫోన్ గత వారం భారత్ లో లాంచైంది. నేడు ఈ ఫోన్ సేల్ కి రానుంది. నేడు మధ్యాహ్నం 12 గంటల నుంచి POCO X5 Pro 5G సేల్ మొదలు కానుంది. ఆసక్తిగల వారు ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. అందుబాటు ధరలో అద్భుతమైన ఫీచర్లతో POCO X5 Pro 5G మార్కెట్ లోకి వచ్చింది.

POCO X5 Pro 5G స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి చిప్సెట్ ని కలిగి ఉంది. ఈ ఫోన్ 6జిబి ర్యామ్, 8జిబి ర్యామ్ వేరియంట్స్ లో లభించనుంది. 108ఎంపి ఓఐఎస్ కెమెరా ఈ ఫోన్ లో హైలైట్ ఫీచర్ గా నిలుస్తోంది. అలాగే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్ లో ఉన్నాయి. సరే, ఓసారి POCO X5 Pro 5G లాంచ్ ఆఫర్స్, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

భారత్ లో POCO X5 Pro 5G లాంచ్ ఆఫర్స్, లభ్యత

POCO X5 Pro 5G స్మార్ట్ ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.22,999 గా ఉంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ యూనిట్ ధర రూ.24,999 గా ఉంది. హెచ్డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్స్ తో ఫోన్ ని కొనుగోలు చేస్తే రూ.2,000 వరకు డిస్కౌంట్ లభించనుంది.

ఎప్పటిలాగే, ఫ్లిప్‌కార్ట్ యాక్సిక్ క్రెడిట్ కార్డ్ యూజర్లు 5 శాతం క్యాష్ బ్యాక్ ని పొందుతారు. నేడు అనగా ఫిబ్రవరి 13 మధ్యాహ్నం 12 గంటల నుంచి POCO X5 Pro 5G ఫోన్ ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

POCO X5 Pro 5G స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

POCO X5 Pro 5G స్మార్ట్ ఫోన్ లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 10-బిట్ డిస్ప్లే, 900 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 50,00,000:1 కాంట్రాస్ట్ రేషియో ఉంటాయి. ఈ ఫోన్ డిస్ప్లే ప్యానెల్ డాల్బి విజన్, హెచ్డీఆర్10+ కి సపోర్ట్ చేస్తుంది.

POCO X5 Pro 5G స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి ప్రాసెసర్, అడ్రెనో 642ఎల్ జీపీయూ ని కలిగి ఉంటుంది. ఎల్పిడిడిఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఈ ఫోన్ లో అందించారు. డివైజ్ 6జిబి/8జిబి ర్యామ్ ఆప్షన్స్ లో లభిస్తుంది. POCO X5 Pro 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

POCO X5 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో షూటర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

POCO X5 Pro 5G స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం టైప్-సీ పోర్ట్ అందించారు. భద్రత కోసం ఈ ఫోన్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. ఈ ఫోన్ లో 3.5ఎంఎం ఆడియో జాక్ కూడా ఉంది.

POCO X5 Pro 5G డివైజ్ 162.91 మిల్లీ మీటర్ల పొడవు, 76.03 మిల్లీ మీటర్ల వెడల్పు, 7.9 మిల్లీ మీటర్ల మందం, 181 గ్రాముల బరువు ఉంటుంది. డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.1, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. POCO X5 Pro 5G డివైజ్ ఐపీ53 స్ప్లాష్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post First Sale: నేడే POCO X5 Pro 5G ఫస్ట్ సేల్ first appeared on 91Mobiles Telugu.

]]>
Snapdragon 695 చిప్, 120Hz AMOLED డిస్ప్లేతో లాంచైన POCO X5 5G https://www.91mobiles.com/telugu/poco-x5-5g-launched-globally-price-specs-availability/ Tue, 07 Feb 2023 05:16:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=4809 POCO X5 Pro తో పాటు పోకో కంపెనీ POCO X5 5G ని కూడా గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ చేసింది. బడ్జెట్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ వస్తోన్న POCO X5 5G స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో వచ్చింది. ఈ హ్యాండ్సెట్ లో 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే ఉంది. Redmi Note 12 5G కి ఈ ఫోన్ కి చాలా పోలికలు ఉన్నాయి. POCO […]

The post Snapdragon 695 చిప్, 120Hz AMOLED డిస్ప్లేతో లాంచైన POCO X5 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 48ఎంపి ప్రైమరీ కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చిన POCO X5 5G
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగిన POCO X5 5G
  • బ్లాక్, బ్లూ, గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న POCO X5 5G స్మార్ట్ ఫోన్

POCO X5 Pro తో పాటు పోకో కంపెనీ POCO X5 5G ని కూడా గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ చేసింది. బడ్జెట్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ వస్తోన్న POCO X5 5G స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో వచ్చింది. ఈ హ్యాండ్సెట్ లో 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే ఉంది. Redmi Note 12 5G కి ఈ ఫోన్ కి చాలా పోలికలు ఉన్నాయి.

POCO X5 5G స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి ప్రైమరీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. POCO X5 5G డివైజ్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. ఈ ఫోన్ ఐపీ53 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది. ఓసారి POCO X5 5G ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ మరియు లభ్యత గురించి తెలుసుకుందాం పదండి.

POCO X5 5G ధర, లభ్యత

POCO X5 5G స్మార్ట్ ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర 249 డాలర్లు (సుమారు రూ.20,500) గా ఉంది. ఇక 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 299 డాలర్లు (సుమారు రూ.24,700) గా ఉంది.

లాంచ్ ఆఫర్ లో భాగంగా ఈ డివైజ్ పై 50 డాలర్ల డిస్కౌంట్ ఇస్తున్నారు. దీంతో ఈ ఫోన్ బేస్ వేరియంట్ ధర 199 డాలర్లకు తగ్గనుంది. ఈ హ్యాండ్సెట్ నేటి (ఫిబ్రవరి 7) నుంచి వివిధ దేశాల్లో కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.

POCO X5 5G స్పెసిఫికేషన్స్

POCO X5 5G లో 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 45,00,000:1 కాంట్రాస్ట్ రేషియో ఉన్నాయి. సెల్ఫీ షూటర్ కోసం సెంటర్ పంచ్ హోల్ నాచ్ ఇచ్చారు. అలాగే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ని డిస్ప్లే కి అందించారు.

POCO X5 5G స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ వాడారు. ఇది 6 నానోమీట్ ప్రాసెస్ పై తయారైన చిప్. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 619 జీపీయూ వాడారు. ఈ హ్యాండ్సెట్ 8జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఆప్షన్స్ తో వచ్చింది. POCO X5 5G డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

POCO X5 5G డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

పవర్ బ్యాకప్ కోసం POCO X5 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం టైప్-సీ పోర్ట్ అందించారు. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కాన్ ఇచ్చారు. హైబ్రిడ్ మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, ఐపీ53 రేటింగ్, ఐఆర్ బ్లాస్టర్, 3.5 ఎంఎం ఆడియో జాక్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

POCO X5 5G స్మార్ట్ ఫోన్ బ్లాక్, గ్రీన్, బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 165.88 మిల్లీ మీటర్ల పొడవు, 76.21 మిల్లీ మీటర్ల వెడల్పు, 7.98 మిల్లీ మీటర్ల మందం, 189 గ్రాముల బరువు ఉంటుంది. డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Snapdragon 695 చిప్, 120Hz AMOLED డిస్ప్లేతో లాంచైన POCO X5 5G first appeared on 91Mobiles Telugu.

]]>
108MP Samsung ISOCELL HM2 సెన్సర్, Snapdragon 778G చిప్‌తో లాంచైన POCO X5 Pro https://www.91mobiles.com/telugu/poco-x5-pro-5g-launched-india-price-specs-availability/ Mon, 06 Feb 2023 13:17:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=4803 భారత్ లో నేడు POCO X5 Pro స్మార్ట్ ఫోన్ లాంచైంది. గతేడాది వచ్చిన POCO X4 Pro కి ఇది సక్సెసర్ గా మార్కెట్ లోకి వచ్చింది. Redmi Note 12 Speed Edition కి రీబ్రాండ్ గా POCO X5 Pro వచ్చినట్లు తెలుస్తోంది. భారీ కెమెరా మాడ్యూల్, సెంటర్ పొజిషన్డ్ పంచ్-హోల్ కటౌట్, ట్రిపుల్ రియర్ కెమెరా సెన్సర్స్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐఆర్ బ్లాస్టర్ తో ఈ ఫోన్ వచ్చింది. […]

The post 108MP Samsung ISOCELL HM2 సెన్సర్, Snapdragon 778G చిప్‌తో లాంచైన POCO X5 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో POCO X5 Pro ధర రూ.22,999 నుంచి ప్రారంభం
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి చిప్సెట్, 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చిన POCO X5 Pro
  • నేడు సాయంత్రం 6 గంటల నుంచి మొదలైన POCO X5 Pro ఎర్లీ యాక్సెస్ సేల్

భారత్ లో నేడు POCO X5 Pro స్మార్ట్ ఫోన్ లాంచైంది. గతేడాది వచ్చిన POCO X4 Pro కి ఇది సక్సెసర్ గా మార్కెట్ లోకి వచ్చింది. Redmi Note 12 Speed Edition కి రీబ్రాండ్ గా POCO X5 Pro వచ్చినట్లు తెలుస్తోంది. భారీ కెమెరా మాడ్యూల్, సెంటర్ పొజిషన్డ్ పంచ్-హోల్ కటౌట్, ట్రిపుల్ రియర్ కెమెరా సెన్సర్స్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐఆర్ బ్లాస్టర్ తో ఈ ఫోన్ వచ్చింది.

POCO X5 Pro స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి చిప్సెట్, 6.67-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5000mAh బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఉన్నాయి. సరే, ఓసారి POCO X5 Pro పూర్తి స్పెసిఫికేషన్స్, ధర, సేల్ తేదీ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

POCO X5 Pro స్మార్ట్ ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర భారత్ లో రూ.22,999 గా ఉంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999 గా ఉంది. ఈ ఫోన్ Flipkart ద్వారా సేల్ కి అందుబాటులో ఉంటుంది. పోకో యెల్లో, ఆస్ట్రాల్ బ్లాక్, హారిజన్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఎర్లీ యాక్సెస్ సేల్ ఫిబ్రవరి 6 వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి మొదలైంది.

POCO X5 Pro స్పెసిఫికేషన్స్

  • 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి చిప్సెట్
  • ఆండ్రాయిడ్ 12 ఓఎస్
  • 108ఎంపి ప్రైమరీ + 8ఎంపి + 2ఎంపి ట్రిపుల్ కెమెరాలు
  • 16ఎంపి ఫ్రంట్ కెమెరా
  • 5000mAh బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్

POCO X5 Pro స్మార్ట్ ఫోన్ లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎక్స్‌ఇన్ఫినిటీ అమోలెడ్ డిస్ప్లే, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 5,000,000:1 కాంట్రాస్ట్ రేషియో, డాల్బి విజన్, హెచ్డీఆర్10+, 900 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

POCO X5 Pro హ్యాండ్సెట్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి చిప్సెట్, అడ్రెనో 642ఎల్ జీపీయూ అందించారు. ఈ ఫోన్ 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకోవచ్చు.

POCO X5 Pro స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ కి రెండు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ ప్యాచెస్ ని కంపెనీ హామినిస్తోంది. POCO X5 Pro లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

POCO X5 Pro లో 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, హై-రెస్ ఆడియో, ఐఆర్ బ్లాస్టర్ ఉన్నాయి. ఈ ఫోన్ 162.91 మిల్లీ మీటర్ల పొడవు, 76.03 మిల్లీ మీటర్ల వెడల్పు, 7.9 మిల్లీ మీటర్ల మందం, 181 గ్రాముల బరువు ఉంటుంది.

POCO X5 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి శాంసంగ్ ఐసోసెల్ హెచ్ఎం2 ప్రైమరీ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. 12-లేయర్ గ్రాఫైట్ షీట్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 108MP Samsung ISOCELL HM2 సెన్సర్, Snapdragon 778G చిప్‌తో లాంచైన POCO X5 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
ఫిబ్రవరి 6 న లాంచ్ అవుతోన్న POCO X5 Pro https://www.91mobiles.com/telugu/poco-x5-pro-launching-on-february-6th-in-india/ Wed, 01 Feb 2023 12:02:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=4737 బాలీవుడ్ సినిమా పఠాన్ థియేటర్లలో ప్రదర్శితమవుతోన్న సమయంలో మధ్యలో POCO X5 Pro కి సంబంధించిన ఒక ప్రకటన వచ్చింది. ఈ ప్రకటన ద్వారా POCO X5 Pro డివైజ్ లాంచ్ తేదీ రివీల్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ భారత్ లో ఫిబ్రవరి 6 వ తేదీన సాయంత్రం 5.30 గంటలకు లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి రానుంది. గతేడాది పోకో నుంచి వచ్చిన POCO X4 Pro […]

The post ఫిబ్రవరి 6 న లాంచ్ అవుతోన్న POCO X5 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • స్నాప్ డ్రాగన్ 778జి ప్రాసెసర్, 108ఎంపి కెమెరాతో వస్తోన్న POCO X5 Pro
  • బాలీవుడ్ మూవీ పఠాన్ చిత్రం ప్రదర్శన మధ్యలో రివీలైన POCO X5 Pro ఫోన్ లాంచ్ తేదీ
  • ఫిబ్రవరి 6 న సాయంత్రం 5.30 గంటలకు భారత్ లో లాంచ్ కానున్న POCO X5 Pro

బాలీవుడ్ సినిమా పఠాన్ థియేటర్లలో ప్రదర్శితమవుతోన్న సమయంలో మధ్యలో POCO X5 Pro కి సంబంధించిన ఒక ప్రకటన వచ్చింది. ఈ ప్రకటన ద్వారా POCO X5 Pro డివైజ్ లాంచ్ తేదీ రివీల్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ భారత్ లో ఫిబ్రవరి 6 వ తేదీన సాయంత్రం 5.30 గంటలకు లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి రానుంది.

గతేడాది పోకో నుంచి వచ్చిన POCO X4 Pro కి సక్సెసర్ గా POCO X5 Pro మార్కెట్ లోకి వస్తోంది. చైనాలో ఇటీవలె లాంచ్ అయిన Redmi Note 12 Speed Edition కి రీబ్రాండ్ వర్షన్ గా POCO X5 Pro లాంచ్ కాబోతున్నట్లు సమాచారం.

POCO X5 Pro స్మార్ట్ ఫోన్ యొక్క మైక్రోసైట్ ద్వారా తెలుస్తోన్న విషయం ఏంటంటే, ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి ప్రాసెసర్ తో వస్తోంది. ఈ ఫోన్ AnTuTu బెంచ్ మార్క్ స్కోర్ 545k+ గా ఉంది. బడ్జెట్ సెగ్మెంట్ లో ఈ స్మార్ట్ ఫోన్ బెస్ట్ ఆప్షన్ గా నిలవనుంది.

POCO X5 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

POCO X5 Pro స్మార్ట్ ఫోన్ 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 778జి చిప్సెట్ వాడినట్లు సమాచారం. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వాడారు.

రీసెంట్ రిపోర్ట్ ద్వారా POCO X5 Pro యొక్క ర్యామ్, స్టోరేజీ, ధర వివరాలు రివీల్ అయ్యాయి. POCO X5 Pro భారత్ లో మొత్తం 3 వేరియంట్స్ లో లభించనుంది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి + 128జిబి, 8జిబి + 256జిబి వేరియంట్స్ లో ఫోన్ లభించనుంది. POCO X5 Pro ఫోన్ ధర రూ.21,000 నుంచి రూ.23,000 మధ్య ఉంటుందని అంచనా.

POCO X5 Pro స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. వచ్చే వారంలో POCO X5 Pro యొక్క లభ్యత, ఇతర వివరాలు తెలియనున్నాయి.

POCO X5 Pro లో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఈ ఫోన్ లో ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఫిబ్రవరి 6 న లాంచ్ అవుతోన్న POCO X5 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
ఫిబ్రవరి 6న భారత్‌లో లాంచ్ అవుతోన్న POCO X5 Pro 5G https://www.91mobiles.com/telugu/poco-x5-pro-5g-india-launch-date-availability-specs-price/ Mon, 30 Jan 2023 15:17:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=4695 భారత్ లో POCO X5 Pro లాంచ్ తేదీని పోకో సంస్థ ఖరారు చేసింది. ఫిబ్రవరి 6 న POCO X5 సిరీస్ భారత్ లో లాంచ్ అవుతోంది. ఇదే తేదీన గ్లోబల్ గా కూడా ఈ ఫోన్ లాంచ్ అవ్వనున్నట్లు సమాచారం. ఇప్పటికే డివైజ్ యొక్క లభ్యతకు సంబంధించిన ఫ్లిప్ కార్ట్ లో మైక్రోసైట్ దర్శనమిస్తోంది. అన్‌లీష్ ఎక్స్ అనే ట్యాగ్ లైన్ తో ఈసారి POCO X5 Pro డివైజ్ వస్తోంది. పోకో ఇప్పటికే […]

The post ఫిబ్రవరి 6న భారత్‌లో లాంచ్ అవుతోన్న POCO X5 Pro 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఫిబ్రవరి 6 న భారత్ తో పాటు గ్లోబల్ గా లాంచ్ కానున్న POCO X5 Pro
  • ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 8జిబి ర్యామ్, స్నాప్ డ్రాగన్ 778జి చిప్సెట్ తో వస్తోన్న POCO X5 Pro
  • భారత్ లో POCO X5 Pro ధర రూ.21,000 నుంచి రూ.23,000 మధ్య ఉండే అవకాశం

భారత్ లో POCO X5 Pro లాంచ్ తేదీని పోకో సంస్థ ఖరారు చేసింది. ఫిబ్రవరి 6 న POCO X5 సిరీస్ భారత్ లో లాంచ్ అవుతోంది. ఇదే తేదీన గ్లోబల్ గా కూడా ఈ ఫోన్ లాంచ్ అవ్వనున్నట్లు సమాచారం. ఇప్పటికే డివైజ్ యొక్క లభ్యతకు సంబంధించిన ఫ్లిప్ కార్ట్ లో మైక్రోసైట్ దర్శనమిస్తోంది.

అన్‌లీష్ ఎక్స్ అనే ట్యాగ్ లైన్ తో ఈసారి POCO X5 Pro డివైజ్ వస్తోంది. పోకో ఇప్పటికే ఇండియన్ క్రికెటర్, ఐపీఎల్ టీమ్ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్థిక్ పాండ్యాను తమ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది. లాంచ్ కి ముందు పోకో, POCO X5 Pro ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది.

కన్ఫర్మ్ అయిన POCO X5 Pro లాంచ్ తేదీ

POCO X5 Pro స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 6 న సాయంత్రం 5.30 గంటలకు భారత్ తో పాటు గ్లోబల్ గా లాంచ్ అవుతోంది. గ్లోబల్ టైమింగ్ 20:00 GMT +8. ఇక గ్లోబల్ గా లాంచ్ అవుతోన్న స్టాండర్డ్ వేరియంట్ POCO X5 5G ఫోన్ భారత్ లో ఇదే ఏడాది లాంచ్ కానుంది.

POCO X5 Pro స్పెసిఫికేషన్స్, ధర (రూమర్లు)

రీసెంట్ రిపోర్ట్ ద్వారా POCO X5 Pro యొక్క ర్యామ్, స్టోరేజీ, ధర వివరాలు రివీల్ అయ్యాయి. POCO X5 Pro భారత్ లో మొత్తం 3 వేరియంట్స్ లో లభించనుంది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి + 128జిబి, 8జిబి + 256జిబి వేరియంట్స్ లో ఫోన్ లభించనుంది. POCO X5 Pro ఫోన్ ధర రూ.21,000 నుంచి రూ.23,000 మధ్య ఉంటుందని అంచనా.

POCO X5 Pro స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి 5జీ ప్రాసెసర్, అడ్రెనో 642ఎల్ జీపీయూ తో వస్తోంది. 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 108ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఈ ఫోన్ లో ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

POCO X5 Pro స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. వచ్చే వారంలో POCO X5 Pro యొక్క లభ్యత, ఇతర వివరాలు తెలియనున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఫిబ్రవరి 6న భారత్‌లో లాంచ్ అవుతోన్న POCO X5 Pro 5G first appeared on 91Mobiles Telugu.

]]>
ఫిబ్రవరి 6న లాంచ్ అవుతోన్న POCO X5 Pro; స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/poco-x5-pro-india-launch-date-february-6/ Fri, 27 Jan 2023 10:50:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=4667 త్వరలోనే భారత్ లో POCO X5 Pro ఫోన్ లాంచ్ కానుంది. ఇప్పటివరకు కంపెనీ POCO X5 Pro లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించలేదు. అయితే తాజాగా ఒక ప్రమోషనల్ బ్యానర్ ద్వారా POCO X5 Pro ఫోన్ ఫిబ్రవరి 6 న లాంచ్ అవుతున్నట్లు లీక్ బయటకు వచ్చియంది. ఇక ఈ ఫోన్ తో పాటు POCO X5 కూడా లాంచ్ అవ్వనుందని అంచనా వేస్తున్నారు. POCO X5 Pro ఇండియా లాంచ్ POCO X5 […]

The post ఫిబ్రవరి 6న లాంచ్ అవుతోన్న POCO X5 Pro; స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఫిబ్రవరి 6 న భారత్ లో లాంచ్ అవుతోన్న POCO X5 Pro స్మార్ట్ ఫోన్
  • 6జిబి ర్యామ్ మరియు 8జిబి ర్యామ్ వేరియంట్స్ లో లాంచ్ కానున్న POCO X5 Pro
  • భారత దేశంలో POCO X5 Pro ధర రూ.21,000 గా ఉండే అవకాశం

త్వరలోనే భారత్ లో POCO X5 Pro ఫోన్ లాంచ్ కానుంది. ఇప్పటివరకు కంపెనీ POCO X5 Pro లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించలేదు. అయితే తాజాగా ఒక ప్రమోషనల్ బ్యానర్ ద్వారా POCO X5 Pro ఫోన్ ఫిబ్రవరి 6 న లాంచ్ అవుతున్నట్లు లీక్ బయటకు వచ్చియంది. ఇక ఈ ఫోన్ తో పాటు POCO X5 కూడా లాంచ్ అవ్వనుందని అంచనా వేస్తున్నారు.

POCO X5 Pro ఇండియా లాంచ్

POCO X5 Pro భారత్ లో ఫిబ్రవరి 6 న లాంచ్ అవుతున్నట్లు సమాచారం. అయితే కంపెనీ నుంచి అఫీషియల్ గా ఎటువంటి ప్రకటన రాలేదు. కానీ, బాలీవుడ్ మూవీ పఠాన్ చిత్ర ప్రదర్శన సమయంలో POCO X5 Pro కి సంబంధించిన ప్రకటన వచ్చింది. దీంతో లాంచ్ వివరాలు బయటకు వచ్చాయి. ఆ ప్రకటనలో లాంచ్ తేదీ, సమయం పేర్కొనబడ్డాయి. దాని ప్రకారం, POCO X5 Pro ఫిబ్రవరి 6 వ తేదీన సాయంత్రం 5.30 గంటలకు లాంచ్ అవుతోంది.

POCO X5 Pro ధర

ఒక లీక్ ప్రకారం, POCO X5 Pro స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర భారత్ లో రూ.21,000 గా ఉంటుందని సమాచారం. ఇది 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర కాగా, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.23,000 వరకు ఉండవచ్చని తెలుస్తోంది. అయితే లాంచ్ తర్వాత ధరల్లో మార్పు ఉండే అవకాశం ఉంది.

POCO X5 Pro స్పెసిఫికేషన్స్

POCO X5 Pro స్మార్ట్ ఫోన్ 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1200*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్ తో వస్తోంది. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 778జి చిప్సెట్ వాడినట్లు సమాచారం. బెస్ట్ గేమింగ్ కోసం ఈ ఫోన్ లో 12 లేయర్ కూలింగ్ సిస్టమ్ ని అందిస్తున్నారు. ఎక్కువగా గేమింగ్ ఆడే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫోన్ వేడెక్కకుండా ఈ లేయర్ సాయపడుతుంది.

POCO X5 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 108ఎంపి శాంసంగ్ హెచ్ఎం2 ప్రైమరీ సెన్సర్ వాడినట్లు సమాచారం. దీంతో పాటు 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. ఇంకా సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

భద్రత కోసం ఈ డివైజ్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇస్తున్నారు. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, 3.5ఎంఎం ఆడియో జాక్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ వంటి ఫీచర్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఫిబ్రవరి 6న లాంచ్ అవుతోన్న POCO X5 Pro; స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
POCO X5 Pro 5G ఫోన్‌ వాడుతూ కనిపించిన హార్దిక్ పాండ్యా https://www.91mobiles.com/telugu/poco-x5-pro-5g-first-look-out-hardik-pandya-with-the-device/ Fri, 20 Jan 2023 10:47:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=4585 POCO సంస్థ POCO X5 Pro 5G స్మార్ట్ ఫోన్ ని త్వరలో భారత్ లో లాంచ్ చేయనుంది. ఈ నెలాఖరులో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ ఫోన్ భారత్ లో లాంచ్ కానుంది. అయితే లాంచ్ కి ముందు పోకో ఎక్స్-సిరీస్ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. భారత క్రికెటర్, అంతర్జాతీయ టీ20 జట్టు కెప్టెన్ హార్థిక్ పాండ్యా POCO X5 Pro 5G ఫోన్ ని వాడుతూ కనిపించాడు. దీనికి […]

The post POCO X5 Pro 5G ఫోన్‌ వాడుతూ కనిపించిన హార్దిక్ పాండ్యా first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ అవుతోన్న POCO X5 Pro 5G స్మార్ట్ ఫోన్
  • లాంచ్ కి ముందు ఆసక్తికర రీతిలో రివీల్ అయిన డివైజ్ యొక్క ఫస్ట్ లుక్
  • భారత టీ20 జట్టు కెప్టెన్ హార్థిక్ పాండ్యా చేతుల్లో కనిపించిన POCO X5 Pro 5G ఫోన్

POCO సంస్థ POCO X5 Pro 5G స్మార్ట్ ఫోన్ ని త్వరలో భారత్ లో లాంచ్ చేయనుంది. ఈ నెలాఖరులో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ ఫోన్ భారత్ లో లాంచ్ కానుంది. అయితే లాంచ్ కి ముందు పోకో ఎక్స్-సిరీస్ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. భారత క్రికెటర్, అంతర్జాతీయ టీ20 జట్టు కెప్టెన్ హార్థిక్ పాండ్యా POCO X5 Pro 5G ఫోన్ ని వాడుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఓసారి మీరు కూడా ఓ లుక్ వేయండి మరి.

హార్థిక్ పాండ్యా చేతిలో POCO X5 Pro 5G డివైజ్

పైన ఇమేజెస్ లో కనిపిస్తోన్న విధంగా, పాండ్యా POCO X5 Pro 5G యెల్లో కలర్ వేరియంట్ ని ఆపరేట్ చేస్తున్నాడు. ఇమేజ్ లో మనకు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కనిపిస్తోంది. డ్యూయల్ టోన్ రియర్ డిజైన్, భారీ కెమెరా మాడ్యూల్ ని మనం గమనించవచ్చు. పవర్ బటన్, ఫింగర్ ప్రింట్ స్కానర్ డివైజ్ కి కుడివైపున కనిపిస్తున్నాయి. పవర్ బటన్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇంటిగ్రేడ్ చేయబడి ఉంది. అయితే ఇమేజెస్ లో ఫోన్ ఫ్రంట్ పార్ట్ కనిపించడం లేదు.

POCO X5 Pro 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

POCO X5 Pro 5G స్మార్ట్ ఫోన్ రెడ్మీ నోట్ 12 స్పీడ్ ఎడిషన్ కి రీబ్రాండ్ వర్షన్ గా మార్కెట్ లోకి వస్తోంది. రెడ్మీ నోట్ 12 స్పీడ్ ఎడిషన్ కొన్ని రోజుల క్రితం చైనాలో లాంచ్ అయ్యింది. ఇక రీబ్రాండెడ్ గా వస్తున్న మాట నిజమైతే గనుక POCO X5 Pro 5G యొక్క స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉండనున్నాయి.

POCO X5 Pro 5G స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 778జి చిప్సెట్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో రానుంది. POCO X5 Pro 5G ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. ఇందులో 108 ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి వైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

పవర్ బ్యాకప్ కోసం POCO X5 Pro 5G లో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం టైప్-సీ పోర్ట్ అందించారు. POCO X5 Pro 5G ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post POCO X5 Pro 5G ఫోన్‌ వాడుతూ కనిపించిన హార్దిక్ పాండ్యా first appeared on 91Mobiles Telugu.

]]>